స్వేచ్ఛ‌ను కాంక్షించ‌డ‌మూ దేశద్రోహ‌మైన చోట‌

| సాహిత్యం | వ్యాసాలు

స్వేచ్ఛ‌ను కాంక్షించ‌డ‌మూ దేశద్రోహ‌మైన చోట‌

- స్వాతి | 02.03.2019 04:24:35pm

ʹదేశభ‌క్తిʹ వ‌ర‌ద‌లై ప్ర‌వ‌హిస్తున్న కాలం ఇది. ఇప్పుడు, స్వేచ్ఛ కోసం నిన‌దించ‌డ‌మూ నేర‌మే ఇక్క‌డ‌. అధికారం నీడ‌లో అమ‌ల‌య్యే అంతులేని హింస‌ను పంటిబిగువున బ‌రించాల్సిందే. లేదంటే... దేశ‌ద్రోహుల జాబితాలో చేరిపోతారు. ఎందుకంటే.. ఇక్క‌డ మ‌ట్టికున్న విలువ మ‌నిషికి లేదు గ‌నుక‌. ఆవుకున్న విలువ ʹఆమెʹకు లేదు గ‌నుక‌. ఆజాదీ నినాదం ఇప్ప‌డు నేర‌మైంది.

పుల్వామా దాడితో దేశం మొత్తం ఒక్క‌సారిగా క‌శ్మీర్ వైపు చూపు సారించింది. దేశ ప్ర‌ధాని మోదీ పుల్వామా దాడికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంద‌ని, గ‌ట్టి స‌మాధానం చెబుతామ‌ని హెచ్చ‌రించారు. అదే స‌మ‌యంలో సోకాల్డ్ దేశ‌భ‌క్తులంతా క‌శ్మీర్ భార‌త్‌లో భాగ‌మే అంటూ నినాదాన్ని ఎత్తుకున్నారు. పుల్వామా దాడికి క‌శ్మీరీ ప్ర‌జ‌లే కార‌ణ‌మంటూ దేశంలోని ప‌లు చోట్ల క‌శ్మీరీల‌పై దాడుల‌కు తెగ‌బ‌డ్డారు. క‌శ్మీరు మాదే అని చాటుకునే ఈ దేశ‌భ‌క్తుల‌కు క‌శ్మీరీలు మాత్రం శ‌త్రువులుగా క‌నిపించ‌డం విడ్డూరంగా ఉంది. హిందుత్వ క‌ళ్ల‌జోడు త‌గిలించుకున్న ఈ దేశ‌భ‌క్తుల‌కు క‌శ్మీరీలు పాకిస్తాన్ అనుకూలుగా క‌నిపించ‌డ‌మే ఈ వైఖ‌రికి కార‌ణంగా చెప్పుకోవ‌చ్చు.

వాస్త‌వానికి ఇది పాకిస్తాన్ స‌మ‌స్యో, భార‌త్ స‌మ‌స్యో కాదు. ఇది క‌శ్మీరీ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌. ద‌శాబ్ధాలుగా తుపాకీ నీడ‌న బ‌తుకులీడుస్తున్న ప్ర‌జ‌ల జీవ‌న్మ‌ర‌ణ పోరాట స‌మ‌స్య‌. క‌శ్మీర్‌లో మిల‌ట‌రీకి ప్ర‌త్యేక అధికారాల చ‌ట్టం (AFSPA) క‌ల్పించిన స్వేచ్ఛ అక్క‌డి ప్ర‌జ‌ల పాలిట శాపంగా మారింది. మిలిటెంట్ల సాకుతో... సామాన్య ప్ర‌జ‌ల‌పై అమ‌ల‌వుతున్న హింస అంతా ఇంతా కాదు. ద‌శాబ్ధాలుగా భార‌త సైన్యం కొన‌సాగిస్తున్న ఈ హింస‌లో వేలాది మంది సామాన్య క‌శ్మీరీ ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 30 వేల మందికి పైగా మాయ‌మ‌య్యారు (మిస్సింగ్‌). ఈ అణ‌చివేత నుంచి, త‌మ నేల‌పై త‌మ‌నే ప‌రాయిని చేసిన పాల‌న నుంచి క‌శ్మీరీ ప్ర‌జ‌లు స్వేచ్ఛ‌ను కోరుకుంటున్నారు. ఆజాదీ క‌శ్మీర్ కోసం నిన‌దిస్తున్నారు. ఈ వాస్త‌వాన్ని గుర్తించ నిరాక‌రించే భార‌త పాల‌కులు.. క‌శ్మీర్‌పై త‌మ పెత్త‌నాన్ని నిలుపుకునేందుకు ఆజాదీ నినాదాన్ని దేశదేహ్రంగా మార్చేసింది. క‌శ్మీరీల స్వ‌యం ప్ర‌తిప‌త్తిని స‌మ‌ర్థించినందుకు జేఎన్‌యూ విద్యార్థుల‌పై దేశ‌ద్రోహం కేసుమోపారు. నిన్న‌టికి నిన్న క‌శ్మీర్‌, మ‌ణిపూర్‌, పాల‌స్తీనా ప్ర‌జ‌ల పోరాటాన్ని బ‌ల‌ప‌ర్చినందుకు కేర‌ళా ప్ర‌భుత్వం ఆర్.ఎస్.ఎఫ్‌. విద్యార్థుల‌పై దేశ‌ద్రోహం కేసుపెట్టింది. స్వేచ్ఛ‌కోసం నిన‌దించే ప్ర‌జ‌ల నోరునొక్కే కుట్ర ఇది.

క‌శ్మీర్ నేల‌పై ఏరులై పారుతున్న నెత్తురు ఓవైపు.. దేశ వ్యాప్తంగా క‌శ్మీరీల‌పై జ‌రుగుతున్నమూక‌దాడులు మ‌రోవైపు. ఈ నేప‌థ్యంలో స‌మ‌స్య ప‌రిష్కారం కోసం పాల‌కులు చిత్త‌శుద్ధితో వ్య‌వ‌హ‌రించాల్సింది పోయి... క‌శ్మీర్‌ను త‌మ స్వార్థ రాజ‌కీయాల కోసం వాడుకోవ‌డం విషాదం. 1947 అధికార మార్పిడికి ముందు జ‌మ్మూ క‌శ్మీర్ బ్రిటీష్ ఇండియాకి చెందిన 552 స్వ‌తంత్ర్య రాజ్యాలో ఒక‌టి. అధికార మార్పిడి స‌మ‌యంలో మెజార్టీ క‌శ్మీరీ ప్ర‌జ‌ల అభిప్రాయాల‌కు భిన్నంగా అప్ప‌టి హిందూ రాజు హ‌రిసింగ్ జ‌మ్మూ కశ్మీరు స్వంతంత్రంగా ఉంచాల‌నుకున్నాడు. ఆ స‌మ‌యంలో జ‌రిగిన తిరుగుబాటును అణ‌చివేసేందుకు భార‌త్ స‌హాయాన్ని కోరాడు రాజు. అలా భార‌త్‌కి, జ‌మ్మూ క‌శ్మీర్‌కి మ‌ధ్య జ‌రిగిన విలీన ఒడంబ‌డిక ప్ర‌కారం జ‌మ్మూ క‌శ్మీర్ భార‌త్‌లో విలీన‌మైనా క‌శ్మీరీలు భార‌త రాజ్యాంగాన్ని ఆమోదించనక్కరలేదు. జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో స్థానిక పాల‌కుని విచక్షణాధికారం కొనసాగుతుంది. ఏ చట్టమూ దాని సార్వభౌమత్వాన్ని ప్రశ్నించదు. ఈ ఒప్పందంలోని నిబంధ‌న‌ల‌ను భార‌త పాల‌కులు ఎప్ప‌టిక‌ప్పుడు కుట్ర‌పూరితంగా ఉల్లంఘిస్తూనే ఉన్నారు. స్థానిక ప్ర‌భుత్వాన్ని బ‌ల‌హీన ప‌రిచి... త‌మ చెప్పుచేత‌ల్లో ఉండే పాల‌కుల‌ను నియ‌మించుకునేందుకు ప్‌థయ‌త్నిస్తూనే ఉన్నారు. క‌శ్మీరీ ప్ర‌జ‌ల‌పై సాయుధ బ‌ల‌గాల‌ను ప్ర‌యోగించి స్వయంప్ర‌తిప‌త్తి అనే ఆకాంక్ష‌ను అణ‌చివేయాల‌ని చూస్తున్నారు. అధికారంలో ఏ పార్టీ భార‌త పాల‌కులు క‌శ్మీర్ ప‌ట్ల ఇలాంటి వైఖ‌రినే అమ‌లు చేస్తుండ‌డం విషాదం.

సైన్యానికి పూర్తి స్వేచ్ఛని కల్పిస్తూ తీసుకువ‌చ్చిన‌ సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం మాటున క‌శ్మీరీ పౌరుల‌పై జ‌రిగిన హింస‌కు అంతులేద‌నే చెప్పాలి. హ‌త్య‌లు, అత్యాచారాలు, చిత్ర‌హింస‌లు, కుట్ర‌కేసులు, సోదాలు, గృహ‌ద‌హ‌నాలు ఇలా లెక్క‌కు లేన‌న్ని నేరాల‌కు భార‌త సైన్యం పాల్ప‌డింది. కానీ అవేవీ శిక్షార్హం కావు. ఒక వాక‌ప‌ల్లి, ఒక బ‌స్త‌ర్, ఒక మ‌ణిపూర్‌, ఒక క‌శ్మీర్‌, ఒక పాల‌స్తీనా... ప్ర‌జా తిరుగుబాటును అణ‌చివేసేందుకు స్త్రీల‌పై లైంగిక హింస రాజ్యం చేతిలోని ఆయుధం. 28 ఏళ్ల క్రితం కున‌న్ - పోష్‌పొరా జంట‌ గ్రామాల్లో మ‌హిళ‌ల‌పై జ‌రిగిన సామూహిక అత్యాచారం సాయుధ ద‌ళాల హింస‌కు ఒక మ‌చ్చు తున‌క మాత్ర‌మే.

1991 ఫిబ్రవరి 23-24 మధ్య రాత్రి ఉత్తర కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలోని కునాన్‌, పోష్‌పొరా గ్రామాలను ఇండియన్ ఆర్మీచుట్టుముట్టింది. విచార‌ణ పేరుతో మ‌గ‌వాళ్లంద‌రినీ క్యాంపుల‌కు త‌ర‌లించి... గ్రామంలో ఉన్న మ‌హిళ‌ల‌పై సామూహిక అత్యాచారాల‌కు పాల్ప‌డ్డారు. తల్లుల ఎదుట పిల్లలనూ, పిల్లల ఎదుట తల్లులనూ.. ప‌సి పిల్ల‌ల నుంచి పండు ముస‌లి వ‌ర‌కు చెరిచారు. ఎద‌పై తుపాకీ గురిపెట్టి మ‌రీ ప‌శుత్వాన్ని ప్ర‌ద‌ర్శించారు. దాదాపు వంద మంది మ‌హిళ‌లు సైన్యం చేతిలో అత్యాచారానికి గుర‌య్యారు. 28 ఏళ్లు గ‌డిచినా.. నాటి భ‌యాన‌క స్థితి నుంచి ఆ మ‌హిళ‌లు బ‌య‌ట‌ప‌డ‌లేక‌పోతున్నారు. ఇలాంటి దుర్మార్గాలెన్నో నిత్యం క‌శ్మీరీ ప్ర‌జ‌లు అనుభ‌విస్తున్నారు. అయినా... వాళ్లు స్వేచ్ఛ‌ను కోరుకోవ‌డం భార‌త పాల‌కుల దృష్టిలో నేర‌మే. ఇదెక్క‌డి న్యాయ‌మో? అస‌లు ప్ర‌జ‌ల అభిప్రాయాలతో సంబంధం లేకుండా.. పాల‌కుడితో ఒప్పందం కుదుర్చొని బ‌ల‌వంతంగా క‌లిసుండాల‌న‌డం ఎలాంటి ప్ర‌జాస్వామ్యం? ఈ అరాచ‌కాన్ని స‌మ‌ర్థించ‌డ‌మే ఇవాల్టి దేశ‌భ‌క్తి. క‌శ్మీరీ ప్ర‌జ‌ల గురించి.. వాళ్ల క‌న్నీళ్ల గురించి మాట్లాడ‌డం దేశ‌ద్రోహం. ఈ వైఖ‌రి మార‌నంత కాలం.. క‌శ్మీరీ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను విన‌నంత కాలం నెత్తురు పారుతుంది త‌ప్ప‌... స‌మ‌స్య ప‌రిష్కారం కాదు. ఈ వాస్త‌వాన్ని ఎప్ప‌టికైనా గుర్తించాల్సిదే. తుపాకీ ఎక్కుపెట్టి శాంతిని కాంక్షించ‌డం అవివేక‌మే అవుతుంది.

No. of visitors : 552
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


యుద్ధగీతం

ప‌ల్ల‌పు స్వాతి | 16.07.2017 08:36:43am

నా కథ అంటే... మా ఆదివాసీల కథ. చీకటితో మొదలైన కథ. భూమి కోసం బలైన బిడ్డల చరిత . మా జాతినంతా అంతం చేస్తున్న రాజ్యం దుర్మార్గ చరిత్ర . మా నేల చెర ...
...ఇంకా చదవండి

పాటై ప‌దునెక్కాలి...

ప‌ల్ల‌పు స్వాతి | 18.06.2017 01:03:17pm

ఇప్పుడీ దుఃఖ‌భ‌రిత కాలాల్లో క‌రిగిన క‌ల‌ల్నీ చెదిరిన గూళ్ల‌నూ క‌న్నీళ్లింకిన మ‌నుషుల్నీ గుండెల‌కు హ‌త్తుకోవాలి...
...ఇంకా చదవండి

రజనీతిలక్ లేని లోటు భర్తీ చేయలేనిది

స్వాతి. పి | 04.04.2018 11:47:09am

ప్రముఖ దళిత కవయిత్రి, రచయిత్రి రజని తిలక్ ఢిల్లీ లో మరణించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. మార్చి 30న‌ తుది శ్వాస విడిచ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2020
  తెర ముందు కథ!
  షాహిన్ భాగ్..షాహిన్ భాగ్
  హిబా కోసం
  నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు
  సత్యాన్ని చెప్పడమే రాజకీయ కవితా లక్షణం
  షాహీన్ బాగ్... ఒక స్వేచ్ఛా నినాదం
  విప్లవం నేరం కాదు. విప్లవకారుడు నేరస్తుడూ కాదు.
  అరెస్టు - అన్‌టచబులిటీ
  విప్లవ కవిత్వంలో ఈ తరం ప్రతినిధి
  నిర్బంధ ప్రయోగశాల
  అరుణతార జనవరి - 2020

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •