ఆ చిరునవ్వుల్ని చిదిమేశారు

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

ఆ చిరునవ్వుల్ని చిదిమేశారు

- పావని | 01.04.2019 01:35:31pm

మార్చి 9, 2019.. మ‌లప్పురం జిల్లా పండిక్కాడు గ్రామంలోని హ‌లీమా, హంసాల చిన్నఇల్లు జ‌లీల్ స్నేహితులు, స‌హ‌చ‌రుల‌తో కిక్కిరిసి పోయింది. త‌మ ప్రియమిత్రుడికి క‌డ‌సారి వీడ్కోలు తెలిపేందుకు వారంతా అక్క‌డకి వ‌చ్చారు. ఎన్నిక‌ల ముందు కేర‌ళ క‌మ్యునిష్టు ప్ర‌భుత్వం ఆప‌రేష‌న్ అన‌కొండ రూపమెత్తి సీపీ జ‌లీల్ ను హ‌త్య‌చేసింది. రాష్ట్రానికి చెందిన యాంటీ మావోయిస్టు ద‌ళం థండ‌ర్ బోల్ట్ టాస్క్ ఫోర్స్ ఎప్ప‌టిలాగానే జ‌లీల్ మ‌ర‌ణానికి అంద‌మైన ఎన్కౌంట‌ర్ క‌థ అల్లింది.

ఉమ్మ‌డి క‌మ్యునిష్టు నేప‌ధ్యంలోంచి వ‌చ్చిన హంసా కుటుంబంలో అంతా ఉద్య‌మ‌కారులే. వివిధ క‌మ్యునిస్టు పార్టీల్లో వారంతా ప‌నిచేస్తున్నారు. జ‌లీల్ పౌర‌హ‌క్కుల ఉద్య‌మంలో ప‌నిచేస్తున్నాడు. కేర‌ళ రాష్ట్రంలో ప‌నిచేస్తున్న జన‌కీయ మ‌నుష్య‌వ‌క‌ష ప్ర‌స్థానంలో కార్య‌వ‌ర్గ స‌భ్యుడు. జ‌లీల్ తోబుట్టువులంతా ఉద్య‌మ‌కారులే. జ‌లీల్ సోద‌రుడు మొయుద్దీన్ త‌ల‌కు కేర‌ళ పోలీసులు వెల‌క‌ట్టారు. ఇత‌ను వాయ‌నాడ్ ప్రాంతానికి చెందిన క‌బ‌ని ద‌ళ స‌భ్యుడ‌నే ముద్ర వేసి... త‌ర‌చు వీరి కుటుంబాన్ని వేధించ‌డం ప‌రిపాటి. మ‌రో సోద‌రుడు ర‌షీద్ మాన‌వ హ‌క్కుల కార్య‌క‌ర్త‌. ఇంకో సోద‌రుడు.. ఇస్మాయిల్ ప్ర‌స్త‌తం మ‌హ‌రాష్ట్ర‌లోని య‌ర‌వాడ జైల్లో ఉన్నాడు. మూడేళ్ల క్రితం మ‌రాఠా పోలీసులు అత‌డిని మావోయిస్టు నేత ముర‌ళితో పాటు అరెస్టు చేశారు. వీరిలో అంద‌రికంటూ చిన్న‌వాడు జిష‌ద్. ఇత‌ను కూడా మాన‌వ హ‌క్కుల సంఘంలో పనిచేస్తున్నాడు. అత్యాచారాల‌కు, హ‌త్య‌ల‌కు వ్య‌తిరేకంగా పోరాడే ఇత‌నిని కూడా పోలీసులు రాడిక‌ల్ రాజ‌కీయాల్లో పాల్గొంటున్నావంటూ ప‌లుమార్లు అరెస్టు చేశారు.

త‌న‌ తండ్రి మరణం తర్వాత, జ‌లీల్ కుటుంబ భారాన్ని భుజానికెత్తుకున్నాడ‌ని అత‌ని స‌హ‌చ‌రులు గుర్తుచేసుకున్నారు. అన్న‌ద‌మ్ములంతా పూర్తి స్ధాయి కార్య‌క‌ర్త‌లు కావ‌డంతో.. జ‌లీల్ రోజు కూలీగా మారాడు. త‌న రెక్క‌ల క‌ష్టంతో కుటుంబానికి ఆర్థిక చేయూతయ్యాడు. మెరుగైన ఉపాధి దొరుకుతుందే ఉద్దేశంతో రెండేళ్ల క్రితం బెంగ‌ళూరుకు వ‌ల‌స వెళ్లాడ‌ని.. ఇంత‌లో ఇలాంటి వార్త వినాల్సి వ‌స్తుంద‌ని అనుకోలేద‌ని జ‌లీల్ త‌ల్లి అంటారు.

మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నాయ‌నే నెపంతో త‌మ కుటుంబాన్ని పోలీసులు నిత్యం వేధింపుల‌కు గురిచేస్తునే ఉండేవారు. జ‌లీల్ ఎక్క‌డికి వెళ్లినా పోలీసులు వెంబ‌డించే వార‌నీ.. చివ‌ర‌కు సినిమాకు, మార్కెట్ కు వెళ్లినా అనుస‌రించే వాళ్ల‌ని స్నేహితులు చెబుతారు. త‌ర‌చూ మొయుద్దీన్ గురించి ప్ర‌శ్నించే వార‌నీ, కానీ మార్చి 7న త‌మ స్నేహితుడి ప్రాణాలు తీశార‌నీ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జ‌లీల్ కుటుంబానికి పోలీసు వేధింపులు కొత్త కాదు. త‌ర‌చూ పోలీసులు ఇంట్లో జొరబ‌డి సెర్చింగ్ పేరుతో ఇబ్బందుల‌కు గురిచేసే వార‌ని ర‌షీద్ చెప్పాడు. ఒకసారి రంజాన్ నెల‌లో పోలీసులు ఇంట్లోని ఖురాన్ తో సహా పుస్త‌కాల‌న్నీ బ‌య‌టికి విసిరేసి వెళ్లార‌ని గుర్తుచేసుకున్నాడు.

అయితే రాష్ట్రంలో హ‌క్కుల కార్య‌క‌ర్త‌ల‌ను మావోయిస్టుల పేరుతో వేధించ‌డం.. కొన్ని సార్లు ప్రాణాలు తీయ‌డం కొత్త కాద‌ని ఇక్క‌డి హ‌క్కుల కార్య‌క‌ర్త‌లు చెబుతారు. గ‌త ఎల్డీఎఫ్ ప్ర‌భుత్వంలో అనేక మంది రాజ‌కీయ కార్య‌ర్త‌లు, హ‌క్కుల, విద్యార్ధి నాయ‌కులను అరెస్టు చేశారు. అనేక మందిని చంపేశారు. అయితే పిన‌ర‌యి విజ‌య్ మ‌రో అడుగు ముందుకేసి.. ఏకంగా ఉద్య‌మ‌కారుల‌పై ఉక్కు పాదం మొపాడు. ప్ర‌జాఉద్య‌మాల‌పై ఆప‌రేష‌న్ అన‌కొండను ప్ర‌క‌టించాడు.

ఏమిటీ ఆప‌రేష‌న్ అనకొండ‌..

పిన‌ర‌యి విజ‌య‌న్ ముఖ్య‌మంత్రి అయ్యాక త‌న రాష్ట్రానికి డీజీపీగా లోక్ నాథ్ బెహ్రాను ఏరికోరి తెచ్చుకున్నారు. పాల‌కుల ఆదేశాల‌ను తూచా త‌ప్ప‌కుండా పాటించ‌డంలో ఎలాంటి వెన‌క‌డుగు వేయ‌డ‌నే పేరున్న ఈ పోలీస్ బాస్ రికార్డులో ఇష్ర‌త్ జ‌హా ఎన్కౌంట‌ర్ వంటి కేసులు ఉన్నాయి. ఈయ‌న నేత్రుత్వంలోనే 2017లో కామ్రెడ్ అజిత, దేవ‌రాజ్ ల హ‌త్య జ‌రిగింది. అప్ప‌ట్లో ఆప‌రేష‌న్ అన‌కొండ లాంటిదేమీ లేద‌ని బుకాయించిన ఈ పెద్ద మ‌నుషులు తాజాగా జ‌లీల్ హ‌త్య ఆప‌రేష‌న్ అన‌కొండ‌లో భాగ‌మేనని నిస్సిగ్గుగా ప్ర‌క‌టించారు.

దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న గ‌ళాల‌పై కొనసాగుతున్న అణ‌చివేత‌నే కేర‌ళ వామ‌ప‌క్ష ప్ర‌భుత్వం కొన‌సాగిస్తున్నది. ఆపరేష‌న్ అన‌కొండ ద్వారా ప్ర‌జాస్వామిక వాదుల‌కు ఒక హెచ్చ‌రిక‌ను పంపేదుకే జ‌లీల్ బూట‌క‌పు ఎన్కౌంట‌ర్ ను ఎంచుకున్న‌ట్లు అక్క‌డి ఉద్య‌మ‌కారులు చెబుతారు. ఈ ఆప‌రేష‌న్ ద్వారా ఇప్ప‌టికే ఎలాంటి ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఉద్య‌మాల‌ను ఉపేక్షించ బోమ‌ని స్ప‌ష్ట‌టం చేస్తోన్న‌ది. ప్రజా స్వామిక ఉద్య‌మాల్లో చురుగ్గా ఉన్న‌వాళ్ల‌ను అరెస్టు చేయ‌డం. ప్రజా ఉద్య‌మ‌కారుల‌ను.. వారి కుటుంబ స‌భ్యుల‌ను వేధింపుల‌కు గురిచేయ‌డం. అప్ప‌టికీ లొంగ‌క పోతే.. హ‌త్య చేసి ఎన్ కౌంట‌ర్ క‌థ‌ల‌ల్ల‌డం ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌రుగుతూ వ‌చ్చింది. అయితే జ‌లీల్ హత్య త‌ర్వాత ఈ ద‌మ‌న కాండ మ‌రొక అడుగు ముందుకు వేసిన‌ట్లు అనుకోవ‌చ్చు. కేవ‌లం వేధింపులు, కేసులు, జైలు నిర్భంధాలే కాకుండా.. ఉద్య‌మ‌కారుల కుటుంబాల‌కు సైతం ర‌క్ష‌ణ ఉండ‌ద‌నే హెచ్చ‌రిక‌ను పంప‌డం కోస‌మే ఈ బూట‌కపు ఎన్ కౌంట‌ర్ చేశార‌ని అనుకోవ‌చ్చు. అందువ‌ల్లే ఇప్ప‌టి వ‌ర‌కూ అన‌కొండ అంటూ ఎలాంటి మిష‌న్ లేద‌ని బొంకుతూ వ‌చ్చిన పోలీలు.. ఈ హ‌త్య‌త‌ర్వాత నిస్సిగ్గుగా ఇది ఆప‌రేష‌న్ అన‌కొండ‌లో భాగ‌మే అని ప్ర‌క‌టించుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ మ‌ధ్య‌భార‌తం, తెలుగు రాష్ట్రాలకే ప‌రిమిత‌మైన హ‌త్యారాజ‌కీయాలు మిగతా ద‌క్షిణ భార‌త‌దేశానికీ విస్త‌రిస్తున్నాయి. వామ‌ప‌క్ష ముసుగు వేసుకున్న ప్ర‌భుత్వాలు సైతం ఉద్య‌మాల‌ను, ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను హ‌త్య‌ల ద్వారా అడ్డుకోవ‌డానికి చూస్తొంది. వామ‌ప‌క్ష ముసుగును తీసి.. రాజ్య దుర్మార్గ స్వభావాన్ని ఎండ‌గ‌ట్టాల్సిన అవ‌స‌రం మంద‌రిపైనా ఉంది. లేక‌పోతే.. ఈ హింస‌.. మ‌న కుటుంబాల దాకా వ‌స్తుంద‌నేది విస్ప‌ష్ట‌మే.

No. of visitors : 756
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నాపేరు శూర్పణఖ

పావని | 17.03.2019 11:23:38pm

నాకు వంటి రంగు గురించి మరో రకం బాధ మొదలైంది. నేను మరీ అంత చిక్కటి నలుపులో లేననీ.. నా జుట్టు వత్తుగా, నల్లగా ఉన్న మాట నిజమే కానీ.. అది రింగులు రింగులుగా లే.....
...ఇంకా చదవండి

రాజ్యానికెదురు రాజీలేని పోరు

పి. పావ‌ని | 17.05.2019 12:18:50pm

మావోయిస్టు విముక్తి ప్రాంతంగా పేర్కొనే అబుజ్ మడ్ నుంచి (బుద్ధర్ డివిజన్ నారాయణ్పూర్, బీజాపూర్ జిల్లాల) వేలాది ఆదివాసీలు ఇంద్రావ‌తి వైపు సాగిపోయారు. దారిలో వ...
...ఇంకా చదవండి

హిందుత్వ శక్తులు చేస్తున్న బలవంతపు మత మార్పిడులకు బలైన ఒక ఆదివాసీ యువకుడి కథ

నవల్ కిషోర్ కుమార్ | 19.11.2019 02:50:44pm

జాతీయ‌త పేరుతో, ఎవ‌రైనా (బ్రాహ్మనీయ శక్తులు) నా సంస్కృతిని చంపేందుకు చూస్తే, పంతి, సువా, క‌ర్మ‌, నా ప్ర‌జ‌ల‌పై మావి కానీ (ఛతీస్ఘడ్ కు సంబంధం లేని) నాట్యం.....
...ఇంకా చదవండి

అతడి ఆలోచనలు అక్షరాలకే పరిమితం కాలేదు

అరుంధతి ఘోష్ | 16.06.2019 10:44:24am

చాలా మంది మేధావుల లాగా.. గిరీష్ క‌ర్నాడ్ వాద‌న‌లు, చ‌ర్చ‌లు, టెలివిజ‌న్ పానెల్ లు, సెమినార్ల‌కు ప‌రిమితం కాలేదు. ఆయ‌న త‌ను న‌మ్మిన విలువ‌ల కోసం వీధుల్లోకి.....
...ఇంకా చదవండి

ఢిల్లీ నుండి ప్రేమతో

పావ‌ని | 18.12.2019 12:56:37am

ఎలా ఉన్నారు? జైల్లో ఉన్న వాళ్ల‌ను ఇలాంటి ప్ర‌శ్న వేయ‌టం బాలేదు కానీ... ఉత్త‌రం ఎలా మొద‌లు పెట్టాలో తెలీదు. మీ ఆరోగ్యం ఎలా ఉందో అని చిన్న బెంగ‌. అంత‌కంటే......
...ఇంకా చదవండి

వాళ్లంటే అంత భ‌యం ఎందుకు?

పావ‌ని | 28.08.2019 07:09:33pm

మ‌త‌మో.. దేశ‌మో ఏదో ఒక మూఢ‌భ‌క్తిలో ఉన్న జ‌నాన్ని నిద్ర‌లేపుతారేమో అని భ‌యం. అలాంటి ప్ర‌మాదం వీళ్ల వ‌ల్ల పొంచి ఉంది. అందుక‌ని.. వీళ్ల‌ను భ‌ద్రంగా జైలు గోడ‌ల...
...ఇంకా చదవండి

ఆట‌లూ - దేశ‌భ‌క్తి ప్ర‌ద‌ర్శ‌న‌

పి.పావని | 16.07.2019 07:19:53pm

దేశ‌భ‌క్తి ప్ర‌ద‌ర్శిచ‌డంలో... మహేంద్ర సింగ్ ధోనీ, మేగ‌న్ రెపీనోల మ‌ధ్య ఎంత తేడా ఉందో ఆలోచిస్తే.. ఆశ్చర్యం క‌లుగుతుంది. ప్ర‌జాస్వామ్య విలువ‌ల ప‌ట్ల స‌మాజ.....
...ఇంకా చదవండి

నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు

| 18.12.2019 10:18:58pm

మ‌తం జాతీయ‌త‌ను, పౌర‌స‌త్వాన్ని నిర్ణ‌యించ‌డం ఆమోదించ త‌గిన చ‌ర్య కాదు. శ‌ర‌ణార్తుల‌ను మ‌త‌ప్రాతిప‌దిక‌న విభ‌జించ‌టం స‌రైన‌ది కాదు. ఇది భార‌తీయులు అటే ఎవ‌.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  సాహ‌సోపేత జీవితం
  నలబై వసంతాల దండకారణ్యం
  అరుణతార ఏప్రిల్ - జూన్ 2020
  తారకంగారంటే..
  సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?
  అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ
  హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష
  అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం
  దేశీయుడి కళ
  మీరొస్తారని
  బందీ
  ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •