159 కేసులను ఎదుర్కొన్న ఒక మహిళా నక్సలైట్ కథ

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

159 కేసులను ఎదుర్కొన్న ఒక మహిళా నక్సలైట్ కథ

- మురళీ కర్ణం | 03.05.2019 03:55:33pm

2019 ఏప్రిల్ 3న సుక్మా నుంచి కుంట మధ్య రెండు గంటల బస్సు ప్రయాణం లో పారామిలటరీ బలగాలు బస్సును ఆపడం అప్పటికి నాలుగో సారి .. బస్సులో ఉన్న దాదాపు ఇరవై మంది ప్రయాణీకులలో ఆమె ఉండడం ఏమీ అసాధారణ విషయం కాదు.. బస్సు ఆపిన ప్రతిసారి సైనికుల దృష్టి ఆమె పైనే.. ఎన్నికలవేళ రొటీన్ గా జరుగుతున్న తనీఖీ కాదు ఇది ..

ఇక కుంట లో మిలటరీ వాళ్లు ఆమెను గుర్తింపు కార్డు చూపమన్నారు.. ఆమె మౌనంగా ఉండిపోయింది.. ఏమీ మాట్లాడలేదు.. ఆమెతో పాటు ఉన్న జర్నలిస్టులు ఆమె వద్ద ఎటువంటి గుర్తింపు కార్డులు లేవని, ఆమె తమతో ఉందని చెప్పారు.. జగదల్పూర్ జైలులో 12 ఎళ్ళ జైలు జీవితం తరవాత బయటకు వచ్చిన ʹనిర్మలక్కʹ తానేనని ఆమె చెప్పలేదు.. అది చెప్పాల్సిన అవసరమూ లేదు.. వాళ్ళకు ఆమె బాగా తెలుసు.. దక్షిణ బస్తర్ ప్రజల్లో 18 ఎళ్ళుగా పేరుగాంచిన మావోయిస్టు నాయకురాలామె..

1989 లో 22 ఏళ్ల ప్రాయం లో వెంకటలక్ష్మి అలియాస్ నిర్మల ఆంధ్రప్రదేశ్ లోని తన ఊరు విడిచి పీపుల్స్ వార్ ఉద్యమం లో భాగమయ్యింది. ఆమె 1994 లో చత్తీస్ఘడ్ వెళ్లక ముందు పీపుల్స్ వార్ ఉద్యమం లోని అనేక మంది నాయకులతో కలిసి పనిచేసింది.. తమిళం, కన్నడం, మరాఠి, హిందీ, గోండీ, హల్బి వంటి పలు భాషలు నేర్చుకోవడానికి ఆమె రాజకీయ ప్రస్థానం కారణమయ్యింది.

1994లో దండకారణ్య స్వభావం, పరిస్థితులు, అక్కడి అడవిలో నివసిస్తున్న ఆదివాసి తెగలు, వారి సంస్కృతి, వారి మధ్య సంబంధాలను అధ్యయనం చేసింది. దండకారణ్యం ఆమె రాజకీయ, సాంస్కృతిక అధ్యయనానికి భూమికయ్యింది..

అనతి కాలంలోనే ఆమె అక్కడి చెట్టు చేమలను, జీవజాతులను ఆకళింపు చేసుకుంది .. ఆ ప్రాంతంలో తమ శత్రువులెవరో , మిత్రులెవరో గ్రహించింది. అక్కడి దుర్భేద్యమైన అడవులను సునాయసంగా ఎక్కడం, దిగడం అలవరచుకుంది.

ఊహించని తూపాకుల మోతలు, ఆదివాసులపై తన అచంచల విశ్వాసం తనను తీర్చి దిద్దాయి.. యుద్ధ భూమిలో ఉన్నవారి వెంట నడవడం , గాయపడినవారికి చికిత్స అందించే పనిలో తాను ఉంది.

గోండీ, హల్బీ భాషలపై పట్టు సాధించాక ప్రజల్లో గొప్ప నాయకురాలిగా ఎదిగింది. 1998లో ఆ ప్రాంత కమాండర్ అయ్యింది.. ఆ తరవాత మిలిటెంట్ ఉద్యమానికి ఒక ప్రభావశీల మహిళా నాయకురాలయ్యింది..

2005లో సల్వాజుడుం మూకలను ఎదిరించడంలో ఆమె, ఆమె సహచరులు మృత్యువును ఎదిరించి ముందువరసలో నిలుచున్నారు.. ఆ క్రమంలో వారు గ్రామ గ్రామాన తిరిగారు.. నిరంతరం చికాకు కలిగిస్తున్న సల్వాజుడుం గాని, తీవ్రంగా వేధిస్తున్న అనారోగ్యం ఆస్తమా గాని ఆమె పోరాట స్ఫూర్తిని నిలువరించలేకపోయాయి.. ఆమె మాటలు వింటే శక్తివంతమైన భారత రాజ్యానికి ఎదురునిలిచి నిలబడడం లోని అసాధారణ మానవ పోరాటేచ్చ మనకు అర్థమవుతుంది..
రాజకీయ విశ్వాసాల వల్ల వచ్చిన తెగువ, సాహసాలతోనే ఆమె తన అనారోగ్య ఇబ్బందినీ అధిగమించింది. 2007 జూలై 5న రాయపూర్ లో తన జీవన సహచరుడు, ఇతర ఉద్యమ సహచరులతో పాటు అరెస్టయింది.. వెంటనే వారిని వేరు చేశారు. తన సహచరుడు ఒక టౌన్ లో ప్రింటింగ్ ప్రెస్ నడిపేవారు..

పోలీసులు ఆమెను బంధించాక తమ విజయానికి సూచనగా, ఆమె పనిచేసిన గ్రామాలలో ఊరేగింపు తీసారు.. ప్రజల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని, ప్రజల ముందే చిత్రహింసలకు గురిచేశారు.. గ్రామలను తగులబెట్టి నేలమట్టం చేశారు.. ప్రజలపై రాజ్య బలగాలు చేపట్టిన దాష్టీకం, విధ్వంసం, విచ్చలవిడి లూటీల గురించి చెబుతుంటే ఆమె గొంతు పూడుకపోయింది.. రెండు దశాబ్దాలకు పైబడిన తన ఉద్యమక్రమంలో కళ్ల ముందే అనేక మంది సహచరులు అసువులు బాసారు..


విచారణ ఒక ప్రహసనం..

చత్తీస్ఘడ్ ప్రభుత్వం నిర్మలపై 159 కేసులు పెట్టింది.. ఉద్యమ సహచరులు ఎవ్వరూ ఎదుర్కోని సుదీర్ఘ జైలు జీవితం ఆమె ఎదుర్కొంది.. తొలి ఎడాదిన్నర ఆమెనసలు సరిగా కోర్టుకు కూడా తెచ్చేవారు కాదు.. పదేళ్ల పాటు మూడు జిల్లాల కోర్టులకు ఆమె హాజరయ్యింది. వింతగొలిపే బాధకరమైన విషయమేమంటే కొర్టు వారెంట్ లో తన పేరు తప్ప వివరాలేమీ లేకపోవడం.. ఆమె నిరసన తెలియజేస్తే తప్ప న్యాయమూర్తులు పట్టించుకోలేదు..

తన కేసులు చూడడానికి కేటాయించిన లాయర్లే తప్ప తనకు మరోదారి లేదు.. ఈ పదేళ్లు తన కేసుకు సంబంధించిన వాదనలు తానే తయారుచేసి లాయర్లకు అందించింది.. ఆ విధంగా విరామం లేకుండా ఈ పదేళ్లు గడిచిపోయాయి..

ఈ క్రమంలో తను గమనించిందేమంటే.. న్యాయమూర్తులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే నేరారోపణలు నిర్ధారించి, నిందితుని సమక్షంలో తీర్పులు చెప్పేస్తున్నారు.. తను అరెస్టయి జైల్లో ఉన్న పదేళ్ల తరవాత అంటే, 2018 లో మరో నేరంలో ఇరికించారు.. అందువల్ల మరో 15 నెలల జైలు నిర్భందం తనపై కొనసాగింది.. తను ఆరోపణలు ఎదుర్కొన్న 159 కేసులలో ఏ ఒక్క కేసులోనూ ఆమె నేరస్తురాలిగా తేలలేదు.. ఈ విచారణ తతంగమంతా శక్తివంతమైన రాజ్య దుర్మార్గ స్వభావాన్ని తెలియజేసాయంతే ..

ఇటవంటి కేసులనే ఎదుర్కొంటున్న ఆదివాసి మహిళా ఖైదీలందరి పైనా ఈ బూటక విచారణా ప్రహసనం పునరావృతమయింది.. ఇవన్నీ ఈ వ్యవస్థ వైఫల్యాన్ని ఎత్తిపడతాయి..

జగదల్పూర్ జైళ్లలో ఉన్న ఖైదీలలో అత్యధికులు ఆదివాసులే .. ఒక్క ఊపిరి తీసుకోవడానికి తప్ప, ప్రతి చిన్న విషయంలోనూ అనుమతులు కావలసిందేనని ఆమె అంటారు.. అయినా ఇంతటి కఠోర జైలు జీవితం ఆమె పోరాట స్ఫూర్తిని చంపలేకపోయింది.. జైళ్లలో సహచర ఖైదీల మృతికి కారణాలు డిమాండ్ చేస్తూ ఆమె అనేక నిరాహార దీక్షలు నడిపింది.. తను కోర్టుకు వెళ్లినపుడల్లా బట్టలు సరిగాలేని సహచర ఖైదీలకు అవసరమయిన ఒకటో రెండో దుస్తులు కుట్టి తాను తీసుకపోయేది.. ఇబ్బందులతో సతమతమవుతున్న సహచర ఖైదీలందరినీ ఆమె అమృత హస్తం తాకింది..

తాను ఎంచుకున్న జీవితం పట్ల ఎపుడైనా పశ్చాత్తాప పడ్డారా..? ఏళ్ల తరబడి గడిచిన తన ఖైదు జీవితం తాను ఎంపిక చేసుకున్న రాజకీయాల ఆచరణ పరంపర లో భాగంగానే ఆమె చూస్తారు..

తన మూడు దశాబ్దాల ఈ ప్రయాణంలో 2017లో తన సహచరుడు జైలు నుంచి విడుదలై పోయిన ఒక్క సందర్భంలో కాస్త ఒంటరితనం అనిపించింది.. అప్పటివరకు కాస్త తన సహచరున్ని కలిసే అవకాశం ఉండేది.. ఖైదు జీవితంలో రెండువారాలకోసారి ఒక ఇరవై నిముషాలు కలుసుకోగలిగేవారు.. జైలులో ఆ కొద్ది క్షణాల కలియిక తన జీవితాన్ని నిలిపి ఉంచాయని ఆమె గుర్తుచేసుకుంటారు.. 52 ఏళ్ల వయసులో తన సహచరుణ్ణి చేరుకోవడానికి ఇపుడు ఆమె ఇంటికి తిరుగు ప్రయాణంలో ఉంది..
జీవితం ఎలా ఉండబోతోందని అనుకుంటున్నారు అని అడిగితే .. జీవితం వచ్చిన తీరుగా ఎదుర్కొంటాను అని ఆమె అన్నారు..

ఆన్ లైన్ పత్రిక " ద వైర్ (The Wire.in) " లో వచ్చిన ఇంగ్లిష్ వ్యాసానికి తెలుగు అనువాదం - రాంకి

No. of visitors : 1263
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2020
  తెర ముందు కథ!
  షాహిన్ భాగ్..షాహిన్ భాగ్
  హిబా కోసం
  నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు
  సత్యాన్ని చెప్పడమే రాజకీయ కవితా లక్షణం
  షాహీన్ బాగ్... ఒక స్వేచ్ఛా నినాదం
  విప్లవం నేరం కాదు. విప్లవకారుడు నేరస్తుడూ కాదు.
  అరెస్టు - అన్‌టచబులిటీ
  విప్లవ కవిత్వంలో ఈ తరం ప్రతినిధి
  నిర్బంధ ప్రయోగశాల
  అరుణతార జనవరి - 2020

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •