వరవర రావును విడుదల చేయమని కోరుతూ ప్రధాన న్యాయమూర్తికి వరవర రావు సహచరి హేమలత బహిరంగ లేఖ

| ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు

వరవర రావును విడుదల చేయమని కోరుతూ ప్రధాన న్యాయమూర్తికి వరవర రావు సహచరి హేమలత బహిరంగ లేఖ

- | 01.04.2019 07:38:29pm


వరవరరావును విడుదల చేయమని కోరుతూ ప్రధాన న్యాయమూర్తికి వరవర రావు సహచరి హేమలత బహిరంగ లేఖ

సంఘీభావం తెలిపిన ఏడువందల మంది ప్రజాస్వామిక వాదులు

హైదరాబాద్‌‌లోని ఒక పత్రికా సమావేశంలో విడుదల చేసిన ʹభారత ప్రధాన న్యాయమూర్తికి బహిరంగ లేఖʹలో ప్రఖ్యాత విప్లవ కవి, ప్రజా మేధావి వరవర రావు సహచరి పి హేమలత.. ఈ కేసులో ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకుని, వరవరరావును విడుదల చేసే ప్రక్రియను తక్షణమే ప్రారంభించవలసిందిగా కోరారు. ఒక నేరపూరిత కుట్ర కేసులో నిందితుడిగా వరవర రావు ప్రస్తుతం పుణెలోని యరవాడ కేంద్ర కారాగారంలో ఉన్నారు.

ఆమె లేఖలోని ప్రధానాంశాలు:

వరవరరావును, తదితరులను నిందితులుగా చూపిన భీమా కోరేగాం హింసాకాండ కేసును తర్వాత నేరపూరిత కుట్ర కేసుగా, ఆ తర్వాత చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధ చట్టం కేసుగా మారుస్తూ వచ్చారు. భీమా కోరేగాం హింసాకాండకు నిజంగా కారకులైనవారి మీద ఇప్పటివరకూ ఏ చర్యలూ లేకపోగా, దానితో ఎటువంటి సంబంధం లేని వరవరరావుమీద, తదితరుల మీద ఆ కేసు బనాయించారు. ఆ కేసులో వరవరరావును ఇరికించడం పూర్తిగా కల్పిత ఆధారాల మీదనే జరిగింది. నా భర్తను ఆ కేసులో ఇరికించడం కేవలం ఆయన స్వరం బైట వినిపించకుండా చేయడానికేనని నాకు అనుమానంగా ఉంది.

వరవరరావు మూడు దశాబ్దాలకు పైగా కళాశాల అధ్యాపకుడుగా పనిచేసిన వరవర రావు వేలాది మంది ఉపాధ్యాయులతో, విద్యార్థులతో సంబంధం లోకి వచ్చి, తన సాహిత్య, విద్యాసంబంధ వ్యక్తిత్వంతో వారికి ప్రేరణగా నిలిచారు. ఈ సుదీర్ఘ కాలంలో ఆయనతో పరిచయంలోకి, స్నేహంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆయనను స్నేహశీలిగా, ప్రేమాస్పదుడిగా, ఇతరుల పట్ల సహానుభూతి చూపే ఉద్వేగభరిత, సున్నిత మనస్కుడిగా, ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేసే వ్యక్తిగా గుర్తిస్తారు. ఆయన కవిగా, సాహిత్య విమర్శకుడిగా, సామాజిక వ్యాఖ్యాతగా, ప్రముఖ వక్తగా సుప్రసిద్ధుడు. ఆయన తన విభిన్నమైన, ప్రత్యామ్నాయ రాజకీయ విశ్వాసాలను బలంగా చెప్పడానికే తన కలాన్నీ గళాన్నీ వినియోగించారు. ఆయన జీవితమంతా ఆ విలువలకోసం, సామాజిక సంస్పందనల కోసం నిలబడ్డారు. ఆయన దళితులు, ఆదివాసులు, స్త్రీలు, కార్మికులు, మైనారిటీలతో సహా అన్ని వర్గాల ప్రజల పోరాటాలను సమర్థిస్తూ వచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయన తన మద్దతు ఇచ్చారు. విప్లవపార్టీలతో ప్రభుత్వం చర్చలకు పూనుకున్నప్పుడు అర్థవంతమైన శాంతిని సాధించే ప్రయత్నాలలో భాగంగా ఆయన విప్లవ పార్టీ ప్రతినిధిగా పనిచేశారు.

ఎవరైనా నిర్ద్వంద్వంగా చెప్పగలదేమంటే ఆయన తన 79 సంవత్సరాల జీవితంలో ఎన్నడూ ఎప్పుడూ నేరపూరిత, హింసాపూరిత కార్యాచరణలో భాగం పంచుకోలేదు. ఆయన ఎప్పుడూ ఏ నేరమూ చేయలేదని, నిర్దోషి అని ఎన్నో న్యాయస్థానాలు ప్రకటించాయి. గత 45 సంవత్సరాలలో ఆయనను 25 కేసులలో ఇరికించిన పోలీసులు ఇప్పుడు ఆరోపిస్తున్నట్టుగానే ఎన్నో భయంకరమైన నేరాలు ఆరోపించారు. కాని ఆ 25 కేసులలో 13 కేసులను నిశితంగా, సుదీర్ఘకాలం విచారణ జరిపిన న్యాయస్థానాలు ఆయనను నిర్దోషిగా ప్రకటించాయి. మిగిలిన 12 కేసులను విచారణ స్థాయికి కూడ రాకముందే పోలీసులే ఉపసంహరించుకున్నారు. ఒకటి 15 సంవత్సరాలు, మరొకటి 17 సంవత్సరాలు విచారణ జరిగిన రెండు భారీ కుట్రకేసులు చిట్టచివరికి ఆయనను నిర్దోషిగా విడుదల చేశాయి. ప్రాసిక్యూషన్ ఆయన మీద చేసిన నేరారోపణల్లో ఒక్కదాన్నయినా ఒక్క కేసులోనైనా రుజువు చేయలేకపోయింది. అయినప్పటికీ, ఈ కేసులలో విచారణలో ఉన్న ఖైదీగా ఆయన తన విలువైన జీవితంలో ఏడు సంవత్సరాలకు పైగా జైళ్లలో గడపవలసి వచ్చింది.

ఇప్పుడు పుణె పోలీసులు కూడ ఆయన మీద తీవ్రమైన నేరారోపణలు చేస్తున్నారు గాని న్యాయస్థానాల విచారణలో ఆ ఆరోపణలేమీ నిలవజాలవని, ఆయన ఏ హానీ లేకుండా తిరిగివస్తారని మేం విశ్వసిస్తున్నాం. ఒకవైపు ఈ కేసులో అరెస్టయి ఉండగానే ఆయనను గడ్చిరోలిలో 2016లో జరిగిన మరొక కేసులో ఇరికించారు. పుణె కేసులో బెయిల్ మీద బైటికి రాకుండా అడ్డుకోవడానికే ఈ రెండో కేసు బనాయించారు. ఇప్పుడు మమ్మల్ని ఆందోళన పరుస్తున్న అంశమూ, మీకు ఈ విజ్ఞప్తి చేయడానికి కారణమైన అంశమూ ఆయన వయసు, క్షీణిస్తున్న ఆరోగ్యం. గతంలో అబద్ధపు కేసులలో అనుభవించిన జైలు జీవితం వల్లనే ఆయన ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమయింది. ఇప్పుడు ఆయనను మరొక అబద్ధపు కేసులో జైలు పాలు చేశారు. న్యాయవిచారణా క్రమపు విధివిధానాలను నేను ప్రశ్నించడం లేదు. న్యాయవిచారణ కొనసాగనివ్వండి, కాని ఎటువంటి నేరచరిత్ర లేని వ్యక్తిని, పాలకులకు రుచించని అభిప్రాయాలు ప్రకటిస్తున్నందుకు కక్షసాధింపుగా 25 కేసుల్లో ఇరికించినప్పటికీ న్యాయస్థానాలలో పోలీసులు ఒక్క నేరారోపణ కూడ రుజువు చేయలేకపోయిన వ్యక్తిని, 79 సంవత్సరాల వృద్ధుడిని, అనారోగ్య బాధితుడిని మరొక దఫా జైలు నిర్బంధానికీ, వేధింపుకూ గురి చేయడం సబబు కాదని మాత్రమే మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ నిర్బంధానికీ, వేధింపుకూ కేవలం పోలీసులు సృష్టించిన అబద్ధపు ఆధారాలే మూలం కావడం విచారకరం.

ఈ కేసు వెనుక ఉన్న దురుద్దేశాలనూ, కేసు తయారుచేసిన అక్రమ పద్ధతినీ పరిశీలించవలసిందిగా, న్యాయవిచారణను ఆపకుండానే వరవరరావును తక్షణమే విడుదల చేయమని ఆదేశించవలసిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన వయసు, ఆరోగ్యం, ప్రజామేధావిగా ఆయన ప్రతిపత్తి దృష్టిలో పెట్టుకుని మానవతా దృష్టితో తక్షణ చర్యలకు పూనుకోవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.

హేమలత రాసిన బహిరంగ లేఖతో హైదరాబాద్ కు, తెలంగాణకు చెందిన దాదాపు వంద మంది ప్రజాస్వామిక వాదులు సంఘీభావం ప్రకటించారు. ఈ లేఖను ఆన్ లైన్ పిటిషన్ల వెబ్ సైట్ మీద ఉంచగా ప్రపంచవ్యాప్తంగా 660 మంది సంతకం చేసి సంఘీభావం ప్రకటించారు.

బహిరంగ లేఖకు మద్దతు తెలిపినవారిలో చుక్కా రామయ్య (విద్యావేత్త), పొత్తూరి వేంకటేశ్వర రావు, కె. రామచంద్రమూర్తి, కె శ్రీనివాస్, సిఎచ్ ప్రశాంత్ రెడ్డి, ఎస్ వీరయ్య, జహీరుద్దీన్ అలీ ఖాన్, జి ఎస్ వాసు, కె సతీష్ చందర్, దేవులపల్లి అమర్, కె శ్రీనివాస రెడ్డి, అల్లం నారాయణ, మల్లేపల్లి లక్ష్మయ్య, సుమంతా బెనర్జీ, వి వసంతలక్ష్మి, కె సత్యవతి (సంపాదకులు, జర్నలిస్టులు), ఎస్ వి సత్యనారాయణ, కె సీతారామ రావు, ఎస్ రామచంద్రం, ఎన్ గోపి, ఎన్ లింగమూర్తి (వైస్ చాన్సలర్లు, మాజీ వైస్ చాన్సలర్లు), జి హరగోపాల్, వసంత్ కన్నబిరాన, రమా మేల్కోటే, జాకబ్ థారు, సుజీ థారు, బి విజయభారతి, ఎం కోదండరాం, ఇ రేవతి, వి ఎస్ ప్రసాద్, డి నర్సింహారెడ్డి, ఎం వనమాల, టి పాపిరెడ్డి, ఘంటా చక్రపాణి, కె కాత్యాయని, బన్న అయిలయ్య (విద్యావేత్తలు), నందిని సిధారెడ్డి, కె శివారెడ్డి, నిఖిలేశ్వర్, దేవిప్రియ, ఓల్గా, కొండేపూడి నిర్మల, కాకరాల, రామా చంద్రమౌళి, యాకూబ్, అరణ్యకృష్ణ, అల్లం రాజయ్య (కవులు, రచయితలు), కె. మాధవరావు, పి లక్ష్మినారాయణ (మాజీ ఐ ఎ ఎస్ అధికారులు), లక్ష్మణ్ ఏలె, నర్సిమ్ (చిత్రకారులు), జి దేవి ప్రసాద్ , ఎం రాఘవాచారి, దుడ్డు ప్రభాకర్, ఎన్ నారాయణరావు, జె కోటి, సి. కాసీం, నల్లూరి రుక్మిణి, డివి రామకృష్ణారావు (ఉద్యోగసంఘాల, ప్రజాసంఘాల నాయకులు) ఉన్నారు.

అమెరికా, కెనడా, ఇంగ్లండ్, ఫ్రాన్స్, ఇటలీ, పోర్చుగల్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, రొమేనియా, థాయిలాండ్, ఖతర్, హవాయి, ఒమన్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, శ్రీలంకల నుంచీ, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచీ ఆన్ లైన్ పిటిషన్ మీద సంతకం చేసిన 660 మందిలో మాజీ సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్, విద్యావేత్తలు పద్మజా షా, ఘనశ్యామ్ షా, హర్జిందర్ (లాల్టూ) సింగ్, ఎస్ ఎ ఆర్ జిలానీ, భంగ్యా భూక్యా, కె లక్ష్మినారాయణ, కె సునీతారాణి, సతీష్ పొడువాల్, రేఖా పప్పు, ఉమా భృగుబండ, నందితా నారాయన్, శేషయ్య సేపూరి, ఎస్ జీవన్ కుమార్, జీనా ఒబెరాయ్, భావనా గోపరాజు, సామాజిక కార్యకర్తలు స్టాన్ స్వామి, ఉజ్రా బిల్ గ్రామి, మీరా సంఘమిత్ర, దర్శన్ పాల్, రచయితలు ఫ్రెనీ మానెక్ షా, జాన్ దయాల్, రవి శంకర్, తుషార్ కాంతి, దివి కుమార్, కొత్తపల్లి రవిబాబు, వాసిరెడ్డి నవీన్, ఆర్ ఎం ఉమామహేశ్వర రావు, చంద్ర కన్నెగంటి, నారాయణస్వామి వెంకటయోగి, రవి వీరెల్లి, ఖాదర్ మొహియుద్దీన్, దాట్ల దేవదానం రాజు, కాశి రాజు, ఎస్ హరగోపాల్, కె ఎన్ మల్లీశ్వరి, వివిన మూర్తి, జమీందర్ బుడ్డిగ, వేల్పుల నారాయణ, సజయ, సుధాకర్ ఉణుదుర్తి, సి కాశీం, బమ్మిడి జగదీశ్వర రావు, గీతాంజలి, మెర్సీ మార్గరెట్, దేశరాజు, శ్రీనివాస్ గౌడ్, న్యాయవాదులు చిక్కుడు ప్రభాకర్, ఆర్ మహదేవన్ ఉన్నారు.

No. of visitors : 353
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నయీం ఎన్‌కౌంటర్‌... హంతకుడిని చంపి హంతక వ్యవస్థను కాపాడుతున్న రాజ్యం

వరవరరావు | 18.01.2017 10:41:11pm

హతుడు నయీంను, మిగిలిన ఆయన అనుయాయులను కాపాడే బాధ్యత ఎవరు ప్రభుత్వంలో ఉన్నా సరే, వాళ్లు నిర్వహించక తప్పదు. తెలంగాణ హోంశాఖ హైకోర్టులో చెప్పకుండా ఉండలేకపోయిన చే...
...ఇంకా చదవండి

వ‌ర్గ స‌మాజం ఉన్నంత కాలం వ‌ర్గ పోరాటం ఉంటుంది

వ‌ర‌వ‌ర‌రావు | 06.11.2016 12:52:46pm

మ‌హ‌త్త‌ర శ్రామిక‌వ‌ర్గ సాంస్కృతిక విప్ల‌వానికి యాబై నిండిన సంద‌ర్భంగా ... కామ్రేడ్ వ‌ర‌వ‌ర‌రావు సాంస్కృతిక విప్ల‌వం లేవ‌నెత్తిన మౌళిక అంశాల‌ను విశ్లేషిస్తు...
...ఇంకా చదవండి

సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం : వ‌ర‌వ‌ర‌రావు

రివెల్యూష‌న‌రీ డెమోక్ర‌టిక్ ఫ్రంట్‌ | 29.07.2016 02:17:42pm

ఈ చారిత్రక మైలురాళ్లను గుర్తుచేసుకుంటూ ప్ర‌పంచానికి సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయమని మ‌రోమారు ఎలుగెత్తిచాటాల్సిన అవ‌స‌ర‌ముంది.................
...ఇంకా చదవండి

దండకారణ్య సందర్భం: పశ్చిమ కనుమలపై పిడుగుపాటు

వరవరరావు | 07.12.2016 11:00:07am

తెలంగాణలో ఓడిపోయి, మళ్లీ కూడదీసుకుంటున్నారు కావచ్చు. ఎఒబిలో నారాయణపట్న కాలం నుంచి నిన్నటి మల్కన్‌గిరి కాలం వరకు ఆటుపోట్లుగా సాగుతున్నారు కావచ్చు. పడమటి ను...
...ఇంకా చదవండి

చెరసాలలో చామంతులు - 2

వరవరరావు | 04.03.2017 08:51:53am

అప్పటి నుంచి మొదలైన నిర్బంధం, రాష్ట్రం వదిలి ప్రయాణాలు, తలదాచుకోవడాలు డా. రామనాథం హత్య నాటికి పరాకాష్ఠకు చేరాయి. అట్లా శాశ్వతంగా నేలను కోల్పోయాం. నేల మీద......
...ఇంకా చదవండి

ఇప్పుడు... దండకారణ్య సంద‌ర్భం - ఏఓబీ, ఆర్కే, ఆదివాసులు

వ‌ర‌వ‌ర‌రావు | 02.11.2016 11:05:39am

దండకారణ్యం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమేకానట్లు ఎఒబికూడా కాదు. అది ఒక ప్రజాప్రత్యామ్నాయ రాజకీయం. ఈ భాష కొత్తగా ఉండవచ్చు. ఇది యుద్ధభాష. ప్రజాయుద్ధ భాష. ఈ భాష ను...
...ఇంకా చదవండి

Condemn the Nilambur Fake Encounter : RDF

Varavararao | 29.11.2016 12:57:05pm

RDF pays homage to tow comrades Kuppa Devaraj and Ajitha and demands for repost mortem of dead bodies and judicial inquiry into the encounter and punish the...
...ఇంకా చదవండి

ప్రభాకరుడే గంగాధరుడు

వివి | 02.11.2016 10:36:10pm

ప్రభాకర్‌ కళా సాంస్కృతిక గుణాత్మక మార్పులో చేరిపోయాడు. పాటను సాయుధం చేసే రసాయన చర్య(ట్రాన్స్‌ఫర్మేషన్‌)లో భాగమయ్యాడు. కారంచేడు మారణకాండకు ప్రతీకారంగా దళిత ...
...ఇంకా చదవండి

యాభై వసంతాల దారి మేఘం

వరవరరావు | 20.05.2017 11:05:03pm

అంబేద్క‌ర్‌ వ్యవస్థలో చిల్లులు పొడవలేకపోయాడు కాబట్టే 1956 నాటికే రాజీనామా చేసాడు. రాజ్యాంగ ఉపోద్ఘాతం, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగ స్ఫూర్తి అమలు ...
...ఇంకా చదవండి

ఎస్‌సి వర్గీకరణ దళిత ఐక్యతకు, కుల నిర్మూలనకు బలమైన ప్రాతిపదిక

వరవరరావు | 16.08.2016 12:08:57am

ఎస్‌సి వర్గీకరణ కొరకు జరుగుతున్న పోరాటానికి ఇరవై రెండేళ్లు. మాదిగలకు, మాదిగల ఉపకులాలకు వారి జనాభా ప్రాతిపదికగా ఎస్‌సి వర్గీకరణ కోసం రాజ్యాంగం కల్పించిన.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర

కార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ...

 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.
  హిందుత్వ శక్తులు చేస్తున్న బలవంతపు మత మార్పిడులకు బలైన ఒక ఆదివాసీ యువకుడి కథ
  వాళ్ళు
  ఇంగ్లీషు వద్దనడం లేదు, తెలుగు మాధ్యమం ఉంచండి
  గుండెను స్పృశిస్తూ జరిపిన ఒంటరి సంభాషణ "నా గదిలో ఓ పిచ్చుక"
  దేశంలో ప్రశాంతత నెలకొనివుంది-జైళ్ళూ నోళ్ళు తెరుచుకొనే వున్నాయి - తస్మాత్ జాగ్రత్త
  జై శ్రీరామ్!
  రమాకాంత్‌ వాళ్లమ్మ
  హిందూ రాజ్యం దిశగా
  అయోధ్య తీర్పు మీద మాట్లాడబోతే అరెస్టు చేస్తారా?
  ఇది హిందూ న్యాయస్థానం ప్రకటించిన ఫాసిస్టు తీర్పు.
  అరుణతార నవంబర్ 2019

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •