ఇడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు - కమ్యూనిస్టు బ్రాహ్మణీయ దృక్పథం

| సాహిత్యం | వ్యాసాలు

ఇడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు - కమ్యూనిస్టు బ్రాహ్మణీయ దృక్పథం

- నలమాస క్రిష్ట్ర | 18.02.2019 09:31:04pm

కమ్యూనిస్టులంటే కష్టజీవుల వైపు నిలబడతారు. అణచివేతకు, అవమానాలకు, అంటరానితనంకు గురౌతున్న బాధితుల వైపు నిలబడతారు. కమ్యూనిస్టులు కాని వారికి కూడా శ్రమ జీవుల పాలిటి ప్రతినిధిగా కమ్యూనిస్టు పార్టీలను చూస్తారు. (దేశంలో పదుల సంఖ్యలో కమ్యూనిస్టు, విప్లవ కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి) కమ్యూనిస్టు పార్టీల మధ్య అవగా

హన, ఆచరణ మొదలైన సమస్యలున్నాసరే కొన్ని విషయాల పట్ల కనీసం అవగాహన స్థాయిలో నైనా సారూప్యత కనిపించడం ఇక్కడి ప్రత్యేకత. ఈ ప్రత్యేకతకు కారణం. రివిజనిస్టులు అనుకున్నా, మితవాద, అవకాశవాదులనుకున్నా, లేదా విప్లవకారులు అనుకున్నా సరే వీరంతా స్థూలంగా మార్క్సిజాన్ని తమ పార్టీల సిద్దాంతంగా స్వీకరించారు.

2018 జనవరి 10 నాడు భారత పార్లమెంటు అగ్రవర్ణాలకు (నెలకు 65 వేలు ఆధాయం ఉన్నా సరే పేదలేనని ఈ చట్టం చెపుతుంది.) విద్యా, ఉద్యోగ అవకాశాలలో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసింది. ఈ చట్రాన్ని ఎంఐఎం, ఎఐడిఎంకె, రెండు పార్టీలు తప్ప సిపిఎం, సిపిఐతో సహా అన్ని పాలకపార్టీలు బలపరిచాయి. కొన్ని పార్టీలు కంటితుడుపు సవరణలు చేసినట్లు నటించి చివరకు రాజ్యాంగ సవరణలో భాగం అయినాయి.

బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలు అగ్రకుల మనువాద నీతి గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. దేశంలోని టిడిపి, టిఆర్‌ఎస్‌, బిఎస్‌పి, బిజెయు, మొదలైన ప్రాంతీయ బయటకు ఏమీ మాట్లాడుతున్నా వాటి పునాది అగ్రకుల సంపన్న వర్గ భూస్వామ్యం పెట్టుబడిపై ఆధారపడి సామ్రాజ్యవాదం దన్నుతో కొనసాగుతున్నవే. వర్గం గురించి వదిలేసి పీడిత కుల ప్రయోజనాల గురించి మాట్లాడుతూ అభివృద్ధి చెంది ఇప్పుడు పాలకపార్టీగా అవతారం ఎత్తిన బిఎస్‌పి బహుజన వాదం నుండి పక్కకు తొలగి సర్వజన సుఖాయ నినాదం ఎత్తుకున్నది. కనుక మాయావతి పైన ఏమీ మాట్లాడినా సరే 124 రాజ్యాంగ సవరణ అనే నేరపూరిత పాసిస్టు కుట్రలో భాగమైంది.

నా అన్న ప్రశ్న ఏమిటంటే శ్రమ జీవులు విముక్తి కోసం పనిచేస్తున్నామని మాట్లాడుతున్న కమ్యూనిస్టుల బుద్ది ఏమైందనేది?

సిపిఎం, సిపిఐ లు మాత్రమే కాదు పార్లమెంటు, అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని ఎర్రజెండా పార్టీలు కూడా (ఇడబ్ల్యూఎస్‌) ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్‌ యిస్తే తప్పేముంది అంటున్నాయి.

హిందూ ఫాసిస్టు ప్రమాదాన్ని ఏదో ఒక స్థాయిల అనుభవిస్తున్న ఆయా పార్టీలు కూడా బ్రాహ్మణీయ చట్రం నుండి బయటపడకపోవడం వలన ఫాసిజానికి పని చాలా సులువు అవుతుంది. అగ్రకుల తత్వాన్ని కలిగి వున్న అగ్రకులాలలోని పేదలకుండే దృక్పథానికి కమ్యూనిస్టు నాయకత్వాల దృక్పథానికి కమ్యూనిస్టు నాయకత్వాల దృక్పథానికి తేడా మౌలికంగా ఉండాలి కదా.

దళితవాడలో, ఆదివాసీ గూడెంలో, లంబాడీతండలో సంచార జాతుల్లో, ముస్లిం బస్తీలో ఉన్న కడు పేదరికం బ్రాహ్మణ పూజారి వర్గంలో కూడా ఉందని రుజువు చేయడం అంతపెద్ద కష్టమేమీ కాదు. పేదరికం సామాజికంతోని ముడిపడిఉంది అంటూనే ఇడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు సమర్థించడానికి అగ్రకులాల్లోని పేదవర్గం ఆర్తనాదాలు హృదయ విదాయక సంఘటను వర్ణించడం కమ్యూనిస్టుల పని ఎంత మాత్రం కాదు. ఈ దోపిడి వ్యవస్థ వున్నంత వరకు ఆకలి, పేదరికం అణచివేత, దోపిడీ వివక్ష ఉంటాయి. మొత్తం సమానత్వం కోసం జరిగే పోరాటాల ద్వారానే మౌలిక మార్పులు సాధ్యం అవుతాయి. ఆ మార్పులో పేదరిక నిర్మూల ముఖ్యమైనదిగా ఉంటుంది. హిందుత్వ తమ ప్రయోజనం కోసం పేదరికం సాకుగా చూపి 10 శాతం రిజర్వేషన్లు యిస్తాయంటే కమ్యూనిస్టు పార్టీలు గొర్రెమందలా తల ఊపడం ఎవరి ప్రయోజనం కోసం? భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా కల్పించబడ్డాయి. అనే విషయం కూడా తెలియని అమాకత్వంలో ఎర్రజెండా పార్టీలున్నాయా? లేక ఉదారవాద బ్రాహ్మణీయ చట్రంలో యిరుక్కుపోయినాయా?, అగ్రకులాల సంఘటితపరిచే ఫాసిస్టుల ఎజెండాలో ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు?

రిజర్వేషన్‌ మౌళిక స్వభావం నేపథ్యం మరిచిపోయిన వారు పేదరికం గురించి మాట్లాడుతున్నారు.ఆలా మాట్లాడటమే వర్గ పోరాట అవగాహన అని భావిస్తున్నారు కానీ నిర్ధిష్ట సమయంలో పీడిత కులాల డిమాండ్స్‌ను గట్టిగా బలపరిచి వారివెంట నిలబడడమే వర్గ దృక్పదం అని మరిచిపోతున్నారు.

కాసేపటికీ పేదరికమే రిజర్వేషన్‌ కల్పించడానికి ప్రమానం అనుకుంటే.. మైనార్టీ బిసి, ఎస్సీ, ఎస్టీలలో దారిద్య్రరేఖకు దిగువనున్న వారి నిష్పత్తి ఎంత? అగ్రకులాలలో నిష్పత్తి ఎంత? అక్షరాస్యతలో ఎవరు ముందున్నారు. 90 శాతం అణగారిన వర్గాల ప్రజలకు దక్కాల్సిన ప్రయోజనాలను అన్యాయంగా, అక్రమంగా, చట్టవిరుద్ధంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి కేవలం 10 నుండి 15 శాతం వున్న సంపన్నకులాలే అనుభవిస్తున్నాయి కదా... ఉన్నతన్యాయస్థానాల్లో క్లాస్‌ ఎ బ్యూరోక్రసీలో 90 శాతం అగ్రకులాలే ఆక్రమించాయి. పార్లమెంటు, చట్టసభలు అగ్రహారాలే కదా... 90 శాతం వున్న పీడిత కులాలకు 10 శాతం (ఉన్నత స్థాయిలో) దక్కడం కష్టంగా మారింది. భూమి, పరిశ్రమలు ఇతర ఉత్పత్తి సాధనాలు ఎలాగో అగ్రకుల సంపన్న వర్గం చేతిలోనే ఉన్నాయి. వేల సంవత్సరాలుగా వున్న బ్రాహ్మణీయ చాతుర్వర్ణ వ్యవస్థ రీ ప్రొడ్యూస్‌ అవుతుంది. దేశంలో సగానికిగా జనాభా వున్న ఒబిసిలకు కేవలం 27 శాతం రిజర్వేషన్‌ మాత్రమే వుంది.(కేసులో సుప్రీంకోర్టు 50 శాతానికి మించరాదని తీర్పు యిచ్చినందున కేవలం 27 శాతానికే పరిమితం చేస్తున్నాయని బిపి మండల్‌ చెప్పారు.)

ఒబిసిలకు న్యాయబద్ద వాటా సంగతి అటుంచితే 27 శాతంలో కేవలం 10శాతం కూడా ఆచరణగా అమలుకావడం లేదు. (208నాటికి దేశంలోని 40 సెంట్రల్‌ యునివర్సీటీలలో ఒక్కరంటటే ఒక్క ఒబిసి ప్రొఫెసర్‌ కూడా లేరు ) ప్రైవేటురంగం దినదినం అభివృద్ధి అవుతుంది. మారిన పరిస్థితుల్లో అనివార్యంగా ప్రైవేటురంగంలో రిజర్వేషన్‌ అవసరంగా ముందుకు వచ్చింది. 80, 90 శాతంపైగా ఉద్యోగాలు అగ్రకులాల చేతిలో ఉన్నాయి. ఐటి సెక్టార్‌ 30 లక్షల ఉద్యోగాల్లో బలహీనమైన కులాల ప్రాతినిధ్యం పదిశాతం కూడా దాటలేదని అనేక గణాంకాలు తెలుపుతున్నాయి.

ఒక కోటి 20 లక్షల ఉద్యోగాలు ప్రవేటురంగంలో ఉంచినట్లు ఒక అంచననా. ఈ రంగంలో రిజర్వేషన్‌ కల్పిస్తే పీడిత కులాలకు కొంతైనా మేలు జరుగుతుంది. ఎస్సీ, జనాభా 15 శాతం నుండి 17 కు ఎస్టీ జనాభా 7.5 నుండి 8.5 శాతంగా పెరిగింది. పెరిగిన జనాభా దామాషా ప్రకారం పెంచమని డిమాండ్‌ చేస్తున్నారు.

75 సంవత్సరాల స్వతంత్ర దేశంలో స్త్రీలకు సమాన హక్కులు ఎందుకు ద్కడం లేదని మహిళలు ప్రశ్నిస్తున్నారు. మహిళా రిజరేషన్‌ బిల్లు పెండింగ్‌లో వుంది. బ్రాహ్మణీయ పురుషాధిక్య పార్లమెంటు 30 సంవత్సరాల నుండి కాళ్ళ క్రింద తొక్కిపట్టి పట్టి వుంచింది. తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ, కేటగిరిల ఉన్న అసమానతలు తొలగించడానికి మార్పులు కావాలని ఉద్యమాలు దశాబ్దాలుగా జరుగుతున్నాయి, పై డిమాండ్స్‌ ఎంత న్యాయమైనవో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, వాటి సాధనకోసం జరిగిన పోరాటాలు, త్యాగాలు చరిత్రలో నమోదై వున్నాయి. సమాజాభివృద్ధికి దోహదపడే ప్రజాస్వామిక డిమాండ్స్‌ పరిష్కారం చూపకూండా రాత్రికిరాత్రి అగ్రకులు రిజర్వేషన్‌ బిల్లు తెచ్చింది. ఎందుకోసం? చిన్న కామన్‌ సెన్స్‌తో అర్థంచేసుకోలేని స్ధితికి నెట్టి వేయబడ్డ ఎర్రజెండ పార్టీలు రేపు మళ్ళీ ప్రజలకేమి చెపుతాయి.

సిపిఎం పార్టీకి జ్ఞానోదయం అయిందని సామాజిక న్యాయం సాధనకు పోరాడుతున్నామనిʹʹ ఊదరగొట్టింది. చివరకీ ఎవరివైపు నిలబడింది, అగ్రకులాలలో పేదరికం పోగొట్టడానికి చర్యలు చేపట్టాలని ప్రజాస్వామిక దృక్పథం గలవారు అందరూ కోరుకుంటారు. ఆ డిమాండ్‌ కోసం పోరాడితే మద్దతు యివాల్సిందే, కానీ వర్గం ముసుగులో పీడిత కులాల్లోని 90 పైగా పేదరికంలో మగ్గతున్న శ్రమజీవుల అవకాశాలను దెబ్బతీసే కుట్రలో భాగం అయితే చరిత్ర క్షమించదు. అగ్రకుల ప్రయోజనాలను కాపాడే, ల సందర్బంలోనైనా పార్లమెంటరీ కమ్యూనిస్టులు తమ బ్రాహ్మణీయ అగ్రకులతత్వాన్ని చాటుకున్నారు. ఈ కుట్ర గురించి మాట్లాడిన వారిని కులవాదులని ముద్రవేసి నోరుమూపించడం సాద్యంకాదు. పేదలకు అవకాశాలు వద్దంటామా..అనే పిచ్చి తర్కం చేస్తూ 90 మందిని దోచుకుంటున్న పది మంది సమర్థించే ఫిలాసఫీని ఎమనాలి? మనువాదమనాలా? లేకా మార్క్సిజమనాలా?

మండల్‌ ఉద్యమం జరుగుతున్న కాలంలో కూడా పీడిత కులాలకు రిజర్వేషన్‌ కోసం మాట్లాడడానికి కమ్యునిస్టు పార్టీలకు మనస్సు ఒప్పలేదు. 1990 మండల్‌ కమిషన్‌ అమలు అపాలని సిపిఐ ప్రకటించింది,(తర్వాత సమర్థించింది) కులాల ప్రాతిపదికన 27 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తే పశ్చిమబెంగాల్‌కు చెందిన నిరుద్యోగులు ఎంతగానో నష్టపోతారని ఆనాటి బెంగాల్‌ ముఖ్యమంత్రి జ్యోతిబసు అన్నారు. ఒబిసిలు బెంగాల్‌లో ఎక్కువగా లేనందున ఉన్నట్టుండి వారిని వెనుకబడిన తరగతులు నృష్టించలమేని తెలివిగా మాట్లాడినాడు. ఉద్యమ ఒత్తిడి ఫలితంగా చివరికి వామపక్షాలు అనివార్యంగా ప్రజా వెల్లువలో భాగం అయినాయి. ఆనాటి చరిత్ర సంగతి అలా ఉంచితే నేటికి కూడా ఆర్థిక ప్రాతిపదికగా రిజర్వేషన్లు ఇవ్వాలనేది వామపక్షాల అధికారిక విధానం అని గుర్తుంచుకోవాలి.

ఈనాడు అగ్రకుల పేదల ప్రయోజనాల పేరుతో జరుగుతున్న బ్రాహ్మణీయ ఫాసిజం సంఘటితానికి జరుగుతున్న కుట్రకు వ్యతిరేకంగా అటువంటి ఉద్యమం జరగవలసి వుంది. మనిషి ఆలోచనలే ఆచరణను నిర్ణయించలేవు. దానికి భిన్నంగా మనిషి సామాజిక అస్థిత్వమే చైతన్యాన్ని నిర్ణయిస్తుందని మార్క్స్‌ చెప్పాడు.

హిందుత్వ ఫాసిజం రోజు రోజుకి బలపడుతున్న సందర్భంలో మత, కుల ధర్మాల పొరలు వదిల్చుకొని న్యాయం ధర్మం వైపు కమ్యూనిస్టులు నిలబడితే ప్రజలకు కొంచమైనా మేలు జరుగుతుంది. వున్న దానిలో ఒక ముద్ద బువ్వ పెట్టి సాదుకొని ఎర్ర జెండాలను ఈనాటికీ కూడా భుజాల మీద మోస్తున్న శ్రామిక కులాల శ్రమజీవుల కోసం వామపక్షాలు ఆలోచిస్తాయని ఆశిద్దాం.

No. of visitors : 192
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అతడూ అర్బన్ నక్సలైటే
  అరుణతార మార్చి 2019
  కలకత్తా ప్రజా సాహిత్య ఉత్సవాల్లో మట్టిపరిమళాలూ, రుధిరాక్షర స్వప్నాలు
  నేరమే అధికారమైన వేళ
  దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర: మార్క్సిజం
  306
  స్వేచ్ఛ‌ను కాంక్షించ‌డ‌మూ దేశద్రోహ‌మైన చోట‌
  భగ్న సభోత్తేజం
  దేశీ సాహిత్య ఒర‌వ‌డి.. వ‌ర్గ‌పోరాట స్ఫూర్తి
  అధర్మ యుద్ధ దుష్పలితమే కాశ్మీరు మారణకాండ !
  పొద్దు
  క‌వితా వ‌చ‌నం

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •