అతడూ అర్బన్ నక్సలైటే

| సాహిత్యం | క‌విత్వం

అతడూ అర్బన్ నక్సలైటే

- నాగేశ్వర్ | 23.03.2019 06:05:50pm


ప్రపంచంలో ఎతైన శిఖరం
హిమాలయం అన్నప్పుడు
అతడు
అంతకన్నా మరింత ఉన్నతంగా కనిపిస్తాడు

త్యాగాన్ని
ఏ కొలమానంతో కొలిచినా
అతడు
కొలతకు అందనంత ఎత్తుగా కనిపిస్తాడు

మొగ్గవయసులోనే
మొక్కలకు బదులు తుపాకులు నాటి
తూటాలను
బ్రిటీషు కోటలకు గురిపెట్టినవాడు

పన్నెండేండ్ల ప్రాయంలోనే
జలియంవాలాబగ్ నేలమీద
చిందిన రక్తాన్ని తడిచిన మట్టిని
దోసిళ్ళనిండా నింపుకుని గుండెకు హత్తుకొని
కసిగా
వలసవాదుల ముఖంమీద తుపుక్కున ఉమ్మేసినవాడు

సైమన్ అడుగులకు అడ్డంగా
గోబ్యాక్ గొడ్డలి పదునైనవాడు

ఇరవైమూడేండ్ల యవ్వనంలో
వందేండ్ల అనుభవంతో
మనమస్తిస్కాలనిండా
విప్లవాల విత్తులు నాటినవాడు

జైలు గోడల నడుమ
అరవై నాలుగు దినాల దీక్షాధివస్ వెలిగించి
జైలు ఆవరణ నిండా
ఖైదీ హక్కుల పిడికిళ్ళు నాటినవాడు

మార్క్సిజం ఆకురాయిమీద
ఆలోచనలను సానబెడుతూ
నేనెందుకు నాస్తికున్నయ్యానని
మతం ముసుగు లోలోపలి
లొసుగుల్ని వివరించినవాడు

మెడలో వేలాడుతున్న ఉరితాడును
పరిహాసపు చిరునవ్వుతో విసిరికొట్టి
శత్రువుకు
భారతీయుడి అమరత్వాన్ని
కళ్ళారా చూసే అదృష్టాన్ని
ప్రసాధించినవాడు

పిడికిలినిండా
ఇంక్విలాబ్ జిందాబాద్
పిడుగులు దాచిపెట్టి మనకిచ్చివెళ్లినవాడు

పెట్టుబడి పాము పడగల్ని
దేశాలు దాటొచ్చి దోచుకుతింటున్న డేగల్ని
సామ్రాజ్యవాదం నశించాలని
చెమట చేతుల్లోని కొడవలికి పదునుపెట్టినవాడు

యువతరం నెత్తురు తరంగం
షహీద్ భగతసింగ్
సలాం లాల్ సలామ్

అతడిప్పుడు
భౌతికంగా మన కళ్లముందుంటే
అతడూ అర్బన్ నక్సలైటే
దేశ అంతర్గత భద్రతకు
అత్యంత ప్రమాధకారే





No. of visitors : 608
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


అర్హత

నాగేశ్వర్‌ | 01.04.2019 02:23:51pm

అతడు తన గొంతునూ వెంటబెట్టుకెళ్ళాడు గొంతు అతని నిరసన గళం...
...ఇంకా చదవండి

చెడగొట్టు వాన

నాగేశ్వర్ | 16.04.2019 09:25:58am

ఐదేండ్లకోసారి కురిసే వాన అప్పుడప్పుడు ముందస్తు అకాల వర్షమై కుమ్మరిస్తుంది మధ్యంతరం కుండపోత వానవుతుంది అన్నీ వడగండ్లవానలే...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి
    అరుణతార ఏప్రిల్ - 2019
    ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
    వరవర రావును విడుదల చేయమని కోరుతూ ప్రధాన న్యాయమూర్తికి వరవర రావు సహచరి హేమలత బహిరంగ లేఖ
    ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
    తెగిపడిన చిటికెనవేలు చెప్పిన ఏడుగురు అక్కచెల్లెళ్ళ కథ
    మేఘం
    అర్హత
    మోడీ ʹమేకిన్ ఇండియాʹలో తయారైనవి
    భూమాట
    చంద్రబాబు అయిదేళ్ల పాలన - మీడియా మేనేజ్మెంట్
    ఆ చిరునవ్వుల్ని చిదిమేశారు

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •