మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి

| ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు

మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి

- విరసం | 20.04.2019 09:23:54pm


పౌర, భావ ప్రకటనా స్వేచ్ఛలపై తెలంగాణ ప్రభుత్వ ఫాసిస్టు దాడికి ఇది నిదర్శనం

ఎమ్మార్పీఎస్ నాయకుడు మంద క్రిష్ణమాదిగను తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదులో గృహ నిర్బంధానికి గురి చేసింది. ఈ ఘటన తెలంగాణలో పౌర ప్రజాస్వామిక హక్కుల సంక్షోభాన్ని సూచిస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం భిన్నాభిప్రాయ ప్రకటనను సహించని ఫాసిస్టు దశకు చేరుకుంది. గ్రామాల్లో అగ్రకుల పెత్తందార్ల పోకడను మంద క్రిష్ట విషయంలో ప్రదర్శించింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వాధినేతగా కేసీఆర్ వైఖరిని క్రిష్ణ తన విమర్శ ప్రకటించారు. ప్రభుత్వాల్లో, అధికార యంత్రాంగంలో అగ్రకుల తత్వం లేదని మన దేశంలో ఎవ్వరూ నిరూపించలేరు. దీనిపై క్రిష్ణ తనదైన విమర్శ పెట్టారు. ఆ హక్కు ఆయనకు ఉంది. ఆందోళనకారుడిగా ఆయన ఈ విషయంపై ధర్నాకు పిలుపు ఇచ్చారు. ఇది ప్రభుత్వం భరించలేకపోయింది. ఆయనను ఈ నెల 27 దాకా గృహ నిర్బంధానికి గురి చేసింది. ఇలా ప్రభుత్వం తన స్వభావాన్ని బాహాటంగా ప్రదర్శించింది. ప్రభుత్వ విధానాలపట్ల, ప్రభుత్వాధినేతల వ్యవహార శైలిపట్ల పౌరులు భిన్నాభిప్రాయాన్ని ప్రకటించే వాతారణం ఉంటేనే ప్రజాస్వామ్యం. లేకపోతే పాత రోజుల్లో ఊళ్లలో నడిచిన దొరల రాజ్యమైనట్లే. సరిగ్గా ఇవాళ తెలంగాణలో కేసీఆర్ దొరల రాజ్యం నడుపుతున్నారు. తనకు భిన్నమైన దాన్ని సహించలేని స్థితిలోకి వెళ్లిపోయారు. అధికార ఉన్మాదంతో పాశవిక రాజ్యాన్ని నడుపుతున్నారు. ఇలాంటి పాలకుడికి సామాజిక సమానత్వం కోసం పాటుపడిన అంబేద్కర్ లాంటి ఉద్యమకారులపట్ల గౌరవం ఉంటుందంటే ఎలా నమ్మగలం? సహజంగానే ఇలాంటి వాళ్లు వర్తమాన రాజకీయ ప్రపంచంలో తమకు భిన్నమైన ఆలోచనలతో ఉద్యమిస్తున్న శక్తులను అణచివేయాలని చూస్తారు. ఇందులో భాగమే క్రిష్ణమాదిగ నిర్బంధం. ఈ అప్రజాస్వామిక విధానాన్ని ఖండిద్దాం. తెలంగాణలో పౌర ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమిద్దాం.

పాణి

విరసం కార్యదర్శి

20- 04-2019

No. of visitors : 481
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  వాళ్ల స్వేచ్ఛ కోసం పోరాడదాం
  నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
  భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
  నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
  కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
  కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
  ʹ రాగో ఏమవుతుంది? ʹ
  "తిన్నాడో లేదో పాపం"
  పరిమళభరిత తావుల్లోంచి
  ఆకలి చెమట వాసన
  ఇంద్రావతి..

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •