తెగిపడిన చిటికెనవేలు చెప్పిన ఏడుగురు అక్కచెల్లెళ్ళ కథ

| సాహిత్యం | క‌విత్వం

తెగిపడిన చిటికెనవేలు చెప్పిన ఏడుగురు అక్కచెల్లెళ్ళ కథ

- వరవరరావు | 01.04.2019 03:07:00pm


ʹ రాజుకేడుగురు బిడ్డలం
పొన్నపూలకు పోయినం
పులిరాజు బుక్క పెట్టె
జంగమయ్య జోలె కట్టె ʹ

(తెలంగాణ పల్లెల్లో తెలతెలవారుతుండగా వచ్చే బాలసంతలు పాడేపాట.)

పొన్నపూల కోసం అడవికి పోయిన ఏడుగురు అక్క చెల్లెళ్లనూ పులి మింగగా ఒక చిటికెనవేలు తెగి నేలమీద పడుతుంది. అటువైపు వచ్చిన జంగమయ్య తన జోలెలో ఆ వేలు వేసుకుంటాడు. ఆ వేలుకు ప్రాణం వచ్చి ఏడుగురు అక్కచెల్లెళ్ళ కథ చెప్తుంది.

ఏడుగురు అక్కచెల్లెళ్ళు
పొన్నచెట్ల కింద పూలేరడానికి పోయిన్రు
గోదావరెంబడి తారుపామువలె రోడ్డు పాకి
పూలచెట్లు పండ్లచెట్లు కూడ కరువై
చెట్లు వెతుకుతూ దట్టమైన అడవిలోనికి పోయిన్రు

జానకి ఒక్కతే కాదు
శ్యామల లత వెన్నెల ముక్కుపచ్చలారని పిల్లలు
వసంత స్వప్న కొమురక్కలు అరవిచ్చిన మల్లెలు

కూలికోసమైనా కూటికోసమైనా
కోరుట్ల మెట్‌పల్లి జగిత్యాలలకు
బొంబాయి మీంచి దుబాయి దగ్గరయింది
కెనాల్‌ పంటి రోడ్డు పక్క
కేసెట్లు దొరుకుతయి గానీ పూలు దొరుకవు

మన పూలకోసమే మనం
ఆమెస్టర్‌ డ్యాం పోలేం గదా

ఆ మంకెనపూలవంటి మంథని పిల్లలు
అందుకోసం అడవికి పోయిన్రు

పెళ్ళి చేసే వయసు
ఓట్లేయించే వయసు
వస్తున్నయి గనుక
ఒంటరిగా కాకుండా విముక్తిసంఘంగా
మనసైన పూలేరుకుంటున్నరు
వాగులో గులకరాళ్లు ఏరుతూ
స్నానాలు చేస్తూ

చెట్టుకింద అన్నం కుత కుత ఉడుకుతున్నది
ఉమ్మగిల్లే దాకా ప్రవాహంలో ఆడుకునే
ఉత్సాహమూ ఓపికా వాళ్ళకున్నయి

అన్నం ఉడికే వాసన, చప్పుడు
నీళ్ళు ఉరికే స్పర్శ, వెలుగు
బాల్యం లోంచి నవయవ్వనంలోకి
ఏడుగురు కూడినపుడు ఎగిసిపడే కలలు

అడవిలో మృగాలుంటాయని తెలియక కాదు
అన్నలు అక్కలు వచ్చినాంక అవి
ఒదిగి ఉన్నయి లేకుంటే పక్కకు జరిగినయి

ఇంక వస్తే హైవే వెంబడి హైనాలు రావాలి
మంద మీద పడే తోడేళ్ళు

అటు రోడ్డు మీంచి కావలిని మరిపించి
ఇటు భూపాలపెల్లి నుంచి గ్రేహౌండ్స్‌ వచ్చినవి

ఇప్పుడక్కడ నీళ్ళచప్పుడు లేదు
పూలేరుతున్న వేళ్ళ చప్పుడు లేదు
వృకోదరుల వేట వికటాట్టహాసం తప్ప

సున్నితమైనవన్నీ ధ్వంసమైనవి

సెలఏటి నీళ్ళలో లేఎండ వలె మెరుస్తున్న పిల్లలు
నెత్తుటి చీలికలలో
పొయిమీది అన్నం మెతుకులు
మట్టిలో మసైనవి

కోసేసిన నెలవంకల్నించి
ఒలికిన నెత్తురు గడ్డకట్టి
అడవి
సిగ్గుతో చీకటయింది

పొన్నపూల కోసం పోయిన పిల్లలు
ఖండితస్వప్నాలై తిరిగి వచ్చిన్రు

ఒంటిమీద నూలుపోగుల్లేకుండా
కాలిపోయిన పూలదేహాల్ని చూస్తూ
కంటతడి పెట్టిన తల్లుల గుండెల్లో
శోకమే కాదు క్రోధమూ రగిలింది

(ఆ ఏడుగురు ఆడపిల్లల కథ రాయమని ఎండ్లూరి సుధాకర్‌ నోరుతెరిచి నన్ను ఎందరి తరపున అడిగిండో కదా)

-వరవరరావు
19 నవంబర్‌ 2000 (ʹఉన్నదేదో ఉన్నట్లుʹ కవితా సంకలనం నుండి)


No. of visitors : 492
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నయీం ఎన్‌కౌంటర్‌... హంతకుడిని చంపి హంతక వ్యవస్థను కాపాడుతున్న రాజ్యం

వరవరరావు | 18.01.2017 10:41:11pm

హతుడు నయీంను, మిగిలిన ఆయన అనుయాయులను కాపాడే బాధ్యత ఎవరు ప్రభుత్వంలో ఉన్నా సరే, వాళ్లు నిర్వహించక తప్పదు. తెలంగాణ హోంశాఖ హైకోర్టులో చెప్పకుండా ఉండలేకపోయిన చే...
...ఇంకా చదవండి

వ‌ర్గ స‌మాజం ఉన్నంత కాలం వ‌ర్గ పోరాటం ఉంటుంది

వ‌ర‌వ‌ర‌రావు | 06.11.2016 12:52:46pm

మ‌హ‌త్త‌ర శ్రామిక‌వ‌ర్గ సాంస్కృతిక విప్ల‌వానికి యాబై నిండిన సంద‌ర్భంగా ... కామ్రేడ్ వ‌ర‌వ‌ర‌రావు సాంస్కృతిక విప్ల‌వం లేవ‌నెత్తిన మౌళిక అంశాల‌ను విశ్లేషిస్తు...
...ఇంకా చదవండి

సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం : వ‌ర‌వ‌ర‌రావు

రివెల్యూష‌న‌రీ డెమోక్ర‌టిక్ ఫ్రంట్‌ | 29.07.2016 02:17:42pm

ఈ చారిత్రక మైలురాళ్లను గుర్తుచేసుకుంటూ ప్ర‌పంచానికి సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయమని మ‌రోమారు ఎలుగెత్తిచాటాల్సిన అవ‌స‌ర‌ముంది.................
...ఇంకా చదవండి

దండకారణ్య సందర్భం: పశ్చిమ కనుమలపై పిడుగుపాటు

వరవరరావు | 07.12.2016 11:00:07am

తెలంగాణలో ఓడిపోయి, మళ్లీ కూడదీసుకుంటున్నారు కావచ్చు. ఎఒబిలో నారాయణపట్న కాలం నుంచి నిన్నటి మల్కన్‌గిరి కాలం వరకు ఆటుపోట్లుగా సాగుతున్నారు కావచ్చు. పడమటి ను...
...ఇంకా చదవండి

చెరసాలలో చామంతులు - 2

వరవరరావు | 04.03.2017 08:51:53am

అప్పటి నుంచి మొదలైన నిర్బంధం, రాష్ట్రం వదిలి ప్రయాణాలు, తలదాచుకోవడాలు డా. రామనాథం హత్య నాటికి పరాకాష్ఠకు చేరాయి. అట్లా శాశ్వతంగా నేలను కోల్పోయాం. నేల మీద......
...ఇంకా చదవండి

ఇప్పుడు... దండకారణ్య సంద‌ర్భం - ఏఓబీ, ఆర్కే, ఆదివాసులు

వ‌ర‌వ‌ర‌రావు | 02.11.2016 11:05:39am

దండకారణ్యం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమేకానట్లు ఎఒబికూడా కాదు. అది ఒక ప్రజాప్రత్యామ్నాయ రాజకీయం. ఈ భాష కొత్తగా ఉండవచ్చు. ఇది యుద్ధభాష. ప్రజాయుద్ధ భాష. ఈ భాష ను...
...ఇంకా చదవండి

Condemn the Nilambur Fake Encounter : RDF

Varavararao | 29.11.2016 12:57:05pm

RDF pays homage to tow comrades Kuppa Devaraj and Ajitha and demands for repost mortem of dead bodies and judicial inquiry into the encounter and punish the...
...ఇంకా చదవండి

ప్రభాకరుడే గంగాధరుడు

వివి | 02.11.2016 10:36:10pm

ప్రభాకర్‌ కళా సాంస్కృతిక గుణాత్మక మార్పులో చేరిపోయాడు. పాటను సాయుధం చేసే రసాయన చర్య(ట్రాన్స్‌ఫర్మేషన్‌)లో భాగమయ్యాడు. కారంచేడు మారణకాండకు ప్రతీకారంగా దళిత ...
...ఇంకా చదవండి

యాభై వసంతాల దారి మేఘం

వరవరరావు | 20.05.2017 11:05:03pm

అంబేద్క‌ర్‌ వ్యవస్థలో చిల్లులు పొడవలేకపోయాడు కాబట్టే 1956 నాటికే రాజీనామా చేసాడు. రాజ్యాంగ ఉపోద్ఘాతం, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగ స్ఫూర్తి అమలు ...
...ఇంకా చదవండి

ఎస్‌సి వర్గీకరణ దళిత ఐక్యతకు, కుల నిర్మూలనకు బలమైన ప్రాతిపదిక

వరవరరావు | 16.08.2016 12:08:57am

ఎస్‌సి వర్గీకరణ కొరకు జరుగుతున్న పోరాటానికి ఇరవై రెండేళ్లు. మాదిగలకు, మాదిగల ఉపకులాలకు వారి జనాభా ప్రాతిపదికగా ఎస్‌సి వర్గీకరణ కోసం రాజ్యాంగం కల్పించిన.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2020
  తెర ముందు కథ!
  షాహిన్ భాగ్..షాహిన్ భాగ్
  హిబా కోసం
  నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు
  సత్యాన్ని చెప్పడమే రాజకీయ కవితా లక్షణం
  షాహీన్ బాగ్... ఒక స్వేచ్ఛా నినాదం
  విప్లవం నేరం కాదు. విప్లవకారుడు నేరస్తుడూ కాదు.
  అరెస్టు - అన్‌టచబులిటీ
  విప్లవ కవిత్వంలో ఈ తరం ప్రతినిధి
  నిర్బంధ ప్రయోగశాల
  అరుణతార జనవరి - 2020

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •