నెల్లిమర్ల కార్మికోద్యమ ఉజ్వల సన్నివేశాల్నిగుర్తుచేసుకుందాం

| సంభాషణ

నెల్లిమర్ల కార్మికోద్యమ ఉజ్వల సన్నివేశాల్నిగుర్తుచేసుకుందాం

- పొలారి, ఇప్టు | 20.01.2019 11:43:27am

ఈ ఏడాది జనవరి 29 కి నెల్లిమర్ల జూట్ కార్మికోద్యమం పై పోలీసు కాల్పులు జరిగి 25 ఏళ్లు నిండుతోంది. ఈ సందర్భంగా "నెల్లిమర్ల అమరత్వానికి పాతికేళ్ళు" నినాదంతో స్మారక కార్యక్రమాలు నిర్వహించాలని ఐ. ఎఫ్. టి. యు జాతీయ, రాష్ట్ర కమిటీలు తీర్మానించాయి. అందులో భాగంగా AP రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 29న విజయనగరం జిల్లాలోని నెల్లిమర్లలో సదస్సు, ప్రదర్శన, స్మారక బహిరంగ సభ జరుగుతాయి. పై సదస్సు లో ప్రముఖ ప్రజాతంత్ర హక్కుల మేధావి, విశ్రాంత ఆచార్యులు *హరగోపాల్* గారు ప్రారంభోపన్యాసం చేస్తారు. ఐ ఎఫ్ టి యు జాతీయ అధ్యక్షురాలు కామ్రేడ్ అపర్ణ* గారు నాటి వీరోచిత నెల్లిమర్ల ఉద్యమ స్మృతి, స్ఫూర్తిల వెలుగులో నేటి కార్మికోద్యమ కర్తవ్యాల పై ప్రసంగం చేస్తారు. ఆ సదస్సు అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు కాల్పులు జరిగిన రైల్వే గేటు వద్ద నుండి ప్రదర్శన ప్రారంభం అవుతుంది. నాలుగు గంటలకు స్థానిక ఇఫ్టూ యూనియన్ కార్యాలయం లో బహిరంగ సభ కలదు. దీనికి *హరగోపాల్* గారితో పాటు ఇఫ్టూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ *ప్రదీప్* గారు, సిపిఐ ఎంఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి కామ్రడ్ వై. *సాంబశివరావు* గారు, ఇఫ్టూ *ప్రసాద్* , *లక్ష్మి* ఇంకా స్థానిక నాయకులు తదితరులు ప్రసంగిస్తారు. ఈ సభకి కామ్రేడ్ *ఎం.వెంకటేశ్వర్లు* అధ్యక్షత వహిస్తారు. అదే రోజు సదస్సులో నెల్లిమర్ల కార్మికోద్యమ పై నాటి వ్యాసాల సంకలనంగా పుస్తక ఆవిష్కరణ కూడా ఉంటుంది. అరుణోదయ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.

ఈ సందర్భంగా ఆనాటి వీరోచిత సమరశీల నెల్లిమర్ల కార్మికోద్యమ చరిత్ర పుటల నుండి కొన్ని ఉజ్వల సన్నివేశాలనీ, వళ్ళు గగుర్పొడిచే కార్మిక వీరుల త్యాగపూరిత సంఘటనలనీ, కార్మిక అమర వీరుల కుటుంబ సభ్యులు ప్రదర్శించిన అసాధారణ చైతన్యాన్నీ, ఇంకా ఎన్నో స్ఫూర్తిదాయక ఘట్టాలని జ్ఞాపకం చ్చేయడం సముచితంగా ఉంటుందని భావిస్తున్నాం. ఈనాటి కార్మికోద్యమ శ్రేణులకు, ప్రజాతంత్ర, ఇంకా అభ్యుదయ, ప్రగతిశీల, లౌకిక శ్రేణులకు వాటిని అందించాలని భావించాము. రేపటినుండి వరుసగా నాటి చరిత్ర పుటల నుండి కొన్ని ముఖ్య సంఘటనలను అందిస్తాం.

నెల్లిమర్ల కార్మికోద్యమం ఆనాడు "మినీ చికాగో" గా అభివర్ణించబడింది. అది నాడు ప్రారంభమవుతున్న నూతన పారిశ్రామిక, ఆర్థిక విధానాలపై భారతదేశంలో తలెత్తిన తొలి సమరశీల కార్మిక ప్రతిఘటనలలో ఒకటిగా పేరొందింది. నేటి సరళీకరణ, ప్రపంచీకరణ ప్రక్రియలపై కొనసాగుతున్న పలు పోరాటాలకు అది ఒక మార్గదర్శకంగా కూడా నిలుస్తుంది. ముఖ్యంగా కార్మికులతో పాటు కార్మిక కుటుంబాల మహిళలను కూడా అత్యధిక సంఖ్యలో సమీకరించిన ఉద్యమంగా అది చరిత్రలో నిలిచింది. వేలాది మంది మహిళలు ఖాళీ పళ్ళాలు, గ్లాసులతో నెల్లిమర్ల నుండి కాలినడక విజయనగరంలో చేసిన ఆకలియాత్ర మరువలేనిది. వేలాది కార్మిక కుటుంబాల తో హైదరాబాదులో చేసిన ఆకలి యాత్ర అఖిల పక్షాల అండదండలు పొందింది. అది కొత్తగా అనేక వినూత్న ఉద్యమ ప్రక్రియలనూ, పోరాట రూపాలను సృష్టించింది. ముఖ్యంగా విశాల ఐక్య కార్యాచరణ ఉద్యమంగా అది చరిత్ర ప్రసిద్ధి కెక్కింది. ఇంకా ఇతర పీడిత వర్గాల ప్రజలను క్రియాశీలంగా, అశేషంగా సంఘీభావంగా కదిలించిన ఉద్యమంగా కూడా అది పేరొందింది. ఇంకా అది అతి చిన్న నిరసన పోరాట రూపాల నుండి ప్రాణాలకు సిద్ధపడ్డ ఉన్నత పోరాట రూపాల వరకు మెట్టుమెట్టు గా దశలవారీగా నిర్మించిన నిర్మాణమైన ఉద్యమంగా కూడా పేరొందింది. అలాంటి నెల్లిమర్ల కార్మిక ప్రతిఘటన ఉద్యమం,దానిలో భాగంగా ఐదుగురి అమరత్వం, వారి త్యాగనిరతి నేటి భౌతిక రాజకీయ పరిస్థితుల్లో అధిక ప్రాసంగికతని కలిగి ఉంది. అందుకే నేటి తరానికి నాటి వీరోచిత నెల్లిమర్ల కార్మికోద్యమంపై విలువైన సమాచారం మరియు అవగాహనను అందించటం సముచితంగా ఉంటుంది. రేపటి నుండి మేము అందించబోయే ప్రచారాంశాలలో కొన్ని భద్రపర్రుచు కోవాల్సినవి కూడా ఉన్నాయి.అందులో ఆనాటి ముఖ్యమైన కొన్ని పత్రికాప్రకటనలు, ఫోటోలు, చిన్నవ్యాసాలు, వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు తదితర అంశాలు ఉంటాయి. గాన మిత్రులు వాటిని ఆసక్తితో స్వీకరిస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా వాటిని తిరిగి మీ మిత్రులకి పంపడం, ఫేసుబుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా విభాగాల ద్వారా ప్రాచుర్యం కల్పిస్తారని ఆశిస్తున్నాము.

ఇట్లు
పొలారి, ఇప్టు

No. of visitors : 299
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


భిన్నకోణంలో "పదేళ్ల ముంబై* *మారణ కాండ

పి. ప్రసాద్ (పిపి) ఇఫ్టూ | 06.12.2018 12:55:27am

IB అధికారుల వత్తాసుతో దేశంలో హిందుత్వ సంస్థలే పై బాంబు పేలుళ్ళని చేపట్టిన నేపద్యాన్ని నిర్ధారించిన పుస్తకమిది. IB శాఖ అలాంటి వ్యవస్తీకృత హిందుత్వ ఉగ్రవాద.....
...ఇంకా చదవండి

అధర్మ యుద్ధ దుష్పలితమే కాశ్మీరు మారణకాండ !

ఇఫ్టూ ప్రసాద్ (పిపి) | 18.02.2019 09:45:37pm

ఈ "యుద్ధోన్మాదం" కొనసాగితే రెండు వైపులా ప్రధానంగా మన రైతు, కూలీల బిడ్డలే సమిధలుగా మారతారు. అదే సమయంలో అటు పాకిస్తాన్, ఇటు భారత్ లూటీ సర్కార్లు మాత్రం......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర

కార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ...

 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార డిసెంబర్ 2019
  సృజనాత్మక ధిక్కారం
  హింసలోనే పరిష్కారం వెతికిన రాజ్యం
  ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.
  హిందుత్వ శక్తులు చేస్తున్న బలవంతపు మత మార్పిడులకు బలైన ఒక ఆదివాసీ యువకుడి కథ
  వాళ్ళు
  ఇంగ్లీషు వద్దనడం లేదు, తెలుగు మాధ్యమం ఉంచండి
  గుండెను స్పృశిస్తూ జరిపిన ఒంటరి సంభాషణ "నా గదిలో ఓ పిచ్చుక"
  దేశంలో ప్రశాంతత నెలకొనివుంది-జైళ్ళూ నోళ్ళు తెరుచుకొనే వున్నాయి - తస్మాత్ జాగ్రత్త
  జై శ్రీరామ్!
  రమాకాంత్‌ వాళ్లమ్మ
  హిందూ రాజ్యం దిశగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •