విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

| సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

- | 01.05.2019 01:10:41am

నేడు సామ్రాజ్యవాదానికి కంచుకోటగా పరిణమించిన అమెరికాలో మే దినోత్సవానికి కార్మికవర్గం నాంది పలికింది. అది 1886 సంవత్సరం. అంతకు ముందు సంవత్సరకాలంలో వందలాది సమ్మెలలో లక్షలాదిగా కార్మికులు పాల్గొన్నారు. రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తామనే నినాదంతో అమెరికాలోని చికాగో మొదలైన అనేక నగరాలలో పెద్ద ఎత్తున ప్రద్రర్శనలు జరిపిన ప్రజానీకం తమ రక్తతర్పణతో కార్మికోద్యమాన్ని అరుణారుణం చేశారు. 1890 నుండి మే 1న దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ప్రదర్శనలు జరపాలని అమెరికా కార్మికవర్గం నిర్ణయించింది.

ఫ్రెంచి విప్లవ శతవార్షికోత్సవం సందర్బంగా పారిస్ లో సమావేశమైన రెండవ ఇంటర్నేషనల్ ఏటా మే 1వ తేదీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం జరపాలని పిలుపునిచ్చింది. ఈ విధంగా "మేడే" ప్రపంచ కార్మిక వర్గానికి దీక్షా స్వీకారంగా రూపొందింది.

శ్రామికవర్గ సమైక్యత అధికారం నుండి శత్రువును కూలదోసి శ్రామిక రాజ్యం స్థాపించేవరకు తిరుగులేని, రాజీలేని విప్లవ పోరాటమే లక్ష్యసాధనకు ఏకైక మార్గం.

ఈ మార్గం కష్టభరితమే. అపారమైన త్యాగాలతో కూడినది. ఇప్పుడున్న మన శ్రామికవర్గం పరిస్థితి ఏమంత సుఖప్రదంగా ఉన్నదిగనుక, కష్టాలకు, త్యాగాలకు వెనుకంజ వేయాలి? మనకు పోయేదేముంది? దారిద్య్రం, దోపిడీ, బానిసత్వపు సంకెళ్ళేకదా? మన విజయం, ఆ పిమ్మట ప్రపంచపు సుఖ సంపదలు సమస్తం మన శ్రామికవర్గానికి ఆదీనం కావడం తథ్యం.

మన ఆశయం, ధ్యేయం, దానికి మార్గం ఇంత సుస్పష్టంగా ఉన్నాయి కదా, శ్రామిక రాజ్యస్థాపనకు ప్రతిజ్ఞచేసి వంద సంవత్సరాలకు పైగా గడిచిన శ్రామికవర్గం ఇప్పటికి ఇంకా మౌలిక సూత్రాలనే పునశ్చరణ చేసుకొంటూ ఉండవలసిన అవసరం ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమౌతుంది.

ఒక మహాకవి చెప్పినట్లుగా "ముందు దగా, వెనుక దగా, కుడిఎడమల దగా, దగా" తలపిస్తునందు వల్లనే శ్రామికవర్గ పోరాటపు పురోగతి అనేక రకాల ఒడిదుడుకులకు తాత్కాలిక పరాజయాలకు లోనౌతూ వచ్చింది.

అందుచేతనే శ్రామికవర్గ సమైక్యతను పునరుద్ఘాటించి శ్రామిక రాజ్యస్థాపనకు మనం తిరిగి దీక్షబూనవలసిన ఈ "మేడే" రోజున, మన పురోగతికి అవరోధాలుగా వస్తున్న నానారకాల స్వభావాల్ని నిశితంగా పరిశీలించి, ముందు దారిని సుగమం చేసుకోవడం ఎంతైనా అవసరం.

మార్క్స్, ఏంగెల్సులు ప్రతిపాదించిన శాస్త్రీయ సోషలిజం అనే స్వప్నాన్ని లెనిన్ మహాశయుడు ఆచరణలో పెట్టి సాయుధ విప్లవ పోరాటం ద్వారా ప్రథమ శ్రామికవర్గ సోషలిస్టు రాజ్యాన్ని శ్రామికవర్గ నియంతృత్వం కింద నెలకొల్పారు. బూర్జవా దోపిడిని నిర్మూలించి శ్రామిక రాజ్యాన్ని నెలకొల్పడం ఆచరణ సాధ్యమని రుజువైనది.

ఆ పిమ్మట మరి పెక్కు యూరప్, ఆసియా దేశాలలో సోషలిస్టు రాజ్యాల అవతరణకు ఆస్కారం ఏర్పడింది. దీర్ఘకాలిక సాయుధ పోరాటం ద్వారా కామ్రేడ్ మావో నాయకత్వాన చైనా శ్రామిక రాజ్యాన్ని నెలకొల్పుతున్నది. సాయిధ గెరిల్లా పోరాటంగా ప్రారంభమైన క్యూబా విప్లవం విజయవంతం కావడంతో దక్షిణ అమెరికా ఖండంపై అరుణపతాకం సాధికారికంగా ఎగురుతుంది.

ఈ దేశాల పోరాటాల నుండి, నేడు బూర్జవా వర్గ దోపిడీకి వ్యతిరేకంగా జాతీయ విప్లవ పోరాటాలలో నిమగ్నమైన దేశాలలోని కార్మికవర్గం చారిత్రిక గుణపాఠాలను నేర్చుకోవాలి.

భారతదేశంలో బూర్జవా ఉదారవాద అభివృద్ధి నిరోధక శక్తులేకాక, కొత్త, పాత రివిజనిస్టులు రాహుకేతువుల్లా విప్లవసూర్యుడిని మరుగుపర్చాలని యత్నాలు చేస్తున్నారు. భారతదేశంలో సాయుధ విప్లవపోరాట ఆవశ్యకత లేదని శాంతియుత పరివర్తన ద్వారా, పార్లమెంటరీ పంథాలోనే సోషలిజం సాధించవచ్చునని వాదిస్తున్నారు.

మన దేశ ఆర్ధిక, సామాజిక పరిస్థితులు స్వాతంత్ర్య అనంతర కాలంలో మరీ విషమించి, స్వదేశీ విదేశీ దోపిడీదారి శక్తుల లాలూచీ పరాకాష్టనందుకోగా ప్రజల అసంతృప్తి జ్వాలలు మిన్నంటుతూ విప్లవకర పరిస్థితి పరిపక్వమౌతూ వచ్చింది.

కాని కొత్తపాత రివిజనిస్టు అంధులకు అదేమీ కనిపించలేదు. ఇలాంటి నిరాశాకరమైన మేఘాలు ఆవరించిన భారత రాజకీయ యుగంలో, సిసలైన మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానం నుండి ఉత్తేజం పొందిన నవ విప్లవ శక్తులు నక్సల్బరీలో ఆవిర్భవించి అనతికాలంలోనే దేశంలో పెక్కుచోట్ల సాయుధ రైతాంగ పోరాటలుగా పరిణితి చెందాయి.

ఈ పరిస్థితులలో భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై ఉన్నది. ఈ భాధ్యతను గుర్తించి, పేదరైతాంగం, మధ్యతరగతి ప్రజలు, విద్యార్థి యువజనులతో కూడిన విప్లవకర శక్తులను పోరాటశీలమైన పంథాలో కార్యచరణ ద్వారా సంఘటితపరచి విప్లవాన్ని కార్మికవర్గం ముందుకు తీసుకుపోవాల్సి ఉన్నది.

ఈ విధానమైన అవగాహన వల్ల ఉత్తేజం పొంది 1969 మే 1వ తేదీన భారతదేశంలో విప్లవకర పార్టీ అవతరించింది. అదే మార్క్సిస్టు లెనినిష్టు పార్టీ. మొదట పెద్దమాటలలో విప్లవపదజాలాన్ని వల్లిస్తూ ఉద్యమంలోకి వచ్చిన శక్తులే త్వరితగతిన జారుకున్నారు. తాత్కాలిక పరాజయాలకు, జననష్టానికి బెదిరి విప్లవ పంథాకు తిలోదకాలిచ్చారు. న్యాయచట్టాల పరిధిలో రాజకీయాలు సాగించే స్థాయికి దిగజారారు.

అందుచేత ఈ మే దినోత్సవం రోజున భారత కార్మికవర్గం విప్లవపంథాకు పునరంకితం కావాల్సిన అవసరం ఇనుమడించింది.

కార్మికులారా ఏకకంకండి అనే నినాదాన్ని నేటి పరిస్థితులకు అన్వయించి దీర్ఘకాలిక సాయుధ విమోచనోద్యమాన్ని పోరాటపంథాలో ఏకంగా పురోగమించండి అని ఎలుగెత్తి చాటడం, ఆచరణలో పెట్టడం కార్మికవర్గానికి పవిత్ర కర్తవ్యం.

(పిలుపు పత్రిక మే 1, 1973)

No. of visitors : 826
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార సెప్టెంబర్ 2019

  దళిత భక్త కవి రవిదాస్‌ సంత్‌ ఆలయం కూల్చివేత హిందూ ఫాసిజంలో భాగమే
  The Destruction of Kashmir is a Deathblow to Democracy in India
  నల్లమల యురేనియం గని కాదు, జీవవైవిధ్య కేంద్రం
  అతడు ఆమె అడవి
  మానవ సంబంధాల ఉన్నతీకరణకు చక్కటి ఉదాహరణ ʹ చందమామ రావేʹ
  కన్ ఫామ్... !
  బందిష్
  రాంగూడ ప్రాంతంలో సమిష్టితత్వం, సహకార పద్ధతి
  కళలన్నా, సాహిత్యమన్నా ఫాసిజానికి భయం
  కవులకు సమర స్ఫురణ

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •