ఇప్పుడు కావలసింది ఇలాంటి పుస్తకాలే

| సాహిత్యం | స‌మీక్ష‌లు

ఇప్పుడు కావలసింది ఇలాంటి పుస్తకాలే

- వై. కరుణాకర్ | 17.05.2019 10:24:40am


మనరాష్ట్త్రంలో మావోయిస్ట్ ఉద్యమం బలంగా ఉండి, బూటకపు ఎన్కౌంటర్లు ఉధృతంగా జరుగుతున్నకాలంలో పౌరహక్కుల సంఘం అంతే విస్తృతంగా నిజనిర్ధరణలు చేస్తూ, సభలు పెడుతూ అడిగిన ప్రశ్న నక్సలైట్లైతే చంపేస్తారా? అని. నిజానికి అప్పటి ఎన్ కౌంటర్ మృతుల్లో ఎక్కువ మంది నిరాయుధ సానుభూతిపరులు అయినప్పటికీ అడిగిన ప్రశ్న మాత్రం ఇదే. ఈ ప్రశ్నతో రాజ్యం తన స్వభావాన్ని మార్చుకోనప్పటికీ దాని దూకుడును నిలువరించగలిగింది. అంతేకాదు ఈ ప్రశ్న అనేక విధాలుగా విస్తరించింది. దొంగతనం చేస్తే లాకప్ డెత్ చేసేస్తారా? నిరసన తెలిపితే, పోనీ రాళ్ళు విసిరితే కాల్పులు జరుపుతారా ? గిట్టుబాటు ధర అడిగితే లాఠీ చార్జ్ చేస్తారా? అంటూ రాజ్యాన్ని గురిచూసిన ప్రశ్న మరోవైపు రాజ్యం గురిలో ఉన్న సమూహాలకు ఎంతోకొంత ధైర్యాన్నిచ్చింది. రాజ్యాన్ని చట్టబద్దంగా వ్యవహరించమని అడిగే చైతన్యం విస్తరించిన కాలం అది. రాజ్యాన్ని కొంత ఒత్తిడికి గురిచేసిన కాలం అది.

ఆ తర్వాత రాజ్యం తన వ్యూహాన్ని మార్చుకుంది. తనను నేరుగా డీకొంటున్న శక్తులను మొరటుగా అణచివేస్తూనే మిగిలిన సమూహాల పట్ల చట్టబద్ధంగా అణచివేయడం నేర్చుకుంది. రాజ్యాంగం సాక్షిగా ఒకదాని తర్వాతా ఒకటిగా అనేక క్రూరమైన చట్టాలను తయారు చేసుకుంది. తనను నేరుగా ప్రశ్నిస్తున్న వారిని మావోయిస్ట్ భావాజాలాన్ని కలిగి ఉన్నారనే కారణంతో కట్టడి చేసేందుకు ఈ చట్టాలను ప్రయోగించడం మొదలు పెట్టింది.

రాజ్యాన్ని ధిక్కరించే శక్తులనే కాదు రాజ్యం తనకి కంటగింపుగా ఉన్న ఇతరేతర సమూహాలను కూడా సహించలేదు. సంఘపరివార్ అధికారంలోకి వచ్చాక రాజ్యం దృష్టిలో ఈ సమూహాల సంఖ్యా పెరిగింది. దళితులు, ఆదివాసీలు, ముస్లింలు, క్రిస్టియన్ లు, కాశ్మీరీ ఇలా అనేక మందిపై రాజ్యానికి అసహనం పెరిగిపోయింది. ఈ సమూహాలతో అది కఠినంగా వ్యవహరించదలచుకుంది. ఈ అణచివేత కోసం సృష్టించిన పదబంధమే ʹఅర్బన్ మావోయిస్ట్ʹ. రాజ్యానికి తోడుగా సంఘపరివారం దీనిని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకువచ్చింది.

ఇప్పుడు ఎవరినైనా అర్బన్ మావోయిస్ట్ అనవచ్చు . వారికి ఆ భావజాలాతో ఏకీభావం ఉండాల్సిన అవసరంలేదు. ఇప్పుడిది హిందూ బ్రాహ్మణీయ ఫాసిస్ట్ రాజ్యం కనుక దానికి దీని సహజ శత్రువులందరూ అర్బన్ మావోయిస్ట్ లే. అర్బన్ మావోయిస్టుల పేరుతో వాళ్ళపై కేసులు పెట్టొచ్చు. జైళ్ళలో కుక్కోచ్చు . సంవత్సరాల తరబడి బెయిల్లు రాకుండా చేయవచ్చు . సాయిబాబాకి లాగా శిక్షలు కూడా వెయ్యొచ్చు . ఇందుకోసం భీమకోరేగాం లాంటి సందర్భాలను సృష్టించవచ్చు. ఎదిరించిన ప్రతివారినీ మీరు అర్బన్ మావోయిస్టులు అంటున్న ప్రస్తుత సందర్భంలో దీనిని ప్రజాస్వామికవాదులు ఎలా ఎదుర్కోవాలి? మావోయిస్టుల ʹపేరుతోʹ ప్రజల హక్కుల కోసం పనిచేస్తున్న మేధావులను కార్యకర్తలను అణచివేస్తోంది ఈ ప్రభుత్వం అంటూ నిరసన తెలపొచ్చా?

అలాచేయడం నేరుగా రాజ్యం ఉచ్చులో పడటమేనంటున్నారు వరలక్ష్మి, పాణిలు తమ ʹఇప్పుడు కావలసింది అర్బన్ మావోయిస్టులేʹ పుస్తకంలో. ఈ ʹఅర్బన్ మావోయిస్ట్లల పేరుతోʹ అని మాట్లాడం మేము మావోయిస్టులం కాదు అని చెప్పుకోవాల్సి రావాడానికి దారితీస్తుంది. మావోయిస్టులు కాని వారు తాము మావోయిస్టులం కాదు అని చెప్పు కోవచ్చు కదా అనిపిస్తుంది. కానీ ఇక్కడ సమస్య .మావోయిస్టులంటే ఎవరు? ఎవరు నిర్వచిస్తారు? రాజ్యంపై నీకున్న వైఖరేంటనేది ఒక్కటే కాదు . నీపై రాజ్యం వైఖరెంటనేది కూడా ఇక్క్కడ ముఖ్యం. అనేక అస్తిత్వ బృందాలు తమ హక్కులకోసం... పాలనలో వాటకోసం ఎన్నికల పరిధిలో చేసే సర్కస్ ఫీట్లను రాజ్యం సహిస్తుంది. కానీ తన ఉనికికి ముప్పు తెచ్చే వర్గ పోరాటాలతో ఏ విధమైన సాంగత్యాన్ని అది సహించదు. అలాంటి బృందాలన్నిటినీ వెంటనే మావోయిస్ట్ నిర్వచనం పరిధిలోకి చేర్చేస్తుంది. ఈ నేపధ్యంలో ʹ మావోయిస్టుల పేరుతో ʹ అనడం అణచివేతకు మరింత సాధికారతనిస్తుంది. మావోయిస్టులను అణచివేయవచ్చు అని అంగీకరించినట్లు అవుతుంది. దీనినుంచి తప్పించుకోవడం ఇక సాధ్యపడక పోవచ్చు.

ఇప్పుడు అనవలసింది ʹఅవును మావోయిస్టులయితే ఏంటి?ʹ అనే. ఇది నిజానికేప్పుడో అనవలసిన మాట. కాస్త బలంగా గట్టిగా అరచినట్ట్లుగా చెప్పవలసిన మాట. 90 శాతం అంగవైకల్యం గల సాయిబాబాను అండాసెల్ లో నిర్భందింఛినప్పుడు అనవలసిన మాట. అప్పడే ఈ మాట కొంచెం బిగ్గరగా అనివుంటే బహుశా ఆదివాసీ తరుపున వాదించే న్యాయవాది సురేంద్ర అరెస్ట్ ఆలస్యమయి ఉండేది గావచ్చు. ఎనభై ఏళ్ల వృద్దుడు వరవరరావుతో మొత్తం పదకొండు మంది హక్కుల ఉద్యమకారుల నిర్భందం నివారించబడి ఉండేది కావచ్చు.

తొంభైలలోనక్సలైట్ అయితే ఏంటి అని అడిగినట్లుగానే మావోయిస్ట్ అయితే ఏంటి అని అడగవలసిన సందర్భం వచ్చింది. ఎందుకంటే ఈ క్రమం ఇంతటితో ఆగక పోవచ్చు .ఒక్కప్పుడు మావొయిస్టులని అణచివేసిన దిగ్విజయ్ సింగ్ని సైతం ఈ రోజు సంఘ్ పరివారం మావోయిస్టు అంటోంది.. డెమోక్రాటిక్ స్పేస్ రోజు రోజుకీ పూర్తిగా కుంచించుకు పోతున్నది. ఈ రోజు ఇంటర్ విద్యార్ధుల ఆత్మ హత్యలకు నిరసన తెలిపేందుకు వీలులేదు. కమల్ హాసన్ లాంటి పాపులర్ నటుడు గాడ్సే మొదటి టెర్రరిస్ట్ అన్నందుకు ట్రోల్ అవుతున్నాడు.

ఇప్పుడే రాజ్యాన్ని దాని మూలాలలోకి వెళ్లి ప్రశ్నించే ప్రజాస్వామికవాదులు, మేధావులు కావాలి. వాళ్ళు అర్బన్ మావోయిస్ట్లయితే ఇప్పుడు కావలసింది వాళ్ళే అంటున్నారు పాణి , వరలక్ష్మి . మొత్తం అసమ్మతిని ఒక్క పదంలోకి కుదించి చికటి గదులలోకి తోసేస్తున్న ప్రస్తుత సందర్భంలో కావలసింది అర్బన్ మావోయిస్ట్ లే అంటున్నారు. వర్తమానంపై మరింత స్పష్టత కోసం అందరూ తక్షణం చదవాల్సిన పుస్తకం ʹ ఇప్పుడు కావలసింది అర్బన్ మావోయిస్టులే.ʹ


No. of visitors : 364
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోషలిజమే ప్ర‌త్యామ్నాయం, నక్స‌ల్బ‌రీయే భారత విప్లవ పంథా

పి.వరల‌క్ష్మి | 29.04.2016 11:02:35am

20, 21వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన భిన్న ధోరణుల‌న్నీ సారాంశంలో మార్క్సిస్టు వ్యతిరేకత ముఖ్యమైన ల‌క్షణంగా కలిగి ఉంటున్నాయి. కొన్నయితే మార్క్పిజం పేరుతోనే ప్రపంచ...
...ఇంకా చదవండి

పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలు

వ‌ర‌ల‌క్ష్మి | 12.03.2017 12:32:58am

సంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ - సోషలిజమే ప్రత్యామ్నాయం (విర‌సం సాహిత్య పాఠ‌శాల కీనోట్).....
...ఇంకా చదవండి

నేనెందుకు రాస్తున్నాను?

పి.వరలక్ష్మి | 05.10.2016 01:16:41am

బూర్జువా పార్టీలు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తాయి కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం రాస్తాను. ఉదాహరణకు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని దశాద్బాలుగా ఒక.......
...ఇంకా చదవండి

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం

| 28.07.2016 08:35:37pm

అసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, ఆమె సామాజిక జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ .......
...ఇంకా చదవండి

సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹ

పి.వరలక్ష్మి | 03.09.2016 01:40:55am

మన ఊర్లలో గూటి గువ్వలు, పాల పిట్టలు, ఎర్ర జొన్నలు, సజ్జ గింజెలు ఏమైపోయాయి? రాయలసీమ ప్రకృతి మరింతగా ఎందుకు నాశనమవుతోంది? పౌష్టిక ఆహారాన్నిచ్చే తిండి .......
...ఇంకా చదవండి

ఇది మనిషి మీద యుద్ధం

పి. వరలక్ష్మి | 19.04.2016 10:59:20am

సైనిక, రాజకీయార్థిక, ప్రచార రంగాల్లో సామ్రాజ్యవాదం ఎంత దాడి చేస్తున్నదో అర్థం చేసుకోవాలంటే వాటన్నిటినీ అనుసంధానించే మంద్రస్థాయి యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి...
...ఇంకా చదవండి

ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.

పి.వరలక్ష్మి | 19.11.2019 08:06:37pm

నాగప్పకు బొత్తిగా బాలేదు. ఇరవై రోజుల క్రితం కింది నుండి తొడల భాగం దాకా విపరీతంగా బొబ్బలోస్తే పులివెందుల గవర్నమెంట్ ఆస్పర్తిలో చేర్చారట. రెండు రోజులుండి వచ్...
...ఇంకా చదవండి

మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రం పై కీనోట్

పి. వ‌ర‌ల‌క్ష్మి | 03.06.2016 10:43:06pm

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రంపై రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి. వ‌ర‌ల‌క్ష్మి కీనోట్‌...
...ఇంకా చదవండి

ఉనా స్వాతంత్ర నినాదం

పి.వరలక్ష్మి | 15.08.2016 10:44:28pm

ఆగస్టు పదిహేను ద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకుʹ అని చెరబండరాజు అన్నట్లు బూటకపు స్వాతంత్రాన్ని ఎండగడుతూ నిజమైన స్వాతంత్రం కోసం ఉనా దళిత సమ్మేళనంతో... ...
...ఇంకా చదవండి

ప్రొఫెస‌ర్‌ క‌ంచ‌ ఐల‌య్య‌కు సంఘీభావంగా భావప్రకటనా స్వేచ్ఛకై

వరలక్ష్మి | 01.06.2016 09:29:12am

ప్రభుత్వాలు భావాల పట్ల నియంత్రణలు అమలుచేయజూస్తూ, భిన్నాభిప్రాయాన్ని, నిరసనను క్రిమినలైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్య...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
  సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన
  జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA), జాతీయ పౌర జాబితా (NRC) ప్రక్రియను ఎందుకు వ్యతిరేకించాలి?
  నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు
  ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి
  ఢిల్లీ నుండి ప్రేమతో
  తెలంగాణలో ఏం జరుగుతోంది? సైలెంట్ ఎమర్జెన్సీ దేనికి సంకేతం?
  తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం
  మానవాచరణ నుంచే విప్లవ కవిత్వం
  కథావరణంలో 50 సంవత్సరాల విరసం.
  నూత‌న మాన‌వ ఆవిష్క‌ర‌ణే విప్ల‌వ క‌థ అంతిమ ల‌క్ష్యం
  జీవితం పరిమళించిన కథలు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •