బాబుకు ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది.

| సంపాద‌కీయం

బాబుకు ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది.

- సాగర్ | 16.04.2019 12:13:15am

ప్రజాస్వామ్యం అంటే మీకు లెక్కలేదా? అసలు ఇది ప్రజాస్వామ్యమా, పోలీసు రాజ్యమా? ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఎంత దూరం అయినా పోతా.. నా పోరాటం ఆంతా ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికే. మోదీ, అమిత్ షా చేతుల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతా.. ఇంతలా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంది ఏ హక్కుల కార్యకర్తలో, మేధావి వర్గానికి చెందిన వారో అనుకుంటే పొరపాటే. మామూలుగా ప్రతిపక్ష పార్టీల వాళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉంటారు. అధికారం దూరమైతే ప్రజాస్వామ్యం గుర్తుకు రావడం, మళ్ళీ అధికారంలోకి రాగానే అంతా మర్చిపోవటం ఆనవాయితీ. అయితే ఈ సారి ఈ మాటలంటున్నది ప్రతిపక్షమూ కాదు. ఇవి ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నోట వచ్చినవి. అవును, బాబు గారికి ప్రజస్వామ్యం గుర్తొచ్చింది.

తన పదమూడేళ్ళ పాలనలో పచ్చి నియంతృత్వ పోకడలతో ప్రజలపై అంతులేని రాజ్యహింసను కొనసాగించినవాడు. కరెంట్ ఛార్జీల పెంపునకు నిరసన తెలిపిన రైతులపై బషీర్ బాగ్ వద్ద కాల్పులు జరిపించినవాడు. కరువుతో రైతులు అల్లాడుతుంటే వ్యవసాయం దండగంటూ అవహేళన చేసినవాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గ్రేహౌండ్స్ బలగాలు, కోవర్టులు సాయంతో వందలాది మందిని ఎన్కౌంటర్ ల పేరిట చంపినవాడు. నయీం లాంటి వాళ్ళను తయారు చేసి, చీకటి మాఫియాను నడిపించి పౌరహక్కుల నేతలను పట్టపగలు నడిరోడ్డు మీద నరికించినవాడు. నక్సలైట్లకు, ప్రభుత్వానికి మధ్య శాంతి చర్చలు జరగాలని ప్రజాస్వామికవాదులు సంవత్సరాల తరబడి కృషి చేస్తే చర్చలకు ఒప్పుకున్నట్లు నాటకమాడి, మోసం చేసి అప్పటి పీపుల్స్ వార్ కేంద్రకమిటీ నాయకులను హత్య చేయించినవాడు. శాంతికి సమాధి కట్టినవాడు. ఇప్పుడు ప్రజాస్వామ్యం గల్లంతైందని రోడ్డు మీదికొచ్చాడు. పౌరహక్కుల నాయకులపై, ప్రజాసంఘాలపై అక్రమ కేసులు పెట్టి, హత్యలు కూడా చేయించి ఇప్పుడు తనకు, తన పార్టీకి అన్యాయం జరిగిందని, ప్రజాస్వామికవాదులందరూ స్పందించాలని మాట్లాడుతున్నాడు.

మారిన మనిషినని మలివిడత అధికారంలోకి వచ్చీ రాగానే ఎర్ర చెందనం స్మగ్లర్ల పేరుతో తమిళనాడుకు చెందిన కూలీలను శేషాచలం అడవులలో హత్య చేయించింది ఎవరో? భూసేకరణను వ్యతిరేకించన రైతులపై అక్రమ కేసులు మోపింది, మహిళా సంఘాల మీద బూటకపు ప్రచారం చేయించి బెదిరించింది, తితిలి తుఫాను బాధితులకు బియ్యం పంచిన వారిమీద రాజద్రోహం కేసులు మోపింది ఎవరో? ఎక్కడో హైదరాబాద్ లో ఉన్న అమ్మాయిల ఇంటికి అక్రమంగా తన పోలీసులను పంపించి కిడ్నాప్ చేయించి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని విశాఖపట్నం జైలులో నిర్బంధించిన వాడేనా వేరే రాష్ట్రం నుండి మాపై పోలీసుల దాడులు చేయిస్తున్నారంటున్నది? జీతాలు పెంచమని ఆందోళన చేసిన హోంగార్డుల మీద అదే డిపార్టుమెంట్ కు చెందిన పోలీసులతో లాఠీ ఛార్జ్ చేయించిన మనిషేనా హక్కుల గురించి మాట్లాడుతున్నది? బహుశా ఆయన చేసిందంతా ప్రజాస్వామ్యమేనేమో! నిరసన తెలిపిన ఉద్యోగలును మీ అంతూ చూస్తా అంటూ బెదిరింపులకు పాల్పడడం ప్రజాస్వామ్యమే! తన ముందుకొచ్చి ఎక్కడ ప్రశ్నిస్తారోనని చేసే ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలు ప్రజాస్వామ్యమే. ప్రజాసంఘాలు ధర్నా చేస్తే, కూలీలను పెట్టించి పోలీసులతో పోటీ ధర్నా చేయించడం ప్రజాస్వామ్యమే. తను గొప్పగా కాపాడిన ప్రజాస్వామ్యం ఇప్పుడు ఏమైపోతోందోనని చంద్రబాబు ఆందోళన.

నిరుద్యోగులకు భృతి ఇస్తానంట్టాడు కానీ సక్రమంగా ఉద్యోగాలను భర్తీ చేయడు అడిగితే అరెస్టులు చేయిస్తాడు. రైతులకు ʹఅన్నధాత సుఖీభవʹ పెట్టుబడి డబ్బులు ఇస్తానంటాడు కానీ పంట నేలను నాశనం చేస్తున్న విత్తనాలను, ఎరువులను అరికట్టడు పైగా ప్రోత్సహిస్తాడు. ఎందుకంటే అది సామ్రాజ్యవాద కంపెనీలకు అవసరం కాబట్టి. రాయలసీమ రైతులు తమకు న్యాయంగా రావాల్సిన శ్రీశైలం నీటిని వారికీ ఇవ్వడు, నీటి వాటా అడిగిన వారిని అరెస్టులు చేయిస్తాడు. అయన మీటింగ్ ఉంటే ముందుగానే ప్రజసంఘాల వారిని, అసమ్మతి తెలియచేస్తారనుకునే వారికి గృహనిర్బంధం అమలు చేస్తాడు. అక్రమంగా ఇసుకు తరలిస్తున్నారని అడ్డుకున్న అధికారిణిని పట్టపగలే తమ ఎమ్మెల్య్ కొడతాడు విషయం అడిగితే ఎదురుదాడి చేస్తాడు. అప్పుడు మాత్రం ప్రజాస్వామ్యం విలువలు లాంటివి గుర్తురావు. కానీ తనదాకా వస్తే తను అణిచివేసినవారందరు తనకు అండగా ఉండాలంటాడు.

అంతులేని రాజ్యహింసకు, హక్కుల హననానికి పాల్పడిన చంద్రబాబు ప్రజాస్వామ్యం విలువలు అంటూ మాట్లాడటం కొత్తగా, వింతగా, కాసింత వినోదంగా కూడా ఉండొచ్చు. తనదాకా వస్తే గాని ప్రజాస్వామ్యం విలువ తెలిసిరాలేదని, ఏదేమైనా మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కదా అని కొంతమంది ఎంతో కొంత సంతృప్తి పడవచ్చు.

ఇలా ఒక్క చంద్రబాబుకు మాత్రమే కాదు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఉత్తర్ ప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ తో పాటు దేశంలోని మిగతా రాజకీయ నాయకులకు ఉన్నట్టుండి గత కొద్ది రోజులుగా ప్రజస్వామ్యం గుర్తొస్తున్నది. ఇంతలా ప్రజాస్వామ్యం గురుంచి మాట్లాడటానికి కారణం మోదీనే. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోదీ, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూ బ్రాహ్మణీయ శక్తులు ఈ అయిదేళ్ళ కాలంలో స్వయం ప్రతిపత్తి సంస్థలను ధ్వంసం చేసారు. యూనివర్సిటీలు మొదలు ఆర్బీఐ, కోర్టులు, ఎన్నికల కమిషన్, సీబీఐ ఒక్కొక్కటిగా కేంద్ర ప్రభుత్వం చేతిలో పావులుగా మారాయి. సీబీఐ అయితే ఎప్పటి నుండో కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారి బంటులా వ్యవహరిస్తూ వస్తున్నది. గతంలో అది కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అయితే ఇప్పుడు బిజెపి అనుకూల టీం లా వ్యవహరిస్తుంది. అయితే యూనివర్సిటీలు, ఆర్బీఐ మొదలైనవి బ్రాహ్మణీయ హిందూ ఫాసిజంలో భాగంగా ధ్వంసం కాబడినప్పట్టికి వీరెవరికీ వాటితో పేచీ లేదు. ఈ విషయంలో దేశంలో ఉన్న బూర్జవ పార్టీలకు ఎటువంటి విభేదాలు లేవు. కానీ ఆయా రాజకీయ పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాలలో అందునా ఎలక్షన్స్ సమయంలో లేదా బిజెపికి అనుకూలంగా లేని చోట్ల ఈ సంస్థలను ఉపయోగించి వీరిని తన గుప్పెట్లో పెట్టుకోవాలనుకోవడం మిగతా వారికి మింగుడుపడని వ్యవహారం. ప్రజాస్వామ్యం, విలువలు అంటూ మాట్లాడుతున్న వీరందరికి వీటి మీద ఇసుమంతైనా గౌరవం ఉందని అనుకోలేం.

చంద్రబాబైనా, ఇంకోరైనా బూర్జువా పార్టీల నాయకులు మాట్లాడే ప్రజాస్వామ్యం ప్రజలకు సంబంధించినది కాదు. తాము అధికారంలోకి రావడానికి, దోపిడీ చేయడానికి వారికి బిజెపితో సమానంగా అవకాశాలు కావాలి. 13 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో కానీ, 40 ఏళ్ల రాజకీయ జీవితంలో కానీ చంద్రబాబు ఈ స్థాయిలో ప్రజాస్వామ్యం అని మాట్లాడింది లేదు. చివరాఖరుకు ఎన్నికల సమయంలో ఆయనకు ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది. ఎందుకు? ఏమిటా ప్రజాస్వామ్యం అంటే టిడిపి అభ్యర్థులపై ఐటి దాడులు జరగడం, ఎన్నికల సమయంలో ఐపిఎస్ అధికారులను బదిలీ చేయడం, కేసీఆర్, జగన్ మోదీతో ఉన్నారనడం ప్రజాస్వామ్యం సంక్షోభంలో పడటానికి కారణం అంటాడు.

ఆయన మాట్లాడుతున్న ప్రజస్వామ్యం ఈవీఎంలు బదులు బ్యాలెట్ రూపంలో ఎన్నికలను నిర్వహించడం గురించి. ప్రజలకు అయిదేళ్లకు ఒకసారి ఓటువేసి తమను ఎన్నుకోడానికి అవకాశం ఇస్తున్నాము కాబట్టి అవి పద్ధతిగా జరగాలని అంటున్నాడు. ఓటు వేయడంతోటే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది అని చెప్పదలిచాడు. ఎలెక్షన్ కమిషన్ పక్షపాతంతో వ్యవహరించకూడదు. కానీ తమకు అనుకూలంగా వ్యవహస్తే ప్రజాస్వామ్యానికి ఇబ్బంది లేదు. ఈవీఎంలు హ్యాక్ చేసే అవకాశం ఉన్నదని, వాటి ద్వారా కేంద్రంలో ఎవరు కావాలంటే వారు గెలుస్తారు కాబట్టి వాటిని రద్దు చేయాలని తద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అంటున్నాడు. గతంలో తను ఇదే పద్దతిలో గెలిచినప్పుడు, బిజెపితో సావాసం చేసినప్పుడు చంద్రబాబుకు ఇబ్బంది కాలేదు.

ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కులను కాపాడటం, వ్యవస్థలు ప్రజల కోసం పనిచేయటం అని కాదు ఆయన ఉద్దేశం. అయిదేళ్లకు ఒకసారి ఓటు వేసి తమకు అధికారం కట్టబెట్టే వారుగా తప్ప ప్రజలను ఈ వ్యవస్థలో భాగంగా చూడటం లేదు. కాబట్టి ఆయన ప్రజాస్వామ్యం ఆయనదే. దానికోసం ప్రజాస్వామికవాదులందరూ మాట్లాడాలాట!¬


No. of visitors : 461
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


స్మృతి చిహ్నాలు... పోరాటపు గుర్తులు

సాగ‌ర్‌ | 19.09.2016 10:53:49am

స్మృతి చిహ్నాలు మనం చూడలేని గత చరిత్రకి సంబందించిన ఆనవాళ్లుగాను , ఒక తరం నుంచి మరొక తరానికి వాటి రాజకీయ భావజాలాన్ని ప్రచారం చేసే సాధనలుగాను , వారి అమర........
...ఇంకా చదవండి

నేనూ అర్బన్ మావోయిస్టునే

సాగర్ | 22.09.2018 09:53:57pm

పూణే పోలీసులు బీజేపీ ప్రభుత్వం చేసిన ఈ అమానవీయ చర్యకు ప్రజలు ʹమీ టూ అర్బన్ నక్సల్ʹ, ʹపూణే పోలీస్ జవాబు దోʹ అంటూ తమ నిరసనను తెలిపారు......
...ఇంకా చదవండి

ప్రజల పై యుద్ధం

సాగ‌ర్‌ | 05.10.2016 12:31:57am

ప్ర‌జ‌లు,సామ‌జిక కార్య‌క‌ర్తలు నేడు దండకారణ్యంలో జరుగుతున్న పాశవిక దాడికి, హక్కుల హననాకి వ్యతిరేకంగా తమ మద్దతు తెలపాల్సిన అవసరంను ఈ పుస్తకం మనముందుంచుతుంది ...
...ఇంకా చదవండి

ఆ కాఫీ తోటలు ఎవరివి?

సాగర్ | 05.10.2017 11:05:45pm

విశాఖ మన్యంలో ఆదివాసులు 30 ఏళ్లగా మావోయిష్టు పార్టీ నాయకత్వంలో పోరాడి కాఫీ తోటలపై సంపాదించుకున్న యాజమాన్య హక్కును తిరిగి తీసుకోవడానికి ఆంద్రప్రదేశ్ ......
...ఇంకా చదవండి

కిసాన్ ముక్తి మార్చ్

సాగర్ | 06.12.2018 12:02:02am

ʹఅయోధ్య ఆలయం కాదు రుణ మాఫీ కావాలిʹ నినాదాలతో దేశ రాజధాని ప్రతిధ్వనించింది. లక్షకు పైగా రైతుల మట్టి పాదాలు తాకి ఢిల్లీ పార్లమెంట్ వీధులు పులకించాయి......
...ఇంకా చదవండి

వేటకెళ్ళిన ఆదివాసులను వేటాడి చంపిన పోలీసులు

సాగర్ | 17.03.2019 10:35:13pm

తమ కాళ్ళ కింద ఉన్న అపార ఖనిజ సంపదను పెట్టుబడిదారులకు పంచిపెట్టడానికి ప్రభుత్వాలు ఆదివాసులను చంపివేస్తున్నాయి. ఆ నిర్బంధాన్ని, హింసను తట్టుకుని వారు ప్రభు......
...ఇంకా చదవండి

చంద్రబాబు అయిదేళ్ల పాలన - మీడియా మేనేజ్మెంట్

సాగర్ | 01.04.2019 01:47:11pm

చంద్రబాబు చేసిన దోపిడీ అంతా ఆయన మానేజ్మెంట్ నైపుణ్యంతో అభివృద్ధి అయింది. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలలో తిరిగి దీనినే ఉపయోగిస్తూ ʹనేను రాకపోతే అన్ని ఆగిపోతాయిʹ అ.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌
  భారత విప్లవోద్యమంలో చారుమజుందార్ శతజయంతి సదస్సు
  విరసం నాయకుడు జగన్‌పై అక్రమంగా పెట్టిన ఉపా కేసు ఎత్తివేయాలి
  అరుణతార అక్టోబర్ 2019
  మనమూ తేల్చుకోవాల్సిందే
  ఆత్మీయ కలయిక
  కరవాలం చెప్పిన రహస్యం
  కాశ్మీరు మనది!
  మంచి కథ ఎప్పుడూ పాఠకుల ఆలోచనలకు పదును పెడుతుంది
  అక్షర సాహసులకు చైతన్య స్ఫూర్తి విరసం
  విరసం తో నా అనుబంధం - అనుభవం
  కులం - విప్లవోద్యమ అవగాహన, ఆచరణ - 2

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •