ర‌చ‌న - స్వేచ్ఛ - ప్ర‌జాస్వామ్యం

| సాహిత్యం | వ్యాసాలు

ర‌చ‌న - స్వేచ్ఛ - ప్ర‌జాస్వామ్యం

- రివేరా | 03.05.2019 05:36:21pm

ఒక క‌వి, ర‌చ‌యిత‌ స్వేచ్ఛని, ఒక స‌మాజం ప్ర‌జాస్వామ్యాన్ని కోల్పోడాన్ని అత్యంత ప్రమాద‌క‌ర ధోర‌ణిగా గుర్తించాలి. ర‌చ‌యిత ఎందుకోసం ర‌చ‌న చేస్తాడు అనే ప్ర‌శ్న‌కు ఒకే జ‌వాబును రాబ‌ట్ట‌డం క‌ష్ట‌మే. కానీ, ఏ ర‌చ‌న అయినా స్వేచ్ఛాపూరిత వాతావ‌ర‌ణంలోనే త‌న‌ను తాను స‌మ‌గ్రంగా వ్య‌క్తీక‌రించుకొంటుంద‌నేది అంద‌రూ అంగీక‌రించాల్సిందే. రాసే స్వేచ్ఛ ముఖ్యం. అలాంటి స్వేచ్ఛ కోసం ర‌చిస్తున్న క‌లాల‌పై క‌ట‌క‌టాల‌ను నాటుతున్న కాలంలో మ‌నం జీవిస్తున్నాం. చాయిస్ తీసుకోమంటే, ప్ర‌భుత్వంలో కాదు, తాము స‌మాజంలోనే భాగంగా ఉంటామ‌నే గొంతుక‌లు ప‌ల‌చ‌బ‌డిపోతుండ‌టం ప్ర‌జాస్వామ్యానికి తొలి హెచ్చ‌రిక! స‌మాజం అంత‌కంత‌కు కుదించుకుపోతూ, ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌ల వేళ్లు అంత‌టా అల్లుకుపోవ‌డం గురించిన ఆందోళ‌న‌, ఆవేద‌న‌, చింత‌న మొద‌లు కావాల్సిన స‌మ‌యం ఇది! దేశ‌వ్యాప్తంగా ఒక ప‌రంప‌ర‌గా గ‌త ఐదేళ్లుగా కొన‌సాగుతున్న మేధావులు, బుద్ధిజీవులు, ప్రొఫెస‌ర్లు, ర‌చ‌యిత‌ల అరెస్టులు ఈ అవ‌స‌రాన్ని మ‌రింత‌గా ముందుకు తోస్తున్నాయి.

ప్ర‌శ్నవ‌ట్టి నిర్బంధమే అయితే, జ‌వాబును ఎలాగైనా గాలించి ప‌ట్టుకోవ‌చ్చు. గ‌తంలో ఎన్నోసార్లు ఈ ప‌నిని విర‌సం స‌హా ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ ప్ర‌చార వేదిక‌లు చేశాయి. ఇప్పుడు అరెస్ట‌యి పుణె ఎర‌వాడ జైలులో త‌న మిగ‌తా తొమ్మిది మంది స‌హ‌చ‌రుల‌తో క‌లిసి ఉన్న వ‌ర‌వ‌ర‌రావు ఇలాంటి నిర్బంధాల‌ను ఇప్ప‌టికే ఎన్నింటినో చ‌విచూశారు. శ్రీ‌శ్రీ లాంటి జ‌గ‌మెరిగిన క‌వులు ఒక‌టి, రెండుసార్లు అరెస్టు అయ్యారు. జీవితాన్ని బీభ‌త్స వ్యంగ్య దృశ్య‌రూపకం చేసి ప్ర‌ద‌ర్శించిన రావిశాస్త్రి లాంటి ర‌చ‌యిత‌లు కొన్ని రోజుల‌యినా జైలులో గ‌డిపారు. ఇక క‌మిటెడ్ అని చెప్పుకొన్న జాతీయ‌, అంత‌ర్జాతీయ క‌వులు, ర‌చ‌యిత‌ల జాబితా చాలా పెద్ద‌దే. చిన్న‌దో పెద్ద‌నో విర‌సం స‌భ్యులంతా ఈ రోజున ఏదో ఒక కేసును ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇంత‌వ‌ర‌కే అయితే, ఏ కాలానికీ, ఏ పాల‌న‌కీ మిన‌హాయింపు ఇవ్వ‌న‌క్క‌ర్లేదు. కానీ, ఇప్పుడు న‌డుస్తున్న నిర్బంధం అలాంటిది కాదు. రెక్క‌లు విరిసేయ‌డంతోనే అది ఆగిపోవ‌డం లేదు. ప్ర‌ధానంగా చైత‌న్యంపై గురిపెడుతోంది. అస‌లు చైత‌న్యం క‌లిగి ఉండ‌టాన్నే చేయ‌రాని నేరంగా చిత్రీక‌రిస్తోంది. ఆ నేరం చేసిన వారిని అవ‌మానించాలంటూ, దేశం నుంచి బ‌హిష్క‌రించాలంటూ ప‌నిగ‌ట్టుకొని ప్ర‌చారం చేస్తోంది. వారిపై దాడుల‌కు కావాల‌నే కృత్రిమ వాతావ‌ర‌ణాన్ని పోగు చేస్తోంది. నిన్న‌టిదాకా అవ‌మానాలు, వేధింపులు అనేవి రాజ్య‌వ్య‌వ‌స్థ అమ‌లు చేసేది. ఇళ్ల‌పై దాడులు చేసి పిల్ల‌ల ముందే తిట్టి కొట్టి బేడీలు వేసి తీసుకుపోవ‌డం, క్లాసు రూమ్‌ల‌లోకి వెళ్లి విద్యార్థుల ముందు వారి అధ్యాప‌కుల‌ను అరెస్టు చేయ‌డం, లాక‌ప్పుల్లో న‌గ్నంగా రోజంతా నిల‌బెట్ట‌డం, మెడ‌లో బోర్డులు త‌గిలించి ఫొటోలు తీయ‌డం ద్వారా అవ‌మానించేది. ప్ర‌ధానంగా పెటీ బూర్జువా సంస్కారంలోంచి సామాజిక పోరాట రంగంలోకి వ‌చ్చిన‌వారిని ఈ ప‌ద్ధ‌తుల్లో కుంగ‌దీయాల‌ని చూసేది. కానీ, ఇప్పుడు మొత్తం స‌మాజాన్నే పోలీసు దుస్తుల్లోకి మార్చే ప‌ని ప్ర‌య‌త్న‌పూర్వ‌కంగా సాగిస్తోంది. అర్బ‌న్ న‌క్స‌ల్ అనే ప‌ద‌బంధాన్ని దానికోసమ‌నే చాలా ప‌క‌డ్బందీగా సిద్ధం చేసింది. ఈ ప‌ద‌బంధ‌నంలోకి లాగి, ఏడాది కాలంలో ప‌ది మంది అత్యున్న‌త మేధో సంప‌న్నుల‌ను జైలుకు పంపింది. నిజానికి, వీరు ఏ పాల‌కుడూ, ఏ అంత‌ర్జాతీయ వేదికా విస్మ‌రించ‌లేని వ్య‌క్తులు. న్యాయ‌, వ్య‌వ‌సాయ‌, ఆర్థిక‌, సామాజిక‌, పాత్రికేయ‌, సాహిత్య రంగాల అభివృద్ధి కోసం, వాటిని మాన‌వీయ శాస్త్రాలుగా మ‌ల‌చ‌డం కోసం త‌మ ప్ర‌భావాన్నీ, ప‌లుకుబ‌డినీ వినియోగ‌పెడుతున్న‌వాళ్లు. అలాంటి వారినే అర్బ‌న్ న‌క్స‌ల్స్ పేరిట వేధింపుల‌కు గురి చేస్తున్నారంటే.. ఇక ఈ దేశంలో న‌క్స‌ల్ కాని వారు ఎవ‌రుంటార‌నేది ప్ర‌శ్న!

ఈ ప్ర‌శ్న స‌రే! పాల‌కులు త‌యారుచేసిన అర్బ‌న్ న‌క్స‌ల్ ప‌ద‌బంధాన్ని మ‌కుటంగా ధ‌రించి.. దానినే ధిక్కారంగా ప్ర‌ద‌ర్శిస్తున్న వారి సంగ‌తి స‌రే! న‌చ్చ‌డం, న‌చ్చ‌క‌పోవ‌డమే కొల‌బ‌ద్దగా ఎంత దూరం పోయారంటే, ఈ దేశాన్ని 50 ఏళ్ల‌కు పైగా పాలించిన కాంగ్రెస్ ని సైతం న‌క్స‌ల్ అనో, ఉగ్ర‌వాద‌నో నిందిస్తున్నారు. చివ‌ర‌కు రాజ్యాంగ‌మే ఒక మేర‌కు గుర్తించిన జ‌నం ఆక‌లి, ప్రాంతాల ఆకాంక్ష‌లు, జాతుల స్వ‌యంప్ర‌తిప‌త్తి, సామాజిక వ‌ర్గాల ప్ర‌త్యేకత‌ల‌ను సైతం స‌హించే ప‌రిస్థితి లేదు. వాటి ప్ర‌స్తాన‌వ ఎవ‌రు ఏ రూపంలో చేసినా అర్బ‌న్ న‌క్స‌ల్ ట్యాగ్‌లైన్‌తో సోష‌ల్ మీడియాలో వేధిస్తారు. చంపుతాం.. దేశం నుంచి వెళ్ల‌గొడ‌తాం అంటూ దాడుల భ‌యం క‌ల్పిస్తారు. ఆన‌క దేశంలోని ఏదో ఒక మారుమూల పోలీస్‌స్టేష‌న్‌లో కేసు పెట్టించి, న‌గ‌రాల్లో అరెస్టులు చేయిస్తారు. అది సామాజిక అంత‌రాల‌ను ప్ర‌శ్నించిన సంద‌ర్భం అయితే, సామూహిక హింస‌కాండ‌నూ, ఇళ్ల‌పై దాడుల‌నూ న‌డిపిస్తారు. న‌డుస్తున్న‌ నిర్బంధాల చ‌రిత్ర అంతా దాదాపు ఇలాగే మొద‌ల‌యి, ఈ ఐదేళ్ల‌లో ఎన్నో కొత్త ప‌ద‌బంధాల‌ను ప‌రిచ‌యం చేసింది. ల‌వ్ జిహాద్‌, ఘ‌ర్ వాప‌సీ, దేశ్ ఛోడోల వ‌రుస‌లోనే ఇప్పుడు అర్బ‌న్ న‌క్స‌ల్ ని చ‌లామ‌ణిలోకి తెచ్చింది. ఈ క్ర‌మంలోనే భీమా కోరేగామ్ ద‌ళిత ప్ర‌తీక నేప‌థ్యంలో జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌ను తాను ప్ర‌చారం చేస్తున్న అర్బ‌న్ న‌క్స‌ల్స్‌కు ప్రభుత్వం ముడిపెట్టి విడ‌త‌ల‌వారీగా ప‌దిమందిని అరెస్టు చేసింది. అయితే, ఒక‌ర‌కంగా ఇది క‌వితాన్యాయ‌మే! ఎవ‌రి విముక్తి ఎవ‌రితో సాధ్య‌మ‌న్న మీమాంస‌కు ఒక మేర‌కు స‌మాధానమే! కాక‌పోతే, పెటీ బూర్జువా త‌త్వంలోంచి వ్య‌క్తిగ‌త త్యాగం, సాహ‌సం, నిబ‌ద్ధ‌త అంటూ చేసే చ‌ర్చ ఎక్కువ‌యి, ద‌ళిత మిలిటెన్సీకి సంబంధించిన ప్ర‌స్తావ‌నలే ఎవ‌రి ఎజెండాలోనూ క‌నిపించ‌డం లేదు. దీనివ‌ల్లే విక‌సించాల్సిన‌ నిర్బంధ వ్య‌తిరేక ఉద్య‌మాలు ముకిళించుకుపోతున్నాయ‌నేది గుర్తించాలి.

90 శాతం వైక‌ల్యంతో బాధ‌ప‌డుతున్న వ్య‌క్తినీ, 60లు దాటిన తాత‌ల వ‌య‌సు వృద్ధుల‌ను వారి శారీర‌క స్థితి రీత్యా కూడా... చేయ‌డానికి అవ‌కాశం లేని నేరాల్లో శిక్షించాల‌ని చూస్తున్నారు. వీరిలో న‌రేంద్ర మోదీ పాల‌న తొలి పాదంలో అరెస్టు అయిన ప్రొఫెస‌ర్ సాయిబాబ‌కు ఇప్ప‌టికే శిక్ష ప‌డింది. ఆయ‌న పాల‌న చివ‌రి పాదంలో నిర్బంధించిన ప్ర‌ముఖ తెలుగుక‌వి వ‌ర‌వ‌ర‌రావు స‌హా ప‌దిమందిని కోర్టు విచార‌ణను సాగ‌దీయ‌డం ద్వారా వేధింపుల‌కు గురి చేయాల‌ని చూస్తున్నారు. అయితే, ప్ర‌శ్న మ‌ళ్లీ మొద‌టిదే..ఇంత జ‌రుగుతున్నా, ర‌గ‌లాల్సినంత ఆవేశం, ఆగ్ర‌హం న‌మోదు కావ‌డం లేదు ఎందుక‌ని? పైగా ఒక‌నాడు ప్ర‌గ‌తిశీల‌, ఉద్య‌మ శ‌క్తుల‌పైనా, వాటి వాహ‌కుల‌పైనా చేయ‌డానికి జంకిన వ్యతిరేక ప్ర‌చార‌మూ, ర‌చ్చా, పోటీ ప్ర‌ద‌ర్శ‌న‌లూ ఇప్పుడు య‌థేచ్ఛ‌గా సాగిపోతుండ‌టం దేనికి సంకేతం? పాల‌మీగ‌డ‌లు తిని సోష‌ల్ మీడియాతో పొద్దుపుచ్చుతున్న మ‌ధ్య‌త‌ర‌గ‌తి యువ‌తే అర్బ‌ల్ న‌క్స‌ల్ ప్ర‌చార సైనికులనేది గుర్తించాలి. ఆదివాసీలు త్యాగాలు చేసి, స్వ‌చ్ఛందంగా త‌మ అస్థిత్వాన్ని వారు ర‌ద్దు చేసుకొంటేనే త‌మ‌కు బ‌తుకు సౌక‌ర్యం అందుతుంద‌ని న‌మ్మే త‌రం ఇది. అందుకు అడ్డుగా నిలిచిన ఒక్క న‌క్స‌ల్సే కాన‌క్క‌ర్లేదు, ఎన్‌జీవోలు, ఉదార‌వాదులు, గాంధేయ‌వాదులు, సామాజిక అధ్య‌య‌న‌ప‌రులు..ఇలా ప్ర‌తి ఒక్క‌రూ ఈ త‌రానికి శ‌త్రువులే. అర్బ‌న్ న‌క్సల్సే. జంకూగొంకూ లేకుండా, ప‌ట్టింపూ, ప్ర‌మాణాలూ ప‌ట్ట‌కుండా వీరిపై విద్వేష ప్ర‌చారం క‌ట్ట‌లు తెగుతోంది. ఈ విష ఉధృతికి ఫాసిస్టు పాల‌కులు ఉండ‌టం వ‌ల్ల‌నే ద‌న్ను దొరుకుతున్నదా లేక స‌మాజ‌మే ఫాసిజంలోకి చిన్న చిన్న‌గా జారిపోతూ, ఊతం అందిస్తున్న‌దా? పెరుగుతున్న ఫాసిజం క‌లిగిస్తున్న క‌ల‌వ‌రం ప్ర‌జాస్వామ్య అనివార్య‌త‌ను మ‌న ఆవ‌ర‌ణ‌ల్లోకి తీసుకొచ్చింద‌నేది వాస్త‌వమేగానీ, అది ఎలాంటి ప్ర‌జాస్వామ్యం? ఒక‌వేళ అది ప్ర‌జ‌ల వైపు ప్ర‌జాస్వామ్యం అయితే, స‌మాజం దాని ప్ర‌మాణం కావాలి. స్వేచ్ఛ ప్రాణ దినుసు కావాలి. స‌క‌ల జీవ‌న రంగాల‌పై ప్ర‌భుత్వ ప్ర‌మేయం త‌గ్గి, ఆ మేర‌కు స‌మాజం పెర‌గాలి. ప్ర‌భుత్వంలో భాగ‌మా కాదా అనేదానికి అవార్డులు, స‌న్మానాలే ఏకైక‌ గీటురాయి కాకూడ‌దు. ప‌నిలో భాగ‌మ‌యిన స‌మాజంలో మ‌న భాగ‌స్యామ్యం ఎంత అనేదే కొల‌బ‌ద్ధ కావాలి. అలాంటి ప్ర‌జాస్వామ్య అనివార్య‌తే స‌క‌ల సంకెళ్ల‌ను తెంచే శ‌క్తిని స‌మాజానికి వాగ్దానం చేయ‌గ‌ల‌దు.

No. of visitors : 424
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


మంద్ర‌స్థాయి యుద్ధం - ప్ర‌జా ప్ర‌తిఘ‌ట‌న : రివేరా

రివేరా | 10.06.2016 01:10:40am

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధం - ప్ర‌జా ప్ర‌తిఘ‌ట‌న పై రివేరా ఉప‌న్యాసం.......
...ఇంకా చదవండి

చేజారిన జాడల్లోంచి మైదానాల్లోకి..

రివేరా | 16.07.2016 11:50:45am

పుస్తకాల సంచిని గిరాటేసి రోడ్డుపైకి దూసుకెళ్లిన జ్ఞాపకం వెనుక నుంచి పిలుస్తున్న తల్లివైపు స్నేహితుల భుజాలపైనుంచి నవ్వుతూ చూడటమే చివరిచూపు.......
...ఇంకా చదవండి

ఏప్రిల్ పండు II రివేరా

రివేరా | 24.04.2016 11:08:03pm

పిల్లలు లేని ఇల్లు, ఇది హైదరాబాద్, ఊరేగింపు, ఏప్రిల్ పండు,...
...ఇంకా చదవండి

సాయంకాలం వాన‌!

రివేరా | 20.12.2016 11:48:01pm

దుప్ప‌టి కింద‌, దిండు అడుగున‌ పిల్ల‌లు చూడ‌కుంటా క‌ప్పెట్టుకొన్న వ‌ర‌ద‌గూడుని మెలిపెడ‌తావేమో...
...ఇంకా చదవండి

భ‌యం చుట్టూ భ‌యం..

ఎడార్డో గెల‌నో | 04.02.2017 01:18:19am

వీళ్లెక్క‌డ చంపుకుతింటారోన‌ని ఆడ‌వాళ్ల‌కు భ‌యం భ‌యంలేని ఆడ‌వాళ్లంటే మ‌గ‌వాళ్ల‌కు మ‌హా భ‌యం దొంగ‌లంటే భ‌యం, పోలీసుల‌న్నా మ‌రి భ‌య‌మే తాళాలు లేని త‌లుపులంటే భ...
...ఇంకా చదవండి

రెప్పని కప్పని నిద్దుర

రివేరా | 16.08.2016 09:26:54am

ఒకే రాత్రిని కప్పుకొన్న మనకి ఒక్క నిద్దుర చాలదా? చుక్క కలని పొదువుకోడానికి ఈ ఒక్క దేహ వర్షం చిలకదా?...
...ఇంకా చదవండి

ఈ రాక్ష‌స గీతి వింటారా?

రివేరా | 02.11.2016 10:23:06am

మ‌నం నిల‌బ‌డిపోయిన చోట నుంచే మ‌న న‌డ‌క‌ల‌ను మోసుకెళుతున్నారు మ‌నం ఆపేసిన రాగాల‌నే తీగ‌లుగా సాగిపోతున్నారు మ‌న గొంతునీ, మ‌న వంతునీ మ‌న‌క్కిచ్చేసి వెళుతు...
...ఇంకా చదవండి

నో, ఐ డోన్ట్‌ లైక్‌ టమాట

రివేరా | 17.09.2016 10:14:09am

టమాట రంగు సరే, రసాలూరే సరస్సులేమీ.. కొంచెం కరిచిపట్టుకొన్న మిలమిలా మీనాలేమీ.. పైకి కిందకి మునకలేసే గత్తరబిత్తర గోళాలేమీ.......
...ఇంకా చదవండి

సబ్కా జవాబ్ వెతికుతున్న కవి రివేరా

మహమూద్ | 04.05.2017 10:49:39am

విప్లవకవిత్వాన్ని ఈసడించుకునే వర్గాన్ని కూడా ముక్కుమీద వేలేసుకునేలా రివేరా ఓ మంచి కవి అని అందరి చేత అనిపించుకోవడం వాస్తవానికి విప్లవ సంస్కృతి విజయమే.......
...ఇంకా చదవండి

అద్గ‌దీ...

రివేరా | 20.10.2016 12:13:15am

అటో ఇటో వేటో పోటో ప‌డిపోవాల్సిందే! పాల‌కులంతా ప్ర‌జాస్వామిక‌వాదులై ప్రజ‌లేమో నియంత‌లైతే ఏమి చేస్తాం?...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  వాళ్ల స్వేచ్ఛ కోసం పోరాడదాం
  నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
  భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
  నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
  కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
  కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
  ʹ రాగో ఏమవుతుంది? ʹ
  "తిన్నాడో లేదో పాపం"
  పరిమళభరిత తావుల్లోంచి
  ఆకలి చెమట వాసన
  ఇంద్రావతి..

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •