నేరమే అధికారమైన వేళ

| సాహిత్యం | క‌విత్వం

నేరమే అధికారమైన వేళ

- అరుణ్‌ | 02.03.2019 04:38:04pm

తూర్పుకు వ్యతిరేకంగా, మార్పుకు వ్యతిరేకంగా
తీర్పుచెప్పి ఒప్పుకొమంటున్న మిలార్డ్‌
మరోసారి నిప్పులో కాలేస్తున్నారు,
సముద్రాన్ని పిడికిలిలో బంధించాలని చూస్తున్నారు
తస్మాత్‌ జాగ్రత్త
అది ఉప్పెనై మీ ఊపిరి తీస్తుంది

తూర్పుకు చిహ్నం, మార్పుకు సంకేతం అతడు
బాంబులను పంచాలేధతడు
బావాలను పంచాడతడు
బావాలను బంధించాలనుకోకు
అవి తేనేటీగలై
ఈ వ్యవస్థకు చరమ గీతం పాడుతాయి.

తూర్పును ఆహ్వానిస్తూ, మార్పును స్వాగతిస్తున్న
అతని బావాల పెనుతుఫాను ఆక్రమణ చూడు
ʹʹజగిత్యాల జైత్యయాత్రʹʹ తో ఆగిపోయిందనుకున్న
ఊరేగింపు
నాసిక్‌ నుండి ముంబాయ్‌ దాక
డిల్లీ పురవీధుల్లో కదంతొక్కిన రైతాంగపధఘట్టనలలో
పునరుత్తేజంతో, పునరుజ్జీవనం చెందడం మరవకు
ఓరుగల్లు, కరీంనగర్‌ కల్లోలప్రాంతాల ఎర్రదండు
భీమకోరేగావ్‌ తో చెట్టాపట్టాలేసుకుందని
మీ కాళ్ళకింద భూమి కదలుతూందని
భయవిహ్వలతతోనీవు పన్నిన కుట్రను
ప్రజలు భగ్నం చేస్తారని తెలుసు

నేరమే అధికారమై
ప్రజల్ని నేరస్తుల చేసి శిక్షిస్తుంటే
ప్రశించడమే అతని నైజం
నోరులేని జనాలకు గొంతివ్వడమే
అతని శ్వాస, ఉచ్చ్వాస
ప్రగతి శీల మార్పుకు ఉదయగీతికలే
అతని కవితలు.

కవిని బంధించగలరు
కాని
కోట్లాది పీడితుల నినాదమై
కదంతొక్కుతున్న కవితల్ని ఏంచేయగలరు

అర్బన్‌ నక్సల్‌ పేరిట
మాటను, పాటను, రాతను బంధించాననుకోకు
నీ మట్టికాళ్ళ రాక్షసికి భీతిచెందేవారెవ్వరూ లేరు
వ్యవస్థ పీడితులందరూ నక్సల్స్‌ అయినపుడు
వారి పోరాటాలకు గొంతునిచ్చే
మేమంతా
అర్బన్‌ నక్సల్స్‌ గాక తప్పదుగా.

(కా:వివి కోసం)





No. of visitors : 263
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సీమ పోరాడాల్సింది... ప్రత్యేక హోదాకై కాదు- నికరజలాలు, నిధులకై

అరుణ్ | 04.02.2017 12:52:07am

ʹ ప్రత్యేక హోదాʹ ఎండమావుల వెంట ప్రజల్ని పరుగేట్టించేందుకు తమిళనాడు జల్లికట్టు ఉద్యమం ప్రేరణ కల్గించడం, దానికి అన్ని రాజకీయ పార్టీలు,ఉభయ కమ్యూనిస్టులతో సహా,...
...ఇంకా చదవండి

వీళ్లు చేసిన నేరం ఏంటి?

అరుణ్ | 16.06.2018 10:29:00am

హిందూ ఫాసిజం నగ్నంగా ప్రజల హక్కుల అణచివేస్తున్నప్పుడు, మనవరకు రాలేదు కదా అని మౌనం వహిస్తే ఏం జరుగుతుందో హిట్లర్ పాలన గురించి వీ ముల్లెర్ చెప్పిన మాటలు వాస్...
...ఇంకా చదవండి

ప్రత్యేక హేళన

అరుణ్ | 21.03.2018 10:49:23am

అవును మరిచాను మీడియా తన స్వామి భక్తిని చాటుకుంటూనే వుంది వలసల ,ఆత్మహత్యల తో సీమ దాహం, దాహం అంటూ అంగలారుస్తూనేవుంది, ఆకాశం వైపు చూస్తూనే వుంది అమరావతి నుండి ...
...ఇంకా చదవండి

ఇక కాశ్మీరీయుల పరాయీకరణ సంపూర్ణం

అరుణ్ | 16.08.2019 07:43:10pm

కాశ్మీరీయుల ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని చెప్పాల్సిన అవసరమూ లేదు. మిలిటెంట్ పోరాటాలు, వాటిని తనకనుకూలంగా మార్చుకునేందుకు వారికి ఆయుధ సంపత్తిని .....
...ఇంకా చదవండి

దేశంలో ప్రశాంతత నెలకొనివుంది-జైళ్ళూ నోళ్ళు తెరుచుకొనే వున్నాయి - తస్మాత్ జాగ్రత్త

అరుణ్ | 17.11.2019 11:14:53am

ఈ తీర్పు జరగబోయే పరిమాణాలకు సూచకమా?గతం లో రాజులూ దండయాత్ర పేరిట చేస్తున్నదదే-భూ ఆక్రమణ.వారే చట్టం,న్యాయం కాబట్టి,వారు చెప్పిందే న్యాయం,చేసేదే ధర్మం గా వుండే...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

  • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
  • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణతార జనవరి - 2020
    నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన
    జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA), జాతీయ పౌర జాబితా (NRC) ప్రక్రియను ఎందుకు వ్యతిరేకించాలి?
    నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు
    ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి
    ఢిల్లీ నుండి ప్రేమతో
    తెలంగాణలో ఏం జరుగుతోంది? సైలెంట్ ఎమర్జెన్సీ దేనికి సంకేతం?
    తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం
    మానవాచరణ నుంచే విప్లవ కవిత్వం
    కథావరణంలో 50 సంవత్సరాల విరసం.
    నూత‌న మాన‌వ ఆవిష్క‌ర‌ణే విప్ల‌వ క‌థ అంతిమ ల‌క్ష్యం

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •