ఒక వికృతి

| సాహిత్యం | క‌విత్వం

ఒక వికృతి

- జి. వెంకటకృ‌‌ష్ణ | 03.05.2019 03:40:58pm


ఓట్ల పెట్టెల మెట్లకొసనగల సింహాసనపు
తాఖీదులందుకునే న్యాయవేత్తలు
శరీర పరిమితులు దాటి
మనసును తమ తక్కెడలో తూచడం
ప్రారంభించారు!
గాలిని వీచవద్దనీ, నీటిని పారవద్దనీ
అగ్నిని మండవద్దనీ తీర్పులిస్తారు.

రక్తపాదాల సేద్యం నిర్మించిన రస్తా నుండీ
చలువ పందిళ్లు చేరిన అధికార ముద్రలు
సమూహ ఆలోచనే నేరమని నిర్ధారిస్తున్నవి
ఎగిరే పక్షి రెక్కలనూ, మోగే డప్పు దరువులనూ
నినదించే ధిక్కార గొంతుకలనూ
నిషేధిస్తున్నవి.

సమూహం వేళ్లనుండీ సారం పీల్చి
బలిసిన రాజకీయ బదనికలు
చిగుర్చే కొమ్మల ఆకాంక్షనీ
పుష్పించే రెమ్మల సంకల్పాన్నీ
ఫలించే ఆశయాల వేకువనీ
నిర్బంధిస్తామంటున్నవి.

మధ్యయుగాల సారమొకటి
విశ్వ విజ్ఞానానికి మత ఛాందసాన్ని అంటుగట్టి
తన్నుతాను పునర్నిర్మించుకుంటున్నది

అడుగడుగునా వూచలు మొలిచే
కొత్త రకం వంగడాలను సంకరం చేయమని
తన వందిమాగధుల్ని పురమాయిస్తున్నది

నెత్తురు మరిగిన కత్తుల కొసలన్నీ
త(న)మోరూపం దాల్చి
శ్రమజీవుల శిబిరాన్ని ఖైదు చేయమంటున్నవి

మాట రూపమైతే, పాట ప్రాణమైతే
స్వేచ్ఛ గానమైతే, హేతువు దాని మూలమైతే
ఓర్వలేక, కర్కశంగా కరాళనృత్యం
చేస్తున్నది.
*
చరిత్ర ఆవర్తనలో వొక్కోసారి
ఆర్తనాదమూ పొలికేకలా ధ్వనిస్తుంది
ఆశనిపాతమూ వుధ్వేగంలా అగుపిస్తుంది .

కానికాలంలో
అవసరమయ్యే నిప్పుకణికా దాగుంటుంది.

కాలమొక్కటే నమ్మకాల గుమ్మం ముందు
ప్రహారా కాస్తుంది
హెచ్చరికలు చేస్తుంది
నిప్పురాజేస్తుంది.

నిప్పులదారి యెప్పుడూ
ఒంటరిగనే చరిస్తుంది.

No. of visitors : 184
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సీమేన్ - వ్యక్తి , ప్రకృతుల నిజదర్శనం

జి.వెంకటకృష్ణ | 05.06.2018 10:52:19am

ఒక కఠిన వాస్తవికత ముందు , రచయిత నమ్మిన పోరాటరూపాలు గణనీయమైన మార్పకు గురికావడం ప్రభు కథల్లో చూస్తాము. ఓడిపోతున్న సందర్భాలు పెరిగేకొద్దీ ప్రతిఘటన ల్లో న...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార సెప్టెంబర్ 2019

  మార్కులే సర్వస్వం కాదని చెప్పిన కథ ʹ నూటొకటో మార్కు ʹ
  మేఘాలొస్తాయి
  న్యాయ ప్రక్రియే శిక్ష అయితే!?
  Justice in deep slumber
  ఎర్ర పిడికిలి
  వేకువ గానం
  అతడేమన్నాడు
  వాళ్లంటే అంత భ‌యం ఎందుకు?
  ఎరవాడ జెయిలులో ఈ వేకువ
  రాజ్య‌మే కుట్రదారు అయిన‌ప్పుడు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •