అసలెందుకు ఓటెయ్యాలి?

| సంపాద‌కీయం

అసలెందుకు ఓటెయ్యాలి?

- పి.వరలక్ష్మి | 01.04.2019 01:19:18pm

అయిదేళ్ళకోసారి దేశ ప్రజలమైన మనకు మన పాలకులను ఎన్నుకునే హక్కు ఓటు ద్వారా వస్తుంది. ఇది అయిదేళ్ళపాటు మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది గనక, ఈ హక్కును వినియోగించుకోడానికి ఓటు వేయమంటారు. నిజంగానే ఓటు ద్వారా మన భవిష్యత్తును మనం నిర్ణయించుకోగలుగుతున్నామా? మెరుగుపరచుకోగలుగుతున్నామా? మనం ఎన్నుకున్న పాలకులు మన ప్రయోజనాల కోసం పని చేస్తున్నారా? రాజ్యాంగం మీద ప్రమాణం చేసి... ఏమని చేస్తారు... రాజ్యాంగం పట్ల విధేయులై, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతూ, భయం గానీ, పక్షపాతం గానీ రాగద్వేషాలు గానీ లేకుండా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తామనేగా? ఒక్కరంటే ఒక్కరు ఇలా పని చేస్తున్నారా? అమెరికా సామ్రాజ్యవాదులకు విధేయులై, పెట్టుబడిదారీ వర్గ పక్షపాతులై, ప్రజలందరినీ పీడిస్తూ తమ, తమవారి ఆస్తులు పెంచుకోడానికి ప్రజలు ఓట్లేయాలా? ప్రజలందరికీ చెందిన ఉమ్మడి సంపదను, ప్రకృతిని, భూములను, భూగర్భసంపదను అన్నిటినీ పిడికెడు మంది దోచుకోడానికి, మనమే ఎన్నుకొని దొంగల చేతికి తాళాలివ్వడానికి ఓటెయ్యాలా? మన మీదికెక్కి స్వారీ చేయడానికి, అన్యాయం అన్నప్పుడల్లా మన వీపులు చితక్కొట్టడానికి మన పీడకులను మనమే ఎన్నుకోవాలా? అందరూ ప్రజలకు నిజాయితీగా ఓటెయ్యమని చెప్తుంటారు కదా, కనీసం నిజాయితీగా, మీ నియమాల ప్రకారమే ఎన్నికలు జరుపుతున్నారా అని ఎవరైనా అడుగుతున్నారా? ఎన్నడైనా డబ్బులు పంచినందుకు, ఎన్నికల నియమాలను ఉల్లంఘించినందుకు ఏ అభ్యర్థి మీదైనా చర్యలు తీసుకున్నారా? ఓటేసి ఎన్నుకున్నాక నువ్వు ప్రమాణం చేసిన చేసిన ప్రకారం నడుచుకోడం లేదుకాబట్టి వెంటనే దిగిపో అని అడిగే అవకాశం ప్రజలకుందా? మరి వేసిన ఓటుకు గ్యారెంటీ ఎక్కడ? ఎలాగూ ఈ దొంగలు చేసే మేలు ఏదీ ఉండదు కాబట్టి, తాత్కాలిక తాయిలాలను తీసుకొని ఊరుకుండడానికి తప్ప ఈ ఎన్నికలు దేనికి పనికొస్తున్నాయి? ఉద్యోగాలివ్వరు, నిరుద్యోగ భృతి ఇస్తామంటారు. గిట్టుబాటు ధరలు కల్పించరు, దళారీవ్యవస్థను అరికట్టి రైతుల బతుకులు నిలబెట్టరు. ఎప్పుడన్నా రుణాలు మాఫీ చేస్తామంటారు. ప్రజలకేమో అప్పులు, పెన్షెన్లు, పెట్టుబడిదారులకేమో మొత్తం దేశ సంపద.

ఇన్నేళ్ళ ప్రజాస్వామ్యం ఏమిచ్చింది అంటే పది శాతం ధనికుల చేతిలో ఎనభై శాతం సంపదను పెట్టింది. కేవలం ఒక్కశాతం చేతిలో 58 శాతం సంపదను పెట్టింది. అసమానతల్లో ప్రపంచంలోనే రెండో స్థానంలో మన అతి పెద్దదైన ప్రజాస్వామ్యం ఉంది. ఎవడు పాలకుడైనా ఈ సంపన్నవర్గాల సేవలో తరించడానికి ఈ ప్రజాస్వామ్యం ఉపకరించింది. దోపిడిని, కులహత్యలను, అత్యాచారాలను, ఆత్మహత్యలను అంతకంతకూ వృద్ధిచేసింది. ఈ ప్రజాస్వామ్యంలో భాగం అవ్వడానికి ఓటెయ్యాలా? ఇది ప్రజాస్వామ్యమేనని ఆత్మవంచన చేసుకొని ఓటెయ్యాలా? అయిదేళ్ళకోసారి ఓటు మరకను అంటించుకొని పదేపదే మోసపోతూ ఉండాలా?

పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే ప్రజాస్వామ్యం కాదని స్వయంగా అంబేద్కరే అంటాడు. ప్రతి మనిషికీ ఒకే విలువ అనే ప్రజాస్వామిక సూత్రాన్ని మన సామాజిక, ఆర్థిక వ్యవస్థలో నెలకొల్పకపోతే, భారతదేశంలో ఉన్న వైరుధ్యాలను పరిష్కరించపోతే, ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ప్రజలు ధ్వంసం చేస్తారని మొదటి రాజ్యాంగ సభలోనే అంబేద్కర్‌ హెచ్చరించాడు. మరిప్పుడు ప్రజలేం చేయాలి? అంబేద్కర్‌ వారసులుగా చెప్పుకుంటున్న వాళ్ళు జనంతో ఉండి ఉద్యమాలను నిర్మించాల్సిందిపోయి అతి జుగుప్సాకరంగా మారిన పార్లమెంటులో భాగమై దోపిడిలో భాగం పంచుకోడానికి దళితులకు ఓటులో పరిష్కారం చూపిస్తున్నారు.

1947 అధికార మార్పిడి తర్వాత ఏ వాగ్దానాలైతే రాజ్యాంగం చేసిందో 60ల నాటికే అవన్నీ వమ్ము అయిపోయాయని తేలిపోయింది గనకనే నిజమైన ప్రజాస్వామ్యం కోసం విప్లవం అవసరం అని నక్సల్బరీ చెప్పింది. ఎన్నికలను బహిష్కరించమని నక్సలైట్లు ఆనాటి నుండి చెప్తూ వస్తున్నారు గాని ఎంతమందిని ఒప్పించగలుగుతున్నారని అడుగుతూ ఉంటారు. ఏ ప్రత్యామ్నాయం కనిపించనప్పుడు, శాశ్వత పరిష్కారాలకు దారి కనిపించనప్పుడు ప్రజలు తాత్కాలిక ప్రయోజనాలవైపే పోతారు. ఎన్నికల చట్రంలో ఉన్నన్ని రోజులూ శాశ్వత దోపిడికి గురవుతూ అడపాదడపా దోపిడి వర్గాలు విదిలించే చిల్లర తీసుకునే దీన స్థితిలోనే ఉంటారు. ఇక్కడ ఒక్కవిషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రజలకు సంక్రమించిన ఏ హక్కులూ ఓటు వేయడం ద్వారా రాలేదు. ప్రజలు పోరాటం చేయడం ద్వారానే వచ్చాయి.

నిజమైన ప్రజాస్వామ్యానికి అర్థం పాలనలో, ప్రభుత్వ నిర్ణయాల్లో ప్రజల భాగస్వామ్యం ఉండటం. ప్రజలకు నష్టం కలిగించే ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించగలగడం. అయితే కనీసం పార్లమెంటులో ఏం జరుగుతోందో ప్రజలకు తెలుస్తోందా? ప్రధానమంత్రి ఒకే ఒక్కడుగా ఒక అర్ధరాత్రి నుండి ప్రజల దగ్గర ఉన్న లక్షల కోట్ల డబ్బు చెల్లదు అని ప్రకటించగల దురహంకారం ఈ ప్రజాస్వామ్యం ఇస్తున్నదంటే ఏమిటర్థం? తమ భూములను, తమ వనరులను తమ అంగీకారం లేకుండా ఎవడికో ఇచ్చేస్తూ కాదన్న ప్రజలను కాల్చిచంపుతున్నదంటే ఏమిటర్థం? బతుకులో అస్థిరత, చేస్తున్న ఉద్యోగంలో అస్థిరత, కనీస వేతనాలు, హక్కులు అడగను వీలు లేని చట్టాలు ఏ ప్రజలకోసం చేస్తున్నారు. ఓటేస్తే ఇవి మారుతాయా? లేదు. ఎక్కడికక్కడ పాలకులను నిలదీస్తేనే, ఉద్యమిస్తేనే, నిజమైన ప్రజాస్వామ్యం కోసం పోరాడితేనే పరిస్థితులు మారతాయి. మన పాలకులు ఏం చెప్తారంటే మతహత్తరమైన ఓటు హక్కును పొంది ఇక ఐదేళ్ళూ నోరుమూసుకొని ఉండమని, అదే ప్రజాస్వామ్యమని. ఓటుకు తప్ప మరిదేనికైనా వేలెత్తినా, నోరెత్తినా అసంఘిక శక్తులు, దేశద్రోహులు అయిపోతారు ప్రజలు. దీనిని ఎందుకొప్పుకోవాలి? ఈ ఎన్నికల వ్యవస్థను ఎందుకొప్పుకోవాలి?

No. of visitors : 540
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోషలిజమే ప్ర‌త్యామ్నాయం, నక్స‌ల్బ‌రీయే భారత విప్లవ పంథా

పి.వరల‌క్ష్మి | 29.04.2016 11:02:35am

20, 21వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన భిన్న ధోరణుల‌న్నీ సారాంశంలో మార్క్సిస్టు వ్యతిరేకత ముఖ్యమైన ల‌క్షణంగా కలిగి ఉంటున్నాయి. కొన్నయితే మార్క్పిజం పేరుతోనే ప్రపంచ...
...ఇంకా చదవండి

పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలు

వ‌ర‌ల‌క్ష్మి | 12.03.2017 12:32:58am

సంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ - సోషలిజమే ప్రత్యామ్నాయం (విర‌సం సాహిత్య పాఠ‌శాల కీనోట్).....
...ఇంకా చదవండి

నేనెందుకు రాస్తున్నాను?

పి.వరలక్ష్మి | 05.10.2016 01:16:41am

బూర్జువా పార్టీలు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తాయి కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం రాస్తాను. ఉదాహరణకు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని దశాద్బాలుగా ఒక.......
...ఇంకా చదవండి

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం

| 28.07.2016 08:35:37pm

అసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, ఆమె సామాజిక జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ .......
...ఇంకా చదవండి

సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹ

పి.వరలక్ష్మి | 03.09.2016 01:40:55am

మన ఊర్లలో గూటి గువ్వలు, పాల పిట్టలు, ఎర్ర జొన్నలు, సజ్జ గింజెలు ఏమైపోయాయి? రాయలసీమ ప్రకృతి మరింతగా ఎందుకు నాశనమవుతోంది? పౌష్టిక ఆహారాన్నిచ్చే తిండి .......
...ఇంకా చదవండి

ఇది మనిషి మీద యుద్ధం

పి. వరలక్ష్మి | 19.04.2016 10:59:20am

సైనిక, రాజకీయార్థిక, ప్రచార రంగాల్లో సామ్రాజ్యవాదం ఎంత దాడి చేస్తున్నదో అర్థం చేసుకోవాలంటే వాటన్నిటినీ అనుసంధానించే మంద్రస్థాయి యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి...
...ఇంకా చదవండి

ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.

పి.వరలక్ష్మి | 19.11.2019 08:06:37pm

నాగప్పకు బొత్తిగా బాలేదు. ఇరవై రోజుల క్రితం కింది నుండి తొడల భాగం దాకా విపరీతంగా బొబ్బలోస్తే పులివెందుల గవర్నమెంట్ ఆస్పర్తిలో చేర్చారట. రెండు రోజులుండి వచ్...
...ఇంకా చదవండి

మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రం పై కీనోట్

పి. వ‌ర‌ల‌క్ష్మి | 03.06.2016 10:43:06pm

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రంపై రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి. వ‌ర‌ల‌క్ష్మి కీనోట్‌...
...ఇంకా చదవండి

ఉనా స్వాతంత్ర నినాదం

పి.వరలక్ష్మి | 15.08.2016 10:44:28pm

ఆగస్టు పదిహేను ద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకుʹ అని చెరబండరాజు అన్నట్లు బూటకపు స్వాతంత్రాన్ని ఎండగడుతూ నిజమైన స్వాతంత్రం కోసం ఉనా దళిత సమ్మేళనంతో... ...
...ఇంకా చదవండి

ప్రొఫెస‌ర్‌ క‌ంచ‌ ఐల‌య్య‌కు సంఘీభావంగా భావప్రకటనా స్వేచ్ఛకై

వరలక్ష్మి | 01.06.2016 09:29:12am

ప్రభుత్వాలు భావాల పట్ల నియంత్రణలు అమలుచేయజూస్తూ, భిన్నాభిప్రాయాన్ని, నిరసనను క్రిమినలైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్య...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2020
  తెర ముందు కథ!
  షాహిన్ భాగ్..షాహిన్ భాగ్
  హిబా కోసం
  నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు
  సత్యాన్ని చెప్పడమే రాజకీయ కవితా లక్షణం
  షాహీన్ బాగ్... ఒక స్వేచ్ఛా నినాదం
  విప్లవం నేరం కాదు. విప్లవకారుడు నేరస్తుడూ కాదు.
  అరెస్టు - అన్‌టచబులిటీ
  విప్లవ కవిత్వంలో ఈ తరం ప్రతినిధి
  నిర్బంధ ప్రయోగశాల
  అరుణతార జనవరి - 2020

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •