దేశం ప్రశాంతంగానే వుంది

| సాహిత్యం | స‌మీక్ష‌లు

దేశం ప్రశాంతంగానే వుంది

- వీరబ్రహ్మాచారి | 16.04.2019 12:18:31pm

చెంచయ్య అంటున్నడు
దేశం ప్రశాంతంగానే వుంది. ఆ! ఔనా!! ఎట్ల?!
వ్యంగ్యం,

అవస్థల వ్యవస్థ రథ సారథులను కత్తితో పొడవదు. కని, వాళ్ళ ఒంటిమీదకు వేల చీమలనొదిలి కంపర మెత్తిస్తది. గోళ్ళతో గోకినా, కర్రతో కసిగా గీక్కున్నా కంపరం చల్లారదు. కత్తితోగోక్కోలేడు. వాడి కంపర సలుపుళ్ళ అవస్థలనుచూసి శ్రోతలం, చదువరులం ఐన మనను ఫకఫక నవ్విస్తది.
మనలను శాడిస్టులను చేస్తది. ఎట్లనా! చెంచయ్యవి అసొంటి కొన్ని కొంటె కవితా ఖండికలు.

ʹవెంకటేశా శ్రీనివాసా
చాలులే నీ తమాషా!
బ్రహ్మసత్యం జగన్మిథ్యని
గీతలో నువు చెబితివి
డబ్బుకోసం కొండపైన
లార్జిస్కేలిండస్ట్రీపెడితివిʹ
----
ʹస్వాతంత్ర్య దినం కాబట్టి చాక్లెట్లిస్తున్నరో,
లేక చాక్లెట్లిస్తున్నరు కాబట్టి స్వాతంత్ర్య దినం
అనుకోవాలో నాకు అర్థం కాలేదుʹ
ʹఉన్న స్వాతంత్ర్యం ఎక్కువై
భరించలేక ఉక్కిరిబిక్కిరై
స్వాతంత్ర్యం రాలేదని అనుకుంటున్నం గాని
నిజానికి స్వాతంత్ర్యం వచ్చిందనే చెప్పాలి!ʹ
అని అంటూ మనను తికమక పెడ్తడు.

ʹవెధవ కూడూ గుడ్డా లేదని
విప్లవం కావాలంటావాʹ
కాస్త నిరాశ, కాస్త నిస్పృహ, కాస్త వైరాగ్యం
కలిపి తయారు చేసిన టానిక్కు
హిందూమతం మందుల షాపులో
దొరుకుతుంది కొనుక్కోʹ మని విప్లవ కవికి సలహా ఇస్తడు. పరాచికమాడ్తడు.

ʹదేశం ప్రశాంతంగనే ఉంది!
అయోధ్యలో ఒకపాత మసీదు నేలమట్టం అయిందంతే
ఎనభైకోట్ల జనాభాలో ఆఫ్ట్రాల్ రెండువేల మంది ప్రాణాలొదిలారంతే
అంతకు మించి ఏం కొంప మునిగిందని?
గతంలో ముస్లిములూచచ్చారు, హిందువులూ చచ్చారు
మసీదులూ కూలాయి, మందిరాలూకూలాయి
ఇప్పుడైనా అర్థమైందా మీకు? అన్నిమతాలూ సమానమేననిʹ

అదే కవితలో మరో చోట
త్రేతాయుగంలోనే లక్షలాదిʹరాక్షసుʹల రక్తం మరిగిన రాముడు
ఎన్నాళ్ళని శాకాహారిగ ఉండగలడు!
భక్తులు రాముడికి పాదసేవ చేసి చేసి విసిగిపోయారు పాపం
వెరైటీగా ఉంటుందని ఒక్కసారి మసీదులోʹ ʹకరసేవʹ చేసుకోమన్నాంʹ
ʹదేశం ప్రశాంతంగానే కాదు, సుʹభిక్షంʹ గానూ ఉంది.

ఇంత కొంటెతనంలో భావుకుడూ ఉన్నడననీకె,

ʹకోయిలా కోయిలా ఎక్కడున్నావే
మా హృదయ తంత్రులు
తెగిపోయినాయే
మృదువైన గీతితో
అతికింపరావే!
ఆ వైపు చాలించి
మా వంక మరలవే.ʹ
పాదంలో ʹఆʹ, మాʹ వైపులేవో రసజ్ఞులకు తెలువకపోదు.

ʹతీయతీయని గాన
మీనాడు కొరగాదు
అగ్ని కణములు చిమ్మ
గొంతెత్తి పాడవేʹ
ʹకదిలించు నీ గాన
మనిపించరావె
వినిపించి పోవేʹ

ʹశోకాన్ని పొందనివాడు
శ్లోకాన్ని కూర్చలేడు
పది మందిని ద్వేశిస్తున్నవాడు
తొంబైమందిని ప్రమించగలడుʹ అని నిక్కచ్చిగా చెప్తడు.

ఇక గాంభీర్యం
ʹఅమ్మా భారత మాతా!
సామాన్యుడు వినిపించే
సంగీతం వింటావా?ʹ
ʹఅనునిత్యం కనిపించే
హృదయ విదారక సత్యం
దళితుల కరాళ నృత్యం
ఇది ఓర్పులేని ప్రళయం
ఇది తూర్పుకాంతి ప్రసవంʹ

పుస్తకం చివరి కవితలో

ʹవాడు
నన్ను కలం పట్టొద్దన్నాడు
ఒళ్ళు మండి పోయింది
చల్లబడ్డాక ఆలోచించాను...
ఇప్పుడు పట్టాల్సిది కలం కాదని!ʹ

2010 ఏప్రిల్ లో విశాఖపట్నం 22 వ మహాసభల్లో రాసి చదివిన ఈ కవిత , ఇప్పటి యువ కవులు
చేయవలసిన పనిని
ʹఓ అమర కళా వేత్తలారా ...
కలంమాత్రమే పట్టిన చాలదూ
గళం మాత్రమే విప్పిన ...ʹ అనే జన నాట్య మండలి కవెవరో రాసిన పాటలోని సందేశాన్ని
యాదికి తెస్తది.

No. of visitors : 181
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణ‌తార - మే 2019
  ఎర్ర‌జెండా - కార‌ల్‌మార్క్స్
  ర‌చ‌న - స్వేచ్ఛ - ప్ర‌జాస్వామ్యం
  వివి, ఆయన సహచర అర్బన్‌ మావోయిస్టు ఖైదీలతో ఆ కొన్ని ఘడియలు
  159 కేసులను ఎదుర్కొన్న ఒక మహిళా నక్సలైట్ కథ
  ఒక వికృతి
  ఎవ‌రు పాస‌ర‌య్యార‌ని?
  స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ
  స‌త్యాన్ని స‌మాధి చేసే కుట్ర‌
  విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •