గోరక్షక దాడుల వెనక అసలు కథ

| సాహిత్యం | వ్యాసాలు

గోరక్షక దాడుల వెనక అసలు కథ

- పి.వరలక్ష్మి | 16.04.2019 12:28:00am

ఆవుల్ని వధిస్తున్నారని, కబేళాలకు తరలిస్తున్నారని, స్మగ్లింగ్‌ చేస్తున్నారని చెప్తూ బిజెపి, దానికి సంబంధించిన సంస్థల గూండాలు ముస్లింల మీద, దళితుల మీద దాడులు చేసి తీవ్రంగా హింసించడం, హత్యలు చేయడం 2014 నుండి విపరీతంగా పెరిగిపోయింది. అంతకు ముందు కూడా గోరక్షణ పేరు మీద ఆరెస్సెస్‌, దాని అనుబంధ సంస్థలు ఏవేవో పేర్లు పెట్టుకొని దాడులు చేసేవి. హిందూ మత పిచ్చి రాజకీయాలకు ఆవు సెంటిమెంటును అవి ఇంధనంలా వాడుకున్నాయి. అధికారంలోకి వచ్చాక బీఫ్‌ రాజకీయాలకు పోలీసు యంత్రాంగం మద్దతు కూడా తోడైంది. సుమారు మూడువందల మంది దాడులకు గురైనారు. నలభై మందిని పట్టపగలు కొట్టి చంపారు. ఈ హింసాకాండను చట్టం గుడ్లప్పగించి చూడటమే కాదు, దాడులకు గురైనవాళ్ళ మీద, చచ్చిపోయిన వాళ్ళమీద కూడా ఆవు కేసు ఫైల్‌ చేసి విచారణ జరిపింది. ప్రపంచవ్యాప్తంగా మానవహక్కుల సంస్థలు ఈ దాడులకు నివ్వెరపోతున్నాయి. దేశభక్తి వాగాడంబరాల నడుమ దేశాన్ని పచ్చి అనాగరిక దశలోకి దిగజార్చిన ఘనత మోడీకి, ఆయన భక్తులకు దక్కింది. అయితే ఈ దాడుల వెనక ఉద్దేశం నిజంగా గోసంరక్షణేనా? దీనిని పరిశోధించడానికి నిరంజన్‌ తక్లే అనే జర్నలిస్టు సాహసోపేతంగా ఒక స్టింగ్‌ ఆపరేషన్‌ చేసాడు.

నిరంజన్‌ తక్లే నిజంగానే నిజం కోసం నిలబడే సాహస జర్నలిస్టు. చదివింది ఎలెట్రానిక్స్‌ ఇంజనీంగ్‌ అయితే, తను ఇష్టపూర్వకంగా జర్నలిస్టు వృత్తిని ఎన్నుకున్నాడు. సిఎన్‌ఎన్‌-ఐబిఎన్‌, ది వీక్‌ వంటి సంస్థల్లో పనిచేసాడు. జస్టిస్‌ లోయా హత్య మిస్టరీని గురించి ఆయన రాసిన విషయాలు సంచలనం అయ్యాయి. ఇప్పుడీ గోహత్యల వెనక ఆయన ఆవిష్కరించిన అసలు కథ వైరల్‌ అయింది.

ఈ స్టింగ్‌ ఆపరేషన్‌ కోసం నిరంజన్‌ ఒక ముస్లిం వ్యాపారిగా మారువేశం వేసాడు. రఫిక్‌ ఖురేషీ అనే పశువుల వ్యాపారిగా మూడు నెలల పాటు రాజస్థాన్‌ పశువుల మార్కెట్లు, గుజరాత్‌ కబేళాల మధ్య 30 ట్రక్కుల్లో తిరిగాడు. అప్పుడాయనకు అర్థమయ్యింది ఏమిటంటే పశవులను తరలించే వాహనాలు సురక్షితంగా గుజరాత్‌ కబేళా చేరుకోవాలంటే సదరు గోరక్షక దళాలకు డబ్బులు సమర్పించుకోవాలని. ట్రక్కులో ఆవులుంటే 15వేలు, గేదెలుంటే 6,500 ఈ గోరక్షక మాఫియా వసూలు చేస్తుంది. ఈ వ్యవహారం గమనించాక నిరంజన్‌ ఈ మాఫియా మొత్తానికి పెద్ద తలకాయ వంటి భజరంగ్‌దళ్‌ నాయకుడు పాలన్‌పూర్‌కు చెందిన చౌదురిని కలిసాడు. తను ఫలానా వ్యాపారం చేస్తానని చెప్పి డీల్‌ కుదుర్చుకోడానికి బేరం మొదలు పెట్టాడు. వ్యాపారం పెంచాలని చూస్తున్నానని, రోజుకు 40 ట్రక్కుల వరకు తరలించే ఆలోచన ఉందని చెప్పి డిస్కౌంట్‌ అడిగాడు. మాటల సందర్భంలో తమ బిజినెస్‌ నడవాలంటే ప్రజల్లో భయం పుట్టించాలని, అందుకని అప్పుడప్పుడు ఎవడినో ఒకడిని చంపాల్సి వస్తుందని సదరు మాఫియా బాస్‌ చెప్పుకొచ్చాడు.

వీళ్ళే పెట్టిన ఇంకో రూల్‌ ఏమింటంటే ఆవును చంపిన తర్వాత ఈ ʹగోరక్షకʹ ముఠాకు చర్మం ఫ్రీగా ఇవ్వాలి. మీ మతంలో ఇది చెయ్యకూడనిది కదా అని నిరంజన్‌ అడిగితే చౌదురి లక్ష్మిదేవి బొమ్మ చూపించి నేను ఈ దేవతను పూజింస్తాను, చర్మాన్ని కాదు అన్నాడట. ఆయన మాటల్లోనే తెలిసిందేమిటంటే ఒక్క అమీర్‌గర్‌ చెక్‌పోస్టు నుండే రోజుకు ఒకటిన్నర కోటి వసూలు అవుతుందని. కింది నుండి పైదాకా ఎవరి భాగం వారికి పోయినా కూడా ఈ లెక్కన ఈ మాఫియా ఆదాయం దేశంలో దేనితో పోల్చడానికి కూడా వీలుకానంత ఉంది కదా!





No. of visitors : 573
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోషలిజమే ప్ర‌త్యామ్నాయం, నక్స‌ల్బ‌రీయే భారత విప్లవ పంథా

పి.వరల‌క్ష్మి | 29.04.2016 11:02:35am

20, 21వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన భిన్న ధోరణుల‌న్నీ సారాంశంలో మార్క్సిస్టు వ్యతిరేకత ముఖ్యమైన ల‌క్షణంగా కలిగి ఉంటున్నాయి. కొన్నయితే మార్క్పిజం పేరుతోనే ప్రపంచ...
...ఇంకా చదవండి

నేనెందుకు రాస్తున్నాను?

పి.వరలక్ష్మి | 05.10.2016 01:16:41am

బూర్జువా పార్టీలు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తాయి కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం రాస్తాను. ఉదాహరణకు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని దశాద్బాలుగా ఒక.......
...ఇంకా చదవండి

పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలు

వ‌ర‌ల‌క్ష్మి | 12.03.2017 12:32:58am

సంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ - సోషలిజమే ప్రత్యామ్నాయం (విర‌సం సాహిత్య పాఠ‌శాల కీనోట్).....
...ఇంకా చదవండి

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం

| 28.07.2016 08:35:37pm

అసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, ఆమె సామాజిక జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ .......
...ఇంకా చదవండి

సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹ

పి.వరలక్ష్మి | 03.09.2016 01:40:55am

మన ఊర్లలో గూటి గువ్వలు, పాల పిట్టలు, ఎర్ర జొన్నలు, సజ్జ గింజెలు ఏమైపోయాయి? రాయలసీమ ప్రకృతి మరింతగా ఎందుకు నాశనమవుతోంది? పౌష్టిక ఆహారాన్నిచ్చే తిండి .......
...ఇంకా చదవండి

ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.

పి.వరలక్ష్మి | 19.11.2019 08:06:37pm

నాగప్పకు బొత్తిగా బాలేదు. ఇరవై రోజుల క్రితం కింది నుండి తొడల భాగం దాకా విపరీతంగా బొబ్బలోస్తే పులివెందుల గవర్నమెంట్ ఆస్పర్తిలో చేర్చారట. రెండు రోజులుండి వచ్...
...ఇంకా చదవండి

ఇది మనిషి మీద యుద్ధం

పి. వరలక్ష్మి | 19.04.2016 10:59:20am

సైనిక, రాజకీయార్థిక, ప్రచార రంగాల్లో సామ్రాజ్యవాదం ఎంత దాడి చేస్తున్నదో అర్థం చేసుకోవాలంటే వాటన్నిటినీ అనుసంధానించే మంద్రస్థాయి యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి...
...ఇంకా చదవండి

మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రం పై కీనోట్

పి. వ‌ర‌ల‌క్ష్మి | 03.06.2016 10:43:06pm

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రంపై రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి. వ‌ర‌ల‌క్ష్మి కీనోట్‌...
...ఇంకా చదవండి

ఉనా స్వాతంత్ర నినాదం

పి.వరలక్ష్మి | 15.08.2016 10:44:28pm

ఆగస్టు పదిహేను ద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకుʹ అని చెరబండరాజు అన్నట్లు బూటకపు స్వాతంత్రాన్ని ఎండగడుతూ నిజమైన స్వాతంత్రం కోసం ఉనా దళిత సమ్మేళనంతో... ...
...ఇంకా చదవండి

ప్రొఫెస‌ర్‌ క‌ంచ‌ ఐల‌య్య‌కు సంఘీభావంగా భావప్రకటనా స్వేచ్ఛకై

వరలక్ష్మి | 01.06.2016 09:29:12am

ప్రభుత్వాలు భావాల పట్ల నియంత్రణలు అమలుచేయజూస్తూ, భిన్నాభిప్రాయాన్ని, నిరసనను క్రిమినలైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్య...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

  • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
  • Students and the Revolution
  • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    వాళ్ల స్వేచ్ఛ కోసం పోరాడదాం
    నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
    భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
    నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
    లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
    కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
    కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
    ʹ రాగో ఏమవుతుంది? ʹ
    "తిన్నాడో లేదో పాపం"
    పరిమళభరిత తావుల్లోంచి
    ఆకలి చెమట వాసన
    ఇంద్రావతి..

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •