ఎర్ర‌జెండా - కార‌ల్‌మార్క్స్

| సాహిత్యం | క‌థ‌లు

ఎర్ర‌జెండా - కార‌ల్‌మార్క్స్

- రివేరా | 03.05.2019 05:39:39pm

ప్ర‌పంచానికి ఎంగెల్స్‌తో క‌లిసి శాస్త్రీయ సోష‌లిజాన్ని అందించిన కార‌ల్‌మార్క్స్ 1883లొ బ్రిటన్‌లో మ‌ర‌ణించారు. మేడేకూ, ఆనాడు ఎగ‌సిన ఎర్ర‌జెండాకూ స్ఫూర్తిని ఇచ్చిన ముఖ్య ఘ‌ట్టం 1886లో అమెరికాలోని చికాగోలో జ‌రిగింది. అంటే, మార్క్స్ మ‌ర‌ణించిన మూడేళ్ల‌కు ఆ న‌గ‌రంలో ర‌క్తం చిందింది. ఎనిమిది గంట‌ల ప‌నిదినాల కోసం కార్మికులు తీసిన ఊరేగింపును చెద‌ర‌గొట్ట‌డానికి ప్ర‌భుత్వం హింస‌కు పాల్ప‌డింది. ఆ హింస‌కు బాధ్యుల‌ను చేస్తూ ఏడుగురు కార్మిక నాయ‌కులను ఉరితీయించింది. మే డేకు దారితీసిన ఘ‌ట‌న‌ల‌తో మార్క్స్ ను ముడిపెట్టి మాట్లాడేవారు... ఆయ‌న మేడే కార్య‌క్ర‌మాల్లో ప్ర‌త్య‌క్షంగా పాల్లొన్నార‌ని అక్క‌డ‌క్క‌డ రాస్తున్నారు. కొంద‌రు ఆ ధోర‌ణితో మాట్లాడుతున్నారు. అలాంటివారిని స‌వ‌రించ‌డం ఎంత అవ‌స‌ర‌మో, మేడేకు మార్క్స్ చాలా ముందుచూపుతో క‌చ్చిత‌మైన నేప‌థ్యాన్ని స‌మ‌కూర్చార‌ని స్ప‌ష్టంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మూ అంతే ఉంది. ఆర్థిక డిమాండ్ల‌కే ప‌రిమితం కాకుండా, కార్మిక‌వ‌ర్గాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు రాజ‌కీయంగా చైత‌న్యవంతం చేయ‌డంలో మార్క్స్ పొందిన విజయానికి మేడే యే చారిత్ర‌క సాక్ష్యం!

కార‌ల్ మార్క్స్ యువ హెగేలియ‌న్‌గా ఉన్న ద‌శ అది. అప్ప‌ట్లో యూర‌ప్‌లో, ముఖ్యంగా జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్‌, ఇంగ్లండ్‌లో కార్మిక వ‌ర్గం కోసం ఆలోచించే అనేక గ్రూపులు, లీగులు ఉండేవి. సోష‌లిజం కోరుకొనేవారు, క‌మ్యూనిజం కాంక్షించేవారు ఈ సంస్థ‌ల్లో స‌భ్యులుగా ఉండేవారు. ట్రేడ్ యూనియ‌న్లు, అవి ప‌నిచేసే బ‌స్తీ కార్మికుల్లో సోష‌లిస్టు భావాలు క‌నిపించేవి. ఖార్జానా ప‌నిలో మగ్గిపోతున్న శ్ర‌మ‌జీవుల‌కు త‌క్ష‌ణం కొన్ని వెసులుబాట్ల‌ను సాధించుకోవ‌డ‌మే ఉన్న‌త క‌ర్త‌వ్యంగా ఉండేది. ఇక యువ హెగేలియ‌న్లు, ఫ్యూయ‌ర్‌బాక్ అనుచ‌రులు, వారు ప‌నిచేసే యూనివ‌ర్సిటీలు, న్యాయ‌స్థానాలు, కార్యాల‌యాలు, చారిటీల్లో క‌మ్యూనిజం గురించి ఎక్కువ‌గా చ‌ర్చ జ‌రుగుతుండేది. కార్ఖానాల్లోనూ, స‌మాజంలోనూ రావాల్సిన స‌మూల మార్పుల‌ను గురించి తాత్వికంగా వీరు చ‌ర్చిస్తుండేవారు. ఈ తాత్విక మీమాంస సాగే క్ర‌మంలోనే మార్క్స్‌.. హెగేల్ భావాల నుంచి దూర‌మ‌వుతూ, చారిత్ర‌క భౌతిక‌వాద ఆవ‌ర‌ణ‌లోకి అడుగుపెట్ట‌డం మొద‌లుపెట్టారు. ఈ స‌మ‌యంలోనే ప‌రిచ‌యం అయిన ఎంగెల్స్‌తో క‌లిసి అటు సోష‌లిస్టుల‌ను, ఇటు క‌మ్యూనిస్టుల‌ను ఒక్క‌టి చేసే ప్ర‌య‌త్నం త‌న కాలంలో చాలా చురుగ్గా ఆయ‌న చేప‌ట్టారు. అందులోభాగంగా, కార్మిక‌వ‌ర్గం కోసం త‌క్ష‌ణం సాధించాల్సిన ఆశ‌యంగా సోష‌లిజాన్ని, దీర్ఘ‌కాల దృష్టిలో ఆ ఆశ‌యాన్ని సాధించే సిద్ధాంతంగా క‌మ్యూనిజాన్ని వారు ప్ర‌తిపాదించారు. అలా వారి కృషి ఫ‌లితంగా యూర‌ప్‌లోని ప‌లు గ్రూపులు, లీగులు క‌లిసిపోయి, క‌మ్యూనిస్టు లీగ్ ఏర్ప‌డింది. సోష‌లిజాన్ని సాధించ‌డం లీగ్ త‌న ల‌క్ష్యంగా ప్ర‌క‌టించుకొంది. ఆ ల‌క్ష్య ప్ర‌క‌ట‌న‌కు ఎంగెల్స్‌, మార్క్స్ ఇచ్చిన స‌మ‌గ్ర రూప‌మే క‌మ్యూనిస్టు మేనిఫెస్టో. ప్ర‌పంచ క‌మ్యూనిస్టు ఉద్య‌మం తొలి అడుగు వేసిన ఘ‌ట్టం ఇది. అయితే, ఇంత‌క‌న్నా ఆస‌క్తిక‌రంగా కార్మిక‌వ‌ర్గాన్ని విప్ల‌వ‌క‌ర వ‌ర్గంగా తీర్చిదిద్ద‌డానికి మార్క్స్ ఈ లీగ్‌ను వేదిక చేసుకొన్నారు. ఆనాడేమిటి, ఈనాడు కూడా కార్మిక‌వ‌ర్గం ప్ర‌ధానంగా ఆర్థిక డిమాండ్ల‌కే ప‌రిమితం అయి పోరాడుతుంద‌నే అభిప్రాయం బ‌లంగా ఉంది. త‌మ స‌మ‌స్య‌ల‌కే హెచ్చు ప్రాధాన్య‌త ఇచ్చే కార్మిక‌వ‌ర్గాన్ని ప‌ట్టుకొని, స‌క‌ల మాన‌వ జాతి విముక్తి ప్ర‌దాత అని మార్క్స్ అంటున్నాడేమిట‌ని అవ‌హేళ‌న కూడా చేశారు. కానీ, మార్క్స్‌ది ప్ర‌ధానంగా చారిత్ర‌క దృష్టి. కాబ‌ట్టే కార్మికుల శ్ర‌మ‌శ‌క్తిని ఆయ‌న స‌రుకు అన్నారు. బేర‌మాడే శ‌క్తి ఎంత‌గా ఉంటే అంత‌గా ఆ స‌రుకు అమ్ముడ‌యి, కార్మిక‌వ‌ర్గ జీవ‌నం మెరుగుప‌డుతుంద‌ని సూత్రీక‌రించారు. ఆ బేర‌మాడే శ‌క్తిని పోరాటాల ద్వారానే కార్మిక‌వ‌ర్గం స‌మీక‌రించుకోవాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. నిరంత‌రాయ పోరాటాల‌కు ఆ వ‌ర్గానికి ఆయ‌న త‌ర్ఫీదు ఇస్తూ వ‌చ్చారు. అందులోభాగంగా, ట్రేడ్ యూనియ‌న్ల‌లో తొలిసారిగా స‌భ్య‌త్వ రుసుం ఆయ‌న సూచ‌న‌తోనే ప్ర‌వేశ‌పెట్టారు. కేవ‌లం ఆర్థిక డిమాండ్ల‌కే ప‌రిమితం అవుతార‌ని క‌దా కార్మిక‌వ‌ర్గం మీద ఆనాటి స‌మాజానికి ఉన్న అంచ‌నా. ఆ అంచ‌నా త‌ల‌కిందులు చేయాల‌ని ఆయ‌న ఈ రుసుం విధానం తీసుకొచ్చారు. యూనియ‌న్‌లో చేరేవారు ఒక పెన్నీ చెల్లించి స‌భ్య‌త్వం తీసుకోవాల‌ని ష‌ర‌తు పెట్టారు. కేవ‌లం ఆర్థిక డిమాండ్ల‌తోనే కార్మిక‌వ‌ర్గం సంతృప్తి ప‌డ‌బోద‌ని, అవ‌స‌ర‌మైతే వ్య‌య ప్ర‌యాస‌ల‌కూ వెర‌వ‌బోద‌ని చెప్ప‌డ‌మే ఇందులో దాగిన మార్క్స్ వ్యూహం. ఈ వ్యూహం ఎంత స‌ర‌యింద‌నేది అనంత‌ర చ‌రిత్ర ప‌దేప‌దే రుజువు చేస్తూ వ‌చ్చింది. కార్మిక‌వ‌ర్గం ఆర్థికంగా కొంత న‌ష్ట‌పోవ‌డానికే కాదు, అవ‌స‌ర‌మ‌యితే ప్రాణ త్యాగానికీ సిద్ధ‌మ‌వుతార‌ని చాటింది మేడే!

మ‌రి మేడే చిగురించిన 1886కు ముందు ర‌క్త‌త‌ర్ప‌ణ‌లు, త్యాగాలు లేవా? కార్మిక‌వ‌ర్గం బ‌లిదానాలు చేయ‌లేదా? అంటే యూర‌ప్‌ను ఒక మ‌హ‌మ్మారిలా ఒక శ‌తాబ్దంపాటు ప‌ట్టి పీడించిన యుద్ధాల సంద‌ర్భంలోనూ, బూర్జువా విప్ల‌వాల స‌మ‌యంలోనూ అసంఖ్యాకంగా కార్మిక శ‌క్తులు ధ్వంస‌మ‌య్యాయి. కార్మిక‌వ‌ర్గానికి ఉన్న విప్ల‌వ‌క‌ర ల‌క్ష‌ణం వ‌ల్ల‌.. ఆ వ‌ర్గం బ‌లోపేతం కాకుండా ఎప్ప‌టిక‌ప్పుడు పెట్టుబ‌డిదారీ వ్య‌వ‌స్థ‌.. కావాల‌నే వేలాది, ల‌క్ష‌లాది మంది శ్ర‌మ‌జీవుల‌ను ఆక‌లికీ, క‌రువుల‌కీ, యుద్ధాలకూ బ‌లిచేసింది. దీనికి ప‌రాకాష్ట తొలి, ద్వితీయ ప్ర‌పంచ యుద్ధాలు. అయితే, ఇలా ధ్వంస‌మ‌వుతూ వ‌చ్చిన కార్మిక‌శ‌క్తికీ, చికాగోలో 8 గంట‌ల‌ ప‌ది దినాలు, శ్ర‌మ‌కు త‌గిన వేత‌నం, కార్మిక నాయ‌కుల విడుద‌ల కోసం నిన‌దించి, రాలిపోయిన కార్మిక‌వీరుల‌కూ మౌలిక తేడా ఉంది. ఈ తేడాను లెనిన్ నాయ‌క‌త్వంలోని రెండో ఇంట‌ర్నేష‌న‌ల్ గుర్తించింది. అప్ప‌టిదాకా ఎవ‌డినో గ‌ద్దె ఎక్కించ‌డానికి, ఎవ‌డికో సంప‌ద‌లు సృష్టించ‌డానికి, ఎవ‌డి లాభాల దాహానికో బ‌లి కావ‌డానికి ప‌రిమిత‌మ‌యిన కార్మిక‌వ‌ర్గం..త‌న కోసం, త‌న విముక్తి కోసం గిరి గీసి నిల‌చిన సంద‌ర్భంగా 1886 మే 1 నాటి ఘ‌ట‌న‌ల‌ను నిర్వ‌చించింది.

ఏటా మే ఒక‌టిన మేడే జ‌ర‌పాల‌ని, ఎర్ర‌జెండాని కార్మిక త్యాగాల చిహ్నంగా ప్ర‌చారం చేయాల‌ని ఈ ఇంట‌ర్నేష‌న‌ల్‌లోనే నిర్ణ‌యం తీసుకొన్నారు. దాటొచ్చిన గ‌తం తాలుకూ విజ‌య‌గాథ‌ల‌ను, వైఫ‌ల్యాల‌ను స‌మీక్షించుకొని, రాబోయే కాలానికిగాను రాజ‌కీయ‌, ఆర్థిక చైత‌న్యంతో పోరాట ప్ర‌ణాళిక‌ల‌ను కార్మిక‌వ‌ర్గం ర‌చించుకొనే వేదిక‌గా మేడేను తీర్చిదిద్దాల‌ని లెనిన్ పిలుపునిచ్చారు. అదే వొర‌వ‌డిలో కార్మిక‌వ‌ర్గం ఎర్ర‌జెండాని మ‌రింత ఎరుపుమ‌యం చేస్తూ విముక్తి ద‌శ‌గా అడుగులు వేస్తోంది!

No. of visitors : 520
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


మంద్ర‌స్థాయి యుద్ధం - ప్ర‌జా ప్ర‌తిఘ‌ట‌న : రివేరా

రివేరా | 10.06.2016 01:10:40am

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధం - ప్ర‌జా ప్ర‌తిఘ‌ట‌న పై రివేరా ఉప‌న్యాసం.......
...ఇంకా చదవండి

చేజారిన జాడల్లోంచి మైదానాల్లోకి..

రివేరా | 16.07.2016 11:50:45am

పుస్తకాల సంచిని గిరాటేసి రోడ్డుపైకి దూసుకెళ్లిన జ్ఞాపకం వెనుక నుంచి పిలుస్తున్న తల్లివైపు స్నేహితుల భుజాలపైనుంచి నవ్వుతూ చూడటమే చివరిచూపు.......
...ఇంకా చదవండి

ఏప్రిల్ పండు II రివేరా

రివేరా | 24.04.2016 11:08:03pm

పిల్లలు లేని ఇల్లు, ఇది హైదరాబాద్, ఊరేగింపు, ఏప్రిల్ పండు,...
...ఇంకా చదవండి

సాయంకాలం వాన‌!

రివేరా | 20.12.2016 11:48:01pm

దుప్ప‌టి కింద‌, దిండు అడుగున‌ పిల్ల‌లు చూడ‌కుంటా క‌ప్పెట్టుకొన్న వ‌ర‌ద‌గూడుని మెలిపెడ‌తావేమో...
...ఇంకా చదవండి

భ‌యం చుట్టూ భ‌యం..

ఎడార్డో గెల‌నో | 04.02.2017 01:18:19am

వీళ్లెక్క‌డ చంపుకుతింటారోన‌ని ఆడ‌వాళ్ల‌కు భ‌యం భ‌యంలేని ఆడ‌వాళ్లంటే మ‌గ‌వాళ్ల‌కు మ‌హా భ‌యం దొంగ‌లంటే భ‌యం, పోలీసుల‌న్నా మ‌రి భ‌య‌మే తాళాలు లేని త‌లుపులంటే భ...
...ఇంకా చదవండి

రెప్పని కప్పని నిద్దుర

రివేరా | 16.08.2016 09:26:54am

ఒకే రాత్రిని కప్పుకొన్న మనకి ఒక్క నిద్దుర చాలదా? చుక్క కలని పొదువుకోడానికి ఈ ఒక్క దేహ వర్షం చిలకదా?...
...ఇంకా చదవండి

నో, ఐ డోన్ట్‌ లైక్‌ టమాట

రివేరా | 17.09.2016 10:14:09am

టమాట రంగు సరే, రసాలూరే సరస్సులేమీ.. కొంచెం కరిచిపట్టుకొన్న మిలమిలా మీనాలేమీ.. పైకి కిందకి మునకలేసే గత్తరబిత్తర గోళాలేమీ.......
...ఇంకా చదవండి

ఈ రాక్ష‌స గీతి వింటారా?

రివేరా | 02.11.2016 10:23:06am

మ‌నం నిల‌బ‌డిపోయిన చోట నుంచే మ‌న న‌డ‌క‌ల‌ను మోసుకెళుతున్నారు మ‌నం ఆపేసిన రాగాల‌నే తీగ‌లుగా సాగిపోతున్నారు మ‌న గొంతునీ, మ‌న వంతునీ మ‌న‌క్కిచ్చేసి వెళుతు...
...ఇంకా చదవండి

అద్గ‌దీ...

రివేరా | 20.10.2016 12:13:15am

అటో ఇటో వేటో పోటో ప‌డిపోవాల్సిందే! పాల‌కులంతా ప్ర‌జాస్వామిక‌వాదులై ప్రజ‌లేమో నియంత‌లైతే ఏమి చేస్తాం?...
...ఇంకా చదవండి

సబ్కా జవాబ్ వెతికుతున్న కవి రివేరా

మహమూద్ | 04.05.2017 10:49:39am

విప్లవకవిత్వాన్ని ఈసడించుకునే వర్గాన్ని కూడా ముక్కుమీద వేలేసుకునేలా రివేరా ఓ మంచి కవి అని అందరి చేత అనిపించుకోవడం వాస్తవానికి విప్లవ సంస్కృతి విజయమే.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2020
  తెర ముందు కథ!
  షాహిన్ భాగ్..షాహిన్ భాగ్
  హిబా కోసం
  నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు
  సత్యాన్ని చెప్పడమే రాజకీయ కవితా లక్షణం
  షాహీన్ బాగ్... ఒక స్వేచ్ఛా నినాదం
  విప్లవం నేరం కాదు. విప్లవకారుడు నేరస్తుడూ కాదు.
  అరెస్టు - అన్‌టచబులిటీ
  విప్లవ కవిత్వంలో ఈ తరం ప్రతినిధి
  నిర్బంధ ప్రయోగశాల
  అరుణతార జనవరి - 2020

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •