విప్లవకవి వరవరరావు తదితరుల విడుదల కోరుతూ..

| క‌ర‌ప‌త్రం

విప్లవకవి వరవరరావు తదితరుల విడుదల కోరుతూ..

- విరసం | 16.04.2019 09:58:01am

పార్లమెంటరీ రాజకీయాలకు బైట ప్రజా, విప్లవ రాజకీయాలను నమ్ముతున్నందుకు దేశంలోని ప్రముఖ మేధావులను, రచయితలను జెయిల్లో పెట్టారు. వరవరరావు దేశంలోనే గుర్తింపు ఉన్న విప్లవ కవి, మేధావి. సాయిబాబా ప్రజా ఉద్యమ నాయకుడిగా, అధ్యాపకుడిగా, బుద్ధిజీవిగా అందరికీ తెలుసు. వీరిద్దరు మన తెలుగు సమాజాలకు చెందినవారు. వెర్నన్‌ గొంజాల్వెస్‌, సురేంద్ర గాడ్లింగ్‌, సుధాభరద్వాజ్‌, షోమాసేన్‌, అరుణ్‌ఫెరేరా, సుధీర్‌ధావ్లే, రోనావిల్సన్‌, మహేష్‌ రౌత్‌ వేర్వేరు రంగాల్లో దేశవ్యాప్త గుర్తింపు ఉన్న మేధావులు.

గత ఏడాది అక్టోబర్‌ 27 మొదలు నవంబర్‌ 17 మధ్యకాలం ఈ తొమ్మిదిమందిని అరెస్టు చేశారు. అంతక ముందు ఆగస్టు 28న వీళ్లతో పాటు మరి కొందరి ఇండ్ల మీద దేశవ్యాప్తంగా దాడులు చేశారు. ఆ తర్వాత కోర్టు జోక్యంతో గృహ నిర్బంధంలో ఉన్నారు. చివరిగా నవంబర్‌ 17 వరవరరావును అరెస్టు చేశారు. ఆనంద్‌ తేల్‌తుంబ్డే, గౌతంనవల్ఖాలను అరెస్టు చేసే అవకాశం ఉంది. సాయిబాబను నాలుగునర సంవత్సరాల కింద ఒక అబద్ధపు కేసులో అరెస్టు చేశారు. ఆ తర్వాత జీవిత ఖైదు విధించారు.

ఇప్పుడు వీళ్లందరినీ అర్బన్‌ మావోయిస్టులని అంటున్నారు. కాబట్టి దేశద్రోహులని సంఘ్‌ ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. కోర్టులను తనకు అనుకూలంగా మార్చేసుకొని న్యాయ ప్రక్రియను అడ్డుకుంటోంది. అన్యాయ, అప్రజాస్వామిక వేదికగా న్యాయస్థానాన్ని మార్చేసింది. దీనికి ఇటీవల ప్రొ. సాయిబాబా మెడికల్‌ బెయిల్‌ కొట్టివేత కంటే ఉదాహరణ లేదు. ఆయన ఆరోగ్యం క్షీణించి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు. కానీ కోర్డు అయన ఆరోగ్యం నిలకడగా ఉందని, అత్యున్నత వైద్యం అందుతోందని న్యాయస్థానం పోలీసు భాషలో తీర్పు చెప్పింది.

ఇదంతా ఒక రాజకీయ వ్యూహంలో భాగంగా కొనసాగుతున్న అణచివేత. మావోయిస్టు ఉద్యమం గురించేకాదు, దళితులు, ముస్లింలు, ఆదివాసుల వంటి పీడిత అస్తిత్వ ప్రజల గురించి మాట్లాడేవాళ్లందరినీ అర్బన్‌ మావోయిస్టులని సంఘ్‌పరివార్‌ ప్రభుత్వం అంటోంది. అలాంటి వాళ్లందరినీ అణచివేస్తోంది. ఒక వేళ రేప్పొద్దున ఎన్నికల ఫలితాల్లో మరో పార్టీనో, కూటమో కేంద్రంలో అధికారంలోకి వచ్చినంత మాత్రాన, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఈ సమస్య పరిష్కారం కాదు. పాలకపార్టీలన్నీ వ్యక్తీకరణలో చిన్నపాటి తేడాతో విప్లవ, ప్రజా రాజకీయాలపట్ల ఒకే వైఖరితో ఉన్నాయి. తప్పుడు ఆరోపణలు చేయడం, అక్రమ సాక్ష్యాలు తీసుకరావడం, కుట్రపూరితంగా అన్ని వ్యవస్థలను నడిపి నిర్బంధం ప్రయోగించడంలో అన్ని పార్టీలు ఆరితేరినవే. జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నిటికీ దుర్మార్గమైన అణచివేత చరిత్ర ఉంది.

ప్రజా ఉద్యమ సమర్థకులైన బుద్ధిజీవులను, రచయితలను అర్బన్‌ మావోయిస్టులని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నప్పుడు దీనిపట్ల విప్లవకర వైఖరి ఎలా ఉండాలి? అనేది ఒక కీలకమైన రాజకీయ ప్రశ్న. మావోయిస్టు రాజకీయాలతో సంబంధం ఉన్న వాళ్లను, లేనివాళ్లను కూడా అర్బన్‌ మావోయిస్టులని కేసులు పెట్టి జెయిలుపాలు చేస్తున్న వ్యూహాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మధ్య తరగతి మేధావుల్లో, రచయితల్లో, ప్రజా ఉద్యమాభిమానుల్లో ఆందోళన కలిగిస్తున్న ఈ వర్తమాన పరిస్థితుల్లో ఏది సరైన అవగాహన అవుతుంది? అనే ప్రశ్నల వెలుగులో ʹఇప్పుడు కావాల్సింది అర్బన్‌ మావోయిస్టులేʹ అనే పుస్తకం విడుదలైంది. మావోయిస్టు రాజకీయాల్లో విశ్వాసం ఉండటం, వాటి ప్రచారానికి పని చేయడం భారత రాజ్యాంగం ప్రకారం ఎంత మాత్రం నేరం కాదు. ఏదైనా నేర పూరిత చర్యకు పాల్పడితే అరెస్టు చేయవచ్చు. అందువల్లే ఈ పది మంది మీదగాని, దేశవ్యాప్తంగా జెయిళ్లలో ఉన్న వేలాది మంది రాజకీయ ఖైదీల మీదగాని భయంకరమైన నేరాలు చేశారని తప్పుడు ఆరోపణలు చేశారు. కుట్రపూరితమైన సాక్షాలు తీసుకొచ్చారు. తద్వారా ఏ రాజకీయాలనైనా నమ్మే స్వేచ్ఛను కాలరాస్తున్నారు. ఈ మొత్తం అణచివేత వ్యూహంలో అర్బన్‌ మావోయిస్టులనే ప్రచారం భాగం. కాబట్టి దానితో ఎలా వ్యవహరించాలో ఈ పుస్తక రచయితలు వివరించారు. వరవరరావు తదితరుల విడుదల డిమాండ్‌ చేస్తూ ఈ పుస్తకాన్ని పరిచయం చేసుకోవడం అర్థవంతంగా ఉంటుంది. ఈ సభకు మీ అందరికీ స్వాగతం.

ʹఇప్పుడు కావాల్సింది అర్బన్‌ మావోయిస్టులేʹ పుస్తకావిష్కరణ సభ

19 ఏప్రిల్‌ 2019 శుక్రవారం సాయంకాలం 6.00 గంటలకు
సూరన తెలుగుతోట, మద్దూరు నగర్‌, కర్నూలు

అధ్యక్షత: అరుణ్‌
పుస్తకావిష్కర: ప్రొ. సుభాషిణి(ప్రముఖ రచయిత్రి)
పుస్తక పరిచయం: మల్లెల భాస్కర్‌(విరసం)
ఇంకా ఈ పుస్తక రచయితలు వరలక్ష్మి, పాణి మాట్లాడతారు.


No. of visitors : 291
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఆగస్టు 2019

  ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగ వ్యతిరేకం
  వేటగాడి వల
  పదునెక్కుతున్న కోరలు
  ఎదురుచూపులు
  యురేనియమం
  మనిషి లోపలి ప్రకృతి గురించి చెప్పిన మంచి కథ ʹ ఆఖరి పాట ʹ
  నిశ్శబ్దంగానో, నిర్మాణంగానో
  దళిత నవలా సాహిత్యంలో ఒక మైలురాయి "నిషిధ"
  చరిత్ర కన్న శిశువు - చరిత్రకు మార్గదర్శి
  ʹఅస‌మ్మ‌తిʹపై ఎక్కుపెట్టిన అస్త్రం

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •