పునరుజ్జీవనం

| సాహిత్యం | క‌విత్వం

పునరుజ్జీవనం

- రివేరా | 17.05.2019 10:20:50am


హడావిడి ప్రేమలకు
అలవాటు పడాలి
ఇలా పీకి అలా పక్కన పెట్టే
ప్రాణ హరుడి నేర్పు రావాలి

తూగే దీపస్థంభం పాటకు
ఊగే తూనీగల వాన కావాలి
తప్పదేమో ఈ వేసటకి
ఉగ్గుపట్టి ఉడకబోయించాలి

కన్ను ఏదైనా అది కటకటాల
నీడ ఎంత పరిచినా ప్రియమే
విషపు చుక్కదేముందిలే
స్పటిక రూపు కన్నీటి బొట్టే
సత్య ప్రియుడి హత్యకు సాక్ష్యం
అది తొణక్కుండా, గుణక్కుండా
ఎత్తిందా చుక్కాని ఏ చరిత్రైనా?

ఉన్న ఒక్క తనువూ విసిరికొట్టే వేళలూ
వస్తానన్నా తీసుకెళ్లని వాళ్లపై
కాలం కోపం చేసిన వేళలూ
ఎంత తొందర పెట్టినా
తనకు మాటైనా ఇవ్వనీ!
వస్తామో... చస్తామో... ముందైతే
ఎదురు చూపులైనా మిగలనీ!





No. of visitors : 166
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


మంద్ర‌స్థాయి యుద్ధం - ప్ర‌జా ప్ర‌తిఘ‌ట‌న : రివేరా

రివేరా | 10.06.2016 01:10:40am

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధం - ప్ర‌జా ప్ర‌తిఘ‌ట‌న పై రివేరా ఉప‌న్యాసం.......
...ఇంకా చదవండి

చేజారిన జాడల్లోంచి మైదానాల్లోకి..

రివేరా | 16.07.2016 11:50:45am

పుస్తకాల సంచిని గిరాటేసి రోడ్డుపైకి దూసుకెళ్లిన జ్ఞాపకం వెనుక నుంచి పిలుస్తున్న తల్లివైపు స్నేహితుల భుజాలపైనుంచి నవ్వుతూ చూడటమే చివరిచూపు.......
...ఇంకా చదవండి

ఏప్రిల్ పండు II రివేరా

రివేరా | 24.04.2016 11:08:03pm

పిల్లలు లేని ఇల్లు, ఇది హైదరాబాద్, ఊరేగింపు, ఏప్రిల్ పండు,...
...ఇంకా చదవండి

రెప్పని కప్పని నిద్దుర

రివేరా | 16.08.2016 09:26:54am

ఒకే రాత్రిని కప్పుకొన్న మనకి ఒక్క నిద్దుర చాలదా? చుక్క కలని పొదువుకోడానికి ఈ ఒక్క దేహ వర్షం చిలకదా?...
...ఇంకా చదవండి

సాయంకాలం వాన‌!

రివేరా | 20.12.2016 11:48:01pm

దుప్ప‌టి కింద‌, దిండు అడుగున‌ పిల్ల‌లు చూడ‌కుంటా క‌ప్పెట్టుకొన్న వ‌ర‌ద‌గూడుని మెలిపెడ‌తావేమో...
...ఇంకా చదవండి

భ‌యం చుట్టూ భ‌యం..

ఎడార్డో గెల‌నో | 04.02.2017 01:18:19am

వీళ్లెక్క‌డ చంపుకుతింటారోన‌ని ఆడ‌వాళ్ల‌కు భ‌యం భ‌యంలేని ఆడ‌వాళ్లంటే మ‌గ‌వాళ్ల‌కు మ‌హా భ‌యం దొంగ‌లంటే భ‌యం, పోలీసుల‌న్నా మ‌రి భ‌య‌మే తాళాలు లేని త‌లుపులంటే భ...
...ఇంకా చదవండి

ఈ రాక్ష‌స గీతి వింటారా?

రివేరా | 02.11.2016 10:23:06am

మ‌నం నిల‌బ‌డిపోయిన చోట నుంచే మ‌న న‌డ‌క‌ల‌ను మోసుకెళుతున్నారు మ‌నం ఆపేసిన రాగాల‌నే తీగ‌లుగా సాగిపోతున్నారు మ‌న గొంతునీ, మ‌న వంతునీ మ‌న‌క్కిచ్చేసి వెళుతు...
...ఇంకా చదవండి

నో, ఐ డోన్ట్‌ లైక్‌ టమాట

రివేరా | 17.09.2016 10:14:09am

టమాట రంగు సరే, రసాలూరే సరస్సులేమీ.. కొంచెం కరిచిపట్టుకొన్న మిలమిలా మీనాలేమీ.. పైకి కిందకి మునకలేసే గత్తరబిత్తర గోళాలేమీ.......
...ఇంకా చదవండి

అద్గ‌దీ...

రివేరా | 20.10.2016 12:13:15am

అటో ఇటో వేటో పోటో ప‌డిపోవాల్సిందే! పాల‌కులంతా ప్ర‌జాస్వామిక‌వాదులై ప్రజ‌లేమో నియంత‌లైతే ఏమి చేస్తాం?...
...ఇంకా చదవండి

సబ్కా జవాబ్ వెతికుతున్న కవి రివేరా

మహమూద్ | 04.05.2017 10:49:39am

విప్లవకవిత్వాన్ని ఈసడించుకునే వర్గాన్ని కూడా ముక్కుమీద వేలేసుకునేలా రివేరా ఓ మంచి కవి అని అందరి చేత అనిపించుకోవడం వాస్తవానికి విప్లవ సంస్కృతి విజయమే.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర

కార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ...

  • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    సృజనాత్మక ధిక్కారం
    హింసలోనే పరిష్కారం వెతికిన రాజ్యం
    ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.
    హిందుత్వ శక్తులు చేస్తున్న బలవంతపు మత మార్పిడులకు బలైన ఒక ఆదివాసీ యువకుడి కథ
    వాళ్ళు
    ఇంగ్లీషు వద్దనడం లేదు, తెలుగు మాధ్యమం ఉంచండి
    గుండెను స్పృశిస్తూ జరిపిన ఒంటరి సంభాషణ "నా గదిలో ఓ పిచ్చుక"
    దేశంలో ప్రశాంతత నెలకొనివుంది-జైళ్ళూ నోళ్ళు తెరుచుకొనే వున్నాయి - తస్మాత్ జాగ్రత్త
    జై శ్రీరామ్!
    రమాకాంత్‌ వాళ్లమ్మ
    హిందూ రాజ్యం దిశగా
    అయోధ్య తీర్పు మీద మాట్లాడబోతే అరెస్టు చేస్తారా?

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •