కిటికీ పిట్ట వెలుతురు పాట‌

| సాహిత్యం | స‌మీక్ష‌లు

కిటికీ పిట్ట వెలుతురు పాట‌

- శేషు కొర్లపాటి | 20.01.2019 12:07:47pm


జైలు జీవితం అందరికీ ఒకేలా ఉండదు. ఎందుకంటే జైళ్ల‌కు కూడా ఈ దేశంలో కులం, వ‌ర్గం ఉంటుంది క‌నుక‌. విన‌డానికి వింత‌గా ఉన్నా.. ఇది వాస్త‌వం. ఏ త‌ప్పు చేయ‌నివాడిని యేండ్ల‌కేండ్లు నిర్బంధించ‌డం, వేల కోట్ల ప్ర‌జా ధ‌నాన్ని మింగిన వాళ్ల‌కు పాల‌కులే సేవ చేస్తుండ‌డం చూస్తూనే ఉన్నాం. మాన‌వ హ‌న‌నాల‌కు పాల్ప‌డిన వాళ్లు ఇక్క‌డ ప్ర‌ధాన మంత్రులు కావ‌చ్చు. ఇదేమి అన్యాయం అన్న‌వాడు మాత్రం చీక‌టికొట్టులో బంధీ అవుతాడు. ఈ దేశంలో వేలాదిగా జైళ్ల‌లో మ‌గ్గుతున్న ఆదివాసీలే నిద‌ర్శ‌నం.

దేశంలోని బ్యాంకులకు అప్పులు ఎగవేసి దేశం వదిలి లండన్ పారిపోయిన విజయ్ మాల్యాని తిరిగి దేశంకి అప్పగించడానికి లండన్ కోర్ట్ ఒప్పుకోలేదు. అందుకు కారణం మన జైళ్లలో వసతులు స‌రిగ్గా లేవని. ఇక్కడి జైలు గ‌ద్దుల్లో కనీసం గాలి వెలుతురు రాదని. మరి అలాంటి జైళ్లలోనే వేలాది మంది ద‌ళిత‌, ఆదివాసీ, ముస్లిం మైనార్టీ ఖైదీలు ఉంటున్నారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే... చిన్న చిన్న నేరాలు చేసిన వాళ్ల దగ్గ‌ర నుంచి కేవ‌లం రాజ‌కీయ విశ్వాసాలు క‌లిగి ఉన్నందుకే బంధీలుగావించ‌బ‌డ్డ రాజ‌కీయ ఖైదీల వ‌ర‌కు. అలా... చీక‌టి కొట్ల‌లో మ‌గ్గిపోతున్న వేలాది మంది గురించి ఏనాడూ ఆలోచించ‌ని అధికార వ‌ర్గం... త‌మ అధికారానికి వెన్నుద‌న్నుగా నిలిచే దోపిడీ శ‌క్తుల గురించి తెగ ఆందోళ‌న చెందుతుంది.

ఇవాల్టి సంద‌ర్భం... మ‌రీ ముఖ్యంగా రాజ‌కీయ ఖైదీల గురించి మాట్లాడుకోవ‌ల్సిన సంద‌ర్భం. దేశ వ్యాప్తంగా హ‌క్కుల కార్య‌క‌ర్త‌లు, ర‌చ‌యిత‌లు, విద్యార్థులు, అధ్యాప‌కులు, న్యాయ‌వాదులు వ‌ర‌కు ప్ర‌జాస్వామిక వాదుల‌ను అక్ర‌మ కేసుల్లో నిర్బందిస్తోంది రాజ్యం. అలా... ఒక ర‌చ‌యిత‌ను, క‌వి ఖైదు చేస్తే ఏం చేస్తాడు ఆ క‌వి? తాను అక్ష‌రాల‌ను ఆలంబ‌న చేసుకుంటాడు. క‌విత్వాన్ని మాద్య‌మంగా మార్చుకొని ప్ర‌పంచంతో సంభాషిస్తాడు. అలా... ఖైదు క‌విత్వం కిటీకి పిట్ట‌. ప్ర‌పంచ ప్ర‌సిద్దినొందిన పికాసో లాంటి చిత్ర‌కారుల‌ను, వాళ్ల సృజ‌నాత్మ‌క‌త‌ను తెలుగు నేల‌కు అత్యంత ద‌గ్గ‌ర‌గా ప‌రిచ‌యం చేసిన క‌ళాపిపాసి పి. మోహ‌న్ క‌విత్వం. జైలు జీవితంలోని సంఘ‌ర్ష‌ణ‌కు ప్ర‌తిబింబం త‌న కిటికీ పిట్ట క‌విత్వం.

కొన్ని జైలు జీవితాలు చాలా సాదార‌ణంగా సాగిపోతే, కొన్ని విలాసవంతం మారిపోతాయి. సెల్ ఫోన్ నుండి సెటిల్ మెంట్స్ వరకు అన్నీ అక్కడనుండే జరిగిపోతాయి. మరికొన్ని జీవితాలు మన ఊహకి కుడా అందనంత భయంకరంగా ఉంటాయి. చీకటి గదుల్లో రోజులు గడిచి పోతుంటాయి. గది బయట కాచేది ఎండో, వెన్నెలో తెలియదు. అలా ఎన్ని రోజులు గడుస్తున్నాయి అని కూడా తెలియదు. అలాంటి రోజులు గడపటం ఎంత దుర్భరంగా, దయనీయంగా ఉంటుందో ఈ కిటికీపిట్ట చెబుతుంది.

అక్రమ నిర్బంధంలో మనిషితనం కోల్పోయిన శత్రువు నోటినుండి కమురు కంపు కొట్టే అసహ్యమైన తిట్లు వింటూ ఉండడం ఎంత కష్టం. అంత కష్టంలోను ఆ మాటలకు చెదరకుండా నిబ్బరంగా నిలబడితే రక్తం గది మొత్తం పారుతుంది. మన రక్తంలో తడిచిన శత్రువు బూటు మన మొఖానికే తగులుతుంది. ఆ సమయంలో కూడా కవి శత్రువుకు వణుకు పుట్టించే దైర్యం చూపాడే తప్ప ఎక్కడా తాను నమ్మిన విలువలను వదలలేదు. "నీ భ్రమల విచ్ఛిత్తి కోసం నేను బతికి బట్టకడతా" అని ఒక యుద్ద ప్రకటన చేశాడు కవి.

కిటికీ పిట్ట సంభాష‌ణ ద‌శాబ్ధం కింద‌టిదే కాదు... ఇవ్వాల్టిది కూడా. జైలు గోడ‌ల న‌డుమ నుంచి ఎంద‌రెంద‌రో ఖైదీలు ఆల‌పిస్తున్న‌ వెలుతురు పాట‌.

No. of visitors : 243
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఎలా కలవాలి ?

శేషు కొర్లపాటి | 30.09.2018 11:13:18pm

వొందల కవర్ పేజీలు చేసిన నువ్వే ఓ కవర్ పేజీ అవుతావని ఎప్పుడైనా ఊహించావా స్వేచ్ఛగా ఉన్న నీ చేతులే కదా అందరికి కనిపించేది సంకెళ్లు పడ్డ నీ జీవితం ఎందరు చూడ.....
...ఇంకా చదవండి

స్వేచ్చా స్వప్నం

శేషు కొర్లపాటి | 04.01.2019 10:55:17pm

ఎక్కడ ప్రశ్న మొదలైతే అక్కడ నోరు నొక్కబడుతుంది, గొంతు గెంటేయబడుతుంది , ప్రాణం పోతుంది.దేశంలో ఇప్పుడున్న పరిస్థితి ఇదే......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి
  అరుణతార ఏప్రిల్ - 2019
  ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
  వరవర రావును విడుదల చేయమని కోరుతూ ప్రధాన న్యాయమూర్తికి వరవర రావు సహచరి హేమలత బహిరంగ లేఖ
  ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
  తెగిపడిన చిటికెనవేలు చెప్పిన ఏడుగురు అక్కచెల్లెళ్ళ కథ
  మేఘం
  అర్హత
  మోడీ ʹమేకిన్ ఇండియాʹలో తయారైనవి
  భూమాట
  చంద్రబాబు అయిదేళ్ల పాలన - మీడియా మేనేజ్మెంట్
  ఆ చిరునవ్వుల్ని చిదిమేశారు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •