నాపేరు శూర్పణఖ

| సాహిత్యం | క‌థ‌లు

నాపేరు శూర్పణఖ

- పావని | 17.03.2019 11:23:38pm

చిన్న‌ప్పుడు నాకు బాగా ఊహ తెలియ‌ని రోజుల్లో అనుకుంటా.. మా అన్న‌య్య‌ను ఎవ‌రైనా కాస్త ముద్దు చేసి.. నీ పేరు ఏంట‌మ్మా అని అడిగితే చాలు.. నా పేరు రావ‌ణాసురుడు, నా చెల్లి పేరు శూర్ప‌ణ‌ఖ అని టక్కున స‌మాధానం చెప్పేవాడట.. ఆయ‌న నా కంటే మూడేళ్లు పెద్ద వాడు. అప్ప‌ట్లో ఆ స‌మాధానం విని.. అంతా మురిపెంగా న‌వ్వుకునే వాళ్లు.. మా అమ్మ‌మ్మ అయితే.. సంబ‌ర‌ప‌డుతూ.. మంచిది నాయ‌నా.. ఆ రావ‌ణాసురుడికి చెల్లి మీద ఉన్నంత ప్రేమ నీ చెల్లిమీద కూడా చూపించు అంటుండేది. అప్ప‌ట్లో మ‌న‌కు ఇన్ని విషయాలు గుర్తు లేవు కానీ.. ఈ సంగ‌తులు మేం పెద్ద అయితున్నా అమ్మ, వాళ్ల అక్క‌చెల్లెల్లందరూ కూర్చుని మాట్లాడుకునేప్పుడు మ‌ళ్లీ మ‌ళ్లీ రిపీట్ అయ్యేవి. ఏడాదికి ఒక సారి వేస‌వి సెల‌వుల్లో క‌లుసుకున్న‌ప్పుడు వాళ్లు మ‌న‌సారా న‌వ్వుకునే సంద‌ర్భం ఇదే..

క‌ట్ చేస్తే...

ప‌దేళ్లు ఫాస్ట్ ఫార్వ‌ర్డ్ చేస్తే.. నేను పుట్టాక ఓ రెండేళ్లకు నాకు తమ్ముడు పుట్టాడు. వాడిపేరు కుంబకర్ణుడు పెట్టాలా? లేక విభీషణుడు పెట్టాలా అని అంతా ఆలోచిస్తుండే వాళ్లు.. నాకు మాత్రం వాడు విభీషణుడే అనిపించేది. ఎందుకంటే..వాడు అచ్చం మా తాత లాగే ఉండేవాడు. పచ్చని మేని ఛాయ. దానివల్ల ఎవరైనా ఎక్కువ ఇబ్బంది పడ్డారా అంటే అది నేనే అని చెప్పాలి. వాడికి నేను నల్లగా ఉంటానని మహా
బాధగా ఉండేది.. ఏం చేసి అయినా.. తెల్లగా చేయాలనే కోరిక..

మరో వైపు ఇంట్లో అమ్మమ్మ, తాతయ్య, స్కూల్లో అప్పుడప్పుడూ వచ్చే స్వామీజీ.. రామాయణం చెప్పే వాళ్లు. మోత్తం కథలో నాకు ఎంత ఆలోచించినా.. శూర్పుణఖ తప్పేంటో అర్థమయ్యేది కాదు.. పాపం.. ఆ అన్న, తమ్ముడు ఆమె ఫీలింగ్స్ తో ఆడుకోవడమే కాక.. ముక్కు చెవులు కోయడం ఏంటని. వాళ్లకేం హక్కు ఉంది. మరి వాళ్ల అన్నకు కోపం రాదా..?

కట్ చేస్తే

ఒకనాడు టీవీలో వచ్చిన ఒక కమర్షియల్ మా తమ్ముడి కోరిక తీర్చేలా కనిపించింది. ఇంకేముంది.. వెంటనే అమలు చేసే అవకాశం కోసం ఎదురు చూశాడు. ఒక రోజు మా అమ్మ మమ్మల్ని ఇంట్లో వదిలి.. స్కూలుకెళ్లింది. వాడు...తన ప్లాన్ అంతా వివరించాడు. నాకు ఎలా స్పందించాలో తెలీలేదు. వీడికి తోడు మా పక్కింటి బుడ్డోడు.. సరే ఆట మంచి సరదాగా ఉంటుందని తమ్ముడి ప్లాన్ కి ఓకే చెప్పేశా...

మా ఇంటి వెనక పెరట్లో పెద్ద నీళ్ల తొట్టి ఉండేది.. ఇద్దరు, ముగ్గురు చిన్నపిల్లలు హాయిగా కూర్చుని ఆడుకునేంత పెద్దది. దాంట్లో ఒక ప్యాకెట్ ఏరియల్ వేసి.. నన్ను అందులో కూర్చోపెట్టారు.. వీళ్లు ఇద్దరూ బయట కూర్చుని చూస్తూ ఉన్నారు. నేను ఎప్పుడు తెల్లగా అయితానా.. అని..! ఇంతలో పక్కింటి బుడ్డోడి అమ్మ అటువైపు వచ్చింది. మా పెరళ్లు కలిసే ఉంటాయిలెండి.. వచ్చి రాగానే.. బోలెడు ఆశ్చర్యంతో ఏంచేస్తున్నారు అని అడిగింది. మేం చెప్పింది విని.. మంచోళ్లే లే.. అని గబగబా వచ్చి నన్ను తొట్లోంచి బయటకు తీసి.. మంచినీళ్లు పెట్టి బాగా కడిగి.. అందరినీ అక్కడి నుంచి తీసుకెళ్లింది.

మా ప్లాన్ పాడు చేసినందుకు మాకు బాగా కోపం వచ్చింది. అయితే మా ఇంట్లో వాషింగ్ మెషీన్ కొనే ఆలోచన చాలా యేళ్ళ వరకూ మా అమ్మ వాయిదా వేసిందనేది మాత్రం నాకు చాలా కాలం వరకూ తెలీలేదు. అలా అప్పటి నుంచి నా రంగు మా వాళ్లందరికీ పెద్ద సమస్య అయిపోయింది. కుటుంబం అంతా తెల్లని తెలుపు.. నేను మాత్రమే.. చిక్కటి రంగులో ఉంటం దాని గురించే ఎప్పుడూ చర్చ. మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు కానీ.. రాను రాను.. ఈ చర్చలు నాకు మహా చికాకు తెప్పించాయి. అమ్మ, తమ్మడు మాత్రం పట్టువదలని విక్రమార్కుల్లా నా చర్మాన్ని తెల్లగా అయ్యే ప్రయోగాలు చేస్తూనే ఉండే వారు.

కట్ చేస్తే..

కాలేజీ.. చదువులు.. ఉద్యమాలు అంటూ ముమ్మరంగా తిరిగేరోజులు.. అలాంటి రోజుల్లో ఒక రోజు కలిశా ఆ అమ్మాయిని.. అబ్బ ఎంత బాగుందో.. నవ్వుతూ.. తుళ్లుతూ... ఎంత స్వేచ్చగా ఉందో.. అదే విషయాన్ని పక్కనున్న ఫ్రెండ్ తో చెబితే.. ఏం బాగుంది.. అరవ ముఖం. లావుగా, నల్లగా అని కొట్టేశాడు. నాకు మాత్రం ఆమె చాలా ఆకర్షణీయంగా ఉంది. తర్వాత దోస్తులయ్యాం అనుకో అది వేరే విషయం. కానీ.. మొదటి సారి చూసినప్పుడు నాకు ఎలా అనిపించిందంటే.. ద్రవిడులంటే వీళ్లే కదా.. రావణాసురిని వారసులు.. అని వెంటనే శూర్పణఖ గుర్తొచ్చింది. మంచి అందగత్తె అని రాశారు రామాయణంలో.. బహుశా.. ఇలా ఉండి ఉంటుంది. చాలా స్వేచ్చగా వన విహారం చేసేదట దండకారణ్య ప్రాంతం అంతా..!

దండకారణ్యానికి దక్షిణ దిక్కున ఉన్న వాళ్లంతా ద్రవిడులు.. వాళ్లే ఈ దేశ అసలు పౌరులు. మిగతా వారంతా.. మధ్య అసియా నుంచి.. తూర్పు యూరోప్ నుంచి వచ్చిన వాళ్లే.. ఆర్యులు కూడా..! వాళ్లే తెల్లగా గోధుమ రంగులో ఉండే వాళ్లు. ఇక్కడి వాళ్లు నల్లగా చక్కగా నిగనిగలాడుతూ ఉండేవాళ్లు. గుండ్రటి ముఖాలు, పెద్ద పెద్ద విశాలమైన కళ్లు, రింగు రింగుల నల్లటి వత్తయిన జుట్టు. అలా అన్నమాట.

ఇదంతా తెలిసే కొద్దీ నాకు వంటి రంగు గురించి మరో రకం బాధ మొదలైంది. నేను మరీ అంత చిక్కటి నలుపులో లేననీ.. నా జుట్టు వత్తుగా, నల్లగా ఉన్న మాట నిజమే కానీ.. అది రింగులు రింగులుగా లేదనీ దిగులేసేది. నేను మరీ ఎటూ కాకుండా పోయానే అని.. అప్పట్లో అలెక్స్ హెలీ రూట్స్ చదివాను. తన వాళ్లను కలుసుకున్న హెలీ ఫీలింగ్స్ నాకు బాగా అర్థం అయ్యాయి.

కట్ చేస్తే..

మా అక్క పెళ్లి.. అక్క అంటే పెద్దమ్మ కూతురు లే.. ఆవిడ పెళ్లి అన్న మాట.. పెళ్లి పనులు.. హడావిడీ అంతా అయిపోయాక.. తీరికగా ఫామిలీ అంతా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. చర్చ అటు తిరిగి.. ఇటు తిరిగి.. వంటి రంగు మీదకు వచ్చింది. ఎవరి రంగు మంచిది.. ఎవరి రంగు ఫర్వాలేదు అని.. నాకు ఇలాంటి చర్చలు మహా తలనొప్పి తెచ్చిపెడతాయ్. అన్యమనస్కారంగానే వింటూ అక్కడి నుంచి లేసి వెళ్లిపొయే సాకు కోసం ఎదురు చూస్తున్నా.. కజిన్స్ పేర్లన్నీ అయిపోయాయి.. ఇంతలో ఎవరో అడిగారు.. నా గురించి.. మా పెద్దమ్మ.. పండిన జామ పండు రంగులో ఉంటుంది. ఆవిడ ముఖం ఎలానో పెట్టి అది నలుపు అని తేల్చేసింది. ఎవరో, కాదు.. చామన ఛాయ అన్నారు. కాదు నలుపే.. గట్టిగా చెప్పింది. అందరూ నావైపు తిరిగి చూశారు. నాక బలే సంబరంగా అనిపించింది. పళ్లన్నీ బయటపెట్టి గట్టిగా నవ్వి.. హమ్మయ్య అన్నా.. ఇంట్లో వాళ్లకు నేను అంత ఆనందించే కారణం ఏంటో అర్థం కాలేదు!

అదీ కథ... నాపేరు శూర్పణఖ, మా అన్న పేరు రావణాసురుడు.

No. of visitors : 284
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఆ చిరునవ్వుల్ని చిదిమేశారు

పావని | 01.04.2019 01:35:31pm

రాష్ట్రంలో హ‌క్కుల కార్య‌క‌ర్త‌ల‌ను మావోయిస్టుల పేరుతో వేధించ‌డం.. కొన్ని సార్లు ప్రాణాలు తీయ‌డం కొత్త కాద‌ని ఇక్క‌డి హ‌క్కుల కార్య‌క‌ర్త‌లు చెబుతారు......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి
  అరుణతార ఏప్రిల్ - 2019
  ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
  వరవర రావును విడుదల చేయమని కోరుతూ ప్రధాన న్యాయమూర్తికి వరవర రావు సహచరి హేమలత బహిరంగ లేఖ
  ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
  తెగిపడిన చిటికెనవేలు చెప్పిన ఏడుగురు అక్కచెల్లెళ్ళ కథ
  మేఘం
  అర్హత
  మోడీ ʹమేకిన్ ఇండియాʹలో తయారైనవి
  భూమాట
  చంద్రబాబు అయిదేళ్ల పాలన - మీడియా మేనేజ్మెంట్
  ఆ చిరునవ్వుల్ని చిదిమేశారు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •