మానవహక్కులను వెటకారం చేసే ద్వేషభక్తులు అర్థం చేసుకోలేనిది.

| సంభాషణ

మానవహక్కులను వెటకారం చేసే ద్వేషభక్తులు అర్థం చేసుకోలేనిది.

- మిసిమి | 17.03.2019 09:38:24am

శత్రుదేశంగా భావించే గడ్డలో మానవహక్కుల సంఘాలు, ప్రజాస్వామికవాదులు అభినందన్ విడుదల కోసం గొంతువిప్పారు. మనలాంటి ద్వేషభక్తులు అక్కడ ఆయన్ని కొట్టి చంపడానికి ప్రయత్నించారు. ఈ సీన్ రివర్స్ అయ్యి పాకిస్తాన్ సైనికుడు ఇండియా సైన్యానికి దొరికి ఉంటే? ఆయన్ని విడుదల చేయమని హక్కుల సంఘాలు కోరి ఉంటే..? వాళ్ళంతా దేశద్రోహులు అయ్యేవాళ్ళు కదా? తీవ్రవాదులతోనో, ఐ.ఎస్.ఐ తోనో సంబంధాన్ని అంటగట్టే వాళ్ళు కదా? మన సైనికులు చచ్చిపోతే ఎందుకు ఖండించలేదు అని అడిగే వాళ్ళు కదా? పాకిస్తాన్ సైనుకులకేనా, భారత సైనికులకు మానవ హక్కులు లేవా అని అడిగేవాళ్ళు కదా? ఇప్పుడు పాకిస్తాన్ లో ఏం జరుగుతోందో తెలీదు కాని, యుద్ధం వద్దంటూ హక్కుల సంఘాల తీసిన ఊరేగింపుపై ఇక్కడ భౌతిక దాడులు జరిగాయి. సోషల్ మీడియా ట్రాలింగ్ గురించి చెప్పక్కర్లేదు.

జెనీవా ఒప్పందం గురించి ఎంత ప్రచారం జరిగింది! పట్టుబడిన యుద్ధ ఖైదీని, అది సివిల్ వార్ అయినా సరే మానసిక శారీరక హింసకు గురిచేయకుండా ఎట్లా చూసుకోవాలో సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసారు. అది పాకిస్తాన్ ఉదారత్వం కాదు, వాళ్ళు నియమాల ప్రకారం చేయవలసిందే చేసారు అంటున్నారు. నిజమే. ఇట్లాంటి నియమాలను, ఒప్పందాలను అమలు చేయమనే ఎక్కడైనా పౌరహక్కుల సంఘాల ప్రతినిధులు అంటారు. భారత ప్రభుత్వం ఐక్యరాజ్య సమితి ముందు వాగ్దానం చేసినట్లుగా కశ్మీర్ లో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి. ఎందుకు జరపడం లేదు? అదే చేసి ఉంటే ఈ సమస్య ఉండేదా? ఇది మాట్లాడటమే కదా దేశద్రోహం?

ఇలాటి సూటి ప్రశ్నలు వేసే ప్రొఫెసర్ సాయిబాబాను, దండకారణ్యంలో ఆదివాసులపై హత్యాకాండను ప్రశ్నించిన ప్రజల గొంతుకను అయిదేళ్లుగా చిత్రహింసలు పెడుతున్నారు. వేరొకరి సహాయం లేకుండా కదలలేని మనిషిని, అతని ʹమెదడు చురుగ్గా పనిచేస్తోందనిʹ రెండేళ్లుగా ఒంటరి చీకటి కొట్లో పడేసి 19 రకాల తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు వైద్యం కూడా అందించకుండా చావుకు వదిలేసారే? భారతదేశ చట్టాల ప్రకారమైనా, అంర్జాతీయ చట్టాల ప్రకారమైనా ఏ ఖైదీ పట్లా ఇట్లా అమానవీయంగా ఉండకూడదు. ఉరిశిక్ష వేసే ముందు కూడా ఆరోగ్యం బాగుందో లేదో చూస్తారే? జంతువులకు కూడా జీవించే హక్కు ఉందని మాట్లాడతామే! స్వయంగా చివరి మూలుగులు తీసుకుంటున్న జంతువులా పడి ఉన్నానని ఆయనే రాసి పంపాడు. అత్యవసరంగా వైద్యం చేయించాలని బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేస్తే సంవత్సర కాలంగా వాయిదాలు వేస్తున్నారంటే ఆయన చావు కోరుకుంటుున్నట్లే కదా? మానవహక్కులంటే మనకిష్టమైన వాళ్ళ జీవించే హక్కులే కాదు, మనం రాజకీయంగా విబేధించే వాళ్ళకూ జీవించే హక్కు ఉంటుందని ఎన్నడు అర్థమయ్యేను? సాయిబాబా నక్సలైట్ల మనిషి. ఆయన్ని ఉరి తీయాలి అని ఊరేగింపులు తీసే ఉన్మాదానికి ప్రజాస్వామిక విలువలు, మానవ హక్కులు, మానవీయ వైఖరులు అర్థం అయ్యేవి కావు.





No. of visitors : 191
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దళిత మహిళా పోరాట చరిత్రను సిలబస్ నుండి తొలగించిన సి.బి.ఎస్.ఇ

-మాయా పలిత్ | 02.01.2017 11:54:34pm

ʹCaste, Conflict and Dress Changeʹ అనే అధ్యాయాన్ని 9వ తరగతి సామాజిక శాస్త్ర పాఠ్య ప్రణాళిక నుండి తొలగిస్తున్నట్లు సి.బి.ఎస్.ఇ (ఉన్నత పాఠశాల కేంద్రీయ విద్యా ...
...ఇంకా చదవండి

తెలుగువారి ముంగిట్లోకి ప్రపంచం

మిసిమి | 17.06.2016 11:09:21am

విశ్వ పరిణామ క్రమంలో ఆవిర్భవించిన మనిషి గురించి, ఆ మనిషి సృష్టించుకున్న ప్రపంచం గురించి ఆలోచించినప్పుడు, తెలుసుకుంటున్నప్పుడు, కవిగా శ్రీశ్రీ పొందిన ఉద్వేగా...
...ఇంకా చదవండి

దేవతా - దెయ్యమూ

మిసిమి | 03.09.2016 12:53:20am

ఆ అమ్మాయి పదిహేనేళ్ల వయసులో చాలా అందంగా ఉండేదట. ఆ ఊరి భూస్వామి ఆమె మీద మోజుపడి, కుట్రపన్ని ఆమె తండ్రిని హత్య చేసి ఆమెను చేరదీసి చేసి ఇంట్లో బంధించి........
...ఇంకా చదవండి

చదివిన వారిని ʹపాల్గుణʹ ఆవహిస్తాడు!

మిసిమి | 16.07.2016 12:56:55pm

పాల్గుణ మట్టివేళ్ళ నుండి రూపొందిన విప్లవకారుడు. సింగరేణి గని కార్మికుడిగా అత్యంత సహజంగా కార్మికోద్యమానికి దగ్గరై, కార్మికవర్గ రాజకీయాలను సొంతం చేసుకున్న......
...ఇంకా చదవండి

మాయమైన నజీబ్ మాట్లాడే సంగతులు

మిసిమి | 05.04.2017 09:43:48pm

దేశంలో అసహనం (ఉన్మాదం అనవలసినదాన్ని) గురించి రచయితలు, శాస్త్రవేత్తలు, ఆలోచనాపరులు మూకుమ్మడి నిరసన తెలిపినప్పుడు మన ప్రభుత్వం వెటకారం చేసిన విషయం ఎంత.......
...ఇంకా చదవండి

సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో రొమిలా థాపర్‌ తదితర పిటిషన్‌దారుల పత్రికా ప్రకటన

| 01.10.2018 10:37:48pm

సమాజంలో బలహీనవర్గాల హక్కుల కోసం పనిచేస్తున్న వ్యక్తులపై రాజ్యం తీవ్రవాద వ్యతిరేక చట్టాలను సరైన ఆధారం లేకుండా ప్రయేగించేటప్పుడు అది కూడా ఒక రకమైన టెర్రర్... ...
...ఇంకా చదవండి

చిన్న చేపల్ని చంపుతున్న పెద్ద పరిశ్రమ

రాహుల్ మాగంటి | 22.09.2018 11:48:04pm

ఆంధ్రప్రదేశ్ లోని ఆ తీర ప్రాంత గ్రామంలో పారిశ్రామిక కాలుష్యం చేపల్ని చంపేసాక మత్యకారులు ఏమయ్యారు? సముద్రమంత గతానికి అనిశ్చిత భవిష్యత్తుకు మధ్య పెనుగులాడు.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి
    అరుణతార ఏప్రిల్ - 2019
    ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
    వరవర రావును విడుదల చేయమని కోరుతూ ప్రధాన న్యాయమూర్తికి వరవర రావు సహచరి హేమలత బహిరంగ లేఖ
    ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
    తెగిపడిన చిటికెనవేలు చెప్పిన ఏడుగురు అక్కచెల్లెళ్ళ కథ
    మేఘం
    అర్హత
    మోడీ ʹమేకిన్ ఇండియాʹలో తయారైనవి
    భూమాట
    చంద్రబాబు అయిదేళ్ల పాలన - మీడియా మేనేజ్మెంట్
    ఆ చిరునవ్వుల్ని చిదిమేశారు

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •