ఎవ‌రు పాస‌ర‌య్యార‌ని?

| సాహిత్యం | క‌విత్వం

ఎవ‌రు పాస‌ర‌య్యార‌ని?

- బ్రహ్మచారి | 03.05.2019 03:30:43pm

నానలూ
ఎవడ్రా పాసైంది
పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఎన్నికలతో
సామ్యవాదం తెస్తనన్నోడా
వాన్ని నమ్మి అసలు పోరాటాన్ని
జమ్మిచెట్టెక్కించినోడా

ఏకాత్మతాయజ్ఞం పేర
కులమతభేధంలేని
భరతమాత మూర్తుల
ఆలయాల నిర్మిస్తనన్నోడా
స్విజ్ బ్యాంకుల సొమ్మును
గుంజుకొచ్చి కుటుంబానికెంతోకొంత
పంచుతనన్న కోత‌ల‌రాయుల్లా

పోనీ
రామమందిరాన్ని నిర్మించి
రామరాజ్జెం తెస్తనన్న రంకు గాండ్లా
స్వదేశీ నినాదమిచ్చి
దేశభక్తిని పేటెంట్ జేసుక
అధికార పీఠ మెక్కిందాడ్వె
యూరప్ దేశాల
సామ్రజ్యవాదులకు
భారతమాత సహజ సంపద
అప్పనంగా అప్పగిస్తున్నోల్లా

బంగారు తెలంగాణ
నినాదమిచ్చిన నికృష్టులా
ఎవడురా పాసైంది!?

ఈ దొంగ గారడీగాండ్ల
సదువులొక సదువులా
పరీక్షలు ఫలితాలకు
బెంబేలు పడి
బతుకుల నార్పుకోవాల్నార
అమ్మనాయినల ఆశలను
అడియాస చెయ్యాలెనార

ఒద్దు నానలూ ఒద్దు
సచ్చిసాధించేదేంది
సదువుకేగాదు
సావుకూ బతుకుకూ
కార్యకారణ సంబంధం తెలీని
సట్ట చదువుల పాలైన
లేలేత చిగుల్లార
ఆ సంబంధం తెలిపే
అసలు సిసలు సదువులు
వేరే ఉన్నయ్
అవి చదివే విద్యాలయాలు
వేరే ఉన్నయ్
గోర్కీ సదివిన యునివర్సిటీలవి
రాండ్రి రాండ్రి
అవి యేంటివో తెల్సుకుందాం
అవి చదివి పావెల్ లవండి
పోరాటం చేయిండి
పోరాటంలో మరణించి
అమరులైనా మంచిదే
ఆత్మహత్యల పిరికి సావులొద్దు
బ్యూరోక్రాట్ బ్రోకర్ల
విద్యాశాఖ ఆధిపత్య అహంకారుల
మతోన్మత్త మనువాద.
ప్రశ్నించే నిలదీసే
జార్జ్ రెడ్డి వారసులు కాండ్రి
ఈ పిరికి తనాన్నంటించిన
జ్ఞానమే తప్ప ఇంగితం నేర్పని
విష విద్యా అస్తవ్యస్త వ్యవస్థల
కూల్చి కాల్చి బూడిద జేయ
కదలండి కదం తొక్కండి





No. of visitors : 230
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

  • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
  • Students and the Revolution
  • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    వాళ్ల స్వేచ్ఛ కోసం పోరాడదాం
    నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
    భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
    నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
    లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
    కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
    కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
    ʹ రాగో ఏమవుతుంది? ʹ
    "తిన్నాడో లేదో పాపం"
    పరిమళభరిత తావుల్లోంచి
    ఆకలి చెమట వాసన
    ఇంద్రావతి..

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •