అకాడమీ దేనికి ప్రాతినిధ్యం వహిస్తుంది ?

| సంపాద‌కీయం

అకాడమీ దేనికి ప్రాతినిధ్యం వహిస్తుంది ?

- పాణి | 18.02.2019 09:26:52pm

ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ చైర్మన్‌, పదకొండు మంది సభ్యులను నియమిస్తూ ప్రభుత్వ ప్రకటన వచ్చాక సాహిత్యరంగం నుంచి హాహాకారాలు మొదలయ్యాయి. తమ ప్రాంతాలకు, కులాలకు, మతాలకు ప్రాతినిధ్యం లేదని, ఉన్నా తగినంత లేదని చర్చలు మొదలయ్యాయి. ఇదెక్కడి అన్యాయమని మాట్లాడుతున్నారు. వీళ్లలో చాలా మంది అడపాదడపా లోకంలోని మంచి చెడ్డలను పట్టించుకొన్నవాళ్లే. వాటిని వివరించిన వాళ్లే. దీనికి ప్రత్యేకంగా అభినందించాల్సిన పని లేదు. అది వాళ్ల బాధ్యత. అలాంటి బాధ్యతాయుత వైఖరి తీసుకున్నారని చెప్పి ఈ హాహాకారాల అర్థం ఏమిటో చెప్పకుండా ఎలా ఉంటాం?

అకాడమీలో ఫలానా ప్రాంతాలకు, కులాలకు, మతాలకు తగిన చోటు లేని మాట నిజమే. ఎల్లవేళలా కొన్ని కులాల వాళ్లే, కొన్ని ప్రాంతాల వాళ్లే ఇలాంటి వాటిల్లో ఎందుకు తిష్టవేసుకొని ఉండాలి? కాబట్టి ఈ అన్యాయం ఎలుగెత్తి చాటాలని కొందరు అనుకోవచ్చు. ప్రభుత్వ వివక్ష స్వభావం వల్లే వెనుకబడిన ప్రాంతాలకు, మైనారిటీ మతాలకు, పీడిత కులాలకు అకాడమీలో ప్రాతినిధ్యం ఉండటం లేదని వాదిస్తున్నారు.

నిజానికి ఈ ప్రాంతాలు, కులాలు, మతాలు ʹవెనుకబడʹటానికి వందల వేల ఏళ్ల సామాజిక కారణాలతోపాటు ప్రజాస్వామ్యబద్ధంగా పని చేస్తున్నామని ఫోజు కొడుతున్న ఈ ప్రభుత్వాలు కూడా ముఖ్యమైన కారణం. అసంఖ్యాక ప్రజలను, అనేక అస్తిత్వాలను వెనుకబడేలా చేసే స్వభావం ఈ రాజ్యానికి ఉన్నది. కాబట్టి అకాడమీలో ఈ అన్ని రకాల వెనుకబడిన అస్తిత్వాల రచయితలకు ప్రాతినిధ్యం ఎలా దక్కుతుంది?

అసలు అకాడమీ ఈ పీడిత అస్తిత్వాలకు ప్రాతినిధ్యం వహిసున్నదా? లేక రాజ్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్నదా? అసలు విషయం ఇది. ఏదో ఒత్తిడి చేసి అన్ని చోట్ల కాసింత జాగా సంపాదించుకుందామనే ఆలోచన తప్ప ఈ రాజ్య ప్రాతినిధ్యంలో మనకు చోటు ఎలా వస్తుందనిగాని, వచ్చినా ప్రయోజనం ఏమిటనిగాని ఆలోచించే విమర్శనాత్మక వైఖరి ప్రకటించే శక్తి మన సాహిత్యరంగానికి ఉండటం లేదు.

రచయితలు ఇంత చిన్న విషయం ఎందుకు పట్టించుకోవడం లేదు. ఇంత చిన్న సత్యం తెలుసుకోకుండా సాహిత్యంలో జీవన సత్యాలను ఇంత కాలం ఎలా రాస్తున్నారు? మానవ జీవితం ఎలా ఫంక్షన్‌ అవుతోందో తెలియకుండా ఒక్క వాక్యం రాయడం ఎవరి వల్లా కాదు. అలాగే ఈ వ్యవస్థ, రాజ్యం ఎలా పని చేస్తున్నాయో తెలుసుకోకుండా ఇంత సాహిత్యం రాయడం ఎలా సాధ్యమవుతోంది ?

అన్ని చోట్లా సీట్లను కులాల, మతాల, ప్రాంతాల వారీగా పంచిపెట్టడితే పీడిత అస్తిత్వాలకు న్యాయం జరిగినట్లే అనే వాదన ఎక్కడికి పోతుందో గమనించాలి. ఇదే అస్తిత్వవాద చైతన్యమయితే రాజ్యానికి ఈ వివక్షా స్వభావం తప్ప ఇంకేమీ లేదా? అనే అతి ముఖ్యమైన ప్రశ్న ఎదురవుతుంది. అకాడమిలో చోటు ఇవ్వడంలో, అవార్డులు పంచడంలో, దుప్పట్లు కప్పడంలో వివక్ష పాటించడం మినహా మరే దుర్మార్గ స్వభావం రాజ్యానికి లేదని ఒప్పుకున్నట్లవుతుంది. అప్పుడు ప్రభుత్వం న్యాయమైన పంపకాలు చేస్తే ఇంకే అభ్యంతరం లేదని అంగీకరించినట్లే.

అందువల్లే.. వాడు తన రాజ్య ప్రాసాదంలోకి కొందరిని పిలిచి కుర్చీ వేసి కూచోపెడితే పళ్లికిలించుకుంటూ వెళ్లే వాళ్లు కొందరు, తమ ప్రాంతాలకు, కులాలకు ఇందులో తగిన వాటా దక్కలేదని గంటుగ ముఖం పెట్టుకొనే వాళ్లు ఇంకొందరు తయారయ్యారు. వెనుకకు తోసివేయబడిన ప్రాంతాలకూ, కులాలకూ తగినంత ప్రాధాన్యం అకాడమీలో చోటు లేదని తప్ప, ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం పంచన చేరడం ఏమిటనే ప్రశ్న తలెత్తడం లేదు. నిజంగానే రాజ్యమెంత దుర్మార్గమైందో తెలిస్తే, లేదా తెలిసినదానికి నిబద్ధమైతే ఇలా వ్యవహరించలేరు.

ఒకసారి అకాడమిలో చేరాక ఇక కవిత్వం ఏం రాస్తారు? ఏ మానవ విషాదాన్ని కథనం చేస్తారు? ఏ విధ్వంసం మీద కలం ఎత్తి నిర్భీతిగా నిలబడతారు? ఒకవేళ ఆ తర్వాత కూడా ఏదో సౌకర్యం ఉండి ఇవన్నీ చేస్తే ప్రజలు ఎందుకు వీళ్లను నమ్మాలి? అలాంటప్పుడు అకాడమీ ద్వారా ఇక చేయగలిగింది ఏముంటుంది? మహా అయితే లావుపాటి పుస్తకాలు అచ్చువేయడం, అందంగా అక్షరాలను అలంకరించడం, అప్పుడప్పుడు జాతరలు చేయడం, దారిన పోయే వాళ్లందరినీ పిలిచి దుప్పట్లు కప్పడం తప్ప ఇంకేమన్నా ఉంటుందా?

ఒకవేళ అకాడమీలతో చేయదగిన సత్కార్యాలు ఉన్నాయనుకుంటే అవన్నీ ప్రభుత్వానికి బైట రచయితలు తమ సొంత శక్తితో ఎంతో కొంత చేయవచ్చు. వీల్లేకపోతే ఏమీ చేయకపోయినా ఫర్వాలేదు. రాజ్య అసమ్మతిదారుగా, రాజ్య వ్యతిరేకిగా, ప్రజా పక్షపాతిగా నిలబడితే చాలు. తరతరాలుగా వివక్షకు గురవుతున్న ప్రాంతాల, కులాల, మతాల ప్రజల గొంతుకగా నిలబడ్డం కంటే సార్థకత ఏముంటుంది?

అంత దాకా ఎందుకు? దశాబ్దాల దశాబ్దాల కేంద్ర, రాష్ట్ర అకాడమీలు చేసిన దానితో పొల్చుకుంటే రచయితలు, కళాకారులు, బుద్ధిజీవుల బ ందాలు, సాహిత్య కళా సంస్థలు, సాహిత్యోద్యమాలు, సాహిత్య ధోరణులే అనేక రెట్లు క షి చేశాయి. రచయితలు వ్యక్తిగత స్థాయిలోనే ఎంతో చేశారు. వేలాది విలువైన పుస్తకాలు సమాజానికి అందించారు. ఈ సమాజంపట్ల విమర్శనా ద ష్టిని అందించారు. అత్యంత విషాదకరమైన మానవ అనుభవంలోంచి ఒక ధిక్కార చైతన్యాన్ని ప్రోది చేశారు. సరిగ్గా మానవ జీవితంలో సాహిత్యం సాహిత్యం, కళలు ఏం చేయాలో దానికి తగినట్లు తమ అక్షరాలను, స జనశక్తిని వెచ్చించారు. మానవ చైతన్యరూపమైన సాహిత్యం జీవితం నుంచి ప్రభవించి, తిరిగి జీవితాన్ని చైతన్యవంతం చేయడంలో అనేక ప్రగతిశీల భావజాలల వెలుగులో పాత్ర అత్యంత గణనీయమైనది. ప్రభుత్వాలు, అకాడమీలు చేసిన దానితో సాహిత్యోద్యమాలు, వివిధ సాహిత్య ధోరణులే వేల రెట్లు ఎక్కువ చేశాయి. నిజానికి ఇది గణాంక భాషలోకి ఒదిగేది కానే కాదు. తరతరాలుగా ఇంగువ వాసనతో గుప్పుమన్న తెలుగు సాహిత్యంలోకి అట్టడుగు జీవన విధానాలను, విన్యాసాలను, మట్టి వాసనలను, శ్రమ సౌందర్యాలను, పనిలోని పాటను రచయితలు తీసుకొని వచ్చారు. మన ప్రజల జీవన్మరణ పోరాటాల స్ఫూర్తితో తలెత్తిన సాహిత్యోద్యమాలు, వివిధ ప్రజాస్వామిక ధోరణులే వీటిని సృజన రంగంలో ఎత్తిపట్టాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇవే మన ప్రజా జీవితాన్ని అపారమైన తేజోవంతం చేశాయి. ఇవేవీ అకాడమీలు తీసుకరాలేదు. సాహిత్యమంటేనే మనకు ప్రజా ప్రతినిధ్యం. అకాడమీల్లో ప్రాతినిధ్యం కాదు. ఇదంతా గుర్తు పెట్టుకుంటే అకాడమీల యావ తగ్గుతుంది. నిజంగానే రాజ్యమెంత దుర్మార్గమైందో తెలిస్తే, లేదా తెలిసినదానికి నిబద్ధమైతే ఇలా వ్యవహరించలేరు.

మన తెలుగు సాహిత్యరంగానికి ఒక పక్క దుప్పట్ల మడతలు విప్పే శబ్దాలు, ఇంకో పక్క సంకెళ్ల సవ్వడులు కొత్త కాదు. అయినా అకాడమీల్లో సాహిత్యం ఏముంది? పేరులో తప్ప. అందుకే సాహిత్య అకాడమీల చుట్టూ నడిచే వాద వివాదాలు ఎల్లప్పుడు అవార్డులు, పురస్కారాలు, వాటి కోసం పైరవీలు తప్ప మరే సాహిత్య, స జనాత్మక చర్చలు ఉండవు. అయిన వాళ్లను అందలాలు ఎక్కించారని, కాని వాళ్లను దూరం పెట్టారని ఈ అకాడమీల్లో కూర్చున్న వాళ్ల గురించి, వాళ్లకూ గురుతుల్యులైన వాళ్ల గురించి గుసగుసలు వినిపిస్తుంటాయి. సరిగ్గా ఇతర రాజ్యవ్యవస్థల గురించి ఏం వింటుంటామో అవే సాహిత్య అకాడమీల చుట్టూ వినిపిస్తుంటాయి.

మరి అకాడమీలు సాహిత్య స జనను, దాని వస్తువులో, ద క్పథంలో, శిల్పంలో ఏం సాధించాయని తమకు ప్రాతినిధ్యం దక్కలేదని వాపోతున్నారు? ఎక్కడో ఒక చోట ప్రజల గురించి ఆలోచించిన శిబిరాల నుంచే మన సాహిత్యంలో అద్భుతమైన జీవన సంవేదనలు వినిస్తున్నాయి. మన సాహిత్యం గొప్ప విస్త తిని అక్కడి నుంచే సాధిస్తోంది. అకాడమీల ద్వారా కొందరు సాహిత్యకారులకు తప్ప సాహిత్యానికి ఏం మేలు జరిగింది? ఇప్పుడు ప్రాంతాల వారిగా, కులాల వారిగా అందరికీ సమానంగా మేలు జరగడం లేదనే వగపాటు తప్ప ఈ విమర్శల్లో ఇంకేముంది?

ఇట్ల విమర్శిస్తే సాహిత్యరంగంలో విశాలమైన ఐక్య సంఘటన దెబ్బతింటుందని అనే వాళ్లు ఉన్నారు. విశాల ఐక్య కార్యాచరణ కోసం సాహిత్యతత్వాన్ని, ప్రయోజనాన్ని, రాజ్యంపట్ల ఉండాల్సిన విమర్శనా వైఖరిని బలి పెట్టాలా? అంతకంటే దుస్థితి ఏముంటుంది? అప్పుడు సాధించేది ఏమీ ఉండదు.

ఎందుకంటే ఇది అంతిమంగా పాలకవర్గాలపట్ల మన వైఖరి ఏమిటి? అనే ప్రశ్న దగ్గరికి మనల్ని తీసికెళుతుంది. కచ్చితమైన వర్గద ష్టి లేకపోతే రచయితలు చాలా సులభంగా చిన్న చితక పదవులకు, సత్కారాలకు, గౌరవాలకు సంత ప్తి చెందుతారు. రచయితలంత అల్ప సంతోషులు భూమ్మీద ఎవ్వరూ ఉండరు. ఒక పూల దండో, రాసిన దాని మీద నాలుగు ప్రసంసా వాక్యాలో, లేదా రాసిన దాని వల్ల వచ్చే నాలుగు రూకలో, పిసరంత గుర్తింపో చాలు పొంగిపోడానికి.

అప్పుడు కనీసం ఒక స్పష్టతనైనా పాఠకులకు ఇవ్వాలి. అకాడమీ రాజ్యారికి ప్రాతినిధ్యం వహించేదే, మేమే కాసేపు అది మర్చిపోయి మాకో, మా సాహిత్యానికో ఏదైనా మేలు జరుగతుందని వెళుతున్నాం అని చెబితే బాగుంటుంది. అకాడమీ రాజ్యానికి ప్రాతినిధ్యం వహించేదే అయినా తరతరాలుగా వివక్షకు గురైన మా ప్రాంతాలకు, కులాలకు, మతాలకు కూడా ప్రాతినిధ్యం వహించాలనే పేరాశతో మాట్లాడుతున్నాం.. అని వాటా గురించి మాట్లాడేవాళ్లుఅంటే బాగుండేది.

ఈ మాట అకాడమీ మోజులో ఉన్నవాళ్లందరినీ శతృవులని అనడం లేదు. సమాజంలో వాళ్ల పాత్రను ప్రశ్నించనవసరం లేదు. ఈ స్థితి గురించి ఏమైనా విమర్శనాత్మక వైఖరి సాధ్యమేనా? అని అడగడం అంతే. ఏదో ఒక కచ్చితమైన అర్థంలో రాజ్యంపట్ల విమర్శనాదృష్టి లేకపోతే రచయితలు మాట్లాడే పెద్ద పెద్ద మాటలకు అర్థం ఏమీ ఉండదు. మన ఇష్టాలు, కోరికలు, వైఖరులపట్ల ఆత్మ విమర్శనాదృష్టి లేకపోతే తేలిగ్గా సాహిత్య వ్యక్తిత్వం బొగిలిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ అకాడమీల పోకడ చర్చనీయాంశం కావాలి. మర్యాదస్తుల్లాగా ఉండే వాళ్లను ప్రశ్నించాల్సి వస్తుంది.

వీళ్ల ముందు అకాడమీ సీట్లు మాత్రమే ఉండొచ్చు. అందులో జరిగే అన్యాయం మాత్రమే ఉండొచ్చు. కానీ ప్రజల ముందు చారిత్రకంగా తాము సొంతం చేసుకోవాల్సిన ప్రపంచమే ఉంది. అది సాధించే లోగా వాళ్లు ఎన్నిసార్లయినా ఓడిపోవచ్చు. లెక్కలేనని తప్పులు చేయవచ్చు. ప్రజలే కాదు, వాళ్ల తరపున ఉన్న వాళ్లు కూడా తప్పులు చేయవచ్చు. అయినా నిబద్ధ దిద్దుబాటుతో ప్రజాశక్తులు తిరిగి లేచి నిలబడి దాని కోసం రక్తమోడి పోరాడుతుంటాయి. ఆ ప్రజల వ్యక్తీకరణగా, అనుభవంగా, చైతన్యరూపంగా ఉండాల్సిన రచయితల అల్ప సంతోషాలను ఐక్య సంఘటన కోసం నిర్విమర్శగా ఎందుకు భరించాలి? అప్పుడు దాని వల్ల సాధించే ప్రయోజనం ఏముంది? దేనికైనా, ఎవరికైనా విమర్శా ద ష్టికంటే ఉన్నతమైన గీటురాయి మరేమీ లేదు. లోకం మొత్తాన్ని విమర్శనాత్మకంగా, సౌందర్యభరితమైన వర్ణనాత్మక దృశ్యంగా పునర్నిర్మించాల్సిన రచయితలపట్ల విమర్శ ద ష్టి లేకుంటే సాహిత్యరంగం శిథిలమైపోతుంది. సాహిత్య కళా రంగాలనే కాదు, మానవ జీవితాన్ని ధ్వంసం చేస్తున్న రాజ్యంపట్ల ఉమ్మడి అవగాహన కాకుంటే అందరం కలిసి కూడా చేసేదేమీ లేదు. అయ్యో అయ్యో అనే వగపు తప్ప. అది మౌనానికంటే హీనం.

No. of visitors : 477
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఏప్రిల్ - జూన్ 2020
  తారకంగారంటే..
  సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?
  అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ
  హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష
  అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం
  దేశీయుడి కళ
  మీరొస్తారని
  బందీ
  ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి
  మనిషిని బంధించినంత మాత్రాన....
  జి.యన్. సాయిబాబా, వరవరరావుల విడుదలను కోరుతూ ప్ర‌పంచ‌ మేధావుల విజ్ఞప్తి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •