సుక్మా బూటకపు ఎదురుకాల్పులు

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

సుక్మా బూటకపు ఎదురుకాల్పులు

- అనూస్‌ శ్రీవాస్తవ | 18.02.2019 09:34:01pm

సుక్మా బూటకపు ఎదురుకాల్పులు :

మహిళపై కాల్పులు జరిపాక ఆమెకు నక్సల్‌ యూనిఫారమ్‌ తొడగడానికి ప్రయత్నించిన పోలీసులు

ఝార్కండ్‌ రాష్ట్రంలోని గుడ్లెగూడ గ్రామంలోని ప్రజలు కోపంతోనూ, నిరసనతోనూ మండిపడుతున్నారు. రాయ్‌పూర్‌కు 450 కిలోమీటర్ల దూరంలో, పోలంపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలోగల రెంగైగూడ గ్రామంలో ఫిబ్రవరి 2న సి.ఆర్‌.పి.ఎఫ్‌. జవాన్లు ఇద్దరు మహిళలపై కాల్పులు జరిపారు. భద్రతా దళాలకు చెందిన బృందం ఒకటి ఆ ప్రాంతం మీద ఆధిపత్యంకోసం తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగింది.

పోడియం సుక్కి అనే మహిళ ఈ కాల్పులలో చనిపోయింది. గాయపడిన మరొక మహిళ కల్మీదివే గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వాళ్ళిద్దరూ మావోయిస్టులని పోలీసుల వాదన. అయితే దీన్ని గ్రామస్తులు తిరస్కరించారు. వాళ్ళు ఎలాంటి ఘర్షణలోను భాగంకాలేదని గ్రామస్తుల వాదన.

సి.ఆర్‌.పి.ఎఫ్‌. జవాన్లు కావాలనే మహిళపై కాల్పులు జరిపారని గుడ్లెగూడ గ్రామస్తులు అంటున్నారు. అంతేకాక, గాయపడిన ఇద్దరిలో ఒక మహిళ బాధతో అరుపులు పెడుతూవుంటే ఆమెకు బలవంతంగా నక్సల్స్‌ యూనిఫారమ్‌ తొడిగే ప్రయత్నం పోలీసులు చేసారని కూడా వాళ్ళంటున్నారు. ఏకపక్షంగా సాగిన ఈ కాల్పులను ఎదురుకాల్పుల సంఘటనగా చిత్రించటానికే పోలీసులు ప్రయత్నించారని ప్రజల వాదన.

పోలీసులు ఏమంటున్నారు:

సుక్మా జిల్లాలోని పోలంపల్లి ప్రాంతంలో శనివారంనాడు ఇద్దరు మహిళలకు బుల్లెట్‌ గాయాలు తగిలాయని, వాళ్ళలో ఒకామె చికిత్స జరుగుతూవుండగా చనిపోయిందని, మావోయిస్టులకు, సి.ఆర్‌.పి.ఎఫ్‌. బలగాలకు మధ్య కాల్పులలో చిక్కుకుపోయిన వీళ్ళకు ఈ గాయాలు తగిలాయని సుక్మా జిల్లా ఎస్‌.పి. జితేంద్ర సుక్లా అన్నారు. వాళ్ళిద్దరినీ వెంటనే సి.ఆర్‌.పి.ఎఫ్‌. ఆసుపత్రికి తరలించామని కూడా ఆయన అన్నారు.

ఈ ఎదురుకాల్పులు దాదాపు అడవిలో పది నిమిషాలపాటు జరిగాయని ఆయన పత్రికా విలేఖరుల సమావేశంలో చెప్పారు. ʹʹఒక తుపాకి, రూ.9058 డబ్బు, కార్టెక్స్‌ వైరు, డిటోనేటర్‌, గెలిటిన్‌ స్టికులు, ఇతర సామాగ్రి ఘటనాస్థలంలో దొరికాయి. ఎదురు కాల్పులు జరుగుతున్నప్పుడు ఆ ఇద్దరు మహిళలు దగ్గర్లో వున్న అడవిలో కట్టెలు ఏరుకుంటున్నారు. కాల్పుల మోత వినగానే వాళ్ళిద్దరూ కాల్పులు జరుగుతున్నవేపు పరిగెత్తారు. పోడియం సుక్కీకి పొట్టలోనూ, కల్మీదివేకు తొడలోను గాయాలు తగిలాయిʹʹ అని ఆయన అన్నారు. ఈ మరణానికి సంబంధించి గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశామని, మెజిస్టీరియల్‌ విచారణ మొదలైందని కూడా ఆయన అన్నారు.

ఆ మహిళలు గుడ్లెగూడ ప్రాంతానికి చెందిన సాధారణ గ్రామస్తులని పోలీసులు అంగీకరించినా, ఆ ప్రాంతంలో పోలీసులు చెపుతున్నట్లుగా ఎన్‌కౌంటర్‌ జరగలేదని, నిజానికి గుడ్లెగూడ గ్రామ సమీపంలో అడవి లేదని గ్రామస్తుల కథనం.

పోలీసులు సుక్మీ కుటుంబానికి రు.25వేలు, దివే కుటుంబానికి రు.20వేలు నష్టపరిహారంగా చెల్లించారు.

ప్రత్యక్షసాక్షి కథనం :

ఈ ఘటన జరిగిన తరవాత, దైనిక్‌ భాస్కర్‌ పత్రికా విలేఖరి మీరజ్‌ భదూరియా, ఈ ఘటనకు ప్రత్యక్షసాక్షి అయిన పోడియం హుంగీ ప్రకటనను ప్రచురించారు. ఆ రోజు జరిగిన వివరాలను ఆమె ఇలా చెప్పారు.

ʹʹనేనూ, పోడియం సుక్కీ, కల్మీదివే గ్రామం దగ్గర అడవిలో కట్టెపుల్లలు ఏరుకోవడానికి ఉదయం 7గం||లకు వెళ్ళాం. మా చేతుల్లో ఒక గొడ్డలి వుంది. గ్రామం నుండి 500-600 మీటర్ల దూరం చేరుకునేటప్పటికి ఆ ప్రాంతంలో పోలీసుల్ని మేం చూశాం. మేం వెంటనే గ్రామం చేరుకోవడానికి వెనుదిరిగాం. వెనక్కు తిరిగిన వెంటనే మాకు తుపాకి కాల్పు వినపడింది. మేం కట్టెలు ఏరుకోవడానికి వచ్చామని పెద్దగా అరుస్తూ చెప్పాం. నేను వెనుక వున్నాను. పోడియం, కల్మీలు ముందు వున్నారు. పోడియంను వెనక నుండి కాల్చారు. కల్మీపై కూడా కాల్పులు జరిగాయి. నేను కల్మీని పట్టుకొని గ్రామానికి తీసుకుని వెళ్ళాను. పోడియం నీళ్ళకోసం పెడుతున్న అరుపులు నాకు వినపడ్డాయి.ʹʹ

ʹʹమేం మంచినీళ్ళు తీసుకుని వెనక్కి వచ్చేటప్పటికి, పోలీసులు పోడియంకు నక్సల్‌ యూనిఫారమ్‌ తొడగడానికి ప్రయత్నిస్తున్నారు. గ్రామస్తులు దీనికి అభ్యంతరం చెపితే, ఆమెను ఆసుపత్రికి తీసుకువెళతామని వాళ్ళన్నారు. పోడియం వణికిపోతోంది. నీళ్ళు కావాలని పదేపదే బతిమలాడుతోంది. ఆమెను ఒక ప్లాస్టిక్‌ సంచిలో చుట్టి తీసుకువెళతామని పోలీసులు అంటే, ఊపిరాడక ఆమె చచ్చిపోతుందని మేం దానికి అభ్యంతరం చెప్పాం. ఈ మొత్తం సంఘటనలో మూడు రౌండ్లు మాత్రమే కాల్చారు. అక్కడ ఘర్షణగాని, ఎన్‌కౌంటర్‌గాని జరగలేదుʹʹ అని ఆమె అన్నారు.

సోనీ సోరి గ్రామానికి వెళ్ళారు :

ఆదివాసీల హక్కులకోసం పనిచేస్తున్న సామాజిక కార్యకర్త సోనీ సోరి 15మంది నిజనిర్ధారణ బృందంతో కలసి ఘటన జరిగిన రెండవ రోజున అంటే ఆదివారం నాడు గుడ్లెగూడ గ్రామం వెళ్ళారు.

ఆమె టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రికతో మాట్లాడుతూ, స్థానికుల నుండి సేకరించిన ప్రత్యక్ష సమాచారాన్ని ఈ విధంగా వెల్లడించారు. ʹʹఆదివారం ఉదయం ఆ గ్రామం నుండి 500 మీటర్ల దూరంలో వంటచెరకు ఏరుకోవడానికి ముగ్గురు మహిళలు వెళ్ళారు. దూరంగా సి.ఆర్‌.పి.ఎఫ్‌. జవాన్లు కనపడగానే వాళ్ళు భయంతో తక్షణం గ్రామానికి తిరిగి రావడానికి వెనుదిరిగారు. ఈ మహిళలు దూరం నుండే తమ దగ్గర వున్న గొడ్డలిని, ఏరుకున్న కట్టెలను - తాము మావోయిస్టులం కాదని, సాధారణ గ్రామస్తులమని చెప్పడం కోసం - భద్రతా దళాలకు చూపిస్తున్నప్పటికీ వాళ్ళమీద మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. అప్పటికే ఇద్దరు మహిళలకు బుల్లెట్‌ గాయాలు తగిలాయిʹʹ.

పోలీసులు మహిళల దగ్గరకు వచ్చి, వాళ్ళు గ్రామస్తులని గుర్తించి, తీవ్రంగా గాయపడ్డ పోడియం సుక్కీని ఆసుపత్రికి తీసుకుపోతున్నామని చెప్పి మోసుకువెళ్ళారు. గాయపడ్డ కల్మీ దివేను మూడవ మహిళ ఎలాగోలా గ్రామానికి తీసుకువెళ్ళింది. మిగిలిన మహిళలు ఒక బృందంగా ఏర్పడి పోడియం పరిస్థితి ఎలా వుందో తెలుసుకోవడానికి సి.ఆర్‌.పి.ఎఫ్‌. బృందంవైపు పరుగుతీసింది.

పోడియం ప్రాణాలతో వుండి, బాధతో తీవ్రంగా ఏడుస్తూ వుంటే పోలీసులు ఆమెకు మావోయిస్టు యూనిఫారమ్‌ తొడగడానికి ప్రయత్నిస్తుండడం చూసి ఆ మహిళలు షాక్‌ తిన్నారు. వాళ్ళు అభ్యంతరం తెలిపారు. అప్పుడు, ఆసుపత్రికి త్వరగా తీసుకువెళ్ళాలన్న నెపంతో ఒక ప్లాస్టిక్‌ షీటులో ఆమెను చుట్టడానికి పోలీసులు ప్రయత్నించారు. గాయపడ్డ కల్మీని కూడా ఆసుపత్రికి తీసుకురావచ్చని వాళ్ళు ఈ మహిళలకు చెప్పారు.

గ్రామస్తులు ఆసుపత్రికి చేరేటప్పటికే పోడియం చనిపోయిందని సోరి అన్నారు. ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని అంటూ ఆమె దీనిపై న్యాయవిచారణను డిమాండ్‌ చేశారు.

అప్పుడు సుక్మా పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులమీద ఈ హత్యలకు సంబంధించి ఎఫ్‌.ఐ.ఆర్‌. నమోదు చేశారు. మెజిస్టీరియల్‌ విచారణ జరుగుతుందని, ఇద్దరు మహిళల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లిస్తున్నామని వాళ్ళు ప్రకటించారు.

అయితే తాము మెజిస్టీరియల్‌ విచారణను డిమాండ్‌ చేయడంలేదని, మహిళలపై కాల్పులు జరిపిన నేరస్థులపై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నామని గ్రామస్తులు, సోనీ సోరి అన్నారు. మహిళలు ఎదురుబొదురు కాల్పులలో చిక్కుకుపోయారని పోలీసులు అంగీకరించారు కాబట్టి వీళ్ళపై కాల్పులు జరిపినవారిపై చర్య తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు.

ఈ ఘటనకు నిరసనగా సుక్మాలో బంద్‌ :

ఆ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ జరగలేదనీ, ఎదురుబొదురు కాల్పులలో ఈ మహిళలకు గాయాలు తగిలాయని చెప్పడం పూర్తిగా అబద్ధమని సర్వ ఆదివాసీ సమాజ్‌ అధ్యక్షుడు ప్రకాశ్‌ ఠాకూర్‌ అన్నారు. ʹʹపోడియం, తుపాకుల కాల్పుల కారణంగా జరిగిన గాయం మూలంగా చనిపోయిందనీ, కావాలనే ఆమెపై కాల్పులు జరిపారని, నేరస్థులైన పోలీసులపై కఠిన చర్య తీసుకోవాలని అన్ని ఆదివాసీ తెగలు కోరుతున్నాయని, అందుకే సుక్మా బంద్‌ పిలుపిచ్చామనిʹʹ ఆయన అన్నారు.

ఎన్‌కౌంటర్‌ అనంతరం తలెత్తుతున్న ప్రశ్నలు :

పోలీసు అధికారుల కథనంలోని లొసుగులే ఈ ఎన్‌కౌంటర్‌ బూటకపుదని ఋజువుచేస్తున్నాయి. ఒక పత్రిక ఇలా రిపోర్టు చేసింది. ʹʹసంఘటనా స్థలాన్ని మా బృందం తనిఖీ చేసింది. మహిళలపై కాల్పులు జరిగిన చోట దట్టమైన అడవి లేదు. ఒక పక్క పొలాలు, మరోపక్క చెరువు వున్నాయి. ఎన్‌కౌంటర్‌ జరిగే సమయంలో దాక్కోవడానికి అనుకూలమైన స్థలంకూడా అక్కడలేదు. ఆ సంఘటనా స్థలం చూశాక, అనేక ప్రశ్నలు వాటంతట అవే తలెత్తుతాయిʹʹ

గుడ్లెగూడెలో ఈ కాల్పులు జరిగిన రెండు రోజుల తరవాత మహిళల చేతులలోని గొడ్డలి, ఇతర పనిముట్లు అక్కడే పడివున్నాయి. కాని ఆ ప్రాంతంలో అంతకు ముందున్న రక్తపు మరకలు ఏవీ కనపడడం లేదు. విచారణను తప్పుదోవ పట్టించడానికి సాక్ష్యాలను చెరిపివేస్తున్నారని సామాజిక కార్యకర్తలు, ఆదివాసీ సమూహాలు, గ్రామస్తులు విశ్వసిస్తున్నారు.

ఈ రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం వున్న గత 15 సం||లలో ఇలాంటి అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి. చాలా వాటిల్లో పోలీసు అధికారులు నేరస్థులని తేలినప్పటికీ వాళ్ళమీద విచారణ జరగలేదు, ఎవ్వరినీ శిక్షించలేదు. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన ఇలాంటి కేసులలో ఇది మొదటిది. నక్సలైట్లు అనే అనుమానంతో గ్రామస్తులపై జరుగుతున్న అమానుష చర్యలపై విచారణ జరుపుతానని ముఖ్యమంత్రి భూపేష్‌ బాగెల్‌ మాట్లాడారు. ఈ గుడ్లెగూడ సంఘటనపై నూతన ప్రభుత్వం మానవత్వంతో ఎలా స్పందిస్తుందోనని అందరూ వేచి చూస్తున్నారు.

ఫిబ్రవరి 6, 2019న ప్రచురితమైంది.

అనువాదం : సి.యస్‌.ఆర్‌. ప్రసాద్‌


No. of visitors : 212
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అతడూ అర్బన్ నక్సలైటే
  అరుణతార మార్చి 2019
  కలకత్తా ప్రజా సాహిత్య ఉత్సవాల్లో మట్టిపరిమళాలూ, రుధిరాక్షర స్వప్నాలు
  నేరమే అధికారమైన వేళ
  దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర: మార్క్సిజం
  306
  స్వేచ్ఛ‌ను కాంక్షించ‌డ‌మూ దేశద్రోహ‌మైన చోట‌
  భగ్న సభోత్తేజం
  దేశీ సాహిత్య ఒర‌వ‌డి.. వ‌ర్గ‌పోరాట స్ఫూర్తి
  అధర్మ యుద్ధ దుష్పలితమే కాశ్మీరు మారణకాండ !
  పొద్దు
  క‌వితా వ‌చ‌నం

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •