స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ

| సాహిత్యం | స‌మీక్ష‌లు

స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ

- ప‌ల‌మ‌నేరు బాలాజీ | 03.05.2019 03:22:15pm

అనేకానేక కవితల ద్వారా తెలుగు సాహిత్య లోకానికి సుపరిచితమైన స్త్రీవాద కవయిత్రి మందరపు హైమవతి గారు. వారి మొదటి కవితా సంపుటి ʹసూర్యుడు తప్పిపోయాడుʹ .

వీరి రెండవ కవితాసంపుటి ʹనిషిద్ధాక్షరిʹ 2004లో వచ్చిన తర్వాత మూడవ కవితా సంపుటి ʹనీలి గోరింటʹ

(2018)పేరిట 57 కవితలని అందించారు. తన కవిత్వానికి గాను ఇదివరకే కృష్ణశాస్త్రి అవార్డు ,ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు, సి.నారాయణరెడ్డి అవార్డు ,ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు ,శ్రీశ్రీ పురస్కారాలను హైమవతి గారు అందుకున్నారు .
తెలుగు సాహిత్యంలో ఉత్తమ కవయిత్రిగా ఇదివరకే విమర్శకుల ప్రశంసలు అందుకున్న హైమవతి గారు కవిగా అనేక జాతీయ స్థాయి కవిసమ్మేళనాల్లో పాల్గొని తన కవితలని దేశవ్యాప్తంగా వినిపించిన వారు. అమ్మ గురించి రాసినా, అమ్మ కష్టం గురించి రాసినా, నాన్న గురించి రాసినా, నాన్న ప్రేమ గురించి రాసినా, స్నేహితురాలు గురించి రాసినా, కొత్త ప్రదేశాల గురించి రాసినా, పాఠశాల గురించి రాసినా, సమాజంలోని దురాగతాలను ప్రశ్నించినా, ఈ కవిత్వం నిండా ప్రకృతి పట్ల ప్రేమ, మానవ సంబంధాల పట్ల గౌరవం, స్త్రీ సమస్యల పట్ల ఆగ్రహం కనిపిస్తాయి. ఈ కవిత్వంలో ఎక్కడా నిరాశ లేదు .ప్రతి విషాద సందర్భంలో స్త్రీ పోరాడవలసిన విషయాల గురించి , సమానత గురించి సాధికారత గురించి స్పష్టమైన చారిత్రక అవగాహనతో రాసిన కవితలు పాఠకులకు ప్రేరణ కలిగిస్తాయి.

తరానికి తరానికి మధ్య ,కుటుంబ సభ్యుల మధ్య ,కుటుంబాల మధ్య, కుటుంబానికి సమాజానికి మధ్య, మనిషికి కుటుంబానికి మధ్య మనిషికి మనిషికి మధ్య ఏర్పడుతున్న ఖాళీలను ఈ కవితలు ప్రశ్నిస్తాయి. ఖాళీలను పూర్తి చేసుకోవాలని, స్త్రీల పట్ల సమాజం గౌరవంగా నడుచుకోవాలని డిమాండ్ చేస్తాయి . ఈ కవిత్వం నిండా సంఘర్షణ కనబడుతుంది.

ఆశావాద దృక్పథంతో మంచి సమాజం కోసం ఒక ఆధునిక స్త్రీ పడే తపనను ఈ కవిత్వం తప్పక చెపుతుంది. పసిబిడ్డల నుండి ముసలివాళ్ళు వరకు అన్ని ప్రాంతాల్లో స్త్రీలపై జరుగుతున్న దురాచారాలను ఈ కవిత్వం ప్రశ్నిస్తుంది. సమాజంలోని అసమానతలు స్త్రీకి అడుగడుగునా కల్పిస్తున్న అవరోధాలను స్పష్టంగా విశ్లేషణాత్మకంగా చెబుతూనే సమాజంలో , పురుషుడి లో రావాల్సిన తక్షణ మార్పును డిమాండ్ చేస్తుంది ఈ కవిత్వం. అనేకానేక ఒత్తిళ్ల మధ్య బ్రతకడానికి కూడా సమయం లేకుండా మొత్తం సమయాన్ని సంపాదనకే వెచ్చించే సంపాదనాపరుల ప్రేమరాహిత్యాన్ని నిలదీస్తుంది ఈ కవిత్వం.

ఈ కవితా సంపుటిలో చాలా కవితలు విడిగా పత్రికల్లోనే కాక వివిధ కవితా సంకలనాల్లో ప్రచురితమయ్యాయి.

ʹకూరగాయలమ్మాయిʹ కవితలో సాదా సీదా ఒక అమ్మాయి శ్రమైక జీవన సౌందర్యం తో ఎలా తనను ఆకట్టుకుందో ఆమె ఇలా చెబుతుంది .

ʹ" ఒక కాలు అరుగు మీద పెట్టి
ఒక చేత్తో నెత్తి మీద చుట్టకుదురు పెట్టి
బరువైన గంపను
శిరస్సు పై అలవోకగా ఎత్తిపట్టుకునే దృశ్యాన్ని గారడీ చేస్తున్నట్లు అబ్బురంగా చూసేదాన్ని".

ప్రపంచీకరణ నేపథ్యంలో చితికి పోయిన చిన్న వృత్తుల జీవన విషాదాన్ని ఈ కవితలో ఇంకా ఇలా చెబుతుంది

" ఇప్పుడు
మా పక్కింటి పద్మ
ఎదురింటి వనజ అందరూ
మా వీధి చివర రిలయన్స్ వెళుతుంటారు
అందమైన ప్లాస్టిక్ సంచులతో కూరలు తెస్తుంటారు

చాలా కాలం తర్వాత
పిట్టలు ఎగిరిపోయిన ఒంటరి వృక్ష౦లా
అకాల వార్ధక్య పంజరంలో
రెక్కలు ఊడబెరికిన విహంగంలా
హృదయాలను కలవరపడుతూ
ఒక ఉద్విగ్న జ్ఞాపకంలా ఆమె."

ʹవంటింటి సూర్యోదయాలు ʹ కవితలో స్త్రీని వంటింటికే పరిమితం చేసిన సంప్రదాయాలను విమర్శిస్తూ కవిత చివర్లో ఇలా అంటారు.
" బాల్య వివాహ పంజరంలో
ఊపిరాడక కోల్పోయిన పూర్ణమ్మ
కలలు కాలరాచిన
కన్యాశుల్క బాధిత బుచ్చమ్మ ల
బ్రతుకు కన్నీటి చిత్రాలు చిత్రించినందుకు గాక సామూహిక వంటశాలలు నిర్మించాలని
ఒక చిన్నమాట రాసిన గురజాడ చేతిపై
ఒక చిన్న ముద్దు పెట్టాలని నా కోరిక ".

ʹఅంతరంగ గాయాలుʹ కవితలో ఆమె ఆవేదన దురహంకార పురుష ప్రపంచానికి ఒక హెచ్చరిక.

" ఇక ఇప్పుడు
కాముక కీచకులను తప్పించుకోవడానికి
తల్లడిల్లె మహిళను కాపాడడానికి
ఏ పురుషోత్తముడు అక్కరలేదు
మా గాయాలకు మేమే లేప నాలం"

ʹకలల రెక్కలుʹ కవిత చూడండి.

"ప్రాణ హరితం పల్లవించే
పచ్చని మొక్కలా శ్వాసించాలంటే
అనురాగ సుధలు పంచే ఆడపిల్ల కావాలి

భయమెరుగని ప్రపంచంలో
బాలికలు కళ్లు తెరవాలి "

****

కొన్ని కవితలనో , కొన్ని కవితా పంక్తులనో ఉదహరించడం , ఉటంకించడం కాదు కానీ - ఈ కవిత్వాన్ని మళ్లీ మళ్లీ చదవాల్సి ఉంది. మెరుగైన మానవ సంబంధాల కోసం మెరుగైన సమాజం కోసం స్త్రీ సాధికారత కోసం, సమానత్వం కోసం ,మంచి బాల్యం కోసం మంచి జీవితం కోసం కవయిత్రి పడుతున్న తపన అంతా నిండి ఉన్న ఈ కవిత్వాన్ని ఒక్కసారిగా చదవాలి ,అప్పుడప్పుడు చదవాలి, మళ్ళీ మళ్ళీ చదవాలి.

ఈ కవితా సంపుటి కి ముందు మాటల అవసరం లేదని తెలియ చేస్తూనే శివారెడ్డి గారు, ఓల్గా గారు వ్రాసిన ముందు మాటలు ఈ కవయిత్రి కవితాశక్తిని కొత్త తరం పాఠకులకు సవివరంగా తెలియ చేస్తాయి.

ఈ కవిత్వం చదివాక మనుషుల్ని ప్రకృతిని మానవీయ విలువల్ని మానవసంబంధాలను
స్త్రీ సమానతను, స్త్రీ సాధికారతను గురించిన కొత్త ఉత్సాహం, ప్రేరణ పాఠకులకు లభిస్తుంది.

( నీలి గోరింట రచన :మందరపు హైమావతి మొదటి ముద్రణ: డిసెంబర్ 2018 పేజీలు :182 ధర : 120 ప్రతులకు :అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు )


No. of visitors : 544
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


పరిమళం , పదును రెండూ వున్నకవిత్వం – చేనుగట్టు పియానో

పలమనేరు బాలాజీ | 04.02.2017 02:37:03am

కవి పాలక పక్షం, రాజ్యం పక్షం, వహించకుండా ప్రజా పక్షం వహిస్తున్నాడని ప్రజల ఆగ్రహాన్ని,ఆవేదనల్ని, ప్రశ్నల్ని,నిరసనల్ని తన గొంతుతో వినిపిస్తున్నాడని .......
...ఇంకా చదవండి

ʹనారుమడిʹ మళ్ళీ మళ్ళీ చదివించే మంచి క‌విత్వం

పలమనేరు బాలాజీ | 18.01.2017 11:47:15pm

కాలం గడచినా మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి చదవాలని అనిపించే మంచి కవితా సంపుటాల్లో ʹ నారుమడి ʹ ఒకటి. యెన్నం ఉపేందర్ ( డాక్టర్ వెన్నం ఉపేందర్ )అటు కథకుడిగా , యిటు కవి...
...ఇంకా చదవండి

ఖాళీ ఇల్లు,ఖాళీ మనుషులు

పలమనేరు బాలాజీ | 01.06.2016 11:57:12am

నమ్ముకున్న కలల్ని గాలికొదలి ఇల్లు వదిలి, ఊరు వదిలి పిల్లల్ని వదిలి, సహచరుల్ని వదిలి...
...ఇంకా చదవండి

సాహిత్య విమర్శకు కొత్త బ‌లం

పలమనేరు బాలాజీ | 04.03.2017 09:54:02am

ఈ పుస్తకం లో వ్యక్త పరచిన అభిప్రాయాల్లో రచయిత ఎక్కడా సహనం కోల్పోలేదని, సాహిత్య అంశాల పట్ల రచయితకు గల ఆసక్తి ,నిబద్దత,స్పష్టతే ఇందుకు కారణాలని, విభేదించే...
...ఇంకా చదవండి

మార్కులే సర్వస్వం కాదని చెప్పిన కథ ʹ నూటొకటో మార్కు ʹ

పలమనేరు బాలాజీ | 05.09.2019 01:00:59pm

ʹ వీడికి వందకి వంద మార్కులు రావలసింది , కానీ తొoతొమ్మిదే వచ్చాయిʹ అప్పుడు ఒకే ఒక్క మార్కు కోసం ఇంత హైరానా పడి రావాలా అని ? అని అడుగుతాడు సైకాలజిస్టు......
...ఇంకా చదవండి

మనిషి లోపలి ప్రకృతి గురించి చెప్పిన మంచి కథ ʹ ఆఖరి పాట ʹ

పలమనేరు బాలాజీ | 03.08.2019 11:39:20pm

మనిషికి, మట్టికి మధ్య వున్న అనుభందం విడదీయరానిది . మట్టి మనిషిని చూస్తున్నాం, విoటున్నామని అనుకుంటాం కానీ, నిజానికి మట్టి మనిషిని నిజంగా సంపూర్ణంగా ......
...ఇంకా చదవండి

ఒక మంచి రాజనీతి కథ

పలమనేరు బాలాజీ | 16.07.2019 09:19:27pm

వ్యవస్థలో, మనిషిలో పేరుకుపోతున్న రాజకీయాన్ని దళారీ తనాన్ని వ్యాపార తత్వాన్ని నగ్నంగా చూపించిన ఈ కథలో ప్రతి పదం ముఖ్యమైనది, అనివార్యమైనది. ఆయా పదాలు......
...ఇంకా చదవండి

మానవ సంబంధాల ఉన్నతీకరణకు చక్కటి ఉదాహరణ ʹ చందమామ రావేʹ

పలమనేరు బాలాజీ | 16.08.2019 09:24:03pm

సాధారణంగా బిడ్డల వల్ల తల్లులు బాధలు పడే కథలు కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి . తల్లి, బిడ్డలకు సంబందించిన కథలు కొన్ని వేల సంఖ్యలో వచ్చింటాయి. వృద్ధాప్యదశకు చేర.....
...ఇంకా చదవండి

అసహజ మరణాలు సమాజానికి హెచ్చరికలు అంటున్న కథ ʹ డోలిʹ

పలమనేరు బాలాజీ | 17.09.2019 08:46:21am

భారతదేశంలో స్థల కాలాలను బట్టి కులాన్ని బట్టి సామాజిక స్థితిగతులను బట్టి చావుకు అర్థం, విలువ మారిపోతూ ఉంటుంది. అంతో ఇంతో ఉన్నవాడి చావుకి ,గొప్ప వాడి .....
...ఇంకా చదవండి

కథల గూటి లోని ఒక మంచి కథ నల్లూరి రుక్మిణి గారి "ఎవరిది బాధ్యత"

పలమనేరు బాలాజీ | 02.12.2019 11:35:29pm

థను శ్రద్ధగా చదివే వాళ్ళకి మానవ మనస్తత్వం లోని వైరుధ్యాలను, సంఘర్షణలను రాజీతత్వాన్ని, ప్రశ్నించే గుణాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. వ్యక్తిగత సంపద పట్ల.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2020
  తెర ముందు కథ!
  షాహిన్ భాగ్..షాహిన్ భాగ్
  హిబా కోసం
  నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు
  సత్యాన్ని చెప్పడమే రాజకీయ కవితా లక్షణం
  షాహీన్ బాగ్... ఒక స్వేచ్ఛా నినాదం
  విప్లవం నేరం కాదు. విప్లవకారుడు నేరస్తుడూ కాదు.
  అరెస్టు - అన్‌టచబులిటీ
  విప్లవ కవిత్వంలో ఈ తరం ప్రతినిధి
  నిర్బంధ ప్రయోగశాల
  అరుణతార జనవరి - 2020

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •