బ్రతికించే మాట ఒకటి కావాలి

| సాహిత్యం | క‌విత్వం

బ్రతికించే మాట ఒకటి కావాలి

- పలమనేరు బాలాజీ | 17.03.2019 09:34:29am


రెండు మూడు సెల్ఫోన్స్
ఐదారు సిమ్ కార్డ్స్
ఇన్ని వాట్సప్లు, ఎన్నో ఫేస్ బుక్స్
నిద్రకు మెలకువకు మధ్య
నానా చెత్తతో ,కుళ్ళుతో,
నటనలతో, మాటకారితనంతో
e- యంత్రాల మనుషులు.

మోసకారితనంతో మాయచేయడమే
మనిషితన౦ అయిన ఈ రోజుల్లో ..
పైకెే నవ్వులు .
లోలోపల అంతా వేళాకోళాలెే ! వెక్కిరింతలెే
మోసపోవటం మోసగించడమే
జీవితం అనిపించే కాలం .

అనేకానేక వాణిజ్య ప్రకటనల మధ్య
అతడు, లెేదా.. ఆమె
ఒకరెవరో ఉదారంగా నవ్వుతూ మాట్లాడతారు.
వాన చినుకులా, లేత మొగ్గలా ఒకరెవరో మాట్లాడే
ఆ నాలుగు మాటలే నన్ను బతికిస్తున్నాయి.
అన్నం ,నీళ్లు ,నిద్ర మాత్రమే కాదు..
బ్రతకటానికి ,జీవించటానికి
సమూహాన్ని నాలో కలుపుకోవడానికి
నేనొక సమూహం కావటానికి
నాకు ఒక మనిషి ,మాట ,మనసు కావాలి .
మనసున్న మనిషి మాట్లాడే మాటొకటి కావాలి
ఉదయమో ,సాయంత్రమో, రాత్రో
నన్ను బ్రతికించే మాటొకటి కావాలి.
మనసుతో మాట్లాడే మనిషొకరు కావాలి !





No. of visitors : 142
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


పరిమళం , పదును రెండూ వున్నకవిత్వం – చేనుగట్టు పియానో

పలమనేరు బాలాజీ | 04.02.2017 02:37:03am

కవి పాలక పక్షం, రాజ్యం పక్షం, వహించకుండా ప్రజా పక్షం వహిస్తున్నాడని ప్రజల ఆగ్రహాన్ని,ఆవేదనల్ని, ప్రశ్నల్ని,నిరసనల్ని తన గొంతుతో వినిపిస్తున్నాడని .......
...ఇంకా చదవండి

ʹనారుమడిʹ మళ్ళీ మళ్ళీ చదివించే మంచి క‌విత్వం

పలమనేరు బాలాజీ | 18.01.2017 11:47:15pm

కాలం గడచినా మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి చదవాలని అనిపించే మంచి కవితా సంపుటాల్లో ʹ నారుమడి ʹ ఒకటి. యెన్నం ఉపేందర్ ( డాక్టర్ వెన్నం ఉపేందర్ )అటు కథకుడిగా , యిటు కవి...
...ఇంకా చదవండి

ఖాళీ ఇల్లు,ఖాళీ మనుషులు

పలమనేరు బాలాజీ | 01.06.2016 11:57:12am

నమ్ముకున్న కలల్ని గాలికొదలి ఇల్లు వదిలి, ఊరు వదిలి పిల్లల్ని వదిలి, సహచరుల్ని వదిలి...
...ఇంకా చదవండి

సాహిత్య విమర్శకు కొత్త బ‌లం

పలమనేరు బాలాజీ | 04.03.2017 09:54:02am

ఈ పుస్తకం లో వ్యక్త పరచిన అభిప్రాయాల్లో రచయిత ఎక్కడా సహనం కోల్పోలేదని, సాహిత్య అంశాల పట్ల రచయితకు గల ఆసక్తి ,నిబద్దత,స్పష్టతే ఇందుకు కారణాలని, విభేదించే...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి
    అరుణతార ఏప్రిల్ - 2019
    ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
    వరవర రావును విడుదల చేయమని కోరుతూ ప్రధాన న్యాయమూర్తికి వరవర రావు సహచరి హేమలత బహిరంగ లేఖ
    ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
    తెగిపడిన చిటికెనవేలు చెప్పిన ఏడుగురు అక్కచెల్లెళ్ళ కథ
    మేఘం
    అర్హత
    మోడీ ʹమేకిన్ ఇండియాʹలో తయారైనవి
    భూమాట
    చంద్రబాబు అయిదేళ్ల పాలన - మీడియా మేనేజ్మెంట్
    ఆ చిరునవ్వుల్ని చిదిమేశారు

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •