రాజ్యానికెదురు రాజీలేని పోరు

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

రాజ్యానికెదురు రాజీలేని పోరు

- పి. పావ‌ని | 17.05.2019 12:18:50pm


2019 మార్చి 5న తెల‌తెల‌వారుతుండ‌గా.. మావోయిస్టు విముక్తి ప్రాంతంగా పేర్కొనే అబుజ్ మడ్ నుంచి (బుద్ధర్ డివిజన్ నారాయణ్పూర్, బీజాపూర్ జిల్లాల) వేలాది ఆదివాసీలు ఇంద్రావ‌తి వైపు సాగిపోయారు. దారిలో వండుకుని తిన‌డానికి నెత్తిన బియ్యం, కాయ‌గూర‌ల మూటలు, చంక‌ల్లో పిల్ల‌ల‌తో ఆడా, మ‌గా ఇంద్రావ‌తి దాటి.. బైరామ్ ఘ‌డ్ ప‌ట్ట‌ణానికి చేరుకుంటున్నారు.

స‌ల్వా జుడుం త‌ర్వాత ఈ గ్రామాల ప్ర‌జ‌లు తొలిసారి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న వ్య‌క్తం చేసేందుకు వ‌చ్చారు. వీరంతా బైరాంఘ‌డ్ చేరుకున్న వెంట‌నే ఒక బ‌హిరంగ స‌భ నిర్వ‌హించారు. ఈ స‌భ‌లో భ‌ద్ర‌తా ద‌ళాలు త‌మ‌పై చేస్తున్న దాష్టీకాల‌ను వివ‌రించారు. ముఖ్యంగా మ‌హిళ‌లు త‌మ ఆగ్ర‌హాన్ని బాహాటంగానే వ్య‌క్తంచేశారు. ఆదివాసీ ఉద్య‌మ‌కారిణి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత సోనీ సోరీ, ఇటీవ‌ల బీజాపూర్ నుంచి కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున శాస‌న స‌భ‌కు ఎన్నికైన సాల్వాజుడుం మాజీ నేత విక్ర‌మ్ మండ‌వి కూడా ఉప‌న్య‌సించారు.

వంట చెరకు కోసం అడ‌విలోకి వెళ్లిన ముగ్గురు ఆదివాసీ మ‌హిళ‌ల‌పై భ‌ద్ర‌తీ దళాలు కాల్పులు జ‌రిపిన స‌రిగ్గా ఐదురోజుల‌కు అంటే ఫిబ్ర‌వ‌రి 7న తాడ్ బండ్ల గ్రామంలో ప‌ది మంది ఆదివాసీ యువ‌తను ఎన్కౌంట‌ర్ పేరిట చంపేశారు. తాడ్ బండ్ల ఇంద్రావ‌తి న‌దికి ఉత్త‌రాన ఉండే చిన్న గ్రామం. ఈ ఎన్కౌంట‌ర్ లో చ‌నిపోయిన వారంతా తాడ్ బండ్ల చుటుప‌క్క‌ల ఆరు గ్రామాల‌(ఉత్లా, జిల్లీ, కొల్నార్, చోటేప‌ల్లి, తాడోపాట్, తాడ్బండ్ల‌)కు చెందిన వారు. ఈ గ్రామాల‌న్నీ ఇంద్రావ‌తికి ఇరువైపులా ప‌రుచుకుని ఉన్నాయి. స‌భ‌త‌ర్వాత జ‌రిగిన ఘ‌ట‌న‌కు సంబంధించి హైకోర్టులో కేసు వేయ‌డానికి మృతుల కుటుంబ స‌భ్యులు నిర్ణ‌యించుకున్నారు.

అస‌లు ఏం జ‌రిగిందంటే..


ఫిబ్ర‌వ‌రి 7కి రెండు రోజులు ముందు అంటే ఫిబ్ర‌వ‌రి 5న కొంత మంది మావోయిస్టు పార్టీ స‌భ్యులు ఉత్లా గ్రామానికి వ‌చ్చారు. స్థానిక యువ‌త కోసం క్రీడ‌ల పోటీలు ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపి.. అందుకు స్థానికుల సాయం కావాల‌ని... గ్రామం నుంచి కొంద‌రు వాలెంటీర్ల‌ను పంపాల్సిందిగా కోరారు. ఉత్లా గ్రామం నుంచి తాడ్ బండ్ల రెండు గంట‌ల న‌డ‌క దూరం. ఉత్లా లాగానే మ‌రో నాలుగు గ్రామాల నుంచి కూడా వాలెంటీర్లు కావాల‌ని అడిగారు. ఇవ‌న్నీ తాడ్ బండ్ల‌కు ఒక‌టి రెండు గంట‌ల న‌డ‌క దూరంలోనే ఉంటాయి. వ‌చ్చేట‌ప్పుడు తాము తినేందుకు అవ‌స‌ర‌మైన బియ్యం కూర‌గాయ‌ల‌ను, వండుకునేందుకు గిన్నెల‌ను తెచ్చుకోమ‌ని మావోయిస్టులు సూచించారు.

ఘ‌ట‌న జ‌రిగిన రోజున ఉద‌యం వాలెటీర్ చేసేందుకు వ‌చ్చిన యువ‌త అంతా ఆట‌ల పోటీలు నిర్వ‌హించే ప్రాంతాన్ని చ‌దును చేసి అనువుగా చేసే ప‌నిలో ఉన్నారు. కొంత మంది వంట కోసం కూర‌గాయ‌లు కోస్తూ ఉన్నారు. ఇంత‌లో వంద‌లాది భ‌ద్ర‌తా ద‌ళాలు( బీజాపూర్, బైరామ్ ఘ‌డ్ క్యాంపుల‌కు చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, స్పెష‌ల్ టాస్క్ ఫోర్స్) మైదానంలో స‌మావేశ‌మైన వారిపై దాడి చేసి కాల్పులు జ‌రిపారు. క‌నీసం రెండు గంట‌ల సేపు కాల్పులు జ‌రిగి ఉంటాయ‌ని గ్రామస్తులు తెలిపారు. ఈ దాడి ఒక రోజు ఆల‌శ్యమై ఉంటే ఏం జ‌రిగిందో త‌ల‌చుకోడానికే భ‌యం వేస్తోంద‌ని అన్నారు గ్రామ‌స్తులు. ఆట‌లను చూడ‌టానికి చుట్టు ప‌క్క‌ల గ్రామస్తులు, పిల్ల‌లు పెద్ద సంఖ్య‌లో వ‌చ్చి ఉండేవార‌ని చెప్పారు. ఈ దాడి జ‌రిగిన స‌మ‌యానికి అక్క‌డ యూనిఫాం వేసుకున్న ముగ్గురు మావోయిస్టులు ఉన్నార‌ని, కాల్పుల నుంచి వారు త‌ప్పించుకు పోయార‌నీ ఒక గ్రామ‌స్తుడు గుర్తు చేసుకున్నాడు. అయితే మావోయిస్టుల వ‌ద్ద ఆయుధాలు ఉన్నాయో లేదే త‌న‌కు తెలీద‌ని అన్నాడు. ఏది ఏమైనా ఆరోజు అక్కడ కాల్పులు ఏక‌ప‌క్షంగా జ‌రిగాయ‌నేది గ్రామ‌స్తుల వాద‌న‌. అయితే ఘ‌ట‌నా స్థ‌లం నుంచి కొన్ని బ‌ర్మార్లు సీజ్ చేసిన‌ట్లు పోలీసులు రికార్డు చేశారు.

ఈ ఘ‌ట‌న‌లో ప‌ది మంది ఆదివాసీ యువ‌త చ‌నిపోయారు. వీరిలో ఐదు మంది ఆడ‌వాళ్లు కాగా ఐదు మంది మ‌గ‌వాళ్లు అంతా పాతిక లోపు వారే. వీరిలో తాడ్ బండ్ల‌కు చెందిన పాలో, కొల్నార్ కు చెందిన శాంతి, ఉత్లా గ్రామానికి చెందిన శంక‌ర్లు మైన‌ర్ల‌ని వాళ్ల త‌ల్లిదండ్రులు వాదిస్తున్నారు. ఉత్లాకు చెందిన బ‌ర్సా ప‌ర్మేశ్ త‌ప్ప మిగ‌తా వారంతా అవివాహితులు.

చ‌నిపోయిన వారిలో తాడ్ బండ్ల‌కు చెందిన పాలో కూడా ఉంది. ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు పాలో త‌ల్లిదండ్రులు ద‌గ్గ‌ర‌లోనే ఉన్నారు. కుమార్తె కేక‌లు అరుపులు విన్న వాళ్లు అటువైపు వెళ్లేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే భ‌ద్ర‌తా ద‌ళాలు వారిని అడ్డుకున్నాయి. మైదాన్నాన్నంతా చుట్టుముట్టి ఎవ‌రినీ క‌ద‌ల‌నీయ‌కుండా చేశార‌ని పాలో తండ్రి సోది హిడ్మ, త‌ల్లి ఐతెలు చెప్పారు. త‌మ కుమార్తె మృత‌దేహాన్ని ఒక పాలెథీన్ క‌వ‌ర్లో చుట్టి ఇచ్చార‌ని తెలిపారు. మృత‌దేహంపై దుస్తులు లేవ‌ని, లైంగిక దాడికి గురైన గుర్తులు ఉన్న‌ట్లు తెలిపారు. పాలో చేతి వేళ్లు తెగిపోయి ఉన్నాయి. ఒక క‌నుగుడ్డు పీకేసి ఉంది. నుదుటిమీద రాయిత‌గిలిన‌ట్లు పెద్ద‌గాయం ఉంది, ఛాతీలో క‌త్తిపోట్ల‌కు గురైనట్లు, రెండు బుల్లెట్లు ఆమె శ‌రీరంగుండా దూసుకెళ్లిన గాయాలు ఉన్నాయ‌ని వివ‌రించారు. పాలో వ‌య‌స్సు 15 ఉంటుంద‌ని అన్నారు. బీజాపూర్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి నుంచి తెచ్చుకున్న అన్ని మృత‌దేహాల ప‌రిస్థితి ఇలానే ఉంద‌ని గ్రామ‌స్తులు చెప్పారు.

ఈ ఘ‌ట‌న‌లో మృతులంతా అత్యంత పాశ‌విక హింస‌కు గురైన గుర్తులు ఉన్నాయి. వీరిని చంపేందుకు, శ‌రీర భాగాల‌ను కోసేందుకు భ‌ద్ర‌తాద‌ళాలు బుల్లెట్లు, క‌త్తులు, రాళ్ల‌ను ఉప‌యోగించారు. రాజు, సుక్కు, పాలో శాంతి, సోమ్డిల శ‌రీరం మీద రెండు నుంచి మూడు బుల్లెట్లు కాల్చిన గాయాలు ఉన్నాయి. ప‌దునైన క‌త్తితో రాజు, శంక‌ర్ గొంతులు కోశారు. సోమ్డి, ప‌ర్మేశ్, పాలో, సుద్రి శ‌రీరాల‌పై క‌త్తిపోటు గాయాలు ఉన్నాయి. పాలోలాగానే 15ఏళ్ల శాంతి,సోమ్డి ల‌ మీద లైంగిక హింస‌జ‌రిగినట్లు తెలుస్తోంది. అంగాల‌ను కోసిన గాయాలు ఉన్నాయి.

వీళ్లంతా మామూలు ఆదివాసీ సంప్ర‌దాయ దుస్తులు ధ‌రించే ప‌నిచేయ‌డానికి వెళ్లార‌నీ, కానీ పేప‌ర్లో, పోలీసులు ప్ర‌చారం చేస్తున్న ఫోటోల్లో వారంతా ష‌ర్ట్స్ వేసుకున్న‌ట్లు క‌నిపిస్తోంద‌ని, ఒక‌టి రెండు మృత‌దేహాల‌పై మావోయిస్టుల యూనిఫారాన్ని త‌ల‌పించే దుస్తులు ఉన్నాయి.
ఘ‌ట‌నా స్త‌లంలో దొరికి న దుస్తులు, ఇత‌ర వ్య‌క్తిగ‌త వ‌స్తువులను పోలీసులు అక్క‌డే త‌గ‌ల‌బెట్టేశారు. బుల్లెట్ల వ‌ల్ల చిల్లులు ప‌డ్డ పాత్ర‌లను ద్వంసం చేశారు. ఇందంతా పూర్తైయ్యాక గ్రామంలోనే ఒక కోడి, పందిని కోసుకుని తిన్నార‌ని గ్రామ‌స్తులు చెప్పారు.

మృత దేహాల‌ను తెచ్చుకోవ‌డానికి ఆస్ప‌త్రికి వెళ్లినప్పుడు మృతుల‌ ఆధార్ కార్డులు తీసుకున్నార‌ని త‌ల్లిదండ్రులు చెప్పారు. శాంతి, శంక‌ర్ ల ఆధార్ కార్డులో వ‌య‌స్సుకు సంబంధించిన స‌మాచారం ఉండే క్రింది భాగాన్ని పోలీసులు తీసేసుకున్నార‌ని తెలిపారు. త‌మ పిల్ల‌లు మైన‌ర్లు కావ‌డం వ‌ల్లే ఇలా చేశార‌ని ఆరోపించారు.

త‌మ ప్రాంతంలో ఇలాంటి ఘ‌ట‌న‌లు ఎప్పుడూ జ‌ర‌గ‌లేద‌ని, త‌మ‌కు న‌ష్ట‌ప‌రిహారం కాదు, న్యాయం కావాల‌ని ఆదివాసులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్‌కౌంట‌ర్‌ ఐన ప్ర‌తి సారీ జ‌నం నిర‌స‌న తెలిపేందుకు రారు. కానీ ఈ సారి మాత్రం ఆదివాసులు బాహాటంగానే త‌మ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తంచేశారు.

ఎన్కౌంట‌ర్ కి సంబంధించిన నిజానిజాలు తెలుసుకోకుండానే ప్ర‌భుత్వం ఇది మావోయిస్టుల‌పై భ‌ద్ర‌తాద‌ళాల విజ‌యంగా ప్ర‌క‌టించేసింది. పోలీసులు ఇచ్చిన స‌మాచారం మేర‌కు ఎన్కౌంట‌ర్ జ‌రిగిన ప్రాంతం మావోయిస్టుల ట్రైనింగ్ క్యాంప‌నీ, ఎదురు కాల్పులు జ‌రిగాయ‌నీ మీడియా చెప్పుకొచ్చింది. దీన్ని బాధితుల త‌ల్లిదండ్రులు, బంధువులు కొట్టిప‌డేశారు.

మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాల్లో భ‌ద్ర‌తా ద‌ళాలు నిరాయుధ ఆదివాసీ సమావేశాల‌పై కాల్పులు జ‌ర‌ప‌డం ఇదేమీ మొద‌టి సారి కాదు. 2013మే17న బీజాపూర్ జిల్లా ఇడుసుమెట్ట గ్రామంలో బీపా పండ‌మ్(విత్త‌నాల పండుగ‌) చేసుకోవ‌డానికి స‌మావేశ‌మైన ఆదివాసుల‌పై కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న‌లో ఎనిమిది మంది ఆదివాసులు మ‌ర‌ణించారు. 2012 జూన్ 28న బీజాపూర్ జిల్లాకే జెందిన స‌ర్కగూడ లో కూడా ఇదే విదంగా ఏక‌ప‌క్షంగా కాల్పులు జ‌రిపారు. ఆ ఘ‌ట‌న‌లో 17 మంది ఆదివాసులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాంతాల్లో భ‌ద్రతా బ‌ల‌గాలు.. గ్రామ‌స్తులు పెద్ద ఎత్తున స‌మావేశం అవుతున్నార‌ని తెలియ‌గానే.. మావోయిస్టుల‌నే అనుమానిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌ల‌పై న్యాయ‌విచార‌ణ జ‌ర‌గాల్సి ఉంది.

బైరాం ఘ‌డ్ స‌మావేశం త‌ర్వాత స్థానిక‌ ఎమ్మెల్యేకి ఒక పిటిష‌న్ అంద‌జేశారు. గ్రామ‌స్తుల క‌థ‌నాల ఆధారంగా ఘ‌ట‌న‌లో పాల్గొన్న పోలీసుల‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని డిమాండ్ చేశారు. ఫిబ్ర‌వ‌రి 7న హింస‌, దౌర్జ‌న్యాల‌కు తెగ‌బ‌డిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. ఈ ఘ‌ట‌న‌పై ఒక జుడిషియ‌ల్ ఎంక్వైరీ వేయాల‌ని డిమాండ్ చేశారు. జుడిషియ‌ల్ క‌మిష‌న్ ముందు ప్ర‌జ‌ల‌కు త‌మ అభిప్రాయాలు తెలిపే అవ‌కాశం ఇవ్వాల‌ని కోరారు. ఇప్ప‌టికే ఈ పిటిష‌న్ కాపీల‌ను రాష్ట్ర‌ప‌తి, సుప్రింకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి, హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి, ఛ‌త్తీస్ఘ‌డ్ ముఖ్య‌మంత్రుల‌కు అంద‌జేసినా వారి నుంటి ఎటువంటి ప్ర‌తిస్పంద‌నా రాలేదు.

No. of visitors : 788
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నాపేరు శూర్పణఖ

పావని | 17.03.2019 11:23:38pm

నాకు వంటి రంగు గురించి మరో రకం బాధ మొదలైంది. నేను మరీ అంత చిక్కటి నలుపులో లేననీ.. నా జుట్టు వత్తుగా, నల్లగా ఉన్న మాట నిజమే కానీ.. అది రింగులు రింగులుగా లే.....
...ఇంకా చదవండి

హిందుత్వ శక్తులు చేస్తున్న బలవంతపు మత మార్పిడులకు బలైన ఒక ఆదివాసీ యువకుడి కథ

నవల్ కిషోర్ కుమార్ | 19.11.2019 02:50:44pm

జాతీయ‌త పేరుతో, ఎవ‌రైనా (బ్రాహ్మనీయ శక్తులు) నా సంస్కృతిని చంపేందుకు చూస్తే, పంతి, సువా, క‌ర్మ‌, నా ప్ర‌జ‌ల‌పై మావి కానీ (ఛతీస్ఘడ్ కు సంబంధం లేని) నాట్యం.....
...ఇంకా చదవండి

ఆ చిరునవ్వుల్ని చిదిమేశారు

పావని | 01.04.2019 01:35:31pm

రాష్ట్రంలో హ‌క్కుల కార్య‌క‌ర్త‌ల‌ను మావోయిస్టుల పేరుతో వేధించ‌డం.. కొన్ని సార్లు ప్రాణాలు తీయ‌డం కొత్త కాద‌ని ఇక్క‌డి హ‌క్కుల కార్య‌క‌ర్త‌లు చెబుతారు......
...ఇంకా చదవండి

అతడి ఆలోచనలు అక్షరాలకే పరిమితం కాలేదు

అరుంధతి ఘోష్ | 16.06.2019 10:44:24am

చాలా మంది మేధావుల లాగా.. గిరీష్ క‌ర్నాడ్ వాద‌న‌లు, చ‌ర్చ‌లు, టెలివిజ‌న్ పానెల్ లు, సెమినార్ల‌కు ప‌రిమితం కాలేదు. ఆయ‌న త‌ను న‌మ్మిన విలువ‌ల కోసం వీధుల్లోకి.....
...ఇంకా చదవండి

ఢిల్లీ నుండి ప్రేమతో

పావ‌ని | 18.12.2019 12:56:37am

ఎలా ఉన్నారు? జైల్లో ఉన్న వాళ్ల‌ను ఇలాంటి ప్ర‌శ్న వేయ‌టం బాలేదు కానీ... ఉత్త‌రం ఎలా మొద‌లు పెట్టాలో తెలీదు. మీ ఆరోగ్యం ఎలా ఉందో అని చిన్న బెంగ‌. అంత‌కంటే......
...ఇంకా చదవండి

వాళ్లంటే అంత భ‌యం ఎందుకు?

పావ‌ని | 28.08.2019 07:09:33pm

మ‌త‌మో.. దేశ‌మో ఏదో ఒక మూఢ‌భ‌క్తిలో ఉన్న జ‌నాన్ని నిద్ర‌లేపుతారేమో అని భ‌యం. అలాంటి ప్ర‌మాదం వీళ్ల వ‌ల్ల పొంచి ఉంది. అందుక‌ని.. వీళ్ల‌ను భ‌ద్రంగా జైలు గోడ‌ల...
...ఇంకా చదవండి

ఆట‌లూ - దేశ‌భ‌క్తి ప్ర‌ద‌ర్శ‌న‌

పి.పావని | 16.07.2019 07:19:53pm

దేశ‌భ‌క్తి ప్ర‌ద‌ర్శిచ‌డంలో... మహేంద్ర సింగ్ ధోనీ, మేగ‌న్ రెపీనోల మ‌ధ్య ఎంత తేడా ఉందో ఆలోచిస్తే.. ఆశ్చర్యం క‌లుగుతుంది. ప్ర‌జాస్వామ్య విలువ‌ల ప‌ట్ల స‌మాజ.....
...ఇంకా చదవండి

నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు

| 18.12.2019 10:18:58pm

మ‌తం జాతీయ‌త‌ను, పౌర‌స‌త్వాన్ని నిర్ణ‌యించ‌డం ఆమోదించ త‌గిన చ‌ర్య కాదు. శ‌ర‌ణార్తుల‌ను మ‌త‌ప్రాతిప‌దిక‌న విభ‌జించ‌టం స‌రైన‌ది కాదు. ఇది భార‌తీయులు అటే ఎవ‌.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  సాహ‌సోపేత జీవితం
  నలబై వసంతాల దండకారణ్యం
  అరుణతార ఏప్రిల్ - జూన్ 2020
  తారకంగారంటే..
  సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?
  అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ
  హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష
  అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం
  దేశీయుడి కళ
  మీరొస్తారని
  బందీ
  ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •