ఆలూరి భుజంగ‌రావు 3వ వ‌ర్థంతి స‌భ‌

| కార్య‌క్ర‌మాలు

ఆలూరి భుజంగ‌రావు 3వ వ‌ర్థంతి స‌భ‌

- | 10.06.2016 01:43:10am

తాను న‌మ్మిన విశ్వాసాల కోసం రాజీలేకుండా జీవించిన మనిషి... త‌న ర‌చ‌న‌ల్లోని విలువ‌ల్ని జీవితానికి అన్వ‌యించుకున్న ర‌చ‌యిత కామ్రేడ్ ఆలూరి భుజంగ‌రావు. చిన్న వయస్సులోనే హోటల్ కార్మికునిగా జీవితాన్ని మొదలుపెట్టిన ఆలూరి భుజంగ‌రావుకు చ‌దువుపై ఉన్న ఆస‌క్తితో.. ప‌ట్టుద‌ల‌తో హిందీ నేర్చుకుని హిందీ టీచర్ గా స్థిరపడ్డారు. శార‌ద స‌హ‌చ‌ర్యంలో సాహిత్యంపై మ‌క్కువ పెంచుకున్నారు. అన్న ప్రకాశరావు నుండి వర్గ దృక్ప‌థాన్ని అల‌వ‌ర్చుకున్నారు. అలా.. మొద‌లైన త‌న సాహితీ ప్ర‌స్థానంలో తెలుగు స‌మాజానికి ఎంతో విలువైన సాహిత్యాన్ని అందించారు ఆలూరి భుజంగ‌రావు. ʹగమనాగమనంʹ ,ʹగమ్యం దిశగా గమ‌నాగ‌మ‌నం న‌వ‌ల‌లు, నాటి సామాజిక‌, రాజ‌కీయ ఆర్థిక స్థితిగ‌తుల‌కు ద‌ర్ప‌ణం ప‌డితే, ʹ సాహిత్య బాటసారి శారదస శార‌త జీవితాన్నీ, వ్య‌క్తిత్వాన్ని ప‌రిచ‌యం చేసింది. స్వాతంత్ర్య సంగ్రామంపై హిందీలో య‌శ్‌పాల్ ర‌చించిన పుస్త‌కాన్ని ʹసింహావలోకనంస‌ పేరుతో అనువదించారు. ప్రేమ్‌చంద్, కిషన్ చందర్ ,రాహుల్జీ ,యశ్ పాల్ ,సరోజ్ దత్తాల రచనలను తెలుగులోకి అనువదించి తెలుగు పాఠకులకు అందించారు. విర‌సం స‌భ్యులుగా కొత్త త‌రానికి స్ఫూర్తినందించిన ఆలూరి చివ‌రి వ‌ర‌కూ నమ్మిన సిద్ధాంతానికి కట్టు బడి జీవించారు. పారదర్శి ,పెద్దన్న,చక్రధర్ ,జనార్ధన్ పేర్ల‌తో సైతం ఆలూరి ప‌లు ర‌చ‌న‌లు చేశారు. కొండ వాగు ,ప్రజలు అజేయులు ,నైనా,అమరత్వం ఎరుపు, గమనా గమనం ,గమ్యం దిశగా గమనం,దిక్కు మొక్కులేని జనం లాంటి నవలలతో పాటు దాదాపు 20కిపైగా కధలను రచించారు. కొన్ని కధలు ʹఅరణ్య పర్వం"అనే పుస్తకంగా వెలువ‌డ్డాయి. రాగో, అతడు,బొగ్గుపొరల్లొ, నేల తల్లి విముక్తి కోసం,దండకారణ్య అమర వీరులు లాంటి పుస్తకాలను తెలుగు నుండి హిందీ లోకి అనువదించారు. ఆ విప్ల‌వ భాట‌సారి స్మ‌రించుకుంటూ రాహుల్ సాహిత్య స‌ద‌నం ఈ నెల 19న ఆలూరి మూడ‌వ వ‌ర్థంతి స‌భ‌ను నిర్వ‌హిస్తోంది. ఆలూరి క‌విని అధ్య‌క్ష‌త‌న జ‌రిగే ఈ స‌భ‌లో అల్లం రాజ‌య్య‌, సీఎస్ ఆర్ ప్ర‌సాద్ వ‌క్త‌లు పాల్గొంటారు. దండ‌కార‌ణ్యంలో అమ‌ల‌వుతున్న ప్ర‌త్యామ్నాయ అభివృద్ధి న‌మూనాను ప‌రిచ‌యం చేస్తూ విర‌సం స‌భ్యుడు పాణి ర‌చించిన ʹజ‌న‌తన రాజ్యంʹ పుస్త‌కం వ‌క్త‌లు ప్ర‌సంగిస్తారు.

తేది: 19 జూన్ 2016 (ఆదివారం)
స‌మ‌యం: ఉ. 10.00 గంటలకు
స్థ‌లం: బ్రాడీపేట 2వ లైన్ UTF హాలు, గుంటూరు
నిర్వ‌హ‌ణ‌: రాహుల్ సాహిత్య స‌ద‌నం

No. of visitors : 894
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


చెరబండరాజు

| 19.04.2016 10:43:18am

సాయుధ రైతాంగ పోరాట ఫలాలు కేవలం జవహర్లాల్‌ నెహ్రూ షేర్వానీ గుండీ దగ్గర గులాబీ రంగులోకి మారినవి. నాలుగు వేల మంది త్యాగాలు భవిష్యత్‌ గుణపాఠాలుగా మాత్రం మిగిలిప...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార సెప్టెంబర్ 2019

  దళిత భక్త కవి రవిదాస్‌ సంత్‌ ఆలయం కూల్చివేత హిందూ ఫాసిజంలో భాగమే
  The Destruction of Kashmir is a Deathblow to Democracy in India
  నల్లమల యురేనియం గని కాదు, జీవవైవిధ్య కేంద్రం
  అతడు ఆమె అడవి
  మానవ సంబంధాల ఉన్నతీకరణకు చక్కటి ఉదాహరణ ʹ చందమామ రావేʹ
  కన్ ఫామ్... !
  బందిష్
  రాంగూడ ప్రాంతంలో సమిష్టితత్వం, సహకార పద్ధతి
  కళలన్నా, సాహిత్యమన్నా ఫాసిజానికి భయం
  కవులకు సమర స్ఫురణ

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •