క‌వితా వ‌చ‌నం

| సాహిత్యం | క‌విత్వం

క‌వితా వ‌చ‌నం

- సమీరన్ | 18.02.2019 09:39:57pm

ప్రణాళికా బద్ధ వరుస కూర్పుల
ఒదిగిన మొక్కా చెట్టూ చేమా
తమ రంగురంగుల పూల బిడ్డల
నెవరు ఎపుడు తమ రెమ్మ కాడల
పేగు బంధాన్నుంచి తుంచి
బుట్టల నింపుక తరలించి
మార్కెట్ స్టాల్స్ ల కుప్పలు బోసి
దేవతామూర్తుల అర్చనకో
రాజకీయుల సన్మానాలకో
ధర్మపత్నుల సిగల సింగారానికో
రెడ్ లైట్ ఏరియా ఆకలిపేగుల
అతివల మార్కెట్ నవ్వుల
మురికి మురిపాల వాసనల వయ్యారాలకో
అమ్మబడే సరుకులైతమోన‌ని
బిక్కుబిక్కుమంటూ బేలలై
నిస్సహాయ నిట్టూర్పులిడుస్తున్నవి
*

అలిసి సోలిన బాటసారుల పసులకాపరుల నీడనిచ్చి
అల్పాహార విందునిచ్చే
మామిడి నేరెడు రేగు జీడి మేడి సీతాఫల చింతలూ
ముళ్ళతీగల ఎత్తైన గోడల
కాపలా పహరాల బందీల తోటలై
సామాన్యుడికందని చందమామలైనయ్
*
హద్దులు కంచెలేవీ లేని
అరణ్యసంచార అవిటి జీవులు
జూ పార్కుల జోన్ ల బంధనాల జలచరాలు
ఆక్వేరియాల పారదర్శక అద్దాల గోడల చెరసాలల దాటే
ప్రయాస‌లు విఫలమై
అహర్నిశలు అపహాస్యాలపాలయే
సుయోధన సార్వభౌములై
ఆస్తిపర మిగులు మధ్యతరగతుల
దృశ్యానంద ఎగ్జిబిట్లయినయ్
*
స్వేచ్ఛా విలాసాల పారే
జలపాతాల నదీ వాగూ సెలయేళ్ళనీళ్ళు
ప్రాజెక్టు రిజర్వాయర్ ట్యాంకుల
స్విమింగ్ ఫూల్ క్యాన్ సీసాల బందీలైనయ్
వర్షజల్లుల జలాలు
అటదూరి ఇటదూరి
ఎక్కడా ఇమికే జాగా దొర్కక
మధ్య పేద కాంక్రీట్ వనాల
గల్లీల దారితప్పి ఇండ్లజేరి బిత్తరపోయి
నిలబడి కుటుంబ పిల్లాజెల్ల తల్లుల
దిక్కు తోచని దీనుల జేసినయ్
*
ఫ్యాక్టరీ వాహన ఫ్రిజ్ఏసీ
యంత్రభూతాల కర్బన విషాల
ప్రకృతిసిద్ధ సహజ గాలి కంపునింపి
ఆమ్ ఆద్మీల కందని ఫ్రాణవాయు
ఛేంబర్ లు పట్న‌వాసాలు వెలుస్తున్నయ్
*

స‌దువుకొన్న మనుషులు సాఫ్ట్‌ వేర్ కంపెనీ కేబిన్ లనో
కార్పొరేట్ ఆస్పత్రులు షాపింగ్ మాల్స్
పెంపుడు పెట్ లుగనో
కాపలా కుక్కలూ రిసీవింగ్ రిసెప్ష‌నిస్ట్ లో
సర్వింగ్ నర్స్ లుగనో
ఏ కార్మిక ఉద్యోగ బతుకు
రక్షణ హక్కుల చట్టాలు వర్తింపని భధ్రత లేని
భత్యాల త్రిశంకు స్వర్గాల తలకిందుల తమాషా
జీవితాల చచ్చిబతుకుతూ బతికి చస్తూ
దూరపు ఎండ మావుల్ల
మంచి భవిత కొరకు
కండ్లు కాయలు గాచ గెలుకుతూ
మంటలు పుట్టే దాన్కవెతుకుతూ
వేసారి పోతున్నవి.
ఆమ్ ఆద్మీని కబళించి
రక్కి చీల్చి పచ్చినెత్తురు పీలుస్తూ
కండల కంకుతూ మెదళ్ళను నెమరు వేస్తూ
ఎముకల మూల్గులు జుర్రి
ఐ టీ పర్వత హర్మ్యాలు లేస్తున్నయ్
*
ఏం చెయ్యాలె ఎట్లచెయ్యాలె
ఏమైనా చేయాలె ఎట్లైనా చెయ్యాలె

తప్పక చేయాలె
గురి తప్పకుండ జెయ్యాలె
ఎత్తుకు పైయెత్తు
ముల్లును ముల్లుతోనే
తుపాకీని తుపాకీతో
ఆయుధాన్నాయుధంతోనె

అగ్ని పర్వతం పేల్చాలె
వెల్వడిన లావాతో
విధ్వంసక అభివృద్ధిని కప్పి కాలమొందించాలె
*

ఆ పిదప లావా ఘనీభవించి
చల్లబడినంక సారవంతమైన ఆ
నేల నుండి కొత్త మొలకలు తొంగి చూస్తవి.
మళ్ళీ నూతన సృష్టి ఆరంభమైతది.

No. of visitors : 138
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నేను నగర మావోయిస్ట్

సమీర | 21.12.2018 01:45:36am

నేను రాజద్రోహినని గడువు లోపు నేనొప్పుకొని తీరాలె ఇంతకూ నేనడిగిందేమి శాంతియుత ఒక నేల తునక కానీ సర్కార్ ఎప్పుడూ విశ్రమించదు నన్ను వేటాడనీకె......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణ‌తార - మే 2019
  ఎర్ర‌జెండా - కార‌ల్‌మార్క్స్
  ర‌చ‌న - స్వేచ్ఛ - ప్ర‌జాస్వామ్యం
  వివి, ఆయన సహచర అర్బన్‌ మావోయిస్టు ఖైదీలతో ఆ కొన్ని ఘడియలు
  159 కేసులను ఎదుర్కొన్న ఒక మహిళా నక్సలైట్ కథ
  ఒక వికృతి
  ఎవ‌రు పాస‌ర‌య్యార‌ని?
  స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ
  స‌త్యాన్ని స‌మాధి చేసే కుట్ర‌
  విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •