చంద్రబాబు అయిదేళ్ల పాలన - మీడియా మేనేజ్మెంట్

| సాహిత్యం | వ్యాసాలు

చంద్రబాబు అయిదేళ్ల పాలన - మీడియా మేనేజ్మెంట్

- సాగర్ | 01.04.2019 01:47:11pm

మళ్ళీ ఎన్నికలొచ్చాయి. అధికార ప్రతిపక్షాల సభలతో, రోడ్డుషోలతో విరామం లేకుండా ప్రజల చెవులకు చిల్లులు పెడుతున్నాయి. విమర్శ ప్రతివిమర్శలతో హోరెత్తిస్తున్నాయి. అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో చెప్పడం కన్నా అందరూ ప్రత్యర్థులపై తిట్లు, దూషణలతో రక్తి కట్టిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అందులోను ఆంధ్రాలో ఇది ఒక ఆకు ఎక్కువే ఉంది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయిడు 9 ఏళ్ల తరువాత 2014 లో బిజెపి, పవన్ కళ్యాణ్ లతో కలసి అధికారంలోకి వచ్చాడు. 2014 కు ముందున్న పరిస్థితుల్లో రైతులకు రుణమాఫీ, కొత్త రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు ఎజెండాలుగా ఎన్నికలకు వెళ్ళాడు. ఆ ఎన్నికల్లలో తన మానేజ్మెంట్ నైపుణ్యంతో విపరీతమైన ప్రాపగాండాతో గట్టెక్కాడు. వీటికి తోడు అప్పటికి కాంగ్రెస్ మీద ఉన్న అసంతృప్తి చంద్రబాబుకు కలిసొచ్చింది.

అయితే ఒక పరిపాలన కాలాన్ని ఎలా అంచనా వేయాలి? దీనికి గీటురాయి ఏమిటి?. మౌలిక రంగాలలో, ప్రజల జీవన స్థితిగతులలో వచ్చిన మార్పులను అంచనా కట్టి పరిపాలన ఏవిధంగా సాగిందో చూస్తాము. మరి ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ప్రజల జీవన విధానంలో ఏ అభివృద్ధి జరిగిందో ఎటువంటి మార్పులు చోటుచేసుకున్నాయో ఆలోచించాలి. వీటికి సమాధానాలు వెదికితే దొరికేది 2019 ఎన్నికలలో గెలవడానికి ఎంత సంపాదించాలి? ఎన్ని రకాలుగా దోచుకోవాలి అనేవి కనపడతాయి తప్ప ప్రజల జీవన పరిస్థితులలో ఎటువంటి మార్పు రాలేదు. అయితే ప్రజల అసంతృప్తిని తన అనుకూల మీడియాతో బయటి సమాజానికి తెలియకుండా చేశాడు చంద్రబాబు. అసలు ఈ అయిదేళ్ల పరిపాలన కాలంలో ఏమి చేశాడు అన్నది చూస్తే...

చంద్రబాబు అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం రుణమాఫీ, రాజధాని నిర్మాణం. వీటితో పాటు ఎన్నికలకు ముందు రైతులకు, డ్వాక్రా గ్రూపులకు ఉన్న మొత్తం రుణాలను (88,000 కోట్లు) మాఫీ చేస్తానని ప్రకటించాడు. తీరా గెలిచాక 1,50,000 వరకు మాత్రమే చేస్తానని ప్రకటించాడు. వాటి విలువ 24,000 కోట్లు మాత్రమే. ఇది కూడా అందని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. అందినవారికి కూడా 4,5 విడతల రుణమాఫీ ఇంకా కాలేదు. ఇది దాదాపు 8,000 కోట్ల దాక ఉంటుంది. 2014 ఎలెక్షన్ మానిఫెస్టోలో రుణమాఫీ ద్వారా వ్యవసాయరంగ సంక్షోభం సమిసిపోదని చెప్తూ ధరల స్థిరీకరణకు 5 వేల కోట్ల స్థిరికరణ నిధిని ఏర్పాటు చేస్తాను అన్నాడు. వీటితోపాటు స్వామినాధన్ సిఫార్సులను అమలు చేస్తాను అని ప్రకటించాడు. కానీ చివరకు ఇవి ఏవీ అమలులోకి మాత్రం రాలేదు. రైతు ఆత్మహత్యలలో అనంతపురం జిల్లా దేశంలో రెండవ స్థానంలో ఉంది. మళ్ళీ 5 ఏళ్ళు గడిచేసరికి రైతుల రుణాలు లక్షకోట్ల దాక చేరుకున్నాయి.

ఇక మొదటి నుంచి కూడా చంద్రబాబు ఊదరకొట్టింది రాజధాని నిర్మాణం గురించి. రాజధాని నిర్మాణం కొరకు శివరామకృష్ణ కమిటిని వేశారు. దాని సిఫార్సుల ఆధారంగా రాజధాని ప్రాంతం ఎంపిక ఉంటుందని చెప్పారు. కానీ ఆయనకు నచ్చినట్టు ఆ కమిటీతో సంబంధం లేకుండా 3 పంటలు పండే అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేశారు. చంద్రబాబు, తన కోటరీ అక్కడ పెద్ద మొత్తంలో భూములను ముందే కొని పెట్టుకుని వాటికి ఎక్కువ ధర పలికేలా చేశారు. మొత్తం రాజధాని నిర్మాణానికి 33,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించారు. భూములు ఇవ్వము అన్న రైతులను బెదిరించారు. బెదిరింపులకు లొంగని వారి పంటలను కాలబెట్టారు. పోలీస్ స్టేషన్ల చుట్టు తిప్పారు. రైతులకు సంఘీభావం తెల్పడానికి వెళ్లిన వారిని మావోయిస్టులు అనే ముద్రవేశారు. రాజధాని ప్రాంతంగా ప్రకటించిన చోట మొత్తం పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. బయట నుంచి ఎవరెళ్లినా స్టేషనుకు తరలించేవారు. ఇక తన అనుకూల మీడియా సాధనలలో అయితే రాజధాని ప్రాంతం రైతులు ఏంతో ఆనందంగా ఉన్నారని, ఎప్పుడు విమానం చూడని వారిని విమానం ఎక్కేలా చేశాడని, కార్లు కొన్నుకున్నారని ప్రచారం చేశారు. కానీ మాకు విమానం, కార్లు ఎందుకు పండించడానికి నేల కావాలి , రాజధాని వేరే ప్రాంతంలో కట్టుకోండి లేదా మమల్ని వదిలేయండి అంటే, మీరు అభివృద్ధికి అడ్డుపడుతున్నారనో, ప్రతిపక్షం వారు అనో ప్రచారం చేయించాడు. ఇంతా చేసి ఇప్పటిదాకా కూడా అక్కడ ఒక్క శాశ్వత భవన నిర్మాణం జరగలేదు. ఎందుకంటే ఏ దేశ పర్యటనకు వెళితే ఆ దేశ రాజధాని మించేలా కడతాను అనడం ఆయనకు అలవాటైంది. దానికి భజన మీడియా ఆహా..ఓహో లతో ముంచెత్తడం ప్రజలను మభ్యపెట్టడం చేస్తూ వచ్చారు. ఆయన పైత్యం చివరకు ఎక్కడ దాక పోయిందంటే రాజధాని నిర్మణానికి సినిమా డైరక్టెరును నియమించేదాకా పోయింది.

ఇక రాజధాని తరువాత చంద్రబాబు విపరీతంగా ప్రచారం చేసింది పోలవరం ప్రాజెక్ట్ గురించి. ఈ ఒక్క ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలను మార్చివేయొచ్చు అనే దానిని ప్రజలలోకి తీసుకెళ్లడంలో చంద్రబాబు అయన జేబు మీడియా నూటికి రెండువందల శాతం సఫలీకృతం అయ్యాయి. అసలు ఈ ఒక్క ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్లో కరువు కనపడదు, ఎప్పుడూ నీళ్లుంటాయి, రైతులందరూ రెండు పంటలు పండించొచ్చు అనేంతలా ప్రచారం చేశారు. కానీ ఈ ప్రాజెక్టు కడితే 7మండలాలు ముంపుకు గురి అవుతాయని లక్షలాది మంది ఆదివాసులు నిర్వాసితులవుతారనే విషయాన్ని బయటికి చెప్పరు. ఈ విషయంలో క్రెడిట్ కోసం అధికార ప్రతిపక్షాలు ఒకదాని మీద ఒకటి పోటీపడ్డాయి. చివరకు పోలవరం గొప్పతనం చూపించడానికి ʹప్రజలను పోలవరం విహారయాత్రʹ పేరుతో 400 కోట్లు ఖర్చుపెట్టారు. అలా పూర్తికాని నిర్మాణాన్ని పూర్తి చేసేశామని, పోలవరం పేరుతో జరుగుతున్న అవినీతీని కప్పి పుచ్చుకోడానికి ప్రజలను భ్రమల్లో ముంచెత్తడానికి చేసిన విపరీతమైన ఆర్ధిక దుబారా మాత్రమే మిగిలింది.

ఇక పోలవరం తరువాత అంతలా ప్రచారం చేసింది పట్టిసీమ గురుంచి. గోదావరి, కృష్ణ జలాలను కలపడం ద్వారా రాయలసీమ రైతులకు ఒక పంటకే కాదు రెండు పంటలకు నీళ్లిస్తామని ఢంకాలు పలికారు. అప్పటికే పోలవరం కోసం తవ్విన కుడి కాల్వను పట్టిసీమకు వాడి బయటికి రికార్డు టైంలో చేసామని చెప్పుకున్నారు. అసలు విషయంలోకి పోతే అనంతపురానికి ఒక ఎకరా తడవడానికి కూడా ఒక్క చుక్క నీరు అందలేదు. కానీ తన భజన బృందంతో అనంతపురంలో పట్టిసీమ నీటితో రెండు పంటలు పండుతున్నాయని ప్రచారం చేశారు. కానీ వాస్తవానికి అనంతపురం రైతులు నీరందక పంటలు లేక రైతు ఆత్మహత్యలలో దేశంలో రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడితో ఆగక రైన్ గన్స్, ఇంకుడు గుంతల పేరుతో ఇంకో 100 కోట్లకు పైగా డబ్బులను వృధా చేశారు. కానీ రాయలసీమ రైతులు న్యాయంగా అడుగుతున్నా సిద్దేశ్వరం అలుగు, గాలేరు -నగరి, హంద్రీ -నీవా, వెలగొండ తదితర ప్రాజెక్టులను పూర్తి చేయలేదు. పైగా వాటి కోసం పోరాడుతున్నా ప్రజలను ప్రభుత్వం అరెస్టు చేసింది. దాదాపు ఒక్క ఇరిగేషన్ రంగంలోనే 50,000 కోట్లకు పైగా అవినీతి జరిగిందని విమర్శిస్తే, అలాంటివాటి మీద శ్వేత పత్రం విడుదల చేయకపోగా మీరు లక్షకోట్లు తిన్నారంటూ ఎదురుదాడి చేసారు.

విద్యా వ్యవస్థను చంద్రబాబు నాయుడు పూర్తి ప్రవైటీకరణ వైపుగా తీసుకెళ్లాడు. రాష్ట్రంలో అతిపెద్ద ప్రైవైట్ విద్యా సంస్థలైన నారాయణ, చైతన్యలకు ప్రయోజనం కలిగించేలా నిర్ణయాలు చేసాడు. తన మంత్రివర్గ సహచరుడు, పార్టీకి ఆర్ధికంగా ఉపయోగపడిన నారాయణకు సంబందించిన కళాశాలలో వందల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నపల్లెత్తు మాటనలేదు. ప్రతి ఏటా స్కూల్స్ తెరవడానికి ముందే డిఎస్సి పోస్టులు భర్తీ చేస్తానని చెప్తూ, చివరికి 35 వేల పోస్టులకు గాను 8 వేల పోస్టులను మాత్రమే భర్తీ చేశారు. ఎన్నికల మానిఫెస్టోలో ఇంటికొక ఉద్యోగాన్ని ʹఉద్యోగమిత్రʹ పేరుతో కల్పిస్తానని వాగ్దానం చేశారు. ప్రతి ఏటా 3 లక్షలకు పైగా యువత ఉద్యోగాల వేటలో పరిగెడుతున్నారు. వీరిలో 20 నుంచి 25 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు దొరుకుతున్నాయి. వీరు ఎప్పుడు నోటిఫికేషన్ విడుదలవుతుందా అంటూ ఎదురు చూస్తున్నారు. 2 లక్షలకు పైగా ఉద్యాగాలు ఖాళీలు ఉంటె 15 వేల ఉద్యాగాలకు నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 లక్షలకు పైగా నిరుద్యోగులున్నారు. ప్రభుత్వం దాదాపు 12 లక్షల మందికి నెలకు 1000 రూపాయలు నిరుద్యోగ భృతిని కల్పిస్తున్నది. దీనివల్ల ఖజానాకు సంవత్సరానికి 8000 కోట్లు ఖర్చు అవుతున్నదని అయినా భరిస్తామంటూ ప్రకటనలు ఇస్తూ ఉన్నాడు. దీనినింకా పెంచుతామంటున్నారు. కానీ యువతకు కావాల్సింది ఉద్యోగాలు కానీ నిరుద్యోగ భృతి కాదు కదా. ఎక్కడ భూములు ప్రాజెక్టుల పేర తీసుకున్న పెద్దఎత్తున ఉద్యోగాలు ఇస్తామంటూ చెప్తుంటారు కానీ అవి కాగితాలకే పరిమితం అవుతున్నాయి.

గత మూడేళ్ళుగా ʹఅగ్రిగోల్డ్ʹ వ్యవహారంలో టిడిపి ప్రభుత్వం మిన్నకుండిపోయింది. దీని వల్ల 100 మందికి పైగా మనుషులు చనిపోయారు. దేశవ్యాప్తంగా సుమారు 32 లక్షల మంది అగ్రిగోల్ద్ బాధితులున్నారు. ఒక్క ఆంధ్రప్రదేశలోనే 19 లక్షలకు పైచిలుకు ఉన్నారు. మొత్తం 6,500 కోట్లు కష్టమర్లకు అగ్రిగోల్డ్ యాజమాన్యం చల్లించాల్సి ఉంది. అయితే ఆ సంస్థకు చెల్లించాల్సిన దానికంటే రెట్టింపు ఆస్తులున్నాయి. దాదాపు 20 వేల ఎకరాలు భూమి ఆ సంస్థ చేతిలో ఉంది. ఇందులో మెజార్టీ ఆంధ్రాలో అందులోనూ అమరావతిలో ఉన్నాయి. కానీ వాటిని తక్కువ ధరకే కాజేయడానికి ప్రభుత్వం పెద్దలు ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. 2015లో ఆస్తులను అమ్మి ఖాతాదారులకు చెల్లించమని కోర్టు తీర్పు వచ్చినప్పటికీ ఇప్పటికి కూడా ఆ దిశగా అడుగులు వేయలేదు.

ఎక్కడ దొరికితే అక్కడ దోపిడీ చేసుకుంటూ పోయింది చంద్రబాబు ప్రభుత్వం. ప్రభుత్వ దోపిడీ గురుంచి ప్రశ్నించిన వారిపై తీవ్రమైన రాజ్యహింసను అమలు చేసింది. తన ప్రమాణ స్వీకారం రోజే నల్లమలలో చెంచులకు వ్యవసాయం నేర్పిస్తున్న ముగ్గురు మావోయిస్టులను చంపిన చంద్రబాబు, ఈ సారి ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదళ్లయ్యేనాటికి విశాఖ మన్యంలో వేటకెళ్లిన ఇద్దరు గిరిజనులను మావోయిస్టుల పేరుతో కాల్చి చంపాడు. అలా ఎన్కౌంటర్ తో పాలన మొదలు పెట్టి ఎన్కౌంటర్ తో ముగించాడు. ఈ ఐదేళ్ల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిమీద ఒకరు ఎన్ని విమర్శలు చేసుకున్నప్పటికీ ప్రజలను, ప్రజా పోరాటాలను, అసమ్మత్తిని అణిచివేయడంలో ఒకరికొకరు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించుకున్నారు. అది కేంద్రంలో బిజెపితో కావొచ్చు, పొరుగుననున్న తెలంగాణ, ఒడిస్సా, చత్తీస్ఘడ్ రాష్ట్రాలతో కావొచ్చు.. సహజ వనురులను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టడంలో, విప్లవోద్యమాన్ని అణచివేయడంలో అన్ని ప్రభుత్వాలు ఒకేలా వ్యవహరించాయి. ప్రస్తుతం విప్లవోద్యమాన్ని అణిచివేయడానికి అనుసరిస్తున్న ʹసమాధాన్ʹ, అంతకముందర ఉన్న మిషన్ 2017, 2016 సంధర్బాలలో అన్ని రాష్ట్రాల డీజీపీల సమావేశం గానీ స్వయంగా హోంమంత్రి రాజనాథ్ సింగ్ సమావేశాలు కానీ విశాఖపట్నం వేదికగానే జరిగాయి. బాక్సయిట్ కోసం విశాఖ మన్యంలో జరిగిన మర్రిపాకల, విప్లవోద్యమ చరిత్రలో అతి పెద్దదైన రాంగూడ సంఘటనలు గాని, మావోయిస్టుల పేర ఆదివాసులను హింసించడంలో కానీ రాష్ట్రాలు ఒకదానికొకటి సహాయం చేసుకున్నాయి.

ఒక్క విప్లవోద్యమాన్నే కాకుండా ప్రశ్నించే అన్ని రకాల గొంతులను చంద్రబాబు ప్రభుత్వం అణిచివేసింది. విశాఖలో ʹవిశాఖ ఉత్సవ్ʹ పేరుతో నిర్వహించిన ఫాషన్ షోలను వద్దనందుకు మహిళా సంఘాల వారిని పోలీసులతో కొట్టించడం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన వాకపల్లి మహిళా బాధితులను కేసు వాపసు తీసుకోమని బెదిరించడం గానీ, చివరకు తితిలి తుఫానులో నష్టపోయిన వారికీ బియ్యం పంచడానికి వెళ్లిన ప్రజాసంఘాల వారి మీద రాజద్రోహం కేసు పెట్టడం గానీ చంద్రబాబు ప్రభుత్వానికే చెల్లింది. అక్కడి బాధితులు నీరసన వ్యక్తం చేస్తే రోడ్ రోలర్ తో తొక్కిస్తాననడం ఆయనకే చేతనైంది.

ఎక్కడో హైదరాబాద్ లో జరుగుతున్న ప్రత్యామ్యాయ వేదిక సభకు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళుతున్న వారిని ఇక్కడ అరెస్టు చేయడం, వరంగల్లో ఆదివాసుల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ʹఆపరేషన్ గ్రీన్ హంట్ʹ సభకు వెళ్ళొద్దంటూటూ ఇక్కడ కార్యకర్తల ఇళ్లకు రెండు రోజుల ముందు నుంచే పోలీసులను పంపడం, హౌస్ అరెస్ట్స్ చేయించడం, మొన్నటికి మొన్న హైదరాబాద్ నుండి అనూష, భవాని, అన్నపూర్ణలను కిడ్నాప్ చేసి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి అనడం అన్నీ చంద్రబాబు ఘనకార్యాలే. రాంగూడ సంఘటనలో చనిపోయిన వారి శవాలను తీసుకురావడానికి వారి కుటుంబాలతో పాటు అమరుల బంధుమిత్రుల సంఘం సభ్యులు, విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావు వెళ్ళినప్పుడు బయటి సమాజం నుంచి వస్తున్న స్పందనకు భయపడి నకిలీ ముఠాలతో ర్యాలీలు , ధర్నాలు చేయించాడు చంద్రబాబు. ఒక రెండు మూడు నెలల పాటు ఆంధ్రాలో ఎక్కడ ఏ సభ జరిగిన ఈ ప్రహసనం నడిచింది.

ఇంతేనా తుందుర్రు ఆక్వా పార్క్ విషయంలో, గుంటూరులో కొప్పకొండ దళితుల భూముల విషయంలో, ప్రత్తిపాడు, రావూర్లలో దళితుల మీద జరిగిన దాడుల సందర్భంలో, భోగాపురం భూమలు విషయంలో ప్రశ్నించిన వారిని హింసించడం, ఇసుక మాఫియా గురుంచి మాట్లాడిన వారిమీదకి ఏకంగా లారీ ఎక్కించడం ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఐదేళ్ల కాలంలో ఎంత దోచుకోవచ్చో అంత దోచుకుంటూనే అంత హింసకు పాల్పడ్డారు. తమకు వ్యతిరేకంగా వార్తలు రాసిన వారిని సైతం చంద్రబాబు ప్రభుత్వం వదలలేదు. రాష్ట్రంలో ముగ్గురు జర్నలిస్టులు ఈ కాలంలో హత్యలకు గురియ్యారు. మంత్రి గారి భార్య అక్రమాలను రాసినందుకు ఇంటి దగ్గరి నుండే తీసుకుపోయి ఒక జర్నలిస్టును చంపేసారు. ఢిల్లీ నుంచి సిబిఐ వచ్చినప్పటికీ రిపోర్ట్ వారికీ అనుకూలంగానే తెచ్చుకున్నారు. ఆఖరికి స్వయంగా టీడీపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభుత్వ ఉద్యోగి వనజాక్షి మీద దాడి చేయడం, స్వయానా చంద్రబాబు ఉద్యోగులను బెదిరించడం జరిగింది. దేశంలోనే మహిళలలు మీద జరుగుతున్నా దాడులలో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో నిలిచింది. ఈ 5 ఏళ్ల కాలంలో 44,000 కేసులు నమోదయ్యాయి.

ఇన్ని అక్రమాలు జరుగుతున్నా అభివృద్ధి జరుగుతున్నది, పంటలు పండుతున్నాయి, ప్రజలు సుఖంగా బతుకుతున్నారు, ప్రపంచంలో మనమే ముందున్నాం అని జనాలు అనుకునేట్టు చంద్రబాబు చేసాడు. ఇవన్నీ ఆయన భజన మీడియాలో, టిడిపి వాట్సాప్లో, ఫేస్బుక్లో నిరంతరాయంగా జరుగుతుంది. ఇంతలా వ్యవస్థను భ్రష్టుపట్టించాడు చంద్రబాబు. ఆయన చేసిన దోపిడీ అంతా ఆయన మానేజ్మెంట్ నైపుణ్యంతో అభివృద్ధి అయింది. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలలో తిరిగి దీనినే ఉపయోగిస్తూ ʹనేను రాకపోతే అన్ని ఆగిపోతాయిʹ అంటూ జనాలను బెదిరిస్తున్నాడు. తనమీది వ్యతిరేకతను కేంద్రం మీదికి మళ్ళించడానికి ఎవరితోనైతే అంటకాగాడో చివరి రోజుల్లో వారితో తెగదెంపులు చేసుకున్నాడు. ఇప్పుడు వైసిపి బిజెపితో కలిసిందని మైనార్టీలు ఆ పార్టీకి ఒటేయెద్దని చెప్తున్నాడు. రాష్టానికి తానేదో గొప్పగా చేయడానికి ప్రయత్నిస్తుంటే కేంద్రం అడ్డుకుంటోందని చెప్పడం మొదలుపెట్టాడు. ఇది మరో మేనేజ్మెంట్. మొత్తం ఈ అయిదేళ్ళ పరిపాలన మానేజ్మెంట్ తప్ప మరేమి లేదు. మరొక అయిదేళ్ళ మానేజ్మెంట్ పరిపాలనకు ప్రజలను ఇప్పటి నుండే సిద్ధం చేస్తున్నాడు.

No. of visitors : 405
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


స్మృతి చిహ్నాలు... పోరాటపు గుర్తులు

సాగ‌ర్‌ | 19.09.2016 10:53:49am

స్మృతి చిహ్నాలు మనం చూడలేని గత చరిత్రకి సంబందించిన ఆనవాళ్లుగాను , ఒక తరం నుంచి మరొక తరానికి వాటి రాజకీయ భావజాలాన్ని ప్రచారం చేసే సాధనలుగాను , వారి అమర........
...ఇంకా చదవండి

నేనూ అర్బన్ మావోయిస్టునే

సాగర్ | 22.09.2018 09:53:57pm

పూణే పోలీసులు బీజేపీ ప్రభుత్వం చేసిన ఈ అమానవీయ చర్యకు ప్రజలు ʹమీ టూ అర్బన్ నక్సల్ʹ, ʹపూణే పోలీస్ జవాబు దోʹ అంటూ తమ నిరసనను తెలిపారు......
...ఇంకా చదవండి

ప్రజల పై యుద్ధం

సాగ‌ర్‌ | 05.10.2016 12:31:57am

ప్ర‌జ‌లు,సామ‌జిక కార్య‌క‌ర్తలు నేడు దండకారణ్యంలో జరుగుతున్న పాశవిక దాడికి, హక్కుల హననాకి వ్యతిరేకంగా తమ మద్దతు తెలపాల్సిన అవసరంను ఈ పుస్తకం మనముందుంచుతుంది ...
...ఇంకా చదవండి

ఆ కాఫీ తోటలు ఎవరివి?

సాగర్ | 05.10.2017 11:05:45pm

విశాఖ మన్యంలో ఆదివాసులు 30 ఏళ్లగా మావోయిష్టు పార్టీ నాయకత్వంలో పోరాడి కాఫీ తోటలపై సంపాదించుకున్న యాజమాన్య హక్కును తిరిగి తీసుకోవడానికి ఆంద్రప్రదేశ్ ......
...ఇంకా చదవండి

బాబుకు ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది.

సాగర్ | 16.04.2019 12:13:15am

అంతులేని రాజ్యహింసకు, హక్కుల హననానికి పాల్పడిన చంద్రబాబు ప్రజాస్వామ్యం విలువలు అంటూ మాట్లాడటం కొత్తగా, వింతగా, కాసింత వినోదంగా కూడా ఉండొచ్చు......
...ఇంకా చదవండి

వేటకెళ్ళిన ఆదివాసులను వేటాడి చంపిన పోలీసులు

సాగర్ | 17.03.2019 10:35:13pm

తమ కాళ్ళ కింద ఉన్న అపార ఖనిజ సంపదను పెట్టుబడిదారులకు పంచిపెట్టడానికి ప్రభుత్వాలు ఆదివాసులను చంపివేస్తున్నాయి. ఆ నిర్బంధాన్ని, హింసను తట్టుకుని వారు ప్రభు......
...ఇంకా చదవండి

హిందూ రాజ్యం దిశగా

సాగర్ | 17.11.2019 10:20:58am

ʹఒకే ప్రజ, ఒకే భాష, ఒకే సంస్కృతి,ఒకే జాతి, ఒకే దేశం, ఒకే నాయకుడుʹ అనే సంఘ్ పరివార్ రాజకీయ లక్ష్యానికి ఆర్టికల్ 370 రద్దు తరువాత ఈ తీర్పు మరో విస్తరణలాంటిదే....
...ఇంకా చదవండి

కిసాన్ ముక్తి మార్చ్

సాగర్ | 06.12.2018 12:02:02am

ʹఅయోధ్య ఆలయం కాదు రుణ మాఫీ కావాలిʹ నినాదాలతో దేశ రాజధాని ప్రతిధ్వనించింది. లక్షకు పైగా రైతుల మట్టి పాదాలు తాకి ఢిల్లీ పార్లమెంట్ వీధులు పులకించాయి......
...ఇంకా చదవండి

యూనియన్లు ఏం చేయగలవో దొరకు బాగా తెలుసు

సాగర్ | 02.12.2019 09:10:25pm

యూనియన్లు ఏం చేయగలవో కెసిఆర్ కు బాగా తెలుసు. పోరాటాలు విజయం సాధించొచ్చు, ఓడిపోవచ్చు. సంఘాలు కార్మికులకు గొంతునిస్తాయి. మళ్ళీ మళ్ళీ పోరాడే ధైర్యాన్నిస్తాయి. ...
...ఇంకా చదవండి

నిర్బంధ ప్రయోగశాల

సాగర్ | 04.02.2020 02:23:41pm

కేసీఆర్‌ సీఎం పదవి కోరుకుంటే వీరు ప్రజాస్వామిక తెలంగాణను కోరుకున్నారు. కేసీఆర్‌కు కావాల్సింది కేసీఆర్‌కు దక్కింది. కానీ ప్రజాస్వామిక తెలంగాణ రాలేదు.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2020
  తెర ముందు కథ!
  షాహిన్ భాగ్..షాహిన్ భాగ్
  హిబా కోసం
  నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు
  సత్యాన్ని చెప్పడమే రాజకీయ కవితా లక్షణం
  షాహీన్ బాగ్... ఒక స్వేచ్ఛా నినాదం
  విప్లవం నేరం కాదు. విప్లవకారుడు నేరస్తుడూ కాదు.
  అరెస్టు - అన్‌టచబులిటీ
  విప్లవ కవిత్వంలో ఈ తరం ప్రతినిధి
  నిర్బంధ ప్రయోగశాల
  అరుణతార జనవరి - 2020

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •