చిన్ని కథ

| సాహిత్యం | క‌థ‌లు

చిన్ని కథ

- సుభాషిణి తోట | 20.01.2019 11:45:55am


ఎలా మొదలు పెట్టాలో అర్ధం కావట్లేదు అందామె.
అతనేమో ఎప్పటిలాగే అన్నాడు.

నాకొక ప్రేమ కథ ఉంది అందామె గోడకు తగిలించిన చిత్రాన్ని గమనిస్తూ..
ఎవరో ఆ అభాగ్యుడు అన్నాడతను
విరుపుగా ఆమె వంక అదోలా చూస్తూ

ప్రేమించడం తెలిసినవాడివేగా ఎందుకంత కినుకు అందామె సోఫా దిండ్లను సరి చేస్తూ
నువ్వెంత సర్దినా అవి అలాగే ఉంటాయి కానీ
కాస్త వివరంగా చెప్పు అన్నాడు తను ఆమెను అదిలిస్తూ..

కంట్లో సముద్రాన్ని నింపుకున్నదాన్ని
ఒడ్డున పడి ఉన్న గుండెను తడుముతున్నదాన్ని
మనసు ఘోషను విన్నదాన్ని
ఇసుక రేణువుల్లో అడుగుల్ని క్షణానికోసారి లెక్కపెడుతున్నదాన్ని
నీతో ఎన్నో సార్లు చెబుదామనుకున్న మాటల్ని మాత్రం
ఎక్కడో తవ్విన కథ లో దాచేస్తుంటా
అందామె

జీవితమంటే నీ నా కథే అనుకున్నా
ఇంకెవరో ఉన్నారంటే .....
నిన్ను నిన్నుగా కావాలనుకున్న
నువ్వే అన్నీ అనుకోని బ్రతికేస్తున్నా
నీలో ఉంది నేనేమో అని భ్రమ పడుతున్నవాడ్ని
మోసపోయానని తెలిసినా చుక్క నీరు కూడా గుండెల్లో ఉబికించుకోలేని వెర్రివాడ్ని
అతనింకేదో అంటునే ఉన్నాడు ఆమెను

ఈ లోగా ఎవరో నవ్విన శబ్దం ...
తిరిగి చూసాడు అతను ఎడారి కళ్ళతో,

ఆమె పచ్చని నదిలా నవ్వుతోంది
ఎండుటాకులా నేలను తాకే నీ చూపులు
ఈ రోజెందుకో ఆకాశాన్ని అందుకుటున్నాయి,
ఆ మన్మధుడు కలలోకొచ్చాడా, కళ్ళ ముందే ప్రత్యక్షమా అన్నాడతను పొస్సెస్సివ్నెస్ తో,
ఇంకా ఇంకా అంటుండగా ఆమె

అతను మళ్లీ
అంతా అబద్ధం
నీదంతా పచ్చి మోసం
నే వెళ్తున్నా
తేల్చేస్తా
నీ సంగతి అంటూ ఆవేశంగా ఊగుతున్నాడు,
ఒక్కసారి నా మాట విని పో అందామె,

షట్ అప్
కొన్ని చోట్ల ఆడదంటే అంత అమానుషంగా
చూస్తే బాధపడ్డ,
వాళ్లలో తప్పేమీ లేదు
నీలాంటి వాళ్లే వాళ్ళు కూడా
మీకు మళ్ళీ నిర్భయ చట్టాలు
అన్ని చోట్లా అడ్డమైన సపోర్ట్ లు
అతనిలో ఉన్న కసినంతా ఆమెపై మాటల రూపంలో విసురుతునే ఉన్నాడు,

ఇప్పుడు నేనెమన్నా అని అంత కర్కశంగా మాట్లాడుతున్నావ్ అందామె
చెప్పలేని భాషేదో వాడుతూ ఆమెను నిందిస్తున్నాడు

ఇంక ఆపు..
మగవాడివనిపించావ్
అసలు కథ విన్నవా
కనీసం వినేందుకు ట్రైచేసావా
నే రాసిన కథ
నీతో చర్చిద్దామని
ఎలా ఉందో అడుగుదామని
సరదాగా అలా అన్నా

అతనింకా ఏదో అనుమానంలోనే ఉన్నాడు
ఆమె ఇలా అనుకుంది
ఏమి లేకున్నా సృష్టించడం
అతని జన్మ హక్కేమో
ఇతనికి ఈ గుణం ఎలా అబ్బిందో ఈసారి కలిసినప్పుడు వాళ్ళమ్మనడగాలి అని...





No. of visitors : 263
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణతార జూలై - 2019

    చారిత్రక పత్రం
    రచయితలకు సవాల్ !
    మూడు తరాల, యాభై వసంతాల విరసం
    వర్తమాన సంక్షోభాల తాత్విక చిత్రణ - అద్దెప‌ల్లి ప్ర‌భు ʹశ్రీ సూర్యనారాయణʹ
    రూపొందుతున్న కాలానికి తగిన కథన శిల్పం
    తిరిగి వ‌స్తావ‌ని
    నన్నెక్కనివ్వండి బోను
    కవిత్వాన్ని సాయుధం చేసిన చ‌నుబాల ధార‌
    సామాజిక సంఘర్షణల సారం - ప్రస్థానం
    సాహిత్యంలో విప్లవోద్యమానికి యాభై ఏళ్లు

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •