దేశీ సాహిత్య ఒర‌వ‌డి.. వ‌ర్గ‌పోరాట స్ఫూర్తి

| సంభాషణ

దేశీ సాహిత్య ఒర‌వ‌డి.. వ‌ర్గ‌పోరాట స్ఫూర్తి

- విర‌సం | 19.02.2019 02:25:45pm

తెలుగు సాహిత్యానికి పోరాటతత్వాన్ని, మట్టి వాసనల పరిమళాన్ని, ప్రజా, జానపద ప్రత్యామ్నాయాన్ని అందివ్వడంలో గ‌ణ‌నీయ పాత్ర పోషించిన న‌ల్ల‌గొండ గ‌డ్డ‌పై విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం 21వ సాహిత్య పాఠ‌శాల నిర్వ‌హించుకుంది. ఫిబ్ర‌వ‌రి 9, 10 తేదీల్లో ఎస్‌.బి.ఆర్ ఫంక్ష‌న్ హాల్‌(బండి యాద‌గిరి, సుద్దాల హ‌న్మంతు క‌మ్యూన్‌)లో విప్లవోత్తేజ వాతావ‌ర‌ణంలో జ‌రిగిన‌ సాహిత్య పాఠ‌శాల వ‌ర్గ‌పోరాట స్ఫూర్తితో మ‌రింత ఇనుమ‌డింప‌జేసింది.

తొలిరోజు ఉద‌యం అంత‌ర్జాతీయ శ్రామిక వ‌ర్గ ప‌తాక ఆవిష్క‌ర‌ణ‌తో స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. అమ‌రుడు పులి అంజ‌న్న త‌ల్లి సైద‌మ్మ ఎర్ర‌జెండాను, సీనియ‌ర్ విర‌సం స‌భ్యురాలు ర‌త్న‌మాల విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం జెండాను ఆవిష్క‌రించారు. అమ‌రుడు శేషయ్య‌ సోద‌రుడు సాంబ‌య్య‌, అమ‌రుడు వివేక్ తండ్రి యోగానంద్‌ అమ‌రుల స్థూపాన్ని ఆవిష్క‌రించారు.

దేశీ సాహిత్య‌, సామాజిక చ‌రిత్ర - మార్క్సిజం కీనోట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన విర‌సం కార్య‌ద‌ర్శి పాణి భార‌తీయ జ్ఞాన ప‌రంప‌రను బ్రాహ్మ‌ణ్య కేంద్రంగా మ‌లిచే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ని, దీనిని ఎదుర్కొనేందుకు చార్వాకులు, క‌ణాదులు, బుద్దుడు మొద‌లైన వాళ్లు గొప్ప ఆలోచ‌న‌ల్ని అందించార‌ని అన్నారు. ఒక‌వైపు దేశం సాంకేతికంగా పురోగ‌తి సాధిస్తోంద‌ని చెబుతున్న బీజేపీ ప్ర‌భుత్వం, విమానాలు, ప్లాస్టిక్ స‌ర్జ‌రీ, టెస్ట్‌ట్యూబ్ శిశు ఉత్ప‌త్తి పురాణాల్లో ఉన్నాయంటూ ప్ర చారం చేయ‌డం హాస్యాస్ప‌ద‌మ‌న్నారు. చ‌రిత్ర నిర్మాణంలో సంఘ్ ప‌రివార్ జోక్యం ఫాసిజానికి బ‌ల‌మైన ఆధార‌మ‌ని అన్నారు. దేశీయ సాహిత్యం, సామాజిక చ‌రిత్రను మార్క్సిస్టు అవ‌గాన‌తో అర్థం చేసుకోవాల‌న్నారు. ఈ స‌మావేశానికి విర‌సం కార్య‌వ‌ర్గ స‌భ్యుడు వెంక‌న్న అధ్య‌క్ష‌త వ‌హించారు.

విరసం కార్య‌వ‌ర్గ స‌భ్యుడు బాసిత్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన రెండ‌వ సెష‌న్‌లో భీమా కోరేగావ్ - బ్రాహ్మ‌ణీయ వ్య‌తిరేక పోరాట ప్ర‌తీక అనే అంశంపై విర‌సం కార్య‌వ‌ర్గ స‌భ్యురాలు వ‌ర‌ల‌క్ష్మి ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ భీమాకోరేగావ్ చ‌రిత్ర‌ను వివ‌రించారు. బ్రాహ్మ‌ణీయ కేంద్రంగా చ‌రిత్ర‌ను రాసుకోవ‌డం సంఘ్‌ప‌రివార్‌కి వెన్న‌తో పెట్టిన విద్య అంటూ ఎద్దేవా చేశారు. చ‌రిత్రను ఆధిప‌త్య వ‌ర్గాలు త‌మ‌కు అనుకూలంగా రాసుకున్నాయ‌ని, దాన్ని తిర‌స్క‌రిస్తూ అట్ట‌డుగు వ‌ర్గాలు చ‌రిత్ర‌ను ప్ర‌జ‌ల వైపు నుంచి వ్యాఖ్యానించాయ‌న్నారు. అలాంటి నేప‌థ్యంలోంచే భీమా కోరేగావ్ పోరాటాన్ని అర్థం చేసుకోవాల‌న్నారు. బ్రాహ్మీణీయ ఆధిప‌త్య వ్య‌తిరేక పోరాటానికి బీమా కోరేగావ్ ఒక ప్ర‌తీక అని, 200 ఏళ్ల కిత్రం పీష్వాల పాల‌న‌కు వ్య‌తిరేకంగా సాగిన భీమాకోరేగావ్ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవ‌డాన్ని ఇవాల్టి పాల‌క వ‌ర్గాల‌కు కంఠ‌గింపుగా మారింద‌ని అన్నారు. ద‌ళితులు త‌మ ప‌రాక్ర‌మ చిహ్నాన్ని విజ‌యోత్స‌వాల‌ను చేసుకోవ‌డం జీర్ణించుకోలేని సంఘ్ ప‌రివార్ శ‌క్తులు దాడుల‌కు పాల్ప‌డడంతో పాటు, ఇద్ద‌రు ద‌ళితుల హ‌త్య‌కు కార‌ణమ‌య్యార‌ని తెలిపారు. ఈ కేసును ప‌క్క‌దోవ ప‌ట్టించేదుకే.. భీమా కోరేగావ్ కుట్ర కేసును ముందుకు తెచ్చార‌ని, ఆ పేరిట దేశ వ్యాప్తంగా హ‌క్కుల కార్య‌క‌ర్త‌ను అరెస్టు చేసి జైలు పాలు చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సంఘ్ కుట్ర‌ల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌జాస్వామిక శ‌క్తులంతా ఐక్యం కావ‌ల్సిన సంద‌ర్భ‌మిది అన్నారు.

క‌లెక్టివ్ వాయిస్ క‌న్వీన‌ర్ క‌వి యాకూబ్ మాట్లాడుతూ దేశంలో హిందూ ఫాసిజం పెచ్చ‌రిల్లుతోంద‌ని, క‌ల్బుర్గి, ప‌న్సారి, గౌరీ లంకేశ్ లాంటి ప్ర‌జా మేధావుల‌ను హ‌త్య‌చేసిన హిందూ మ‌తోన్మాద శ‌క్తులు.... ప్ర‌శ్నించే వారిని అర్బ‌న్ మావోయిస్టుల పేరుతో జైళ్ల‌లో నిర్బందిస్తోంద‌న్నారు. సామాజిక కార్య‌క‌ర్త‌లపై మోపిన అక్ర‌మ కేసుల‌ను ఎత్తివేయాల‌ని డిమాండ్ చేశారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు జైని మ‌ల్ల‌య్య గుప్త త‌న సందేశంలో... మునుపెన్న‌డూ లేని విధంగా మ‌తోన్మాదం ప్ర‌స్థుత పాల‌కుల విధానాలు చూస్తుంటే.. ఇందుకేనా మేము స్వాంతంత్ర్యం కోసం పోరాడింద‌నే సందేహం క‌లుగుతోంద‌ని పేర్కొన్నారు. ప్ర‌శ్నించే గొంతుల‌ను నులిమేసే దోర‌ణి పెరిగిపోతుంద‌ని, మోదీ అధికారంలోకి వ‌చ్చాక ఫాసిస్టు మూక‌లు పెచ్చ‌రిల్లు పోతున్నాయ‌ని పేర్కొన్నారు. గోర‌క్ష‌కుల పేర భౌతిక దాడులు, హ‌త్య‌లు చేస్తున్న‌ర‌ని, విభిన్న ఆచార వ్య‌వ‌హారాల‌ను, సాంస్కృతిక జీవ‌న స‌ర‌ళిని నేరంగా ప‌రిగ‌ణిస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు.. ప్రొఫెస‌ర్ జి.ఎన్‌. సాయిబాబా మొద‌లు, వ‌ర‌వ‌ర‌రావు త‌దిత‌రుల‌ను కుట్ర కేసుల్లో ఇరికించి జైళ్ల‌లో నిర్బందించ‌డం ప్ర‌జాస్వామ్యానికి పొంచి ఉన్న ప్ర‌మాదంగా పేర్కొన్నారు. పాల‌క వ‌ర్గాల ఫాసిస్టు పోక‌డ‌ల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌జాస్వామిక శక్తులు ఐక్యం కావాల‌ని కాంక్షించారు.

రెండవ రోజు స‌మావేశాలు మొద‌టి సెష‌న్‌లో దేశీ సాహిత్య చరిత్ర మార్కిస్టు దృక్పథంపై విర‌సం కార్య‌వ‌ర్గ స‌భ్యులు కాశీం ప్ర‌సంగించారు. ఉత్పత్తి కులాల నుండి వచ్చిన సాహిత్యం దేశీ సాహిత్యంమని, రామాయణ మహా భారతాలు, రాజులకోసం, వారి ప్రయోజనాలకోసం ఉనికిలోకి వచ్చాయని అన్నారు. జాన పద‌ సాహిత్యాన్ని అంటరాని కులాలు శ్రామికులు సృష్టించాయన్నారు. సాహిత్య చరిత్ర చాలా కాలం వరకూ మౌఖిక సాహిత్యాన్ని గుర్తించలేదని, నన్నయ ఆదికవి అనడం చరిత్రను వక్రీకరించడమే అని అన్నారు. అసలు సిసలు కవిత్వం ప్రజల్లో ఉంటుంది. దాన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉందని అన్నారు.

వ‌ర్త‌మాన సామాజిక ఆవ‌రణ‌లో విప్ల‌వ సాహిత్యం అనే అంశంపై విర‌సం కార్య‌వ‌ర్గ స‌భ్యుడు అర‌స‌విల్లి కృష్ణ ప్ర‌సంగించారు. 90ల తర్వాత తెలుగు సాహిత్యంలో ప్రధానంగా స్త్రీ, దళిత, మైనారిటీ వాద సాహిత్యం ముందుకు వచ్చిందని, తమదైన జీవితం గురించి ఆ సమూహాలు మాట్లాడుతున్నాయన్నారు. వర్తమాన సాహిత్య సృజనకు ఇది చేర్పు అన్నారు. ఇవాళ రెండు సాహిత్య ధోరణులు ఉనికిలో ఉన్నాయని, ఒకటి మైదాన సాహిత్యం, రెండోది దండకారణ్య సాహిత్యమని గుర్తు చేశారు. దండకారణ్య రచయితలు యుద్ద భూమిలో, మృత్యువు అంచున నిలబడి సృజనాత్మక సాహిత్య సృజన చేస్తున్నారని అన్నారు. దేశంలో జరుగుతున్న విధ్వంసంపై, పెచ్చరిల్లుతున్న ఫాసిజంపై మైదాన ప్రాంత రచయితలు తమ సృజనను ఎక్కుపెట్టాల్సిన అవసరం ఉందన్నారు.

రెండవ సెషన్లో బుద్ధిజీవులపై నిర్భందం అనే అంశంపై ప్రముఖ రచయితలు డ్యానీ, ఎన్. వేణుగోపాల్, స్కైబాబా, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, వరలక్ష్మి ప్రసంగించారు. హిందూ ఫాసిజం పెచ్చరిల్లిపోతున్న ఇవాల్టి సందర్భంలో అన్ని వర్గాల ప్రజలు, అన్ని సమూలు ఐక్యం కావల్సిన అవసరముందన్నారు. పాలకుల అణచివేత విధానాలకు వ్యతిరేకంగా ఉమ్మడి స్వరాన్ని వినిపించాలన్నారు. లేదంటే.. ఫాసిజం అత్యంత ప్రమాదకరంగా మారి దేశాన్ని కబళిస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు.

విరసం సాహిత్య పాఠశాలలో వక్తలు దేశంలో రెండు రాజకీయాలున్నాయని, ఒకటి ప్రభుత్వాన్ని మార్చే ఎన్నికల రాజకీయాలు, మరొకటి వ్యవస్థను మార్చే రాజకీయాలని విరసం సీనియర్ సభ్యులు జి. కళ్యాణరావు అన్నారు. సాయంత్రం బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించిన ఆయ‌న‌.. వ్యవస్థను మార్చే ప్రత్యామ్నాయ రాజకీయాలపై ఇవాళ తీవ్ర నిర్బంధం అమలవుతోందన్నారు. రోజు రోజుకూ దేశంలో హిందూ ఫాసిజం పెచ్చరిల్లిపోతోందని, ప్రజల పక్షాన మాట్లాడే గొంతులను నొక్కేందుకు రాజ్యం యత్నిస్తోందని విరసం సీనియర్ సభ్యురాలు రత్నమాల అన్నారు. అక్రమ కేసుల పేరుతో జైళ్లలో నిర్భందిస్తోందని, బ్రాహ్మణీయ హిందూ ఫాసిజానికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాల్సిన అవసరముందని అన్నారు. విరసం కార్యదర్శి పాణి మాట్లాడుతూ వర్గ పోరాటాలే ప్రజల విముక్తి మార్గమని, సమాజాన్ని మార్క్సిస్టు దృక్పథంతో అర్థం చేసుకున్నప్పుడే సరైన పరిష్కారాలను అన్వేషించగలుతామని అన్నారు.

రెండు రోజుల స‌మావేశాల్లో సహచరులు, నేను చావును నిరాక‌రిస్తున్నాను, అన‌గ‌న‌గా అడవిలో, భూంకాల్, నిలువెత్తు సాక్యం, జీవితం, నదిలాంటి మనిషి, జాబిలిఖైదు, వెన్నెల పడవ, స‌బ్జెక్ట్ క‌రెక్షన్‌, కాగితంపై అక్ష‌రానికి క‌మిటైన క‌వి, కొమురం భీం ఇంగ్లీష్ న‌వ‌ల‌, స‌రిహ‌ద్దు, ఎడారి వాస‌న, జీవితం తదితర పుస్తకాలు వెలువ‌డ్డాయి. క‌విస‌భ‌లో ప‌లువురు యువ‌, సీనియ‌ర్ క‌వులు క‌విత్వ ప‌ఠ‌నం చేశారు. ప్ర‌జా క‌ళామండ‌లి క‌ళామండ‌లి క‌ళాకారుల సాంస్కృతిక కార్య‌క‌ర్ర‌మాలు, పునాదులు క‌దులుతున్నాయి నాట‌క ప్ర‌ద‌ర్శ‌న విశేషంగా ఆక‌ట్టుకున్నాయి.

No. of visitors : 381
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర

కార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ...

 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  సృజనాత్మక ధిక్కారం
  హింసలోనే పరిష్కారం వెతికిన రాజ్యం
  ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.
  హిందుత్వ శక్తులు చేస్తున్న బలవంతపు మత మార్పిడులకు బలైన ఒక ఆదివాసీ యువకుడి కథ
  వాళ్ళు
  ఇంగ్లీషు వద్దనడం లేదు, తెలుగు మాధ్యమం ఉంచండి
  గుండెను స్పృశిస్తూ జరిపిన ఒంటరి సంభాషణ "నా గదిలో ఓ పిచ్చుక"
  దేశంలో ప్రశాంతత నెలకొనివుంది-జైళ్ళూ నోళ్ళు తెరుచుకొనే వున్నాయి - తస్మాత్ జాగ్రత్త
  జై శ్రీరామ్!
  రమాకాంత్‌ వాళ్లమ్మ
  హిందూ రాజ్యం దిశగా
  అయోధ్య తీర్పు మీద మాట్లాడబోతే అరెస్టు చేస్తారా?

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •