ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు

| సాహిత్యం | స‌మీక్ష‌లు

ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు

- అల్లం రాజయ్య | 01.04.2019 08:48:11pm

పార్ట్ -2

అసలు ఈ కథల తర్వాతికథల గురించి నేను ముందుమాట రాయాలి..... అవి 2005 నుండి 2018 దాకా అంటే పదమూడు సంవత్సరాలు... ఒకరకంగా పైన అంత సుదీర్ఘంగా చర్చించకుండా కూర్మనాథ్‌ - కూర్మనాథ్‌ కథలు అర్థం కావు... ఆయన రచనాపద్ధతి మార్మికవాస్తవికత. వాస్తవికత అంటేనే స్థలకాలాలుంటాయి. అందులో మార్మికత అంటే- మనకు కనిపించే - విన్పించే ప్రపంచం యొక్క అసలు సిసలు భయంకరమైన నగ్నస్వరూపం చిత్రించాలి. అది సమకాలీన యుద్ధరంగంలో, అత్యంత ప్రమాదకరమైనది... చెప్పకపోతే నిద్రపట్టదు. బతుకలేం. చెప్పితే - బతుకలేం - ఆక్సిడెంట్లో మఖ్యమంత్రులే మాటాష్‌ కాగా - మామూలువాళ్ల గతేమిటి? ఈ నేపథ్యంలో - ఈ దుర్భరపరిస్థితిలో - కూర్మనాథ్‌ భాష, పదాలు, కథలు రూపొందాయి. ఇది ఒక్కొక్కసారి ఒంటరియాతన లాగా ఉంటుంది... అరణ్యరోదన లాగా ఉంటుంది. మనం కంఠనరాలు తెగిపోయేలాగా అరిచి మొత్తుకున్నది - ఎవరికి చెప్పాలనుకున్నామో? ఎవరితో పంచుకోవాలనుకున్నామో? వారి దాకా చేరిందో లేదో తెలియదు. తెలిసినా తిరిగి చెప్పజాలరు.

ఇది రెండువేలమంది కొలంబియా కార్మికుల మరణానికి నోరుమెదపని, ఘనీభవించిన కొలంబియా ప్రజల మౌనం లాంటిది... అబద్దం అనేక చానళ్లుగా, పత్రికలుగా, వందిమాగధ కవులుగా, పాటలుగా, ఆటలుగా విలసిల్లుతున్న చోట - ప్రజలంతా మత్తుసోకిన వాళ్లుగా తూలుతున్నచోట - ఎప్పటిలాగే ఆదివాసులే ఆఖరుకు యుద్ధరంగంలో నిలబడాల్సి వచ్చింది.

ఇలాంటి అన్నిస్థితుల్లో రాయగా రాయగా ఈ కథలు రాసేనాటికి వయసులో యాభైలకు చేరుకున్నారు. ఆగ్రహం స్థానే ఉండాల్సిన మరేమైనా ఉన్నాయా అనే అన్వేషణ ఈ కథలనిండా......

ఈ నేపథ్యంలో కథలను పరిశీలిస్తే 2005 నాటి స్థితులను కళ్లకుగట్టే కథలు నాలుగు రాశారు.

పాత మృగరాజు పోయి కొత్తకుందేలు రాజ్యాధికారం చేపట్టడం ʹవేటమానేసిన రాజుʹ కథలో చిత్రించారు. నిత్యనిర్బంధం అనుభవించిన ప్రజలు వెసులుబాటు కోరుకున్నారు. కొత్త నక్కరాజు ఉద్యమకారులను ʹజనజీవనస్రవంతిʹలో కలవమని - చర్చలకు పిలిచారు. ఒక పిచ్చిపంతులు జనజీవన స్రవంతి అంటే ఏమిటో వెతికే క్రమంలో అది ఎంత కుళ్లిపోయి, నివాసయోగ్యంగా లేదో తెలుసుకునే కథ ʹరాజుగారి బట్టలుʹ. కథలో ఆనాటికి ఉన్న పరిస్థితులను, దాదాపుగా చర్చల్లో ఉద్యమకారులు లేవనెత్తిన అంశాలను మార్మిక వాస్తవికతతో చిత్రించారు.

ʹజంతుస్వామ్యంలో హింసకు తావులేదు.... కుందేళ్లు కలకలం సృష్టిస్తున్నాయి... నిషేధిస్తున్నాంʹ చివరకు నక్కరాజు ప్రకటించాడు.

హైదరాబాదులోని అల్లకల్లోల పరిస్థితులను చిత్రించిన కథ ʹమా హైద్రాబాద్‌ ప్రయాణంʹ - తమ కళ్లముందటి ప్రపంచాన్నిఎవరి చైతన్యం మేరకు వారు - ఎవరి అవసరం మేరకు వారు అర్థంచేసుకుంటారని - వాస్తవమనేది బహురూపాలతో కన్పించేదనే విషయాన్ని ʹగుడ్డివాడి వర్ణచిత్రాలుʹ కథలో చిత్రించారు.

మరో సంవత్సరానికి నక్కకు కోరలు మొలిచాయి..... మళ్లీ ఎప్పటిలాగే పూర్తిస్థాయి నిషేధంతోపాటు - ఎన్‌కౌంటర్‌ హత్యలు - ప్రత్యర్ధుల హత్యలు - చీకటిగ్యాంగుల విహారం మొదలయ్యింది.... ఉద్యమకారుల మీద అవాకులు చెవాకులు మీడియా, పత్రికలు ప్రచారం చేయడం ఆరంభమయ్యింది..... అలాంటి స్థితిమీద - విప్లవకారులు సామాజిక రుగ్మతలకు ʹమందుʹలు యిచ్చే డాక్టర్లుగా ʹమందుʹ కథను ఒక డాక్టర్‌ నేపథ్యంలో రాశారు. ʹకొత్త సందర్భాలుʹ కలిచివేసే కథ - సహజ మరణానికి అలంకరించుకువెళ్లిన విప్లవకారుని తండ్రి కథ - ఉద్యమప్రాంతాలల్లో ʹహత్యాకాండʹ ఎలాంటి లోలోపలి విధ్వంసాన్ని - మొత్తం ప్రజల్లో ఎలాంటి మానని గాయాన్ని రేపిందో ఈ కథలో కన్పిస్తుంది. సహజ స్పందనలు కోల్పోయిన పిల్లల కథ ʹముసురుʹ. వంశధార నది పొంగడం నేపథ్యంలో - శ్రీకాకుళ ఉద్యమంనుండి ఇప్పటిదాకా ఉద్యమనదులను, ప్రవాహాలను నిర్మించే ఆశావహమైన కథ ʹనదిని నిర్మిస్తున్నవాళ్లుʹ.

2007 లో రాసిన కథ నల్లమలలో ఆఖరి ఎన్‌కౌంటర్‌ మాధవ్‌, రజిత, ప్రసాద్‌ల సంస్మరణ మీద రాసిన కథ.

అస్థిత్వ ఉద్యమాలు, సాహిత్యం విరివిగా వస్తున్న దశలో ముఖ్యంగా మహిళలకు సంబంధించి - ప్రకృతితో మమేకానికి, మానసిక ఉద్వేగాలకు జెండర్‌పరమైన పరిమితులుంటాయని - అన్ని అనుభవాలు, ఒకటి కాదని - జీవితాన్ని మహిళలు అర్థం చేసుకునే విధాన్ని ʹనా క్లాసుమేట్‌ పద్మʹ కథలో చిత్రించారు.

విచ్చలవిడిగా - వేలంవెర్రిగా పెరిగిపోతున్న కాంక్రీట్‌ జంగల్‌లో మనుషులు ఏమైపోతారు? సమస్త ఉద్వేగాలు కోల్పవడమే కాదు - భౌతికంగా కూడా ఎట్లా తయారౌతారు - ముఖ్యంగా పర్యావరణం నేపథ్యంలో - పావురాల ఉదాహరణతో ʹపొదగని గుడ్లుʹ కథ రాశారు.

దాదాపు మూడుసంవత్సరాలు నిశ్శబ్దం. ఏమీ రాయకుండా తిరగడం ఎంత యాతనో? కథల వర్కుషాపుల్లో కథల మీద చర్చలు - మరోపక్క అస్థిత్వ ఉద్యమాల జోరు.

ఆ తరువాత 2012లో పిల్లలను దండించడం, వాళ్ల భావోద్వేగాలు - అచ్చమైన పిల్లలు ద్వంద్వలోకి మార్చేక్రమం ʹవెన్నెల పడవʹ - ఆ తరువాత సంవత్సరం - తమ సమస్త వైఫల్యాలను, ముఖ్యంగా ప్రేమవైఫల్యాలను మహిళల మీదకు నెట్టడం - పితృస్వామ్య సాహిత్యం - సినిమాపాటలు - ఆ పాటలనే మహిళలు తిరిగేసి పాడితే ఎలా ఉంటుంది? మహిళలు ʹపాడని పాటʹ కథ.

కార్పొరేటు యుద్ధాలకు సహజంగానే హైద్రాబాదు కేంద్రమయ్యింది.... బహుళజాతి కంపెనీలకు, స్థానిక రాజకీయాలకు బేరసారాలు బెడిసికొట్టాయి... ప్రమాదాల పరంపరలో ముఖ్యమంత్రి మరణం తరువాత - మళ్లీ స్థానిక రాజకీయ అనిశ్చితి మొదలైంది. మొదటే చెప్పుకున్నట్లు రియల్‌ఎస్టేట్‌, ఐటి - ప్రైవేట్‌ కాలేజీలు, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు - లాంటి సర్వీసురంగం విస్తరించి - కొత్త కంపెనీలు వచ్చాయి... స్టాకుమార్కెట్‌ విస్తరించి - ఎగువ మధ్యతరగతి స్వర్గానికి నిచ్చెనమెట్ల కలలు కన్నారు. తెలివైన మాయల కంపెనీ యజమానులు మందిసొమ్ముతో షేర్‌మార్కెట్‌ అనే పులిమీద సవారి జూదాన్ని ఆరంభించారు. అలాంటి జూదంలో లక్షలాదిమంది తమ డబ్బు పోగొట్టుకున్నారు. అలాంటి జూదం గురించి వ్యంగ్యకథ ʹరాజుగారి పులిస్వారీʹ. రాజుగారు - సత్యం మాత్రమే ప్రవచించే రాజుగారు ప్రజలను పులిమీదెక్కించి తను దిగిపోయారు.

అనేక ఎత్తులు, లాబీయింగులు - ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ దోపిడీ సర్దుబాట్ల అనంతరం 02.06.2014 ప్రత్యేక తెలంగాణరాష్ట్రం ఏర్పడింది.... ఉద్యమగీతాలు పాడిన కవి, గాయకులు, పరపతి కల్గినవారు- ప్రమాదరహితమైన వాళ్లు ఉద్యోగులయ్యారు. ఉద్యమాల నుంచి ఎదిగివచ్చిన మేధావులందరు ప్రభుత్వంతో ఏదో మేరకు సర్దుబాటయ్యారు. కళాకారులు, కవులు, మేధావులు బహుమతుల కోసం, శాలువాల కోసం క్యూలల్లో నిలబడ్డారు. అస్థిత్వ ఉద్యమాలు ఎక్కడిపోవాలో - తమ లక్ష్యము, వ్యూహంకన్నా - అక్కడక్కడే కదం తొక్కుతున్నాయి. క్రమంగా ఉద్యమాలపేరు చెప్పి కుర్చీ ఎక్కిన కుందేలు కోరల సింహంగా మారింది.... ఊళ్లల్లోనుండి విప్లవోద్యమాలు తరిమిన దొరల బాపతు ʹసింహమేʹ కుందేలు వేషం వేసింది.... యాభయేండ్ల ఉద్యమచరిత్ర తెలిసినసింహం - అన్నిరకాల సనుగుళ్లను నయానా బయాన అణచివేసి పోలీసుఫోర్సును పెంచుకున్నది... కుర్చీ అదే, పరిపాలన అదే - మూడురంగులు, పసుపుపచ్చ రంగు స్థానంలో గులాబిరంగు వచ్చింది అంతే.... మరింక అన్నిరకాల దోపిడికి రాచబాటలుండనే ఉన్నాయి... కొత్తగా బహుళజాతి కంపెనీలకు ఖనిజాలు దోచిపెట్టి దళారులుగా డబ్బు దండుకోవడం - ప్రాజెక్టులు - ఇసుక ఏదుంటే అదే - ʹనీళ్లు, నిధులు, నియామకాలుʹ కోసం అడిగిన ఉద్యమకారుల ఎన్‌కౌంటర్లు ఆరంభమయ్యాయి. ఈ కుట్రలను ʹకోరలసింహంగా మారిన కుందేలుకథʹలో చిత్రించారు. మీడియా, పత్రికలు మాత్రమే కట్టుకథలు చెప్పే స్థాయి నుండి అన్ని రాజకీయపార్టీల నాయకులు - అంతకంతకు వల్లకాడులుగా ఉత్పత్తిరంగాలైన వ్యవసాయ పారిశ్రామికరంగాలు - గ్రామాలు పట్టణాలు మారుతూ ఉంటే - ʹభూతలస్వర్గంʹ తామే మాట్లాడే స్థితికి చేరుకున్నారు... మళ్లీ జర్నలిస్టులు కొత్తడిక్షన్‌ వెతుక్కోవల్సివచ్చింది. అలాంటి కథే ʹభూతలస్వర్గంʹ.

కూర్మనాథ్‌ తిరిగి తిరిగి మళ్లీ తన దగ్గరికి తనే చేరుకున్నాడు. అదే అశాంతి - అదే జర్నలిస్టు జీవితం - అణచివేత, తిరుగుబాటు ఒకేచోట ఒకే కాలంలో - అనేక అపజయాలు -

ఉద్యమాలు ఆదివాసుల్లోకి మారిపోయాయి- గ్రామీణ, పట్టణ ప్రాంతాలు నివురుగప్పిన నిప్పులా మారిపోయాయి. అర్థశతాబ్దం, మూడుతరాలు కొనసాగిన విప్లవపోరాటాలు ఆలోచనలో పడ్డాయి - ఆదివాసులు, దళితులు, మహిళలు, మతమైనార్టీలు మరింత అణచివేతకు, దోపిడికి గురయ్యారు. వన్‌హండ్రెడ్‌ ఇయర్స్‌ ఆఫ్‌ సాలిట్యూడ్‌ నవలలో లాగ - మూడుతరాల, యాభయి సంవత్సరాల వీరోచిత విప్లవపోరాటాల అనంతరం కూడా ప్రతితరం తప్పులను పునరావృతం చేయడం పరిపాటయ్యింది. చరిత్ర పునరావృతమౌతుంది. తెలంగాణ సాయుధపోరాటం- విరమణ, దొరలు మళ్లీ ఊళ్లల్లోకి వచ్చారు. ఇప్పుడు అదే జరుగుతోంది.

హేతువిరుద్ధమైన, హేయమైన, పుక్కిటి పురాణాల బ్రాహ్మణీయ తత్వశాస్త్రం, రాజకీయాలు, మూడువేల సంవత్సరాలుగా ʹకులంʹ పునదితో అదనపు విలువను, ఆస్తులను, అధికారం అత్యంత కౄరంగా, హింసాత్మకంగా, మాయోపాయంగా కొల్లగొడుతూనే ఉన్నది. ముస్లింలతో, ఆంగ్లేయులతో ఆఖరుకు విప్లవోద్యమంతో దేనితోనైనా కలగల్సిపోయే ఊసరవెల్లి ʹబ్రాహ్మణీయʹ రాజకీయం. బతుకుతూనే వుంది.....

ఏతావాతా మైదానప్రాంతాలు 90శాతంగా గల ప్రజలు విప్లవోద్యమాలకావలనే ఉన్నారు. ʹకులంʹ పునాది కాగల విప్లవోద్యమాల వర్గపోరాటాల దారి ఆలశ్యంగా తిరిగి పుంజుకునేవేళ కమాండర్‌ కల్నల్‌ ఆరెలియానో బూన్డియా కేవలం ఇగో కోసం పద్దెనిమిది యుద్ధాలు చేశానంటాడు.

కూర్మనాథ్‌ ఈ గడబిడలో ʹనగరంలో ఇంకోరోజుʹ గడవక మరింత పేరుకపోయిన వ్యక్తం గాని, విస్ఫోటనం చెందని అసహ్యాన్ని - భిన్న ప్రపంచాల క్రౌర్యాన్ని - పసిపిల్లల కలలను, పక్షుల, జంతువుల కలలను మోస్తూ తిరుగుతూనే ఉన్నారు. మారుమూల పల్లెల దాకా...... పైగా నిర్బంధం తన మామగారైన వివి ద్వారా తన జీవితంలో భాగమయ్యింది....

ఈ పదిహేడు కథలు చదివితే - మనలోలోపలి దాన్ని కూర్మనాథ్‌తో సరిపోల్చుకుంటాం. సుదీర్ఘ విప్లవోద్యమ కాలంలో విధ్వంసంలోని - గతిస్తున్న అమానుషమైనదాన్ని - అనివార్యంగా రూపొందుతున్న నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని మనకు మాంత్రిక వాస్తవికత ద్వారా ఎరుక కలిగించుకుంటాం....

అదేమిటో చిత్రించాలంటే కూర్మనాథ్‌ లాగా మనం యాతన పడాల్సిందే...

అల్లం రాజయ్య
మంచిర్యాల
02 ఫిబ్రవరి 2019


No. of visitors : 468
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెలుతురు న‌ది

అల్లం రాజ‌య్య‌ | 03.07.2016 02:04:45am

ʹʹదళితులు, బహుజనుల స్థితిగతులు, చరిత్ర గురించి పూలే, అంబేద్కర్‌ ఎంతో కొంత చెప్పిండ్లు. కాని మహిళల చరిత్ర ఉందా? లేదా? ఉందేమో తనకు తెలియదేమోʹʹ రాజు లోలోప......
...ఇంకా చదవండి

ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు

అల్లం రాజయ్య | 01.04.2019 03:11:28pm

రాత్రులకురాత్రుల్లు పిచ్చివాడిగా అరిచినా కూడా వొడువుదు. దిగులుదిగులుగా- తనకే స్పష్టంగానిదేదో పూనినవానిలాగా విరసంలోతిరుగుతూ... తిరుగుతూ.. అప్పటికే విరసంలో.....
...ఇంకా చదవండి

విస్తరణ - క‌ల‌ల‌కు దారులైన దండ‌కార‌ణ్య క‌థలు

అల్లం రాజయ్య | 05.03.2020 12:30:34pm

ఇందులో భిన్నమైన కథా నిర్మాణం ఉంది. ఉద్యమ విస్తృతిలో విప్లవకారుల, ప్రజల వ్యక్తిగత అనుభవం, గతితార్కిక మానవ సంబంధాల అధ్యయనం, ఆచరణ ద్వారా దశలు దశలుగా ఎదగడం కనిప...
...ఇంకా చదవండి

మూడో తరానికి...

అల్లం రాజయ్య | 19.02.2020 03:00:32pm

ఐక్యంగా పురోగమనించడానికి దారులు వెతకడానికి విప్లవ కథ ప్రయత్నించడం కన్పిస్తుంది. ఇందులో కొత్త వస్తువులు, కాలానికి తగిన శిల్ప రీతులు కూడా కనిపిస్తాయి....
...ఇంకా చదవండి

తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం

అల్లం రాజయ్య | 17.12.2019 10:09:31pm

ప్రజాపోరాటాలను, ప్రజా జీవితం లోలోతులు చిత్రించడానికి ఇంత పెద్దఎత్తున రచయితలు, కళాకారులు పూనుకోవడం గతంలో అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడడం, క్రమంగా తగ్గడం, ఇప్టా.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •