మ‌రో కుట్ర మొద‌లైంది !

| సంపాద‌కీయం

మ‌రో కుట్ర మొద‌లైంది !

- సంఘ‌ర్ష్ | 17.05.2019 09:34:55am

భిన్నాభిప్రాయాల్ని అణ‌చివేయ‌డం కోసం... రాజ‌కీయ విశ్వాసాలు క‌లిగి ఉండడాన్నే నేరంగా ప్ర‌చారం చేస్తోంది రాజ్యం. అందుకోసం అంద‌మైన క‌ట్టు క‌థ‌ల్ని సిద్ధం చేస్తుంది. ఆక‌లిగొన్న డొక్క‌ల‌పై ఆయుధాల‌ను ఎక్కుపెట్టి యుద్ధాన్ని ప్ర‌క‌టిస్తుంది. నియంతృత్వానికి మేలి ముసుగులేసి... ప్ర‌వ‌చ‌నాలు వ‌ల్లిస్తుంది. ఇప్పుడు జ‌రుగుతున్న‌ద‌దే.

ప్ర‌గ‌తిశీల విద్యార్థి రాజ‌కీయాల‌పై మ‌తోన్మాదుల దాడులు ఇవాళ కొత్త‌వేమీ కాదు. తెలుగు నేల‌పై గ‌డిచిన ఐదు ద‌శాబ్ధాలుగా మ‌తోన్మాద శ‌క్తుల‌తో ప్ర‌గ‌తిశీల విద్యార్థి సంస్థ‌లు పోరాడుతూనే ఉన్నాయి. కానీ.. మ‌తం, అధికారం క‌ల‌గ‌లిసి ఇవాళ హ‌క్కుల హ‌న‌నానికి పాల్ప‌డుతున్నాయి. ప్ర‌జాస్వామ్యం స్థానంలో మ‌నుస్మృతిని సుస్థిర ప‌రిచే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రంగా సాగుతున్నాయి. అందుకోసం విశ్వ‌విద్యాల‌యాల్లో ప్ర‌శ్న‌ను ఉరితీసే కుట్ర జ‌రుగుతోంది. అది.. జేఎన్‌యూ అయినా, హెచ్‌సీయూ అయినా, శాత‌వాహ‌న యూనివ‌ర్సిటీ అయినా. నిశ్శ‌బ్ధాన్ని సుస్థిరం చేసే కుట్ర అది. ఇవాళ శాతావాహనా యూనివర్సిటీలో తెలంగాణ విద్యార్థి వేదిక‌, ప్రొఫెస‌ర్ సూరేప‌ల్లి సుజాత‌పై జ‌రుగుతున్న విష ప్ర‌చారం అందులో భాగ‌మే.

తెలంగాణ విద్యార్థి వేదిక మావోయిస్టు రాజ‌కీయాల‌ను ప్ర‌చారం చేస్తోంద‌ని, అందుకు ప్రొఫెస‌ర్ సూరేప‌ల్లి సుజాత స‌హ‌క‌రిస్తోందంటూ ఓ అడ్ర‌స్ లేని సంస్థ న‌క్స‌ల్ బాధిత కుటుంబాల సంక్షేమ సంఘం పేరుతో ప్ర‌చారం ఆరంభించ‌డం, ఆ వెనువెంట‌నే స‌దరు సంఘంతో గొంతుక‌లిపి తెలంగాణ విద్యార్థి వేదిక‌ను నిషేధించాలంటూ ఏబీవీపీ ఆందోళ‌న‌ల‌కు దిగ‌డం యాదృశ్చిక‌మేమీ కాదు. పోలీసులు, ప్ర‌భుత్వం డిజైన్ చేసిన కార్య‌క్ర‌మాన్ని న‌క్స‌ల్ బాధిత కుటుంబాల సంక్షేమ సంఘం, ఏబీవీపీలు ఆచ‌రిస్తున్నాయి.

ముందే అనుకున్న‌ట్లు ప్ర‌జాస్వామ్యాన్ని గౌర‌వించ‌ని మ‌తోన్మాద శ‌క్తులు కోరుకునేది నిషేధాలే. భూస్వామ్యానికి, కార్పోరేట్ల‌కు ప్ర‌తినిధిగా అధికారం చెలాయిస్తున్న కేసీఆర్‌కు కావాల‌సిందీ నిషేధాలే. మోదీకి కావ‌ల్సిందీ... ఆర్ ఎస్ ఎస్ కి కావ‌ల్సిందే నిషేధాలే. ప్ర‌శ్న‌ను, ప్ర‌శ్నించే సంస్థ‌ల‌ను నిషేధించ‌డం... పోరాడే ప్ర‌జ‌ల‌ను నిర్భంధించ‌డం ఇవాళ రాజ్యానికి త‌క్ష‌ణ అవ‌స‌రంగా మారింది. అందులో భాగంగా దేశ వ్యాప్తంగా హ‌క్కుల కార్య‌క‌ర్త‌ల‌ను అక్ర‌మ కేసుల్లో నిర్భందించిన రాజ్యం... ప్ర‌జ‌ల్ని భ‌యం నీడ‌లో బ‌తికే అసహాయులుగా మార్చాల‌నుకుంటోంది. అందుకోసం... మాట్లాడే ప్ర‌తి ఒక్క‌రిపై దేశ ద్రోహులుగా, న‌క్స‌లైట్లుగా ముద్ర‌వేస్తోంది.

భీమా కోరేగావ్‌లో ద‌ళితుల‌పై దాడులు జ‌రిపి ముగ్గురిని హ‌త్య చేసిన సంఘ్ ప‌రివార్ శ‌క్తులు... కోరేగావ్ అల్ల‌ర్ల వెన‌క మావోయిస్టులున్నార‌నే ప్ర‌చారాన్ని లంఘించాయి. ఆ ప్ర‌చారానికి గొంతుక‌లుపుతూ మావోయిస్టులు ప్ర‌ధాని మోదీ హ‌త్య‌కు కుట్ర‌ప‌న్నార‌నే క‌ట్టుక‌థ‌ను సిద్ధం చేసి... కుట్ర‌లో ఎల్గార్ ప‌రిష‌త్ స‌భ్యుల‌తో పాటు, దేశ వ్యాప్తంగా గ‌ల హ‌క్కుల కార్య‌క‌ర్త‌ల‌ను భాగం చేసింది ప్ర‌భుత్వం. మావోయిస్టు ఉద్య‌మాన్ని దేశ అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అత్యంత ప్ర‌మాదంగా చిత్రీక‌రిస్తూ... ఆ ఉద్య‌మానికి స‌హ‌క‌రిస్తున్నార‌నే పేరిట ప‌దుల సంఖ్య‌లో హ‌క్కుల కార్య‌క‌ర్త‌ల‌ను, వేలాది ద‌ళిత ఆదివాసీ ప్ర‌జ‌ల‌ను జైళ్ల‌లో నిర్భందించింది. అక్ర‌మ కేసుల్లో జైళ్ల‌లో నిర్భందించ‌బ‌డ్డ రాజ‌కీయ ఖైధీల‌ను విడుద‌ల చేయాల‌ని ఇవాళ తెలంగాణ విద్యార్థి వేదిక చేస్తున్న డిమాండ్ ఇప్పుడు... స‌ర్కారు ఆగ్ర‌హానికి కార‌ణం.

టీవీవీని మావోయిస్టు అనుబంధ సంస్థగా ప్ర‌చారం చేయ‌డం ద్వారా రాజ్యం ఆ సంస్థ‌పై నిర్భందాన్ని పెంచేందుకు సిద్ధ‌మ‌వుతోంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ప‌దుల సంఖ్య‌లో విద్యార్థి నాయ‌కులపై అక్ర‌మ కేసులు మోపిన ప్ర‌భుత్వం... ఇప్పుడు త‌మ అణ‌చివేత‌ను స‌మ‌ర్థించుకునేందుకు దుష్ర్ప‌చారానికి తెర‌తీసింది. అందులో భాగంగానే శాత‌వాహ‌న యునివ‌ర్సిటీ కేంద్రంగా టీవీవీకి మావోయిస్టుల‌తో సంబంధాలున్నాయ‌నే ప్ర‌చారాన్ని లంఘించింది. ఇప్పుడ‌ది అదిలాబాద్‌... న‌ల్ల‌గొండ జిల్లాల‌కు విస్త‌రించి... ఏ ఆధారాలు లేకుండానే పోలీసులు అధికారిక ప్ర‌క‌ట‌న‌లు చేసే స్థాయికి చేరింది.

తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మంలో మిలిటెంట్ పోరాటాలు నిర్వ‌హించి ఉద్య‌మానికి కొత్త జ‌వ‌స‌త్వాలు అందించిన టీవీవీ... ప్ర‌జ‌ల నిజ‌మైన ఆకాంక్ష‌లు నెర‌వేర‌డం కోసం, ప్ర‌జాస్వామిక తెలంగాణ సాధ‌న కోసం ప్ర‌త్యేక రాష్ట్రంలోనూ పోరాటం చేస్తోంది. పోల‌వ‌రం నిర్వాసితుల‌కు... న‌ల్ల‌మ‌ల ఆదివాసుల‌కు.. అండ‌గా నిల‌బ‌డిన సంస్థ‌... మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్టుకు, ఓపెన్ కాస్ట్‌ల‌కు వ్య‌తిరేకంగా, ద‌ళితుల‌పై దాడుల‌కు వ్య‌తిరేకంగా పోరాడిన సంస్థ‌... కేజీ నుంచి పీజీ ఉచిత విద్య కోసం అవిరామంగా పోరాడుతున్న సంస్థ‌... కార్పోరేట్ విద్యా సంస్థ‌ల ధ‌న దాహానికి పిల్ల‌ల్ని బ‌లి చేసుకోవ‌ద్దంటూ ప‌ల్లె ప‌ల్లెను త‌ట్టి లేపిన సంస్థ... టీవీవీ. ద‌శాబ్ధ‌కాలం పైగా.. పౌర ప్ర‌జాస్వామిక హ‌క్కుల కోసం నిల‌బ‌డి క‌ల‌బ‌డుతున్న‌ టీవీవీపై మావోయిస్టు అనుబంధ అనే ముద్ర వేయ‌డం వెన‌క గ‌ల కుట్రను అర్థం చేసుకోవ‌ల్సి ఉంది. స‌మాజంలోని అన్ని స‌మూహాల్లో చైత‌న్యాన్ని ర‌గిలించే టీవీవీ కార్యాచ‌ర‌ణే ఇవాళ రాజ్యానికి కంట‌గింపుగా మారింది.

జేఎన్‌యూలో క‌న్హ‌య్య కుమార్‌, ఉమ‌ర్ ఖ‌లీద్, అనిర్భ‌న్ త‌దిత‌రుల‌ను దేశదోహులుగా చిత్రించే ప్ర‌య‌త్నం చేసిన ఏబీవీపీయే ... ఇక్క‌డ టీవీవీ నాయ‌కుల్ని మావోయిస్టులుగా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేస్తోంది. అందుకు... ఆ ప్ర‌య‌త్నాన్ని మ‌రింత వేగ‌వంతం చేస్తూ.. మీడియా, పోలీసులు అత్యుత్హాన్ని ప్రద‌ర్శిస్తున్నారు. తాము వేదిక స‌భ్యుల‌పై మోపిన అక్ర‌మ కేసుల జాబితా చ‌ద‌వి... ఇవే ఆధారాలు అని ద‌బాయిస్తున్నారు. మీడియాయే న్యాయ‌మూర్తి వ‌లే తీర్పులిచ్చేస్తోంది. ఇది... విద్యార్థుల నుంచి ప్ర‌గ‌తి శీల ఆలోచ‌ల‌ను దూరం చేసే కుట్ర‌. పోరాట శ‌క్తుల‌ను వేరు చేసే కుట్ర‌. ఈ కుట్ర‌ల‌ను బ‌ట్ట‌బ‌య‌లు చేయాల్సిన అవ‌స‌రం ఉంది. ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు... ప్ర‌శ్నించే హ‌క్కును నిల‌బెట్టుకునేందుకు... ప్రొఫెస‌ర్ సాయిబాబా, వ‌ర‌వ‌ర‌రావు లాంటి ప్ర‌జా మేధావుల విడుద‌ల కోసం ఐక్యంగా ఉద్య‌మించాల్సిన అవ‌స‌రం ఉంది.





No. of visitors : 271
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


అక్క‌డ డేనియ‌ల్ ఉన్నాడు

సంఘ‌ర్ష్‌ | 18.11.2016 12:59:34pm

అక్క‌డ‌ బాల్యం భ‌యంలో... య‌వ్వ‌నం నిర్బంధంలో గ‌డిచిపోతుంది. ఇంటి నుంచి బ‌య‌ట‌కెళ్లిన పిల్ల‌లు తిరిగి వ‌స్తారో రారో తెలీదు. దారి కాచుకు కూర్చునే ఖాకీ మూక‌...
...ఇంకా చదవండి

బోధ‌నా హ‌క్కు కోసం మ‌రో జైలు పోరాటం చేస్తా : ప్రొIIజి.ఎన్‌.సాయిబాబా

ఇంట‌ర్వ్యూ : క్రాంతి | 01.06.2016 12:44:47pm

1930 సంక్షోభ కాలంలో హిట్లర్ యువతను, కార్మికులను కమ్యూనిస్టుల కంటే అధికంగా ఆర్గనైజ్ చేయడాన్ని గమనించవచ్చు. ఉపాధి లేక తిరుగుబాటు స్వభావంతో ఉన్నయువతను ఫాసిస్ట...
...ఇంకా చదవండి

దూతను కాల్చివేసే చోట: బస్తర్ అడవుల్లో జీవన్మరణ సమస్యగా జర్నలిజం

సుబోజిత్ బాగ్చీ (అనువాదం : క‌్రాంతి) | 17.06.2016 09:33:33am

సామాజిక కార్యకర్తలు, లాయర్లు, న్యాయ సహాయక బృందాలు డాక్టర్లు మొదలు సామాన్యుల వరకు అక్కడ ప్రతి ఒక్కరూ తుపాకీ నీడలో జీవించాల్సిందే........
...ఇంకా చదవండి

మ‌రో ఆదివాసీ యువ‌కుడు...

క్రాంతి | 03.09.2016 03:22:46pm

17 ఏళ్ల పిల్లాడిని తీసుకెళ్లి 30 ఏళ్ల యువ‌కుడిగా త‌ప్పుడు చార్జిషీటు సిద్ధం చేశారు. 2014లో ఐదుగురు జ‌వాన్లు చ‌నిపోవ‌డానికి కార‌ణ‌మైన అంబులెన్స్ ........
...ఇంకా చదవండి

పొట్ట‌కూటి కోసం పోతే... పోలీసులు కాల్చిచంపారు

| 20.10.2016 03:21:04pm

తాపీ మేస్త్రీ కాస్తా రాత్రికి రాత్రి మావోయిస్ట‌య్యాడు. మూడు రోజుల క్రితం పనికోసం వెళ్లిన‌ మ‌నోహ‌ర్ శ‌వ‌మై తిరిగి వ‌చ్చాడు. "ఎన్‌కౌంటర్" క‌థ రిపీట్ అయ్యింది....
...ఇంకా చదవండి

వెలివాడే తొలిపొద్దై పుస్త‌కావిష్క‌ర‌ణ‌

ఫొటోలు : క‌్రాంతి | 17.07.2016 12:15:31pm

రోహిత్ వేముల స్మృతిలో విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం వెలువ‌రించిన వెలివాడే తొలిపొద్దై పుస్త‌కాన్ని రోహిత్ త‌ల్లి వేముల రాధిక ఆవిష్క‌రించారు. మార్చి ...
...ఇంకా చదవండి

సంత‌కు వెళ్లిన వాళ్లు.. శ‌వాలై వ‌చ్చారు

సంఘ‌ర్ష్‌ | 20.02.2017 11:52:50am

ఏకంగా ఇర‌వై రోజుల నుంచి మృత దేహాల‌ను ఖ‌న‌నం చేయ‌కుండా గ్రామంలోనే ఉంచుకొని ఆందోళ‌న చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క అధికారి కూడా ఈ విష‌యంలో స్పందించ‌క‌పోవ...
...ఇంకా చదవండి

అధికారం నీడ‌లో.... అంతులేని హింస‌

క్రాంతి | 05.10.2016 03:32:08pm

మోదీ ప్ర‌భుత్వం ʹ మేక్ ఇన్ ఇండియాʹ పేరిట దేశ స‌హ‌జ వ‌న‌రుల‌ను వేదాంత‌, ఎస్సార్‌, టాటా, జిందాల్ వంటి బ‌హుళ‌జాతి సంస్థ‌ల‌కు క‌ట్ట‌బెడుతోంది. అందుకు......
...ఇంకా చదవండి

ఆ చెట్టుకు నోరుంటే ..

క్రాంతి | 03.01.2017 09:49:29am

ఆట‌పాట‌ల్లో మురిసిపోయే ప‌సివాడు ఉట్ట‌న్న‌ట్టుండి న‌క్స‌లైట‌య్యాడు. క‌సిగా గుచ్చుకున్న బ‌యోనెట్ మొన వాడి మొర ఆల‌కించ‌లేదు. రాజ్యం ఎక్కుపెట్టిన తుపాకీ తూటాల...
...ఇంకా చదవండి

ఆర‌ని మంట‌లు...

| 02.11.2016 09:05:19am

2011 మార్చిలో చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని తాడిమెట్ల గ్రామంలో జ‌రిగిన మార‌ణ‌హోమం పోలీసుల ప‌నే అని సీబీఐ తేల్చిచెప్పింది. ఈ కేసులో... ఎనిమిది మంది స్పెష‌ల్ పోలీస్...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణతార ఆగస్టు 2019

    ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగ వ్యతిరేకం
    వేటగాడి వల
    పదునెక్కుతున్న కోరలు
    ఎదురుచూపులు
    యురేనియమం
    మనిషి లోపలి ప్రకృతి గురించి చెప్పిన మంచి కథ ʹ ఆఖరి పాట ʹ
    నిశ్శబ్దంగానో, నిర్మాణంగానో
    దళిత నవలా సాహిత్యంలో ఒక మైలురాయి "నిషిధ"
    చరిత్ర కన్న శిశువు - చరిత్రకు మార్గదర్శి
    ʹఅస‌మ్మ‌తిʹపై ఎక్కుపెట్టిన అస్త్రం

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •