భగ్న సభోత్తేజం

| సంపాద‌కీయం

భగ్న సభోత్తేజం

- పాణి | 02.03.2019 04:21:26pm

సంగీతం ఆగిపోయింది
సృజనకారులను తరిమేశారు
కవులకు విషపాత్రలిచ్చారు
చరిత్రకారులను సజీవంగా పాతిపెట్టారు
శాస్త్రవేత్తలను మచ్చిక చేసుకున్నారు
తత్వవేత్తలను ఉరికంబాలెక్కించారు...
అని కా. జిఎన్‌ సాయిబాబ అంటారు.

దీనికి ʹపాత్రికేయులను లోబరుచుకున్నారు..ʹ అని కూడా చేర్చుకోవాలి. ప్రజాస్వామ్యమనబడేదానికి నాలుగో స్తంభం అని చెప్పుకునే పత్రికారంగం పోలీసులకు భయపడితే ఎలా ఉంటుందో నిన్న వరంగల్లులో రుజువైంది. సాయిబాబ జైలు కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ, వరవరరావు గతంలో జైలులో ఉన్నప్పుడు రాసిన ʹసహచరులుʹ ఆవిష్కరణ సభ నిన్న (28 న) సాయంకాలం వరంగల్లు ప్రెస్ క్లబ్బులో జరగాల్సి ఉండింది.

కానీ 27వ తేదీ రాత్రే వరంగల్లు పోలీసులు ప్రెస్ క్లబ్బు పెద్దలను బెదిరించారు. నిషేధిత సంఘం సభకు ఎలా అనుమతి ఇస్తారని ఆంక్షలు పెట్టారు.
లోకజ్ఞానం, కనీస పాత్రికేయ అవగాహన ఉండి వుంటే వారు భయయపడేవారు కాదు, పోలీసులకు లొంగిపోయేవారు కాదు. విరసం గతంలో నిషేధానికి గురైనా అప్పుడే కోర్టు దాన్ని ఎత్తేసిందని చెప్పి ఉండాల్సింది. ఆ పని చేయలేదు. మన వరంగల్లుకు కాళోజీ తర్వాత గర్వకారణమైన కవీ, మేధావీ అయిన వరవరరావు పుస్తకావిష్కరణను అడ్డుకోవడం అవమానకరం అని పోలీసులకు గడ్డి పెట్టి ఉండాల్సింది. ఆ పనీ చేయలేదు. కవిగా, ఆధ్యాపకుడిగానేగాక తెలుగు పత్రికా చరిత్రలోనే చిరకాలం గుర్తుపెట్టుకోదగిన సృజన పత్రికా సంపాదకుడూ, ఇతర పత్రికల్లో వేలాది రచనలు చేసిన రచయిత ఆయన. ఒక ప్రముఖ పత్రికలో వచ్చిన ఆయన రచనల పుస్తకం ఇది. దాని ఆవిష్కరణ అడ్డుకోవడం మా పాత్రికేయ విలువలకు భంగకరం అని ప్రకటించి ఉండాల్సింది.

అలాగే ప్రొ. సాయిబాబ ప్రపంచ స్థాయి మద్దతు ఉన్న మేధావి, అధ్యాపకుడు. ముఖ్యంగా మలి విడత తెలంగాణ పోరాటానికి ఊపిరి ఊదిన వరంగల్‌ డిక్లరేషన్‌ ప్రకటనకు ఆయన నాయకుడు. ప్రజాకవి కాళోజీ సమక్షంలో ఆ ప్రకటన జరిగింది. ఆ రకంగా కూడా ఆయన మన వరంగల్లుకు దగ్గరివాడు, ఆయన కవిత్వ ఆవిష్కరణను అడ్డుకోవడం అంటే మనల్ని మనం కించపరుచుకోవడం అని చెప్పాల్సింది.

వీటన్నిటికంటే కూడా ఆ సంస్థ వాళ్లు వచ్చి ఏ సభ జరుపుకునేది మాకు చెప్పాకనే 3000 డబ్బు తీసుకొని రసీదు ఇచ్చి మేం అంగీకరించాం. ఒకసారి పబ్లిక్‌ కమిట్‌మెంట్‌ అయ్యాక వెనక్కి తీసుకోవడం మాకు వీలు కాదు అని చెప్పాల్పి ఉండింది. మామూలు జనాలు కూడా ఒకసారి మాట ఇస్తే దాని కోసం ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడతారు.

కానీ వరంగల్లు ప్రెస్‌క్లబ్‌ నాయకులు ఎలా వ్యవహరించారంటే, సాయంకాలం కాగానే మీటింగ్‌ హాలుతో సహా అన్ని గదులకు తాళాలు వేసుకొని ప్రెస్‌క్లబ్‌ను సాయుధ పోలీసులకు అప్పగించి వెళ్లిపోయారు.

మన సంస్థ కార్యాలయం ఎదుట ఇలా తుపాకులు పట్టుకొని పోలీసులు తిరగడం, పోలీసు వ్యాన్లు చక్కర్లు కొట్టడం మనకు అవమానకరం కదా? అనే ఇంగితం కూడా వాళ్లకు పని చేయలేదు. మామూలుగా బడి, కాలేజీ, పత్రికా ఆఫీసు మొదలైన పబ్లిక్‌ ప్రాంతాల్లో పోలీసులు తచ్చాడటాన్ని ఆ సంస్థల పెద్దలు అవమానంగా భావిస్తారు. అభ్యంతరం చెబుతారు. కానీ ఇవేవీ ప్రెస్‌క్లబ్‌ వాళ్లకు అనిపించలేదు.

దీనికి కారణం ఉంది. అది చెప్పుకోకపోతే అసలు కథ పూర్తి కాదు. అదేమంటే.. పత్రికలకు, వాటిని నడిపేవాళ్లకు, ఇలాంటి ప్రెస్ క్లబ్బు నాయకులకు, పాత్రికేయ సంఘాలకు భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏమిటో తెలియదు. దీన్ని పత్రిలు తమ కంపెనీల స్వేచ్ఛగా ఎన్నడో మార్చేశాయి. తాము అధికారికంగా, అనధికారికంగా ఊడిగం చేస్తున్న రాజకీయ పార్టీల భావాల ప్రచారమే భావ ప్రకటన స్వేచ్ఛ అనే దగ్గరికి దిగజారిపోయాయి. కాబట్టి ఒక భిన్న భావజాల వ్యక్తీకరణ అయిన వివి, సాయి కవిత్వ సభకు ఆటంకం కలిగించడం తగదని అనిపించలేదు.

పత్రికారంగం దిగజారుడు గురించి ఆ రంగంలో ఉండే పెద్దలే ఎంతో విశ్లేషణ ఇస్తారు. ఎన్నో ఉదంతాలు చెబుతారు. కానీ తన రంగానికి గుండెకాయ అయిన భావ ప్రకటనా స్వేచ్ఛ గురించే అది పూర్తిగా మర్చిపోయింది. తన రంగానికి సంబంధించిన ఏ విలువ లేకపోవడం అంటే వెన్నెముక లేకపోవడం, వ్యక్తిత్వం లేకపోవడం. అప్పుడు అది ఏం పాత్రికేయం అవుతుంది? ప్రజలకు, ప్రజాస్వామ్యానికి కాపలా కుక్కల్లా పత్రికా, మీడియా రంగం ఎలా వ్యవహరిస్తుంది? పోలీసులకు భయపడి, వాళ్ల ఆదేశాలు పాటించేటట్లయితే ఇక మీడియా ఎందుకు? మూసేసుకోవడం మంచిది కదా? పోలీసుల గురించి, అందునా వరంగల్లు పోలీసుల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునేది ఏమీ ఉండదు. వాళ్లు ఎలా ఉంటారో అట్లాగే ఉన్నారు. పత్రిక రంగం ఎలా ఉండకూడదో అలా ఉండటమే అభ్యంతరకం.

అయితే గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే నిన్న నిర్బంధ సాయంకాలం ఇద్దరు ప్రముఖ విప్లవ కవుల కవిత్వం గురించి వరంగల్లు సాహిత్యకారులు, విప్లవాభిమానులు, ప్రజా సంఘాల సభ్యులు ఉత్తేజ పూరితంగా ప్రెస్ క్లబ్బు బైట మసక వెలుతురులో నిర్వహించుకున్నారు. తాళం వేసి ఉన్న మీటింగు హాలు గేటు ముందే సాయి కవిత్వాన్ని అమరుల బంధు మిత్రుల సంఘం నాయకురాలు, కథకురాలు కామ్రేడు పద్మకుమారి, వివి సహచరులు పుస్తకాన్ని ప్రముఖ సాహిత్యవేత్త, కేంద్ర సాహిత్య ఆకాడమీ అవార్డు తిరస్కర్త ప్రొ. కాత్యాయనీ విద్మహే ఆవిష్కరించారు.

ఆ తర్వాత అక్కడే ప్రేక్షకులు మూడు గంటలపాటు నిలబడి సభ విజయవంతం చేశారు. భగ్న సభ ఉత్తేజం ఎలా ఉంటుందో రుజువు చేశారు. ప్రముఖ సాహిత్యకారులు రామా చంద్రమౌళి, వి.ఆర్.విద్యార్థి, రామశాస్త్రి, నల్లెల్ల రాజయ్య మేధావుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ మాట్లాడారు. వివితో తమ సాన్నిత్యాన్ని గుర్తు చేసుకున్నారు.

సహచరులు పుస్తకం మీద కాత్యాయనిగారు చాలా వివరమైన విశ్లేషణ చేశారు. అలాగే ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ పై మిత్రుడు మెట్లు రవీందరు చాలా లోతైన, వివరమైన పరిచయం చేశారు. సీనియరు కవి లోచన్ గారు ఈ సభకు పంపిన కవితను అధ్యక్షుడు చదివి వినిపించారు.

వరంగల్లు అంటే అణచివేతే కాదు, ఉద్విగ్నభరితమైన ఉత్తేజం కూడా అని ఈ భగ్న సభ మరోసారి నిరూపించింది.





No. of visitors : 346
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణతార ఆగస్టు 2019

    ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగ వ్యతిరేకం
    వేటగాడి వల
    పదునెక్కుతున్న కోరలు
    ఎదురుచూపులు
    యురేనియమం
    మనిషి లోపలి ప్రకృతి గురించి చెప్పిన మంచి కథ ʹ ఆఖరి పాట ʹ
    నిశ్శబ్దంగానో, నిర్మాణంగానో
    దళిత నవలా సాహిత్యంలో ఒక మైలురాయి "నిషిధ"
    చరిత్ర కన్న శిశువు - చరిత్రకు మార్గదర్శి
    ʹఅస‌మ్మ‌తిʹపై ఎక్కుపెట్టిన అస్త్రం

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •