పిల్లలు పిట్టల్లా రాలుతున్నా
చీమెవరినీ కుట్టడంలేదు
పేగు వారిదైతే
కడుపుతీపి వాసనకైనా
కరిగిపోయేవాళ్ళు
ఏ తీపి లేనివాళ్ళు
ఏ పాపభీతి లేనివాళ్ళు
పాపాలకులైనచోట
మన పిల్లల బొడ్డుతాడుతో
వాళ్ళనెలా ముడెయ్యగలం
వాళ్ళు వాళ్లే
మనం మనమే
వాళ్ళ గారాలపట్టీలకు
బంగారు కొండలకు
చింతాకు మందమైనా
చీమ కుట్టినప్పుడుకదా
వాళ్ళ కడుపులు చెరువయ్యేది
గ్లోబరిన్
ఇంటర్ బోర్డ్
పాలకహస్తాలు
చేతులెప్పుడూ కలుపుకోలేదట
అవన్నీ ఉత్త షేక్ హ్యాండ్లేనట
కార్పొరేట్ విద్యా ఆక్టోపస్
అష్టకాళ్ల పాదాలతో నడుస్తూ
మంచిగా రాయకుంటే
ఫెయిల్ కాక మరేమవుతారని
అధికారిక మోరీ నుండి
మురుగు పారుతోంది
నూటికి తొంభైతొమ్మిది మార్కులు
పిల్లల కంట్లో
ʹసున్నాʹలై మండినా
నింద మనమీదే
వాళ్ళందరూ నిʹర్దోషుʹలే!
దోషులెవరో
జనం పరీక్షా సరస్సులో
శవాలై తేలారులే
పిల్లల్లారా
మీ భవిష్యత్తును తుంచేసి
వాళ్ళ ముఖాల మీద
నల్లగా ఉమ్మేస్తున్నారు కదా!
అయినా
వాళ్ళ పెదాల మధ్య పూస్తున్న
వెకిలి పువ్వులు చూడండి
చావెతుక్కోవడం కాదు
సమస్య సాధన చేయండి
ఫలితం తప్పక
మీదే అవుతుంది
అయ్యలారా అవ్వలారా
మన పురిటి నొప్పులు
మనకు తప్ప మరెవ్వరికీ
అర్థం కావని తెలుసుకోండి
జ్ఞాపకాలుగా మనపిల్లలు
పడమరపొద్దు కావద్దనుకుంటే
మన కళ్ళ నిండా
మన బిడ్డల భవిష్యత్తు పొద్దుపొడవాలంటే
విన్నపాలు వేడుకోళ్ళ
రోజులు కావివి
బిగించిన మోదుగుపూల
పిడికిళ్ళు కావాలిప్పుడు
Type in English and Press Space to Convert in Telugu |
దండకారణ్యంలో... నక్సల్బరీ 50 వసంతాల వేడుకలునక్సల్బరీ వారసులైన దండకారణ్య మావోయిస్టు విప్లవ కారులు జనతన సర్కార్ నేపథ్యంలో తమకు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్రజలకూ, ప్రపంచ..... |
విరసం సాహిత్య పాఠశాలరాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య... |
నోట్ల రద్దు ప్రగతి వ్యతిరేకమైనది : ప్రసాద్విరసం సాహిత్య పాఠశాల (11, 12 ఫిబ్రవరి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల రద్దుపై ఐఎఫ్టీయూ ప్రసాద్ ప్రసంగం... |
సాయిబాబా అనారోగ్యం - బెయిల్ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూకేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్ పిటీషన్ వేయడంలో చాల రిస్క్ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల... |
సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాంమానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్ విప్లవం. ఈ నవంబర్ 7 నుంచి రష్యన్ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ... |
ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండిఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ... |
నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమంనక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా....... |
లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్పాతనగరం పేద ముస్లింలకు బడేబాయి, సహచరులకు ఖాన్‌సాబ్.పౌరహక్కుల నేతగా, విప్లవ రచయితగా, అధ్యాపకుడిగా, పాత్రికేయుడిగా తెలుగు సమాజంలో తనదైన...... |
కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాంభౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స
... |
బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిపడదాం
చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్ విప్లవం..... |
ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్రకార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ... |