రివార్డుల కోసం బ‌స్త‌ర్‌లో నెత్తురు పారిస్తున్న పోలీసులు

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

రివార్డుల కోసం బ‌స్త‌ర్‌లో నెత్తురు పారిస్తున్న పోలీసులు

- పౌరహక్కుల సంఘం | 01.04.2019 01:26:06pm

ఎంతమంది మావోయిస్టులు చనిపోయారు, ఎన్ని ఎన్‌కౌంట‌ర్లు జ‌రిగాయో లాంటి క్రైమ్ ఆడిట్ తమ ప్రభుత్వం చేయదలుచుకోలేదని ఛత్తీస్‌ఘ‌డ్‌ ముఖ్యమంత్రి భూపేష్ బెగల్ అధికారంలోకి రాగానే ప్రకటించాడు. మావోయిస్టులతో తమ ప్రభుత్వం చర్చలు జరపాలనుకుంటుంది అని ప్రకటించాడు. ఒక వైపు చర్చల‌ గురుంచి మాట్లాడుతూనే బస్తర్లో పోలీసు రాజ్యాన్ని నడిపించిన కల్లూరిని తిరిగి తీసుకొచ్చాడు. దీనితోనే తమ పరిపాలన తీరు ఏవిధంగా ఉండబోతుందో అక్కడ ప్రభుత్వం స్పష్టం చేసింది. గత ప్రభుత్వాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆదివాసులను ఎన్‌కౌంట‌ర్ల‌ పేరుతో హత్య చేస్తోంది. ఈ క్రమంలో జరిగిందే ఫిబ్రవరి 7న భైరాంఘర్ దగ్గర పదిమంది ఆదివాసులను పట్టుకుని కాల్చి చంపిన సంఘటన.

ఛత్తీస్‌ఘ‌డ్‌ రాష్ట్రం బీజాపూర్ జిల్లా బైరాంఘర్ బ్లాకు పోలీస్ స్టేషన్ పరిధిలో తడబల్ అటవీ ప్రాంతం ఉంది. దీనినే అబూజ్మడ్ ప్రాంతం అని కూడా అంటారు. ఇంద్రావతి నది నుండి సుమారు 15 కిమీ లోపలకు బైరాంఘర్ గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఎక్కువుగా కోయ మాట్లాడే ఆదివాసులు నివసిస్తుంటారు. నది ఆవల ఎటువంటి రహదారి లేదు. కేవలం నడక దారి మాత్రమే కరెంటు, పాఠశాలలు, వైద్య సౌకర్యాలు లేని ప్రదేశం. ఆ ప్రాంతంలో పురుషులు అరలుంగీ అడ్డగుడ్డ, చొక్కా లేదా బనియన్ ధరిస్తే, ఆడవాళ్లు మాత్రం అరలుంగి అడ్డగుడ్డ, అరలుంగి పైట జాకెట్టు ధరించారు. మనం స్నానానికి ముందు ధరించే తువ్వాలులో సగం లుంగితో అక్కడ ఆడ,మగ చుట్టుకు జీవిస్తున్నారు. వారు రేషన్ షాపుకు వెళ్లాలన్నా, వైద్యం, చదువు ఇలా ఏ చిన్న అవసరానికైనా ఈ నది దాటాల్సిందే. ప్రభుత్వం ఇచ్చిన ఆధార్ కార్డులు మాత్రం చాలా మంది దగ్గర ఉన్నాయి. ఏ వసతులు, సదుపాయాలు కల్పించని ప్రభుత్వం మనుషుల్ని అతి కిరాతకంగా కాల్చి చంపే వసతిని మాత్రం కల్పించింది. మావోయిస్టు ఉద్యమాన్ని అణిచివేసేందుకు బిజెపి ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ సమాధాన్ ఆదివాసీ దహనం తప్ప మరేమి కాదు.

ఈ సంఘటనలో చనిపోయిన ఏ ఒక్కరి వద్ద ఆయుధాలు లేవు. వారు ఎటువంటి యూనిఫామ్ ధరించి లేరు. సుమారు 200 మంది సాయుధ బలగాలు ఆదివాసీ యువతీ యువకులను చుట్టుముట్టి పట్టుకున్నారు. వారిలో కొంతమంది పారిపోయారు. పదిమంది యువతీ యువకులు బలగాల చేతిలో చిక్కుకుపోయారు. పారిపోయిన వారు పొదల చాటు నుండి మిగిలిన వారిని ఏమి చేస్తారోనని ఆందోళనగా చూస్తున్నారు. పట్టుకున్న పది మందిని వెదురు కర్రలతో ఇష్టమొచ్చినట్టు చితకబాదారు. ఇద్దరి మీద అత్యాచారం చేశారు. ఆ తరువాత వారిని అక్కడిక్కడే కాల్చి చంపారు. చనిపోయిన వారిలో 5గురు మహిళలు, 5గురు పురుషులు. విజ్జే అనే 12 సంవత్సరాల బాలిక ముక్కు చెవులు కోసేశారు. ఆమె మొల కింద భాగం ఎటువంటి దుస్తులు లేవు. చనిపోయిన వారిలో 7 మంది ఒకే గ్రామస్తులు. వీరిలో ఒక బాలిక పేరు మడావి విజ్జే, మరొక యువతి పేరు సుద్రి. మిగతావారు కడియం శంఖర్, బార్ సా సుక్కు , వయాకు రాజు, వయామి పరమేస్,బార్ సా సుక్కో, వీరిలో ఒక్కరు మాత్రం ఇద్దరి పిల్లల తండ్రి. మిగతావారంతా 18-19 సంవత్సరాల వయసు కలవారు. పై 7 మందిది బైరాంఘర్ బ్లాకు ఉదతలా గ్రామం. శాంతి అనే మరో బాలిక వయసు 15 సంవత్సరాలు. ఆ అమ్మాయిది కొలనార్ గ్రామం. మరో యువతీ చోమి, ఈమె భర్త బుద్రిది చోట్ పల్లి గ్రామం. మరో బాలిక పేరు సోడిపల్. ఈమెది తడబల్ సమీప గ్రామం.

గ్రామస్తుల కథనం మేరకు ఒకటి, రెండు రోజుల కిందట సిపిఐ మావోయిస్టు మీటింగ్ ఉందని వీరు వెళ్లారు. 7-02-2019 ఉదయం 10-10:30 కు పోలీసుల చేతిలో తమ బిడ్డలు చంపబడ్డారని అక్కడి నుండి బీజాపూర్ తరలించారని తెల్సింది. తమ వారిని తెచ్చుకోవడానికి, అసలు వారిని ఎందుకు చంపారో అడగటానికి గ్రామస్తులు బీజాపూర్ వెళ్లారు. పోలీసులు తుపాకులను ఎక్కుబెట్టి గ్రామస్తులను శవాల మధ్య నిల్చోబెట్టి మీ గ్రామస్తులను గుర్తించండి! అంటూ బెదిరించారు. కళ్ళలో నీరు కుక్కుకుంటూ మృతదేహాలను గుర్తించారు. వారి మాటల్లోదే పై రిపోర్ట్. ఏ ఒక్క మీడియా అక్కడికి రాలేదు. గ్రామ అధికారులు అంత కంటే రాలేదు. అక్కడ ఇది జరిగింది అంటే దానికి చిలువలు పలవలు కథనాలు అల్లే మీడియా మసాలా కథనాలు అన్ని పాత క్లిపింగులు, పోలీసులు చెప్పిందే పదిసార్లు అటు తిప్పి ఇటు తిప్పి వల్లెవేశారు. నేర స్థలంలో పగిలిన వంట సామగ్రి, సగం కాలిన నూనె లేదా వాటర్ క్యాన్లు కాల్చిన బూడిద తప్ప నేర స్థలంలో ఎటువంటి ఆధారాలు పోలీసులు మిగల్చలేదు. ఆదివాసులని కాల్చి చంపిన అనంతరం 4, 5 చెట్లును పేల్చి ఎదురు కాల్పుల ఘటన జరిగినట్లు చిత్రీకరించారు. ఈ సంఘటనకు ముందు అక్కడకు మావోయిస్టులు వచ్చి వెళ్ళారన్నది గ్రామస్తులు కథనం. వారి మీటింగ్ కు వచ్చిన ఆదివాసులను పట్టుకుని కాల్చి చంపి సిపిఐ మావోయిస్టులుగా కథలల్లారు. వీరిలో కొందరికి ఆధార్ కార్డులున్నాయి. వారి వయస్సు అవి దృవీకరిస్తున్నాయి. వారు చదువు లేని వారు. వారి బిడ్డల పుట్టిన తేదీ కూడా గుర్తుపెట్టుకోలేనివారు. వారి బిడ్డతో పాటు పుట్టిన బిడ్డను చూపి ఇదే వయసు అని చెప్పే ప్రయత్నం చేశారు. సాధారణంగా రజస్వల 13 సంవత్సరాలకు అవుతారు కాబట్టి అయి ఒకటి, రెండు సంవత్సరాలు అని తల్లులు చెప్పుకొచ్చారు. భావి భారత భవిష్యత్తుకు వీరు ఆటంకవాదులు, తీవ్రవాదులు, మావోయిస్టులంటూ రాజ్యం ముద్రవేస్తుంది. 70 ఏండ్ల స్వాతంత్య్రంలో కూడు, గుడ్డ, నీరు, వైద్యం, చదువు లాంటి మౌళిక సదుపాయాలను వీరికి అందించలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుకు అదునాతన ఆయుధాలతో వారి గ్రామాలకెళ్లి వారిని చంపే హక్కు ఎవరిచ్చారు. ఈ ప్రభుత్వాలు వాళ్ళకేమిచ్చాయి కనీసం గుక్కెడు మంచి నీళ్లు కూడా ఇవ్వలేదు. నిజంగా వాళ్ళు సిపిఐ మావోయిస్టు మీటింగుకు వెళ్లినా వాళ్ళ రాజకీయాలకు ఆకర్షితులైన అందుకు కారణం ఎవరు? ఈ ప్రభుత్వాలు కాదా? ఎటువంటి నేరచరిత లేని యువతీ యువకలును ప్రైజ్ మనీ కోసం, మైనింగ్ కంపెనీలకు భూమలను అప్పచెప్పడానికి కేంధ్రరాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ సమాధాన్ నరమేధాన్ని కొనసాగిస్తున్నాయి.

No. of visitors : 561
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


కూలీల‌ను కాల్చిచంపి.. మావోయిస్టుల ముద్ర‌వేశారు

గుముడుమహా ఎన్‌కౌంటర్‌ పై clc నిజ నిర్దారణ | 20.07.2016 06:43:38pm

కూలీలు ఆటోను ఎక్కబోతుండగా రోడ్డుకు ఎడమ ప్రక్క చెట్ల పొదల్లో మాటు వేసి కూర్చున్న పోలీసు బలగాలు ఒక్కసారిగా వారి మీదకు కాల్పులు జరిపారు. 5 మంది కూలీలు.......
...ఇంకా చదవండి

పొలం ప‌ని చేసుకుంటున్నోళ్ల‌ను కాల్చిచంపారు

పావురిగూడెం ఎన్‌కౌంటర్‌పై నిజనిర్ధారణ నివేదిక | 15.08.2016 10:53:46pm

పొలం పనులు ముగించుకుని పక్కనే పారుతున్న వాగులోకి స్నానానికి బయలుదేరి పోతున్న న‌లుగురు యువ‌కులను ఉన్న‌ప‌ళంగా చుట్టుముట్టిన పోలీసులు వారిని నిర్థాక్షిణ్యంగా.....
...ఇంకా చదవండి

నిషేదాలు, నిర్భందానికి వ్య‌తిరేకంగా ఢిల్లీలో స‌ద‌స్సు

| 09.09.2016 09:38:48am

రాజ‌కీయ, సామాజిక‌, సాంస్కృతిక నిషేదాల‌కు వ్య‌తిరేకంగా; హ‌క్కులు, స్వేచ్ఛా న్యాయాలు క‌లిగిన ప్ర‌జాస్వామ్య పున‌రుద్ధ‌ర‌ణ‌కై ఢిల్లీలో ధ‌ర్నా, స‌ద‌స్సు.........
...ఇంకా చదవండి

చంద్ర‌బాబుకు బహిరంగ‌లేఖ‌

పౌర హ‌క్కుల సంఘం | 02.11.2016 09:45:50am

అసలు ప్రభుత్వం టార్గెట్ ఎంత? ఇందులో మావోయిస్టులతో పాటు ఎంతమంది సాధారణ ఆదివాసీలను చంపాలనుకుంటున్నారు. న‌క్స‌లైట్ ఉద్య‌మం కారణంగా మన రాష్ట్రంలోకి .......
...ఇంకా చదవండి

పౌర ప్రజాస్వామిక హక్కుల అమలుకై రాజకీయనాయకులను నిలదీయండి

పౌరహక్కుల సంఘం | 06.12.2018 12:20:39am

ఈ విధమైన భయానక వాతావరణంలో, పోలీసుల డేగకన్నుల పహారాలో మహిళలు పోలింగు బూతులవరకు నడవడం ఎట్లా? క్యూలో గంటల తరబడి ఎందుకు నిలబడాలి? ఈ యుద్ద వాతావరణాన్ని తలపించే.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఏప్రిల్ - జూన్ 2020
  తారకంగారంటే..
  సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?
  అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ
  హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష
  అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం
  దేశీయుడి కళ
  మీరొస్తారని
  బందీ
  ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి
  మనిషిని బంధించినంత మాత్రాన....
  జి.యన్. సాయిబాబా, వరవరరావుల విడుదలను కోరుతూ ప్ర‌పంచ‌ మేధావుల విజ్ఞప్తి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •