స‌త్యాన్ని స‌మాధి చేసే కుట్ర‌

| సంపాద‌కీయం

స‌త్యాన్ని స‌మాధి చేసే కుట్ర‌

- సంఘర్ష్ | 03.05.2019 03:11:51pm

సర్వాధికారాలనూ తన గుప్పిట పెట్టుకున్న రాజ్యం... సత్యాన్ని సమాధి చేసేందుకు సకల విద్యలనూ ప్రదర్శిస్తుంది. ప్ర‌శ్న‌ను సంధించే కలాన్ని... గళాన్ని... అక్షరాన్ని... చూసి జ‌డుస్తుంది రాజ్యం. అందుకే.... ప్రశ్నను అణచివేసేందుకు... ప్రజలను నేరస్థులను చేసేందుకు... ఎన్ని అబద్ధాలైనా ఆడుతుంది. ఎన్ని కుట్రలైనా చేస్తుంది. రాబందులను కాపాడేందుకు.... పావురాలను బంధిస్తుంది. ఇప్పుడూ... అంతే.

బీమా కోరేగావ్‌ కుట్ర కేసును ఎదుర్కొంటున్న విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావు తాత్కాలిక బెయిల్‌ పిటీషన్‌ను పూణె ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. వరవరరావుకు బెయిల్‌ మంజూరు చేస్తే... అతడు తప్పించుకుపోయే అవకాశముందంటూ విచారణ సందర్భంగా ప్రభుత్వ తరుపు న్యాయవాది వాదించ‌డం గ‌మ‌నార్హం. వరవరరావును తెలంగాణకు తరలిస్తే పోలీసులపై నక్సల్స్‌ దాడులు జ‌రిపే అవకాశముందని పూణె పోలీస్‌ జాయింట్‌ కమిషనర్‌కు హైదరాబాద్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ లేఖ రాసిందట‌. న్యాయస్థానంలో ప్ర‌భుత్వ త‌రుపు న్యాయ‌వాది చేసిన స‌త్య ప్ర‌క‌ట‌న ఇది.

90 శాతం వైల‌క్యంతో... 19 ర‌కాల వ్యాదుల‌తో బాధ‌ప‌డుతూ మృత్యువుతో పోరాడుతున్న జి.ఎన్‌. సాయిబాబాను సైతం అత్యంత ప్ర‌మాద‌క‌ర వ్య‌క్తిగా ప‌రిగ‌ణించింది రాజ్యం. అందుకే... సాయిబాబా ద‌ర‌ఖాస్తు చేసుకున్న బెయిల్ పిటీష‌న్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తిర‌స్క‌రిస్తూ.. వ‌స్తోంది. ఎనిమిది ప‌దుల వ‌య‌సున్న ఓ క‌విని, వీల్ చైర్‌కి ప‌రిమిత‌మైన ఓ అధ్యాప‌కుడిని చూసి రాజ్యం ఎందుకంత భ‌య‌ప‌డ‌తోంది? ఒక న్యాయ‌వాదిని, ఒక క‌ళాకారుడిని, ఒక ప‌రిశోధ‌కుడిని, ఒక పాత్రికేయుడిని చూసి ఎంద‌కంత‌గా జ‌డుస్తోంది? అవును... రాజ్యానికి భ‌యం. వాళ్ల ఆలోచ‌న‌లంటే భ‌యం. ప్ర‌జ‌ల గొంతుక‌గా మారిన వాళ్ల ఆచ‌ర‌ణ అంటే భ‌యం. అందుకే.... రోజుకో కొత్త కేసు బ‌నాయిస్తూ వాళ్ల‌ను బ‌య‌ట‌కు రానీయ‌కుండా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది.

భీమా కోరేగావ్‌ హింసాకాండ కేసులో ప్ర‌ధాన నింధితులైన శంబాజీ భీడే, మిళింద్ ఎక్బోటేల‌ను కాపాడేందుకు... ప్ర‌ధాని హ‌త్య‌కు కుట్ర ప‌న్నార‌నే కొత్త వాద‌న‌ను ముందుకు తెచ్చిన మ‌హారాష్ట్ర పోలీసులు అందుకు ఆధారంగా త‌ప్పుడు లేఖ‌ల‌ను సృష్టించారు. ప్ర‌ధాని హ‌త్యకు కుట్ర పేరుతో.. ప‌ది మంది హ‌క్కుల కార్య‌క‌ర్త‌ల‌ను జైళ్ల‌లో బంధించింది. ఈ సంఖ్య రోజుకు రోజుకు మ‌రింత పెరిగే అవ‌కాశ‌మూ లేక‌పోలేదు. జైళ్ల‌లో ఉన్న‌వారిని బ‌య‌ట‌కు రానీయ‌కుండా అడ్డుకునేందుకు... రోజుకో కొత్త నాట‌కాన్ని ముందుకు తెస్తున్న పోలీసులు ... వరవరరావుపై మ‌రో అబద్ధపు కేసు బనాయించారు.

గడ్చిరోలి జిల్లా అహెరి పోలీస్ స్టేషన్ పరిధిలోని సుర్జాగడ్ ప్రాంతంలో మైనింగ్‌కి పాల్ప‌డుతున్న లాయిడ్స్‌ మెట‌ల్ అండ్ ఎన‌ర్జీ లిమిటెడ్‌కు చెందిన 75 వాహ‌నాల‌ను 2016 డిసెంబ‌ర్‌లో ఆదివాసులు త‌గ‌ల‌బెట్టారు. ఈ ఘ‌ట‌న‌కు కుట్ర చేశార‌నే ఆరోప‌ణ‌లతో వ‌ర‌వ‌ర‌రావు, న్యాయ‌వాది సురేంద్ర గ‌డ్లంగ్‌పై కేసు న‌మోదు చేశారు. దాడికి జ‌రిగిన ప్రాంతానికి వంద‌ల కిలో మీట‌ర్ల దూరం నివ‌సించే వ‌ర‌వ‌ర‌రావు, సురేంద్ర గ‌డ్లింగ్‌లు ఈ దాడికి ఎలా కార‌ణ‌మ‌వుతార‌నే సందేహం ప్ర‌తి ఒక్క‌రిలోనూ ఉద‌యిస్తుంది.

నిజానికి సూరజ్‌గ‌డ్‌లో గ‌నుల త‌వ్వ‌కం ద్వారా వేలాది మంది ఆదివాసీలు నిర్వాసితులు అవుతున్నారు. ఈ విధ్వంసానికి వ్య‌తిరేకంగా సుధీర్ఘ‌కాలంగా స్థానిక ఆదివాసులు పోరాడుతున్నారు. ఈ పోరాటంలో భాగంగానే ప్ర‌జ‌లు లాయిడ్స్ కంపెనీ వాహ‌నాల‌ను త‌గ‌ల‌బెట్టారు. బ‌హుళ‌జాతి సంస్థ‌కు అండ‌గా నిలిచిన రాజ్యం ప్ర‌జల తిరుగుబాటును అణ‌చివేసేందుకు ఆదివాసుల‌పై మావోయిస్టుల ముద్ర‌వేసి వారిని అక్ర‌మ కేసుల్లో ఇరికించింది. ఆదివాసుల పోరాటానికి అండ‌గా నిలిచిన మావోయిస్టు ఉద్య‌మాన్ని అణ‌చివేసేందుకు వేలాదిగా సాయుధ బ‌ల‌గాల‌ను మోహ‌రించి గ్రామాల్లో యుద్ధ వాతావ‌ర‌ణాన్ని సృష్టించింది. గ‌త ఏడాది ఏప్రిల్ 22, 23 తేదీల్లో ఏకంగా 40 మంది మావోయిస్టులు, ఆదివాసుల‌ను హ‌త్య‌చేసిన రాజ్యం పెట్టుబ‌డి మేం పాదాక్రాంత‌మ‌ని మ‌రోచాటుకుంది.

బ‌హుళ‌జాతి కంపెనీల దోపిడీని, రాజ్య‌హింస‌ను ప్ర‌శ్నంచినందుకు ఇప్పుడు... హ‌క్కుల కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జాస్వామిక వాదుల‌పై అక్ర‌మ కేసులు బ‌నాయించి జైళ్ల‌లో నిర్భందిస్తోంది రాజ్యం. వ‌ర‌వ‌ర‌రావు, స‌రేంద్ర గ‌డ్లింగ్ స‌హా గ‌డ్చిరోలి జిల్లాలోని ఆదివాసీల ప‌క్షాన పోరాడుతున్న మ‌హేష్ రౌత్‌ను సైతం బీమా కోరేగావ్ కేసులో ఇరికించ‌డ‌మే అందుకు నిద‌ర్శ‌నం. గ‌త ఏడాది బూట‌క‌పు ఎన్‌కౌంట‌ర్‌లో 40 మందిని హ‌త్య చేసిన రాజ్యం మావోయిస్టు ఉద్య‌మంపై తాము సాధించిన విజయంగా ప్ర‌క‌టించుంది. ఇక టీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మైతే.. తెలంగాణ‌లో మావోయిస్టు ఉద్య‌మం లేద‌ని ప‌లుమార్లు ప్ర‌క‌టించింది కూడా. అలాంటి ప్ర‌భుత్వాలు... ఇప్పుడు వ‌ర‌వ‌ర‌రావుకు బెయిల్ మంజూరు చేస్తే.. మావోయిస్టులు దాడులు చేసి అత‌డిని త‌ప్పిస్తార‌ని మాట్లాడ‌డం ఆశ్చ‌ర్యం గొలుపుతుంది. ప్ర‌జ‌ల ప‌క్షాన మాట్లాడే వారిని నిర్బందించ‌డం ద్వారా, ఒక భ‌యాన‌క వాతావ‌ర‌ణాన్ని సృష్టించాల‌నుకుంటోంది. స‌త్యాన్ని స‌మాధి చేయాల‌నుకుంటోంది. త‌ద్వారా.. ప్ర‌జ‌ల ప్ర‌శ్నించే హ‌క్కును అణ‌చివేయాల‌నుకుంటోంది.

ఇలాంటి సంద‌ర్భంలో రాజ్య నిర్బందాన్ని ఎదుర్కొంటున్న క‌వులు, ర‌చ‌యిత‌లు, హ‌క్కుల కార్య‌క‌ర్త‌ల విడుద‌ల కోసం, ప్ర‌జ‌ల ప్ర‌జాస్వామిక హ‌క్కుల ర‌క్ష‌ణ కోసం ఉమ్మ‌డి గొంతును వినిపించాల్సిన అవ‌స‌రం ఉంది. లేదంటే... ఈ నిర్భందం మ‌రింత తీవ్ర రూపం దాల్చే ప్ర‌మాదం ఉంది. క‌వి జీవించే, ర‌చించే హ‌క్కు కోసం కొట్లాడ‌డం ఇవాళ ర‌చ‌యిత‌ల ముందున్న త‌క్ష‌ణ క‌ర్త‌వ్యం.

No. of visitors : 504
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


అక్క‌డ డేనియ‌ల్ ఉన్నాడు

సంఘ‌ర్ష్‌ | 18.11.2016 12:59:34pm

అక్క‌డ‌ బాల్యం భ‌యంలో... య‌వ్వ‌నం నిర్బంధంలో గ‌డిచిపోతుంది. ఇంటి నుంచి బ‌య‌ట‌కెళ్లిన పిల్ల‌లు తిరిగి వ‌స్తారో రారో తెలీదు. దారి కాచుకు కూర్చునే ఖాకీ మూక‌...
...ఇంకా చదవండి

బోధ‌నా హ‌క్కు కోసం మ‌రో జైలు పోరాటం చేస్తా : ప్రొIIజి.ఎన్‌.సాయిబాబా

ఇంట‌ర్వ్యూ : క్రాంతి | 01.06.2016 12:44:47pm

1930 సంక్షోభ కాలంలో హిట్లర్ యువతను, కార్మికులను కమ్యూనిస్టుల కంటే అధికంగా ఆర్గనైజ్ చేయడాన్ని గమనించవచ్చు. ఉపాధి లేక తిరుగుబాటు స్వభావంతో ఉన్నయువతను ఫాసిస్ట...
...ఇంకా చదవండి

దూతను కాల్చివేసే చోట: బస్తర్ అడవుల్లో జీవన్మరణ సమస్యగా జర్నలిజం

సుబోజిత్ బాగ్చీ (అనువాదం : క‌్రాంతి) | 17.06.2016 09:33:33am

సామాజిక కార్యకర్తలు, లాయర్లు, న్యాయ సహాయక బృందాలు డాక్టర్లు మొదలు సామాన్యుల వరకు అక్కడ ప్రతి ఒక్కరూ తుపాకీ నీడలో జీవించాల్సిందే........
...ఇంకా చదవండి

మ‌రో ఆదివాసీ యువ‌కుడు...

క్రాంతి | 03.09.2016 03:22:46pm

17 ఏళ్ల పిల్లాడిని తీసుకెళ్లి 30 ఏళ్ల యువ‌కుడిగా త‌ప్పుడు చార్జిషీటు సిద్ధం చేశారు. 2014లో ఐదుగురు జ‌వాన్లు చ‌నిపోవ‌డానికి కార‌ణ‌మైన అంబులెన్స్ ........
...ఇంకా చదవండి

పొట్ట‌కూటి కోసం పోతే... పోలీసులు కాల్చిచంపారు

| 20.10.2016 03:21:04pm

తాపీ మేస్త్రీ కాస్తా రాత్రికి రాత్రి మావోయిస్ట‌య్యాడు. మూడు రోజుల క్రితం పనికోసం వెళ్లిన‌ మ‌నోహ‌ర్ శ‌వ‌మై తిరిగి వ‌చ్చాడు. "ఎన్‌కౌంటర్" క‌థ రిపీట్ అయ్యింది....
...ఇంకా చదవండి

వెలివాడే తొలిపొద్దై పుస్త‌కావిష్క‌ర‌ణ‌

ఫొటోలు : క‌్రాంతి | 17.07.2016 12:15:31pm

రోహిత్ వేముల స్మృతిలో విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం వెలువ‌రించిన వెలివాడే తొలిపొద్దై పుస్త‌కాన్ని రోహిత్ త‌ల్లి వేముల రాధిక ఆవిష్క‌రించారు. మార్చి ...
...ఇంకా చదవండి

సంత‌కు వెళ్లిన వాళ్లు.. శ‌వాలై వ‌చ్చారు

సంఘ‌ర్ష్‌ | 20.02.2017 11:52:50am

ఏకంగా ఇర‌వై రోజుల నుంచి మృత దేహాల‌ను ఖ‌న‌నం చేయ‌కుండా గ్రామంలోనే ఉంచుకొని ఆందోళ‌న చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క అధికారి కూడా ఈ విష‌యంలో స్పందించ‌క‌పోవ...
...ఇంకా చదవండి

అధికారం నీడ‌లో.... అంతులేని హింస‌

క్రాంతి | 05.10.2016 03:32:08pm

మోదీ ప్ర‌భుత్వం ʹ మేక్ ఇన్ ఇండియాʹ పేరిట దేశ స‌హ‌జ వ‌న‌రుల‌ను వేదాంత‌, ఎస్సార్‌, టాటా, జిందాల్ వంటి బ‌హుళ‌జాతి సంస్థ‌ల‌కు క‌ట్ట‌బెడుతోంది. అందుకు......
...ఇంకా చదవండి

ఆ చెట్టుకు నోరుంటే ..

క్రాంతి | 03.01.2017 09:49:29am

ఆట‌పాట‌ల్లో మురిసిపోయే ప‌సివాడు ఉట్ట‌న్న‌ట్టుండి న‌క్స‌లైట‌య్యాడు. క‌సిగా గుచ్చుకున్న బ‌యోనెట్ మొన వాడి మొర ఆల‌కించ‌లేదు. రాజ్యం ఎక్కుపెట్టిన తుపాకీ తూటాల...
...ఇంకా చదవండి

ఆర‌ని మంట‌లు...

| 02.11.2016 09:05:19am

2011 మార్చిలో చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని తాడిమెట్ల గ్రామంలో జ‌రిగిన మార‌ణ‌హోమం పోలీసుల ప‌నే అని సీబీఐ తేల్చిచెప్పింది. ఈ కేసులో... ఎనిమిది మంది స్పెష‌ల్ పోలీస్...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2020
  తెర ముందు కథ!
  షాహిన్ భాగ్..షాహిన్ భాగ్
  హిబా కోసం
  నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు
  సత్యాన్ని చెప్పడమే రాజకీయ కవితా లక్షణం
  షాహీన్ బాగ్... ఒక స్వేచ్ఛా నినాదం
  విప్లవం నేరం కాదు. విప్లవకారుడు నేరస్తుడూ కాదు.
  అరెస్టు - అన్‌టచబులిటీ
  విప్లవ కవిత్వంలో ఈ తరం ప్రతినిధి
  నిర్బంధ ప్రయోగశాల
  అరుణతార జనవరి - 2020

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •