ప్రశ్నించేతత్త్వం - బ్లాక్ వాయిస్

| సాహిత్యం | స‌మీక్ష‌లు

ప్రశ్నించేతత్త్వం - బ్లాక్ వాయిస్

- దాసరి సుబ్రహ్మణ్యేశ్వరరావు | 01.06.2019 10:50:48pm

చాలామంది కవులు రకరకాలుగా తమ కవిత్వాలను తమదైన శైలిలో రాసి వాళ్లకి అర్ధమైన రీతిలో సాహితీప్రియులకు అందించడంలో చాలా కృషి చేస్తారు కానీ వారికవిత్వం కొంతమందికి మాత్రమే అర్థమవుతుంది మరికొందరికి ద్వందార్థాలతో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ కొంతమంది కవులలో ఒక కవి మాత్రమే ఈమధ్య ఉద్యమ సూర్యుడిలా దూసుకుంటూ తన కవిత్వాన్ని ఎవరికైనా సరే ఇట్టే అర్థమవుతుంది ఒక రకంగా చెప్పాలంటే చదువు లేని వారి కంటే చదువుకున్న వారికి ఆ కవిత్వంఅర్థం చేసుకోవడం కొన్ని పదాలు డిక్షనరీ లో కూడా ఉండవు ఎందుకంటే పల్లెల్లో ఉండే పదాలు మాండలికాలతో పోలుస్తూ ఇవి దళిత గ్రామాలలో లేదా మారుమూల పల్లెల్లో మాత్రమే ఉంటాయి. ఉదాహరణకు చేపలు రొయ్యలు సంబంధించి చేపల బుట్ట దీన్ని తాటి ఆకులతో తయారు చేస్తారు. చేపలు పట్టడానికి గర్రెలు, మావులు , ( వెదురు కర్రతో చేసే పనిముట్లు ) గాలం, వల మొదలగునవి రకరకాలవస్తువులను ఉపయోగించిచేపలను రొయ్యలను పట్టుకుంటారు. మారుమూల పల్లెల్లో కూడా పచ్చిమాంసాన్ని ఒకరకంగాను ఎండు మాంసాన్ని మరో రకంగాను పిలుస్తూ ఉంటారు ఎర్రమల్లెలు అని ఎర్రమందారం అని ఇలా పూలు పేర్లతో పిలుచుకునే సరికొత్త సంకేతం అని చెప్పొచ్చు. మరొక విషయం ఏమిటంటే కొల్లేరు లోను వివిధ సరస్సులలో పొలములో నదులలో అనేక రకమైన పక్షులు గాని జీవరాసులు గాని పిలవడానికి వాటికి పేర్లు ఆంగ్లంలో ఉన్నయో ఏమో కానీ తెలుగులో అయితే అన్నిటికీ స్పష్టంగా లేవు కానీ పల్లెల్లో మాత్రం కచ్చితంగా పేర్లు ఉన్నాయి అవి ఏ నిఘంటువులో కూడా లేవు. అంతేకాదు చెట్లకు రకరకాలైన పచ్చగడ్డిని కూడా చదువురాని పల్లెటూరి ప్రజలకు మాత్రమే తెలుసు. జమ్ముగడ్డి, చుంచుగడ్డి, సామ గడ్డి మేర గడ్డి లతాసొర గడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే కొత్త కొత్త పేర్లు మనం ప్రస్తుతం వింటూ ఉంటాం. అసలు విషయానికి వస్తే పల్లెల్లో జీవన బ్రతుకులు ఎలా ఉంటాయి అంటే పెద్దగా మన ఊహించనక్కర్లేదు. ఎందుకంటే ప్రపంచంలో అన్ని చోట్ల జరిగే ధనికులకు, పేదలకు మధ్య పోరాటం ఆకలితోనే ముడిపడిఉంది. ధనికులుగా ఐతే ఆకలి కోసం కాకుండా సంపాదన కోసం చచ్చేంత వరకు సంపాదిస్తూనే ఉంటారు. పేదలు మాత్రం ఈరోజు ఒక్కపూట అన్నం దొరికితే చాలు అనుకుంటారు. ఈ సమాజంలో అనేక మంది ధనికులు, పేదలుతో పాటు కులాలు కూడా తీవ్రంగా ఒకరికొకరు విమర్శలకు గురవుతూ ఉంటారు.

వివిధ మతాలు వారు కూడా ఈ కోవలోకే వస్తుంది. మనదేశంలో పేదవారు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలు ( పూర్వం ) అని చెప్పవచ్చు. ఒకవేళ మిగతావారు ఉన్న ప్రభుత్వాలు వాళ్లకు మాత్రమే పథకాలు రూపంలో కాంట్రాక్ట్ రూపంలో ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళని మరింత బలవంతుల్ని చేస్తుంది. ఇలాంటి సన్నివేశాలు అన్నింటినీ, కవి సమాజాన్ని చదివి చలించిపోయి తన సరికొత్త స్వరంతో వినిపించిన కవితా సంపుటి బ్లాక్ వాయిస్ఈ పుస్తకంలో అతి తేలికైన పదాలు ఇవి పల్లెల్లో నివసించే ప్రజలకు నిరక్షరాస్యులకు మాత్రమే చాలా త్వరగా అర్థం చేసుకోగలరు. అలాంటి పదాలు ఈ కవితా సంపుటిలో చాలా చురుకుగా ఉంటాయి. చదువుకున్న వారికి కూడా చాలా సులభమైన పద్ధతులు అర్థం చేసుకోగలరు కానీ ఈ తంగిరాల సోనీ రాసిన బ్లాక్ వాయిస్ కవితా సంపుటిలో చాలా పదాలు తెలుగు నిఘంటువులో ఎక్కడ దొరకవు అందుకే చాలా మంది దళిత కవులు ఉన్నాతమ పుస్తకంలో ఉన్న కవితలు చాలా సులభమైన పద్ధతిలో ఎవరూ రాయలేదని మాత్రమే చెప్పవచ్చు. ఈ బ్లాక్ వాయిస్ కవితా సంపుటి ఎవరు చదివినా దీనిని మొట్టమొదట తొలి తెలుగు మోటు కవిత్వం అని చెప్పవచ్చు. తెలుగు కవులు కవిత్వాన్ని సులభమైన పద్ధతిలో రాసినా సమాజానికి ఉపయోగపడే సన్నివేశాలు లేదా బ్రతుకు జీవనపోరాటాలుస్వలాభం కోసం తమ పేరు కోసం రాసుకున్నారే తప్పా దగాపడ్డ దళిత జీవన బ్రతుకులో ఎలాంటి మార్పు రాకుండా రాసిన వారే ఎక్కువ. సమాజంలోపీడిత కులాలుగా చిత్రించబడినప్రజలకు, కొన్ని వేల సంవత్సరాలుగా బానిస బ్రతుకు బ్రతుకుతున్నదళితులకుతిరుగుబాటు అనేది ప్రపంచంలో ఎక్కడో ఓ చోట వస్తూనే ఉంటుంది. అలాగే మనదేశంలో మన తెలుగు రాష్ట్రాలలో కూడా తిరుగుబాటు జరుగుతూనే ఉన్నాయి. కానీ కులంతో హింసించే ప్రజలు కులంలోనే బ్రతుకుతూ ఉన్నారు. ఒకడు దూషిస్తే మీరు బాధింపబడడానికి చేవ లేని మనుషులు కాదు కదా! అంబేద్కర్ ఇచ్చిన హక్కులలో మీరు స్వేచ్ఛగా బతకండి ఒకరి కింద బానిస బతుకు హీనంగా బ్రతుకొద్దు. ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ ఇంకా బానిస బ్రతుకు కొనసాగుతూనే ఉంది.

దళిత జీవన బ్రతుకుల్లో వెలుగుగా ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. అలా వచ్చిన వారిలో చాలా మంది మహనీయులు ఉన్నారు మహాత్మాజ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, పెరియార్ స్వామి అంబేద్కర్ మొదలగునవారు చాలామంది ఉన్నారు. అణగారిన ప్రజలకు తిరుగుబాటు అనేది - తమ మాటలతో కవిత్వాలతో పాటలతో ఉద్యమ స్ఫూర్తిగా నిలిచిన వారుకుసుమ ధర్మన్న, కలేకూరి ప్రసాద్, శివ సాగర్, పైడి తెరేష్ బాబు, మద్దూరి నగేష్ బాబువీళ్ళ తర్వాత తంగిరాల సోనీ అని చెప్పవచ్చు మధ్యలో చాలామంది ఉన్నారు కానీ సోనీ కవిత్వం జీవచ్చవంలా బ్రతికే వాళ్లకికూడారోషంతో తిరగబడ్డానికిముందుకొస్తుంటారు. అలాంటి ఒక కవిత్వంలో మీ దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్న ʹ నాపొగరేనాఆయుధం ʹ తో దాడి చేస్తా! అంటూ నా పొగరు అనే కవిత నుంచిʹ తొణకని గుండె ధైర్యంతోనే కూర్చున్నా / తరతరాలుగా అవమానాలతో కూర్చున్నవాణ్ణి / పిడికెడు ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్న వాణ్ణి / మూడు వేల సంవత్సరాలుగా చిత్రహింసలు అనుభవిస్తున్న వాణ్ణి / అధికారంకై తిరగబడక తప్పదు / కుర్చీ ఎక్కడం తప్పదు /వణుకులేదు ... బెణుకులేదు /ఎవడొచ్చినానడ్డిఇరగతన్నే / పొగరుతోనేఉన్నా ... / కదలకుండా కాలికింద నలిపేస్తా / నా పొగరు నాకు అలంకారం. ఇలా ఎవరికి భయపడకుండా ఉండాలని తన కవిత్వం ద్వారా తెలియజేశారు.

ఈ దేశం రాజ్యాంగ ప్రకారం నడుస్తుంటే అంబేద్కర్ ప్రధాన కారణమని దేశంలో ఉన్న ప్రజలందరికీ రాజకీయ నాయకులతో సహా తెలుసు. అంబేద్కర్ జయంతి వర్ధంతులు వస్తున్నాయంటే ప్రతి రాజకీయ నాయకులు అంబేద్కర్ గురించి తప్పనిసరిగా తెలుసుకొని దండేసి దణ్ణం పెట్టుకోవడం సహజంగా జరిగే విషయమే. రాజకీయాల పరిపాలనలో చిత్తశుద్ధితో ఏనాడూ తమ హామీలనునిలబెట్టుకోలేదని చెప్పవచ్చు. వారికి వత్తాసు పలకడం అనేక దళిత సంఘాలు రాజకీయ నాయకుల పక్కన చెంత చేరిఒక దళితుడు అయ్యుండి దళితులను మోసం చేయటం సిగ్గుచేటని కూడా చెప్పవచ్చు. ఈ మధ్య జరిగిన సంఘటన గురించి తంగిరాల సోనీ గారుఅంబేద్కర్ జయంతివర్ధంతులకువివిధ అంశాలపై వివరిస్తూ... కోరకాసు కవితలో ʹ నివాళులు అర్పించి/ మీ మొసలి కన్నీరుతో / కుర్రాళ్లను మోసం చేయకండ్రా బాబు ... / మీ రాజకీయ లబ్ధి కోసం / ఆరోజు జెండాలు పట్టుకుని కుర్రాళ్ళు మొత్తంకు /గొంతుల్లో...బైకుల్లోపీపాలునింపి / అంబేద్కర్ను అనుసరించినట్టు కాదురా నాయనా... అంటూ ఎక్కువగా దళిత సంఘాలలో ఉన్న నాయకులు జయంతులు, వర్ధంతులు జరిగిన విషయాల గురించి మళ్లీ పల్లెల్లోకి,గూడేలలోకి రాగానే మంచం మీద కాలుమీద కాలు వేసుకుని ఏదో జాతినిఉద్ధరిస్తున్నమంటూ హితోపదేశం చేస్తూ ఉంటారు. ఇప్పటి ప్రజల అలా లేరు మారండిరా బాబు అని సోని తన కవిత్వంలో మంచి విషయాన్ని తెలియజేశారు. చదును అనే కవితలో కూడా ఎన్నాళ్ళిలా మీ దగ్గర మా బానిస బ్రతుకులు ఎంత మంది ప్రాణాలు బలి తీసుకుంటారు.మాలో సహనం నశిస్తే మీరు నశించడానికి క్షణకాలం కూడా పట్టదు. వాడి గర్వం, వాడి మదం, వాడి మత పైత్యం ,వాడి అగ్రహారం కోటలు బద్దలు కొట్టే ఈ దేశ మూలవాసులంనిరూపించుకున్నాం. మేము లేనిదే ఈ దేశం లేదు.ఏ మేము సమసమాజ నిర్మాణం చేస్తున్నాం. మేము విశ్వమానవ సమానత్వంకై పరితపించే బాబాసాహెబ్ అంబేద్కర్ అనుచరులంఅంటూ ఈ దేశ మిట్టపల్లాల్నిచదును చేస్తున్నామని సోనీ గారు తన కవిత్వం ద్వారా తెలియజేశారు.

మనదేశంలో ఏది పోయినాకులం పోదేమో ? చిన్నప్పట్నుంచీ పాఠశాలలో, కళాశాలలో, విశ్వవిద్యాలయంలో వివిధ దశల నుంచి కుల ప్రస్తావన వస్తూనే ఉంది. చిన్నప్పుడు కులం అని తెలియక పోయినా తల్లిదండ్రులు కొట్టి బడికి పంపేవారు. ఏడుస్తూ పలక బలపం పట్టి బడిలో అడుగుపెట్టగానే పంగనామాలు పెట్టుకున్నా తోటి విద్యార్థులు నన్ను చూసి పప్పు ఉండలు తింటూ కింద నుంచి గ్యాస్ వదులుతూ నా ముఖం వైపు చూసి హేళన చేస్తూ అదేదో నేను తొక్కివచ్చినట్టు ముక్కు మూసుకుని నేను వేసుకున్న నిక్కరుకి మూడు బొక్కలను చూస్తూ వీడు కులం కాని కులపోడు అయి ఉంటాడని దూరంగా కూర్చునేవారు. ఇంతలో పంతులు వచ్చి నాలుక తిరగని పద్యం చూపించి ఒప్పో చెప్పమని అడిగితే నేను చెప్పేలోపే మీకు ఎందుకు వస్తాయిరా చదువులులో లోపల గొణుక్కుంటూ ఆ ఎదురు బెంచీలో కూర్చున్న పిల్లలు లేపి వాళ్ళని అడక్కుండానే వాళ్లలా చెప్పాలిరా అంటూ మేము ఇరసకొచ్చిన బెత్తంతో మమ్మల్ని కసితీరా కొట్టి, గోడకుర్చీ వేయించేవాడు పంతులు. తీరా పరీక్షల్లో మాకు ఎక్కువ మార్కులు వస్తే ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఎవరు తట్టుకునే వారు కాదు. దళితులకు పరీక్షల్లో మార్కులు ఎక్కువ వచ్చినా మంచి ర్యాంకు వచ్చినా, ఆటలో ప్రతిభ చూపించినా వీడిది ఏ కులమని ఆరాతీసి దళితులకి ఎలా సాధ్యం అయిందని నిద్రలేని రాత్రులు గడుపుంటారు మనువాదులు. అగ్రవర్ణాల అమ్మాయిల్ని ప్రేమించడం చూడకూడదు. చూస్తే చంపేస్తారు.

దేవాలయాల్లోకి దళితులకు నిషేధం లేకపోతే దేవుడు అపవిత్రం అవుతాడు. దళితులు మీ వీధుల్లో తిరిగినా , మంచినీళ్లు అడిగినా, మీతో కలిసి చదువుకున్నా, భోజనం చేసినా చివరకు జరిగేది మా మరణాలే! కానీ మేము పండించిక పోతే మీకు కూడు లేదు, బావులు కాలువలు తవ్వకపోతే నీరు లేదు, గుళ్లు గోపురాలు కట్టకపోతే మీకు జీవితమే లేదు, ఈ దేశంలో మేము లేనిదే మీరు లేరు. కానీ నీ దళితులు అంటే చిన్న చూపు చూస్తారు. ప్రతి కులంలో కుల సంఘాలు ఉన్నాయి కానీ ఎవరికైనా ఆపద వస్తే వాడున్నాడు చూడు వీడున్నాడు చూడు అంటారే తప్ప ఏ ఒక్కరు ముందుకు రారు కుల సంఘాలు మాత్రం తమ కులస్థులను తొక్కి బాగుపడ్డారే తప్పఎవరికి న్యాయం చేసిన సంఘటనలు ఎక్కడా లేదు. పేరుకు మాత్రం వందల సంఖ్యలో కులాలు లెక్క పెట్టుకోవాలంటే జీవితం చాలదేమో!.

తెలుగు సాహిత్య చరిత్రలో దళిత సాహిత్యం అగ్రస్థానంలో ఉందని చెప్పవచ్చు. ఈ సాహిత్యంలో కూడా ఎవరికి వారే తమ సాహిత్యమే గొప్పదని డాబులు చెప్పుకోవడమే. ఒకరు పుస్తకం రాస్తే మరొకరు ఈర్ష్యతో ఏదో ఒకటి చేయాలనే తపనతో అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కలేకూరి ప్రసాద్ కవిత్వం మాత్రమే జనాల గుండెల్లోకి బాణంలా గుచ్చుకుంది. మనువాద కవులకు మాడి పగిలినట్టు దళిత కవులకుఅన్యాయంపై తిరుగుబాటు చేసేటట్లుమనుషుల మనసుల్లో ఈటెల గుచ్చుకున్నాయి. కలేకూరి ప్రసాద్ కంటే దళిత కవులు ఉన్నాకవిత్వం త్వరగా ప్రజల్లోకి వెళ్లిందంటే అది కలేకూరి ప్రసాద్ కవిత్వం మాత్రమే. పిడికెడు ఆత్మగౌరవం కోసం ప్రతి ఒక్కరు తెలిసిన కలేకూరి ప్రసాద్ గారి రచనలు చాలా వరకు కవితలేగానీ, కథలేగానీ, పాటలే కానీ, అనువాద రచనలేకానీ చాలా వరకువివిధ కవుల ఖాతాలో జమ అయ్యాయి. దళిత సాహిత్యంలో చెప్పుకో దగ్గ కవులలో కుసుమ ధర్మన్న,మద్దూరి నగేష్ బాబు, పైడి తెరేష్ బాబు,కలేకూరి ప్రసాద్ ఆ తర్వాత పదునైన మాటలతో నీలిరంగు పతాకంలో దూసుకుంటూ వచన కవితతంగిరాల సోనీ కవిత్వం బ్లాక్ వాయిస్ మాత్రమే. మధ్యలో చాలా మంది కవులు ఉన్నప్పటికీ దళితులకు దగ్గరగా తీసుకెళ్లిన కవిత్వం బ్లాక్ వాయిస్.

సమాజంలో అంబేద్కర్ పుణ్యమంటూ అందరూ కొంత వరకు సమానంగా బ్రతికినా, ప్రతిరోజు వివక్ష కొనసాగుతూనే ఉంటుంది. వివక్ష పోవాలంటే రాజ్యాధికారం కావాలి రావాలి. రావాలంటే అందరూ ఐక్యంగా ఉంటే తప్పనిసరిగా వస్తుంది. ఐక్యంగా ఎందుకుండాలి అని మాట్లాడే వాళ్లే ఎక్కువ మంది దళితులు మందుకోబిర్యానికోఅమ్ముడు పోకూడదు అని వాళ్ళ అంతరాత్మకు తెలిసినా మళ్లీ అదే దారిలోకి వస్తారు. మన వాది జెండా మోసే వాడిని గెలిపించి చివరికి వాడిచేత తన్నులు తింటూ అంతరాని వాడివి అని నీ పై నింద వేసి మళ్లీ ఊరు చివర నిలబెడతారు. మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ బీసీల దేవుళ్ళు మీరు ఓటు వేస్తే గెలుస్తామని లేనిపోని వాగ్దానాలు చేసిమీకు సర్వం ఇస్తామని చెప్పి అత్యాశ కలిగించి దళితులను అడ్డంపెట్టుకుని మళ్లీ గెలుస్తారు. మళ్లీ దళితుల కథ మొదటికి వస్తుంది. ఎందుకు ఇలాంటి జీవితం బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే అని తంగిరాల సోనిబ్లాక్ వాయిస్ కవిత్వం ద్వారా తెలియజేస్తారు. ఈ పుస్తకంలో లో ఎక్కువగా దళితులపై జరిగినదాడులపై వివిధ సంఘటనలపై నిరసనను వ్యక్తం చేస్తూ ఎక్కువగా రచించిన కవితల ఇవి .

స్త్రీల క్షోభ కోసం మీ కలాలు కదలాలి – బ్లాక్ వాయిస్


నేను చాలా పుస్తకాలు చదివిను కానీ చాలా రోజుల తర్వాత నన్ను ఆకట్టుకున్న పుస్తకం తంగిరాల సోని కవిత్వం బ్లాక్ వాయిస్ చాలా చాలా బాగుంది. ఈ రోజుల్లో కవిత్వం రాయాలంటే ద్వందార్థాలు మరియు పర్యాయపదాలుగానో నానార్ధాలు గానో అర్థం చేసుకోవలసి వస్తుంది కానీ ఈ కవిత్వం ఇప్పుడున్న వాడుక భాషలో చెప్పాలంటే చదువురాని వారికే త్వరగా అర్థమవుతుందని చెప్పవచ్చు.దీనిని మోటు కవిత్వం అని కూడా అనవచ్చు. ఇప్పటి కవులు చాలా కవిత్వాలలో తనదైన భాష, శైలి, అర్థం తమకు అనుగుణంగా రాసుకుంటున్నారే తప్పఇతరులకు త్వరగా అర్థమయ్యే రీతిలో ఎవరూ రాయడం లేదునిపిస్తుంది. బ్లాక్ వాయిస్ కవిత్వం అలా కాదు ఎవరు చదివినా సరాసరి ఆకట్టుకున్న శైలిలోనే అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ కవిత్వం చదువుతున్నంత సేపూ ఈ పదాలు మనం రోజు మాట్లాడుకునే మాటలే కదా అనుకున్న ఆ పదాలు రాయడానికి ఒక్కసారిగా ఎవరికి ఆలోచన తట్టదు.ఒక్క తంగిరాల సోనిగారికితప్ప.

ఈ బ్లాక్ వాయిస్ కవిత్వం సరదా కోసమో, పుస్తకాలు ముద్రించుకోవడం కోసమో, అవార్డుల కోసమో - పురస్కారాల కోసమో కాదు. దేశంలో జరిగేఅరాచకాలపైఅందులోదళితులపై జరిగే దాడులపై తంగిరాల సోనీ తమ కవిత్వాన్నితిరుగుబాటు తత్వం ఉండేలా ఒక సంకేతాన్ని బ్లాక్ వాయిస్ రూపంలో ఎగర వేసాడు. దళితులపై ఎక్కడైనా దాడులు జరిగినా వెంటనే స్పందించి ఆ సంఘటనకు వెళ్లడం వెంటనే కవిత్వరూపంలో సోషల్ మీడియాలో పంపడం జరుగుతుంది కానీ, ఎక్కడైనా ఏ సంఘటనలు జరిగినా మనకు ఎందుకులే అనేవాళ్లే చాలా మంది ఎక్కువ. కానీసోనీ మాత్రం తన వాయిస్ ని వినిపిస్తాడు. అతనిలో గొప్ప విషయంఏమిటంటేవయసులో చిన్నవాడైనా పెద్దవాళ్లకు ధైర్యం చెప్పే వ్యక్తి. అందులో స్త్రీలపై జరిగే అన్యాయాలపై ఎక్కువగా స్పందించి తన బ్లాక్ వాయిస్ కవిత్వం ద్వారా ప్రశ్నించే తీరు, ఎదుర్కొనే తీరు, తిరుగుబాటుచేసే తీరు, సరికొత్త గొంతుతో వినిపిస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే తన గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది ఈ బ్లాక్ వాయిస్ కవిత్వం ద్వారా అర్థమవుతుంది.

తల్లిదండ్రులు భారంగా భావించే పిల్లలు ప్రస్తుత రోజుల్లో చాలా సంఘటనలు చూస్తూనే ఉన్నాం. వయసుమళ్ళిన తల్లిదండ్రులను ప్రేమగా జీవితాన్ని కొనసాగించడానికి తమ పిల్లలు ముందుకు రాక పోవడానికి కారణం ప్రేమ నశించడమే. తల్లి పనిచేసే శక్తి ఉంటే అన్ని పనులు చేయించుకునిఒక ముద్ద భోజనం పెట్టితన పనేదో తనను చూసుకోమనే వారు ఒకప్పుడు ఉన్న ఇప్పుడు కనుమరుగవుతున్నారు. తల్లి తన బిడ్డలను ఎలా చూసుకునేదో అమ్మ ఒంటరి కవిత్వం ద్వారా మనకు చక్కని సందేశం ఇస్తున్నారుసోనీ. సమాజంలో ఆడపిల్లల పుడుతుంటే సంతోషపడాలి కానీ బాధపడకూడదు.ఇందులో ఆడపిల్లనేను పుట్టగానేనన్ను భారంగా చూడలేదు కానీ నేను పుట్టిన తర్వాత నాన్న చనిపోయాడనినన్ను అవమాన పరిచారు మా ఊరి ప్రజలు. అమ్మ ఎంత బాధ పడిందో నాకు తెలుసునా చిన్నప్పుడు పందిరి గుంజకు ముతక చీర ఊయలగా కట్టి దానిలో పడుకోబెట్టి పరిగేరుకోవడానికి పొలం పోయేది. వస్తూ వస్తూ పరిగి గింజల్ని కోమట్ల కొట్టంలో వేసి చీరలో సోలెడు బియ్యం, రెండు ఉల్లిపాయలు, రెండు మిరపకాయలు, తీసుకుని గబగబా వస్తూ తలకు కట్టిన గుడనుబిగదీసుకుంటూవస్తుంటే వాడ మలుపు లోనే నా ఏడుపు గొంతు వినిపించి గబగబా పరిగెత్తుకుంటూ వస్తుంటే పక్కన ఉన్నవాళ్లు మీ పిల్ల దయ్యం పిల్ల ఆ గొంతుచూడు ఎలాఉందో ఊరు మొత్తం వినిపిస్తుంది ఆమెకు లేనిపోని చాడీలు చెబుతుండేవాళ్ళు. తల్లితన బిడ్డను కళ్ళు తుడుస్తూ, తల నిమురుతూ, చీముడు తుడుస్తూఅలా ఆలోచించే అమ్మ అబిడ్డ ఎదిగేకొద్దీ అమ్మ అలా తగ్గుతూ ఉండేది అమ్మను వాటేసుకుని పడుకుంటే అమ్మ పేగులో సముద్రాల అలలు పోటెత్తిన శబ్దాలు వినిపించాయి నాకు.

మూడు పూటలు అన్నం పెట్టి, అమ్మకుంటల్లో నీళ్లు తాగి ఆకలని నింపుకునేది . ʹనేనుఎదుగుతుంటే/ అమ్మకు గుండెల్లో కలుక్కుమన్నట్టు వుండేది / నా సమర్తకు రైకముక్కయినా / కొనలేని అమ్మ / నేను బువ్వ తినందే తినని మా అమ్మ/ నన్ను సూడకుండా ఉండలేని అమ్మ / ఇప్పుడు నాకు వయస్సు వొచ్చిందని/ ఎవళ్ళనో నాకు కట్టబెట్టడానికి వెతుకుతుంది / కిందా మీదా పడి నాకు పెళ్లి చేసి / ఇప్పుడు నన్ను పంపేటప్పుడు / తన రెండు చేతులతో పాటు / అమ్మ ప్రాణాన్నే నేను తీసుకెళ్తునట్టుంది / అమ్మ నుండి నన్ను దూరం చేస్తుంటే / నాకు అమ్మే కావాలి అనిపించి /గుక్క పట్టి ఏడ్చుకుంటూ వచ్చా / నేను లేకుండా నా పిచ్చితల్లి /యట్టా బతికిద్దో / నాకు తెల్వడంలా / ఇప్పుడు అమ్మ ఒంటరి....ఇలా తల్లీ పిల్లల మధ్య చాలా సంఘటనలు మనము గుర్తు చేసుకోవచ్చు.
చాలామందికవులుస్త్రీల అందాలను అణువణువు వర్ణించారే తప్ప! బాధలను ఎవరు వర్ణించలేదనిదేశంలోస్త్రీలపై జరిగే సంఘటనలుబాదా తప్త హృదయంతో కలాలు కదిలించాలని తంగిరాల సోనీ బ్లాక్ వాయిస్ కవిత్వం ద్వారాతెలియజేశారు.

నా నెత్తురుతో అనే కవితలోఓ స్త్రీఆవేదనతో నా అందాలు వర్ణించడానికి, ప్రతి అవయవాలు కొలవడానికి, మమ్మల్ని ఏవిధంగా చిత్రహింసలు పెట్టారో, ఎలా రేప్ చేశారో రాయడానికి మాత్రమే మీ కలాలు కదులుతాయి గాని,మా బాధలుమా రోదనలు రాయడానికి మీ కలాలకు కుష్టురోగం వచ్చింది కదా ! మేము సమాజంలో రావాలి అంటే భయం, జీవించాలంటే భయం ఎక్కడ చూసినా మనుషుల్లో మానవత్వం చచ్చి , మృగం ఆవహించి పశువుల ప్రవర్తిస్తున్నారు. అదేమంటే ఇది చేసే పనికి అలాగే జరగాలనివేదమంత్రంలా పనికిరాని మాటలు మాట్లాడుకుంటూ సరదాగా నా పై జోకులు వేసుకుంటూఅనరానీ మాటలతోచచ్చిన తర్వాత కూడా ఇది ఇలా అది అలాఈ మాటలపోటులతో మమ్మల్నిచంపుతుంటారని,నానెత్తురుతో అనే కవితలో బాధను వ్యక్తం చేస్తూ....ʹ నా దేహంపై కప్పుకున్న గుడ్డని తీసి / నాపై పొర్లడడానికేకలాలు కదులుతాయి.../ బయట మాత్రం మేం స్త్రీవాదులం / అని చెప్పే గొప్ప హింసావాదులు ఉన్న / పరమ కిరాతక పురుషులోకం.../ కప్పుకోండి...కప్పుకోండి...కప్పుకోండి... / నా శరీరం తోలువొలిచి తయారుచేసిన/ వజ్రాల శాలువాతో సత్కరించుకోండి / నా రొమ్ములు కొరికిసిరా నింపిన / కలాలు తీసుకోండి / నన్ను చంపి బంగారంతో తయారుచేసిన / పతకాల సర్టిఫికెట్లు అందుకోండి.../ మీక్కావాల్సింది నా పతనమే కదా /మీక్కావలసింది నా బానిసత్వమే కదా /మీక్కావలసింది నాపై పెత్తనమే కదా /మీక్కావాల్సింది నా శరీరమే కదా /ఒరే..ఒరే..ఒరే.../ తలతిప్పితేనే వరసకట్టి / హింసించే పరమ దుర్మార్గులారా / మీ ఇళ్లల్లో కూడా నేను ఉంటానని / మీరు కూడా నా నుండే వచ్చారని తెలుసుకోండి... ఇలా దేశంలో జరుగుతున్న దాడులకు నిరసనగా తంగిరాల సోనీ నా నెత్తురుతో అనే కవితలో స్త్రీల బాధలను వ్యక్తం చేశారు.

ఒకప్పుడు మనం కట్టేలతోనే భోజనం వండుకునేవాళ్ళం. రాను రాను గ్యాస్- కరెంటుతో అలవాటైపోయింది మనకి. చెప్పాలంటే రోగాలు కూడా దగ్గర అయ్యామే తప్ప మళ్లీ కట్టెలతో వండటం లేదు. పల్లెల్లో ఎక్కువ శాతం తల్లిదండ్రులు కలిసి వరిచేలల్లో పనికి వెళ్లి పనిచేసి వస్తూ వస్తూ కొన్ని కట్టెలు తీసుకుని వస్తూ ఉంటారు.ఆకట్టేలుపచ్చివైనా, ఎండివైనావీటితోనే వంట చేసేవారు . కట్టెలతో వండుకున్న భోజనంతింటే ఎలాంటి రోగాలకు దరిచేరనీయకుండా గ్యాస్ కు దూరంగా ఉంచుతాయి. పల్లెల్లో కట్టెలమోపు తీసుకువస్తున్నారంటే ఎక్కువమంది స్త్రీలే . అమ్మ కట్టెలమోపు తీసుకు వస్తూ వస్తూఈ కట్టెలమోపు అనే కవితలో అమ్మ చేసే పనితనం గురించిఎంత చెప్పినా తక్కువేననిపిస్తుంది ...ʹ పొద్దున్నే పరగడుపున నీళ్లు తాగి / తలకు కట్టుకోవల్సినతువ్వాలుఒకటి తీసుకుని / చేతిలో కొడవలి పట్టుకుని / గబగబా ఇంటి తాడికనెట్టి) అందర్నీ లేపుకుని /పుల్లలుఏరడానికి పోయేది అమ్మ.../ కంది కట్టే, పొగాకు కట్టే, పత్తి కట్టే / నెత్తిమీద మోస్తావుంటే / అంత బరువు యట్టా మోస్తున్నావే /అనీ.. ఊరిలో జనం నోరు ఎళ్ళబెట్టే వాళ్ళు / అమ్మ ఇంటి చుట్టూరా /తడికకట్టిందంటే / ʹ ఎంత అందంగా కట్టివే ʹ అనీ / చుట్టు పక్కల వాళ్లు మురిసేటోలు.../ పరగడుపునే పుల్లలకుపోయీ / వస్తా వస్తా చీరచెంగులో రేగు పళ్ళు తెచ్చేది / నోట్లో వేపపుల్ల పెట్టుకుని / ఆకలని ఎండగడుతూ ఉండేది అమ్మ/రాత్రుళ్లు సగం బువ్వతోనే/చెయ్యకడిగే మా అమ్మ / పొద్దున్నే మంచినీళ్ళు తోనే కడుపు నింపుకునేది / వారంలో ఒక్కసారి అయినా సరిగ్గా / బువ్వతిందో లేదో కానీ.../ పనికి వంగిందంటే / యంత్రమైన వంగి దండం పెట్టాల్సిందే అమ్మకు...ఇలా అమ్మ పనితనం గురించి చక్కని సందేశం తన కవిత్వం ద్వారా తెలియజేశారు సోనీ గారు.

ప్రాచీన కాలం నుంచి వస్తున్న మాట అమ్మ ఎవరికైనా అమ్మే. అమ్మ చేసే పనులు గురించి, త్యాగాలు గురించి ఎంత చెప్పినా తక్కువేననిపిస్తుంది. నడక, నేర్పరి, శైలి, భాష అన్ని మొదటిగా అమ్మ దగ్గరేనేర్చుకుంటాము. కవిత్వాలు, నవలలు, కథలు మొదలగునవి ఏవైనా అమ్మ గురించే ఎక్కువగా రాస్తుంటారు రచయితలు. అలాంటి అమ్మ గురించి ఎవరైనా అమర్యాదగా మాట్లాడితేఅమ్మ విలువ తెలిసిన వారికి ఎవరికైనా కోపం వస్తుంది. అమ్మ గురించి చులకనగా మాట్లాడినా, దూషించినా బిడ్డలు తిరగబడతారు లేదో తెలియదుగానీ కచ్చితంగా తల్లి తిరగబడాలి అని సోనీ గారు చెప్పే అమ్మకవిత్వంలో... పొడిచే పొద్దు కన్నా అమ్మ ముందే లేచి ఇల్లు వాకిలి ఊడ్చి పేడ నీళ్లు చల్లి చట్టేలోగిద్దెడు బియ్యం పోసికట్టె పొయ్యలో ఉడుకుతుండగాబయట దొరగారి పిలుపుకికాలినసాసరనుపక్కన పెట్టిఏందయ్యగారు పిలిచారుఅనేలోపే దొరసాని ఇంట్లోంచి అరుపులు కేకలు వినిపిస్తున్నాయి. ఇంకా రాలేదేమిటా అని నీకోసం ఎదురు చూస్తున్నా ఇంట్లో పనంతా చేసి ఆ చద్దికూడు తీసుకొని వెళ్ళు అని చెప్పి దొరసాని మళ్ళీ పడుకుంది.పనంత చేసేసరికి సాయంత్రం అయింది. పని చేసి వస్తూ వస్తూకొంతమంది దారిలోఅరుగులమీదదొరలు పంచలు సర్దుకుంటూ, పళ్ళు నూరుతూ , కండ్లు కొడుతూ,రొమ్ముఇరుస్తూ, పళ్ళు పెదాల మీద కొరుకుతూ... ʹ ఏందే..! / నీ మొగుడు సచ్చాక ../ చాలా వొళ్ళు చేశావంటూ / సరసాలమాటలుమాట్లాడుతున్నారు../ కాగుతున్న నూనెలోఎయ్యాలి / ఈ దొరగాండ్లను అంటూ / తల దించుకొని నడుస్తుంది అమ్మ.../ ఆకలితో పేగులు మాడిన డొక్కలో / వాడికి సౌందర్యంకనబడిందంట...! / అలసి సొలసి పనులతో నిద్రలేమి నా కళ్ళల్లో / కామపు చూపులుకనపడిందంట / పాలురాని నారొమ్ములో / వాడికినయాగరాజలపాతాలు కనపడ్డాయంట..!/ ఈ.. దొరగాండ్లకు.../ ఒక్కపూట బువ్వ లేకపోతే..! బతకలేని వెధవలు../ దొరసాని ముందుకెళ్తే../ దొరగారు కుక్కపిల్లలా,కుక్కినపేనులా పడుండాలి.../ బయట రోషంలేని మీసం మెలేస్తారు /గాంభీర్యం ప్రదర్శిస్తారు... అంటూ నా మొగుడు ఇంటా మగాడే బయట మగాడే మా ఆయనకి దేనికి చాలరు ఈ దొర గాండ్లు. మా ఆయనపొలం పనికి పోతే పని చిటికలో అయిపోతాది.మా ఆయన పని చేసి బయటకు వస్తుంటే ఈ దొరగాండ్లు రెండు చేతులు తీసుకువెళ్లి రెండు కాళ్ళ మధ్యలో పెట్టుకుని కూర్చుని భయపడుతూ తలదించుకుని చూస్తుంటారు . నా మగాడు పేరు చెబితే మీకు పంచెలుతడవాలా అంటూ ... ఏడుస్తున్న పిల్లాడ్ని ఎత్తుకొనిముద్దాడుకుంటూ.. గుమ్మంలో కూలబడి తనరొమ్ములోరాని పాలు ఇస్తూ బిడ్డలోవాళ్ళయ్యను చూసుకుంటూ మురిసిపోతోంది అమ్మ...!

తంగిరాల సోనీ గారు దేశంలో స్త్రీలపై జరుగుతున్న దాడులకు గద్గద స్వరంతో వినిపించిన బ్లాక్ వాయిస్ కవిత్వంలో ఎక్కువ శాతం స్త్రీవాద కవిత్వమే ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ప్రతి స్త్రీలో మన ఇంట్లో స్త్రీలతో సమానంగా చూడాలని సరికొత్త గొంతుతో స్త్రీవాద భావజాలాన్ని ఈ సమాజం అందిపుచ్చుకోవాలని స్త్రీలపై జరిగే దాడులలో గృహహింస, హత్యాయత్నం, చులకన భావన, బానిసత్వంనీటి నుండి స్వేచ్ఛగా ప్రజలకు తమకు తాము నచ్చే విధంగా నడుచుకోవాలని, ఇంటి పనికి , వంట పనికి పరిమితమైన స్త్రీలు స్వేచ్ఛ సమాజంలోకి అడుగుపెట్టడానికి రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛాస్వాతంత్య్రం లోస్త్రీలకంటూ ఒక ప్రత్యేక గుర్తింపురూపొందించిందనితంగిరాల సోనికవిత్వం బ్లాక్ వాయిస్ ద్వారా వినిపించారు.

No. of visitors : 420
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
  సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన
  జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA), జాతీయ పౌర జాబితా (NRC) ప్రక్రియను ఎందుకు వ్యతిరేకించాలి?
  నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు
  ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి
  ఢిల్లీ నుండి ప్రేమతో
  తెలంగాణలో ఏం జరుగుతోంది? సైలెంట్ ఎమర్జెన్సీ దేనికి సంకేతం?
  తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం
  మానవాచరణ నుంచే విప్లవ కవిత్వం
  కథావరణంలో 50 సంవత్సరాల విరసం.
  నూత‌న మాన‌వ ఆవిష్క‌ర‌ణే విప్ల‌వ క‌థ అంతిమ ల‌క్ష్యం
  జీవితం పరిమళించిన కథలు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •