నిన్న కురిసిన
వర్షం తాలూకు తడి ఆరలేదు
వాకిళ్ళనిండా
ఖద్దరు చొక్కాల కాలిగుర్తులు చెరిగిపోనేలేదు
ఓటర్ల మీద కురవడానికి
తాయిలాలతో పొట్టకొచ్చిన మబ్బుల జాడసలేలేదు
హామీలు మొలకెత్తలేదు
కహానీలు ఇంకా మరచిపోనేలేదు
మళ్ళీ మబ్బులు కమ్ముకుంటున్నాయి
మేఘాలు ఆగమేఘాల మీద పరుగెడుతున్నాయి
నిన్నటి వరదకు
బార్ల జాలార్ల నిండా నోటు మేటవేసి కూర్చుంది
తడిచి ముదై చలిజ్వరమొచ్చి మంచంపట్టిన ఓటు
ఇప్పుడిప్పుడే లేచి కూర్చుంటోంది
అంతలోనే మళ్ళీ వాన
ఇప్పుడు దేశమంతా ముసురుకున్న వాన
నిన్నటి వానలో వరదలో బురదలో
కొట్టుకుపోయినవాళ్ళు పోగా
అందిన తుంగ పోసల ఆసరాతో
బతుకు జీవుడా అని తేలినవాళ్ళు తేలగా
ఒడ్డుకు కొట్టుకొచ్చి గద్దెమీద
నిద్దురపోయే పాతిక పాలక కప్పల బెకబెకబెక
డెబ్బై ఏండ్లుగా
ఈ వాన వచ్చిపోతూనేవుంది
వరదలో పూరిగుడిసె కొట్టుకుపోతూనేవుంది
చూపుడువేలు సిరాచుక్క మోసపోతూనేవుంది
వానొస్తే
పుడమి పులకరిస్తుంది
పువ్వు మురిసిపోతుంది
మట్టి పొత్తిళ్ళ నుండి విత్తు కన్ను తెరుస్తుంది
పంటచేను పచ్చపచ్చగా నవ్వుతుంది
చెమటచుక్క ఇంద్రధనస్పై మెరుస్తుంది
దేశం దేశమంతా
కడుపారా తిని కండ్లారా కునుకుతీస్తుంది
పార్లమెంట్
పాలరాతి భవంతిలో ఏర్పడిన
అల్పపీడన ద్రోణి ప్రభావంతో
ఏప్రిల్ పదకొండు నుండి
మే పందొమ్మిది వరకు
భారీ నుండి అతిభారీ వర్షాలు పడే అవకాశముందని
భారత ఎన్నికల వాతావరణ శాఖ తెలియజేసింది
నోట్ల ఓట్ల చిటపట చినుకుల జడిలో తడిలో తడిచి
పెట్టుబడి ముచ్చటపడుతుంది
బహుళజాతి కంపిని బహుదోపిడి ముఖాలతో నవ్వుతుంది
పెట్టుబడీ పార్లమెంటూ చెట్టాపట్టాలేసుకొని
వానా వానా వల్లప్పా అని
చినుకుల్లో చిందులేస్తుంది
ఇక్కడ విత్తుకు విలువలేదు
రైతుకు నిలువనీడలేదు
దేశం ఆకలి పేగు
రాజస్థాన్ థార్ ఎడారై విస్తరిస్తుంది
పెట్టుబడీ పార్లమెంట్
చుట్టిర్కం కలుపుకొని రాజ్యమేలుతోంది
ఐదేండ్లకోసారి కురిసే వాన
అప్పుడప్పుడు ముందస్తు అకాల వర్షమై కుమ్మరిస్తుంది
మధ్యంతరం కుండపోత వానవుతుంది
అన్నీ వడగండ్లవానలే
కళ్ళం గింజల మీద
కన్నెర్రజేసిన వానోలె
చెమట చుక్కలమీద
చెడగొట్టు వాన ఇది
Type in English and Press Space to Convert in Telugu |
అతడూ అర్బన్ నక్సలైటేఅతడిప్పుడు
భౌతికంగా మన కళ్లముందుంటే
అతడూ అర్బన్ నక్సలైటే
దేశ అంతర్గత భద్రతకు
అత్యంత ప్రమాధకారే
... |
అతడేమన్నాడుమనుషులు కనిపిస్తే
అల్లుకపోయే మల్లెచెట్టు
మాటల్లో పూచే మల్లె పూలు
ఎప్పుడూ తన ఉనికిలోనే మోదుగ పూలై పూస్తాడు
ఎల్లప్పుడూ చీమల బారై తిరుగాడుతాడు
అతని కనుల మహా స... |
ఇల్లుమూటనిండా
ముల్లెవుందని
కారుకూతల నోరు జారారు
రాజ్యం కోడై కూసింది
ఆ తల్లి
మూట ముడివిప్పి చూస్తే
పిడికిళ్ళెత్తి
జేజేలు పలుకుతూ
జనమే జనం
... |
అర్హత
అతడు
తన గొంతునూ వెంటబెట్టుకెళ్ళాడు
గొంతు అతని నిరసన గళం... |
యురేనియమంఅడవికి
ఆదివాసికి
అతికిన బొడ్డుతాడు పుటుక్కున తెంపుదాం
నోటికాడి
పోడు బువ్వ బుక్కను
కాకులై తన్నుకుపోదాం
దూపబుడ్లు
ఊటచెరువుల
కడుపెండబెడదాం
నల్లమల నిండ... |
"దేశభక్తి"మనలో దేశభక్తి ఊటలు ధారలుగడుతుంటే
వాడు ధరల అడుగులు
ఒక్కోమెట్టు ఆకాశం మేడెక్కించే పనిలో ఉంటాడు
మనం దేశభక్తి శిగాలొచ్చి ఊగుతుంటే
పెట్టుబడి చుట్టాల నెత్తిమీది
... |
కరోనా కర్ఫ్యూనీకూ నాకూ మధ్య
మాస్క్ ములాఖత్ గోడ కట్టుకోవాల్సిందే... |
అడవి - నదిఅమరులు
ఆకాశ దీపాలు
అలల అరచేతుల మీదుగా
బిడ్డల్ని
ఒడ్డుకు చేర్చిన ఇంద్రావతి గుండెల మీద నిద్రపుచ్చి
ఆకుల
చీరంచు కప్పిన గడ్చిరోలి... |
పూల పరిమళం వాళ్ళువాళ్ళు
మా ఇంటి పెరట్లో ఎర్రమందారాలు
మా చేను సెలకల్లో నవ్వే గోగుపూలు... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |