వేటకెళ్ళిన ఆదివాసులను వేటాడి చంపిన పోలీసులు

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

వేటకెళ్ళిన ఆదివాసులను వేటాడి చంపిన పోలీసులు

- సాగర్ | 17.03.2019 10:35:13pm


మార్చి 16 ఉదయం ఆంధ్ర - ఒడిస్సా సరిహద్దుల్లో ఎన్కౌంటర్ జరిగిందని, దానిలో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారని వార్త వచ్చింది. వారి వద్ద నుండి భారీగా విప్లవ సాహిత్యం స్వాధీన పర్చుకున్నామని, ఇంకా 20మంది దాక మావోయిస్టులు తప్పించుకుపోయారని పోలీసులు ప్రకటించారు. ముందుగా మావోయిస్టులు కాల్పులు జరపడంతో ఆత్మరక్షణ కొరకు తాము కాల్చామని కూడా ప్రకటించారు. ఈ సంఘటనతో ఆంధ్ర - ఒడిస్సా సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం అంటూ మీడియా కథనాలు వచ్చాయి. ఈ సంఘటనలో పెదబయలు మండలం పెదకోడాపల్లికి చెందిన బట్టి భూషణం, సీదరి జమధార్ మృతి చెందారు. వీరు పెదబయలు ఏరియా కమిటీకి చెందినవారని పోలీసులు ప్రకటించారు.

కానీ వాస్తవానికి వీరిద్దరు మరో ఇద్దరితో కలసి అడవిలో వేటకు వెళ్లారు. వీరు ఇంటికి తిరిగి వస్తుండగా ఆంధ్ర - ఒడిస్సా గ్రేహౌండ్స్ బలగాలు ఎదురుపడ్డాయి. మీరెవరు అని అడగటంతో పోలీసులను చూసి భయపడిన వీరు పరిగెత్తారు. వెంటనే పోలీసులు కాల్పులు జరపడంతోటి ఈ ఇద్దరు చనిపోగా మిగతా ఇద్దరు తప్పించుకున్నారు. తప్పించుకున్నవారు గ్రామస్తులకు విషయం చెప్పడంతోటి వారు పాడేరు ఆసుపత్రి వద్ద, సబ్ కలక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి విషయాన్ని బయట ప్రపంచానికి తెలియచెప్పారు. మావోయిస్టులన్న అనుమానం ఉంటే ప్రాణాలతో పట్టుకోవాలి కానీ ఇలా ఇష్టమొచ్చినట్టు చంపడం ఏమిటని ప్రశించారు.

గత 20, 30 ఏళ్లగా ఎన్కౌంటర్ వార్తలను చదివే వారికి ఈ కథనాలు కొత్త కాదు. ఎక్కడ ఏ ఎన్కౌంటర్ జరిగినా ఇదే తీరుగా పోలీసుల వైపు నుంచి వచ్చే ప్రకటనల చిట్టా చివరకు ఒక క్రైమ్ ఆడిట్ గా మారిపోయింది. దీనిలోని వాస్తవాలను బయట `ప్రపంచానికి తెలియడం చాల అరుదు. పౌరహక్కుల సంఘం వారు నిజనిర్ధారణలకు వెళ్ళి వాస్తవాలు చెప్పినప్పట్టికి వారి చెప్పేవి ప్రధాన స్రవంతి పత్రికలకు పట్టనివ్యవహారంలా అయిపోయింది. ఇక రామగూడ ఎన్కౌంటర్ తరువాతనైతే, అందులోను విప్లవోద్యమాన్ని అంతమొదించేందుకు ఆపరేషన్ సమాధాన్ ప్రారంభించాక నిజనిర్ధారణలకు వెళ్లిన హక్కుల సంఘాల వారికి పోలీసుల ర్యాలీలు, ధర్నాల దాడులతో స్వాగతం పలుకుతున్నారు. ఎన్కౌంటర్ పేరిట పోలీసులు, ప్రభుత్వాలు మావోయిస్టులను చంపుతూ, వారిపేరుతో ఆదివాసుల మీద సాగిస్తున్న హింసను, ఆకృత్యాలను బయట ప్రపంచానికి తెలీకుండా గందరగోళ పరచడానికి ఈ సరికొత్త నాటకానికీ తెరతీసారు. అయితే విప్లవోద్యమం ఇచ్చిన చైతన్యంతోటి ప్రజలుతిరగబడుతున్నారు. ప్రభుత్వాలను, పోలీసులను ప్రశ్నిస్తున్నారు. రాజ్యం ఎంతగా వారి మీద అణిచివేతను ప్రయోగిస్తే అంతే రీతిలో తిరగబడుతూ తమ అస్తిత్వాలను, పోరాట సాంప్రదాయాలను కాపాడుకుంటున్నారు.

నిజనిర్ధారణ బృందాలు వెళ్లడానికంటే ముందే తమ వారిని తమ అడువులలోనే చంపుతున్న పోలీసులను అడ్డుకుంటున్నారు. తమ వారిని ఇష్టమొచ్చినట్టు కాల్చి చంపితే ఊరుకోమంటూ నిరసనలు తెలియచేస్తున్నారు. గతంలో ఆండ్రపల్లి వద్ద జరిగిన మీనా ఎన్కౌంటర్ అప్పుడు కూడా ఆదివాసులు గొడళ్ళు, రాళ్ళతోటి పోలీసులకు అడ్డం పడి ఆమెను పట్టుకుని చంపారని ఆమె మృతదేహాన్ని తీసుకుపోనివ్వమని ఆందోళన చేశారు. 2019 ఫిబ్రవరిలో చత్తీస్ఘడ్ లో ఇలాగే ఇద్దరి మహిళలను చంపి మావోయిస్టుల డ్రెస్ వారికీ వేయబోతుంటే అక్కడి వారు పోలీసులకు అడ్డుపడి ఆందోళన చేశారు. చివరకు వారు మావోయిస్టులు కాదు ఆదివాసులేనని ప్రభుత్వం ప్రకటించాల్సి వచ్చింది.

తమ కాళ్ళ కింద ఉన్న అపార ఖనిజ సంపదను పెట్టుబడిదారులకు పంచిపెట్టడానికి ప్రభుత్వాలు ఆదివాసులను చంపివేస్తున్నాయి. ఆ నిర్బంధాన్ని, హింసను తట్టుకుని వారు ప్రభుత్వాలకు, హంతక పోలీసులకు వ్యతిరేకంగా నిలబడుతూ పోరాటం చేస్తున్నారు. మనం నాగరికులుగా, బుద్దిజీవులుగా, ప్రజాస్వామ్యవాదులుగా ఏం చేస్తున్నాం? కనీసం వారికీ మద్దతునివ్వగాలమా? వారి మీద జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ప్రభుత్వాలను నిలదీయగలమా? మన దగ్గరి నుంచి ఆ ప్రజలు కోరుకుంటుంది కూడా ఇదే.





No. of visitors : 302
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


స్మృతి చిహ్నాలు... పోరాటపు గుర్తులు

సాగ‌ర్‌ | 19.09.2016 10:53:49am

స్మృతి చిహ్నాలు మనం చూడలేని గత చరిత్రకి సంబందించిన ఆనవాళ్లుగాను , ఒక తరం నుంచి మరొక తరానికి వాటి రాజకీయ భావజాలాన్ని ప్రచారం చేసే సాధనలుగాను , వారి అమర........
...ఇంకా చదవండి

నేనూ అర్బన్ మావోయిస్టునే

సాగర్ | 22.09.2018 09:53:57pm

పూణే పోలీసులు బీజేపీ ప్రభుత్వం చేసిన ఈ అమానవీయ చర్యకు ప్రజలు ʹమీ టూ అర్బన్ నక్సల్ʹ, ʹపూణే పోలీస్ జవాబు దోʹ అంటూ తమ నిరసనను తెలిపారు......
...ఇంకా చదవండి

ప్రజల పై యుద్ధం

సాగ‌ర్‌ | 05.10.2016 12:31:57am

ప్ర‌జ‌లు,సామ‌జిక కార్య‌క‌ర్తలు నేడు దండకారణ్యంలో జరుగుతున్న పాశవిక దాడికి, హక్కుల హననాకి వ్యతిరేకంగా తమ మద్దతు తెలపాల్సిన అవసరంను ఈ పుస్తకం మనముందుంచుతుంది ...
...ఇంకా చదవండి

ఆ కాఫీ తోటలు ఎవరివి?

సాగర్ | 05.10.2017 11:05:45pm

విశాఖ మన్యంలో ఆదివాసులు 30 ఏళ్లగా మావోయిష్టు పార్టీ నాయకత్వంలో పోరాడి కాఫీ తోటలపై సంపాదించుకున్న యాజమాన్య హక్కును తిరిగి తీసుకోవడానికి ఆంద్రప్రదేశ్ ......
...ఇంకా చదవండి

బాబుకు ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది.

సాగర్ | 16.04.2019 12:13:15am

అంతులేని రాజ్యహింసకు, హక్కుల హననానికి పాల్పడిన చంద్రబాబు ప్రజాస్వామ్యం విలువలు అంటూ మాట్లాడటం కొత్తగా, వింతగా, కాసింత వినోదంగా కూడా ఉండొచ్చు......
...ఇంకా చదవండి

కిసాన్ ముక్తి మార్చ్

సాగర్ | 06.12.2018 12:02:02am

ʹఅయోధ్య ఆలయం కాదు రుణ మాఫీ కావాలిʹ నినాదాలతో దేశ రాజధాని ప్రతిధ్వనించింది. లక్షకు పైగా రైతుల మట్టి పాదాలు తాకి ఢిల్లీ పార్లమెంట్ వీధులు పులకించాయి......
...ఇంకా చదవండి

చంద్రబాబు అయిదేళ్ల పాలన - మీడియా మేనేజ్మెంట్

సాగర్ | 01.04.2019 01:47:11pm

చంద్రబాబు చేసిన దోపిడీ అంతా ఆయన మానేజ్మెంట్ నైపుణ్యంతో అభివృద్ధి అయింది. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలలో తిరిగి దీనినే ఉపయోగిస్తూ ʹనేను రాకపోతే అన్ని ఆగిపోతాయిʹ అ.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    ధిక్కార ప్రతీక గిరీష్‌ కర్నాడ్‌
    అరుణతార జూన్ 2019
    మహాభారతం - చారిత్రక వాస్తవాలు
    జల వనరుల సాధనకు స్ఫూర్తి
    వెన్నెల సెంట్రీలో మోదుగు పూల వాన‌
    నల్లని పద్యం
    పేకమేడలు
    Democratized Poetry
    ప్రశ్నించేతత్త్వం - బ్లాక్ వాయిస్
    ఇప్పుడు గుండె దిటువుతో నిలబడేవాళ్లు కావాలి
    Women Martyrs of The Indian Revolution ( Naxalbari To 2010 ) - Part 2
    ఆచ‌ర‌ణే గీటురాయి

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •