సిద్దేశ్వరం కోసం...

| సాహిత్యం | వ్యాసాలు

సిద్దేశ్వరం కోసం...

- | 17.05.2019 10:46:54am


సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన మూడవ వార్షికోత్సవం సందర్బంగా నంద్యాల నుండి సంగమేశ్వరం వరకు ( మే 28 నుండి మే 31, 2019 వరకు ) జరిగే 100 కి. మీ.ల మహా ప్రజా పాదయాత్రలో రాయలసీమ ప్రజలందరం స్వచ్చందంగా పాల్గొందాం

ఎప్పుడూ రాయలసీమ ప్రజలు మాట్లాడుకునే మాట మాకు అన్యాయం జరిగిందని మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదనిబీ మా పంటలకు సాగు నీరు అందడం లేదనిబీ తాగు నీటి సమస్య తీరడంలేదని. ఇలా నలుగురు కూర్చుకుని నిట్టూర్పులు, ఆవేదనలు వెల్లగక్కే స్థాయి నుంచి జరిగిన అన్యాయాల్ని తెలుసుకుని, మోసాల్ని అర్ధం చేసుకుని, కోల్పోతున్న హక్కుల్ని సాధించుకోవాలన్న స్ప హ మూడేళ్ళ క్రిందట కలిగింది. 2016 మే 31న సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన చేసుకుని ప్రభుత్వంపై శాంతియుతంగా నిరసన తెలిపిన ఉద్యమం నుంచి ఈ ఆకాంక్ష పుట్టుకు కొచ్చింది. ఆ ఉద్యమ స్ఫూర్తితో మూడేళ్ళుగా 2017 మే31 న నంద్యాల కేంద్రంగా రాయలసీమ జల చైతన్య సభను భారీ ఎత్తున నిర్వహించుకున్నాం. 2017 ఏప్రిల్‌ 3 న రాయలసీమ అంతటా సుమారు వంద కేంద్రాలలో ʹʹనీళ్ళ సత్యాగ్రహాలు కార్యక్రమాలను విజయవంత చేసుకున్నాం. 2018 మే31 న సిద్దేశ్వరం సాధన వాహన ర్యాలీని చేపట్టి, సంగమేశ్వరంలో మరోసారి రాయలసీమ అన్యాయాల్ని ఎలుగెత్తా చాటాం. 2018 నవంబర్‌ 16 న విజయవాడ కేంద్రంగా శ్రీబాగ్‌ ఒడంబడికలోని హక్కలకై దీక్ష విజయవంతగా నిర్వహించుకున్నాం. 2018 జనవరి 27, 28 గుండ్రేవుల రిజర్వాయర్‌ సాధన పాదయాత్ర, పులికనుమ రిజర్వాయర సాధన పాద యాత్రలతో శాంతియుత పోరాటాలు చేశాం. మా చెరువులకు నీళ్ళు అనే నినాదంతో అంతపురం జిల్లా అంతటా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి అందరినీఈ భాగస్వాముల్ని చేశాం. రాయలసీమ వ్యాప్తంగా అనేక సభలు , సదస్సులు, ర్యాలీలు, కవి సమ్మేళనాల ద్వారా రాయలసీమ జిల్లాల్లోని రైతాంగం, ప్రజల్లో ఒక చైతన్యాన్ని కలిగించి రాయలసీమ పట్ల ఒక ఆలోచనలను రేకిత్తించాం. చట్టబద్ధమైన నీటి హక్కుల కోసం, మిగిలిన అన్ని రంగాల్లో జరుగుతున్న తీవ్రమైన అన్యాయాలను ప్రశ్నించే స్థాయికి తీసుకుని వచ్చాం.

మూడేళ్ళుగా రాయలసీమ వ్యాప్తంగా జరుగుతున్న అనేక ఉద్యమాల్లో రైతాంగం, ప్రజలు, విద్యార్ధులు, మేధావులు, రాయలసీమ అభివ ద్ధిని ఆకాంక్షించే వ్యక్తులందరు రాయలసీమ సాగునీటి సాధన సమితి మరియు రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక చేపట్టే అన్ని పోరాటాల్లో భాగస్వాములవుతున్నారు. ఎవరి స్థాయిల్లో వారు, వారి వారి వేదికల నుంచే ఉద్యమిస్తున్నారు. రాయలసీమకు చట్టబద్ధమైన నీటి వాటా కోసం నినదిస్తున్నారు.

రాష్ట్ర విభజన తరువాత రాయలసీమకు ఇసుమంత మేలు కూడా జరగలేదన్న వాస్తవాన్ని గ్రహిస్తూనే గడచిన ఆరు దశాబ్దాల కాలంలో కూడా రాయలసీమకు జరిగిన మేలు ఏమీ లేదన్న సత్యాన్ని తెలుసుకున్నారు. అందుకే రాయలసీమ ప్రజల్లో, రైతాంగంలో, విద్యార్ధి, మేధావి లోకంలో ఒక నూతన చైతన్యం కనిపిస్తోంది. మూడేళ్ళుగా రాయలసీమ సమస్యల్ని అన్ని వేదికలపైన, అన్ని సందర్భాల్లో ప్రస్తావిస్తూ ప్రభుత్వాల ద ష్టికి, రాజకీయ పార్టీల ద ష్టికి తెచ్చినా స్పందిచకపోవడాన్ని రాయలసీమలోని అన్ని వర్గాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. రాయలసీమ అంశాలను తమ ఎన్నికల ప్రణాళికలలో చేర్చాలని రాయలసీమ ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులను కలసి విన్నవించారు. 2019 ఎన్నికల ప్రణాళికలో రాయలసీమ అంశాల్ని చేరుస్తారని ఆశించారు. అయితే ఏ పార్టీ పట్టించుకోకపోవడం రాయలసీమ ప్రాంతం పట్ల మన రాజకీయ పార్టీల వైఖరి ఏమిటన్నది వేరే చెప్పనక్కర్లేదు.

రాయలసీమలో ఇప్పుడున్న పరిస్థితి ఇలాగే కొనసాగితే జీవించే పరిస్థితి ఉండదన్నది కఠిన వాస్తవం. చట్టబద్ధంగా కేటాయించిన నికర జాలాలే ఇవ్వలేని పాలకులు, మిగులు జలాలు రాయలసీమ ఇవ్వరన్న సత్యం ఎన్నడో తేలిపోయింది. బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ముందు తమ నీటి వాట హక్కును కూడా వినియోగించుకోని రాయలసీమ అధిక నీటి వాటాను వాడుకుందన్న తెలంగాణా వాదనను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతోనే పాలకులు ఈ ప్రాంతం పట్ల ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో అర్థమయ్యింది. ఈ దుర్మార్గాన్ని ప్రశ్నించే స్థితిలో గాని, నిరసన తెలిపే స్థితిలో మిగిలిన రాజకీయ పార్టీలు లేకుండా పోవడం మరింత ఆందోళన కలిగించే అంశం. రాయలసీమ భవిష్యత్తులో ఎడారిగా మారిపోవడానికి పాలక, ప్రతి పక్ష పార్టీలు చేస్తున్న కుట్రలే కారణమన్నది నిష్ఠూర సత్యం.

రాయలసీమకు నీళ్లడిగితే నీళ్ళు ఎక్కడున్నాయని ఎదురు ప్రశ్నించే పాలకులకు, రాజకీయ పార్టీలకు సిద్దేశ్వరం ఉద్యమం ద్వారా సహేతుకమైన, చట్టబద్దమైన, శాస్త్రీయమైన పద్దతిలో సమాధానం, పరిష్కారం రాయలసీమ వాదులు పాలకుల ముందుంచారు.

తెలంగాణా ఒకవైపు కరువు ప్రాంతాలకు నీరందించేందుకు ప్రాజెక్టులు కడుతూంటే రాష్ట్రంలో కరువు ప్రాంతమైన రాయలసీమ కోసం ఈ ఐదేళ్ళలో చేసిందేమీ లేదు. తుంగభద్ర డ్యాం లో పూడిక చేరడం వలన తగ్గిపొయిన నీటి నిలువ వలన నష్టపోతున్న కర్ణాటక, రాయలసీమ ప్రాజక్టులకు ప్రయోజకరంగా ఉండే ప్రాజెక్టులు కట్టుకుందామని కర్నాటక ఆహ్వానిస్తే కనీస స్పందన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వంలో కనిపించలేదు. రాయలసీమపై పాలకులకు ఏమాత్రం ప్రేమ ఉన్న ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కర్నాటకతో చర్చలలో పాల్గొని వుంటే అనంతపూర్‌ జిల్లాకు అత్యంత కీలకమైన తుంగభద్ర ఎగువ కాలువకు సక్రమంగా నీరు అందడానికి ముఖ్యమైన ఎగువ సమాంతర కాలువ నిర్మాణానికి అంకురార్పణ జరిగివుండేది. అదేవిదంగా కర్నూలు పక్షిమ ప్రాంతానికి అత్యంత కీలకమైన తుంగభద్ర దిగువ కాలువకు ప్రాజెక్టుకు సక్రమంగా నీరు అందడానికి ముఖ్యమైన వేదవతి ఎత్తిపోతల పథకం సాకారం అయ్యివుండేది.

కర్నూలు-కడప జిల్లాలకు వరప్రదాయిని అయిన కే సి కెనాల్కు అత్యంత కీలకమైన గుండ్రేవుల రిజర్వాయర్‌ పై నిముషానికో మాట మాట్లాడుతూ పాలకులు ఐదేళ్ళ కాలం హరించేశారు. గోదావరి నీటిని నాగార్జున సాగర్‌ ఆయకట్టుకు మళ్ళించి, శ్రీశైలం రిజర్వాయర్‌ ను పూర్తిగా రాయలసీమ, దక్షిణ తెలంగాణా అవసరాల కోసం వినియోగించుకునేలగా గత కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన దుమ్ముగూడెం నాగార్జునసాగర్‌ టైల్‌ పాండ్‌ ప్రాజెక్టును రాష్ట్ర విభజన చట్టంలో చేర్చకపోయిన అంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. పట్టిసీమ ద్వారా ఆదాయం అయిన నీటిని హంద్రీ-నీవా, గాలేరు- నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు చట్టబద్ధంగా కేటాయిస్తామని శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి ప్రకటించి మూడేళ్ళు అయినా, ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. శ్రీశైలం రిజర్వాయర్‌ కనీస నీటి మట్టాన్ని 854 అడుగలకు పెంచి, రాయలసీమ ప్రాజెక్టులైన తెలుగుగంగ, ఎస్‌.ఆర్‌. బి. సి., గాలేరు- నగరి, కే సి కెనాల్‌ కు పోతిరెడ్డి పాడు ద్వారా, హంద్రీ నీవాకు మల్యాల ఎత్తిపోతల ద్వారా నీరందించే ఏర్పాటు జరగలేదు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలిగొండ, తెలుగుగంగ ప్రాజెక్టులకు నికర జలాలు కేటాయింపు జరిగేలా నీటి హక్కుల దక్కేందుకు రాష్ట్ర విభజన చట్టంలో జరిగిన తప్పులను సరిదిద్దాల్సిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం కనీస ప్రయత్నాలు చేయకపోవడం అత్యంత దారుణమైన అంశం .

1951 లో ప్లానింగ్‌ కమీషన్‌ అనమతి ఇచ్చినా సిద్దేశ్వరం వద్ద నిర్మించ వలసిన క ష్ణా- పెన్నార్‌ ప్రాజెక్టును ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్రం నుండి తెలుగు రాష్ట్రము విడిపోయిన తరువాత మధ్య కోస్తా నాయకత్వ చలాకితనంతో కార్యరూపం దాల్చకుండా పోయింది. దీనికి బదులుగా నాగర్జనసాగర్‌ నిర్మాణం చేపట్టి రాయలసీమకు నీరందకుండా చేసారు. తరువాత కట్టిన శ్రీశైలం ప్రాజెక్టునైనా సిద్దేశ్వరం దగ్గర నిర్మించకుండా రాయలసీమకు తీవ్ర ద్రోహం చేసారు. ఇది కేవలం నాగార్జున సాగర్‌ కు అదనపు రిజర్వాయర్‌ గా ఉపయోగ పడుతుంది. జరిగిన నష్టాన్ని సరిద్దిడుకోనడానికి సిద్దేశ్వరం అలుగు నిర్మాణం ఒక సువర్ణ అవకాశం. కేవలం 600 కోట్ల రూపాయల ఖర్చుతో, సిద్దేశ్వరం అలుగు నిర్మాణం ద్వారా హంద్రీనీవా, గాలేరునగరి, తెలుగుగంగ, ఎస్‌ ఆర్‌ బి సి , కేసి కెనాల్‌ కు నీరు సకాలంలో, సంపూర్ణంగా అందించడంతో పాటు, శ్రీశైలం రిజర్వాయర్‌ కింద భూమి పోగుట్టుకున్న కొత్తపల్లి మండలం లోని అనేక గ్రామాలకు ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని అందించవచ్చు. అంతేకాకుండా సిద్దేశ్వరం అలుగు నిర్మాణంతో శ్రీశైలం రిజర్వాయర్లో పూడిక చేరడాన్ని అరికట్టే అవకాశం ఉంది. తద్వారా శ్రీశైలం ప్రాజెక్టు జీవితకాలం పెంచేందుకు వీలవుతుంది. . ఇంతటి బ హత్‌ ఫలితాలను అందించే సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన జరిగి మూడేళ్ళయినా పాలకులు రాయలసీమ ప్రజల న్యాయబద్దమైన డిమాండ్ను గౌరవించడం అటుంచి ఉద్యమ నాయకులతో మాట్లాడటానికి కూడా సిద్దంగా లేరంటే రాయలసీమకు వారు ఇస్తున్న ప్రాధాన్యత ఏపాటితో అర్థమౌతున్నది.

రాయలసీమకు చట్టబద్దంగా కేటాయించిన నీటిని పొందేందుకు ఉపయోగపడే పై ప్రాజెక్టులు, నిర్మాణంలో వున్నా ప్రాజెక్టులకు చట్టబద్ద నీటి హక్కుల కల్పించే దిశగా క షి చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్న పాలకుల చర్యలపై మౌనంగా ఉంటే భవిష్యత్తు తరాలు క్షమించవన్న ప్రధానాంశమే నేడు రాయలసీమ సాగునీటి సమితి మరియు రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో కొత్త తరహా ఉద్యమానికి ప్రేరణగా నిలుస్తోంది. సిద్ధేశ్వరం అలుగు సాధనతో పాటు రాయలసీమలోని అన్ని సమస్యలను పరిష్కారించాలన్న డిమాండ్‌ పై ఉద్యమిస్తున్న రాయలసీమ సాగునీటి సాధనా సమితి మరియు రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక, సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన మూడేళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రజా పాద యాత్రకు రూపకల్పన చేసింది.

రాయలసీమ సస్యశ్యామలంగా బతకడానికి ఇన్ని అవకాశాలున్న కేవలం పాలకుల నిర్లక్ష్యంతోనే రాయలసీమ అంపశయ్యపై ఉంది. ఎప్పుడో చచ్చే కంటే ఇప్పుడే ప్రాణత్యాగాలకైనా సిద్దమై రాయలసీమను కాపాడి భవిష్యత్‌ తరాలకు ʹʹరతనాల రాయలసీమʹʹ అందించాలంటే రైతులు, విద్యార్ధులు, మేధావులు, ఉద్యోగులు, ప్రజలు, మహిళలు అందరూ ఒక్కటై నడుద్దాం!. నంద్యాల మున్సిపల్‌ టౌన్‌ హాల్‌ నుంచి మే 28 ఉదయం 7 గంటలకు ప్రారంబమై మే 31 సిద్ధేశ్వరం వరకు సాగే ఈ మహోద్యమ పాదయాత్రలో మనమంతా భాగస్వాములవుదాం!!

No. of visitors : 204
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర

కార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ...

 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార డిసెంబర్ 2019
  సృజనాత్మక ధిక్కారం
  హింసలోనే పరిష్కారం వెతికిన రాజ్యం
  ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.
  హిందుత్వ శక్తులు చేస్తున్న బలవంతపు మత మార్పిడులకు బలైన ఒక ఆదివాసీ యువకుడి కథ
  వాళ్ళు
  ఇంగ్లీషు వద్దనడం లేదు, తెలుగు మాధ్యమం ఉంచండి
  గుండెను స్పృశిస్తూ జరిపిన ఒంటరి సంభాషణ "నా గదిలో ఓ పిచ్చుక"
  దేశంలో ప్రశాంతత నెలకొనివుంది-జైళ్ళూ నోళ్ళు తెరుచుకొనే వున్నాయి - తస్మాత్ జాగ్రత్త
  జై శ్రీరామ్!
  రమాకాంత్‌ వాళ్లమ్మ
  హిందూ రాజ్యం దిశగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •