వెన్నెల సెంట్రీలో మోదుగు పూల వాన‌

| సాహిత్యం | వ్యాసాలు

వెన్నెల సెంట్రీలో మోదుగు పూల వాన‌

- కేక్యూబ్ వ‌ర్మ‌ | 01.06.2019 11:14:32pm

"There is no greater agony than bearing an untold story inside You" - Maya Angelou

"I am a continuation of my mother. I write to immortalize her sacrifices"

- AmanKBatra.

స్వాతి కవిత్వం మోదుగు పూల వాన చదువుతున్నప్పుడు వీరి మాటలు సరిగ్గ సరిపోతాయనిపించింది. ఈ మధ్య కాలంలో స్త్రీ రచయితల నుండి విప్లవ కవిత్వం రావడం లేదు తరచుగా. ఆ లోటును భర్తీ చేస్తూ విరసం నుండి తోకచుక్కలా మెరిసింది స్వాతి కవిత్వం. తోకచుక్కలా ఎందుకంటే మెరుస్తూ సర్రున గుండెల్లోకి దూసుకుపోయే కవిత్వ నిర్మాణంతో తాను చెప్పదలచుకున్న అంశాన్ని సూటిగా చెప్పారు స్వాతి. తన అమ్మ నుండి కొనసాగింపుగా వేదనను, ఆర్తిని, ధైర్యాన్ని వారసత్వంగా పుణికిపుచ్చుకున్న స్వాతి విప్లవోద్యమం పట్ల అంతే ప్రేమతో ఆర్తితో తన భావాలను ఆవిష్కరించారు. "నాగళి సాళ్ళలో విత్తనాలు చల్లుతున్నప్పుడు భూమి పొరల్లోంచి ఆరుద్ర పూలు నా అక్షరాలు"గా ప్రకటించిన స్వాతి మనో నిబ్బరం మనకు అవగతమవుతోంది. కవిత్వానికి ముడిసరుకు కవి జీవితమే కదా? తన చుట్టూ జరుగుతున్న సంఘటనల లోతుపాతుల పట్ల వున్న అవగాహనకు చూపుగా వున్న మార్క్సిస్టు దృక్పధం సాధనంగా తోడయితే అది కవిత్వంగా రూపాంతరం చెందినప్పుడు అది సాంస్కృతిక సాధనంగా ఆయుధంగా మారుతుంది. దానికి స్వాతి మోదుగు పూల వాన కొనసాగింపు. కొత్తగా నవోత్తేజంతో స్ఫూర్తిమంతమవుతుంది.

కాగితంపై గాయపడ్డ
అక్షరమిప్పుడు
యుద్ధ క్షేత్రానికి సాగిపోయింది
వెలుగులీనే వెన్నెల్లా
తుడుం మోతల యుద్ధ గీతంలా స్వాతి అక్షరం నినదిస్తోంది.

అడవిలో వెన్నెల పూర్వం సామెతలా లేదు నెత్తురోడుతున్న వెన్నెలలా భగభగ మండుతుందిలా..

దండకారణ్యం కొండలపై
సెంట్రీ కాస్తున్న వెన్నెలా...
కన్నీళ్ళలో నువ్వే
కదనరంగంలో నువ్వే.... అని సాయుధులతో పాటు వెన్నెలా కార్య క్షేత్రంలో భాగమవుతుందన్న పద చిత్రంతో మనకు కన్నీళ్ళతో పాటు కదనోత్సాహాన్ని ఇస్తుంది.

జనం పాటగా పోరుబాటగా సాగిన సాయుధ జన నాట్యమండలి ప్రజా గాయకుడు ప్రభాకర్ రామగూడ బూటకపు ఎదురుకాల్పులలో అమరుడవ్వగా తన సహచరితో పాటుగా అమరవీరుల కుటుంబాలకు బాసటగా ఎరుపెక్కిన వెన్నెల కవితలో....

ఇప్పుడా వసంతం
ఎరుపెక్కిన కొండల నడుమ
పొడిచే పొద్దులా
నవ్వుతూ
భుజాన ఏకేలతో
తూర్పు దిక్కున సాగుతోంది వెన్నెల

ఆమె ఒక్క ఆమేనా...?
ఆమె... ఎందరో ఆమెలు
ఆమె నువ్వో
నేనో
వేన వేల ఎరుపెక్కిన వెన్నెలలం..... అని ఎంతో గుండె నిబ్బరాన్ని కూడగట్టుకునే నేటి దు:ఖ సమయాన్ని తన అక్షరాలలో పొదువుకుంది.

ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో అమలవుతున్న కుల వివక్షకు మానసికంగా కుంగిపోయి నిరసనగా వ్యవస్థ పట్ల తమలో రగిలిన ఆగ్రహాన్ని ఆ వివక్షకు వ్యతిరేకంగా గళమెత్తి పిడికెలెత్తి పోరాడాల్సిన యువత రోహిత్ వంటి గొప్ప చూపున్న యువత ఆత్మహత్య చేసుకోవడం సమాజానికి తీరని నష్టాన్ని కలుగ చేస్తోంది. అలా కాకూడదని

ఇప్పుడు చేయాల్సింది
రాజీపడుడో రాలిపోవుడో కాదు
ఎదిరించాలె
మర్లబడాలే
తిరగబడాలె
నువ్వెప్పటికయినా చేయాల్సింది
యుద్ధమే...
తప్పదిక అని కార్యాచరణ వైపు ఆలోచింప చేస్తుంది.

నేటి సమాజం ఎదుర్కొంటున్న అన్ని పీడనలకు విముక్తి మార్గం సాయుధ పోరాటంగా, విప్లవించడమే నేటి తక్షణ కర్తవ్యంగా చాలా ఆర్తితో జ్వలించే స్త్ర్రీ హృదయాన్నీ మనం ఈ మోదుగు పూల వానలో అనుభూతించ వచ్చు.

చివరిగా తన మాటల్తో ముగిస్తాను

పచ్చని చేన్లపై ఊపిరితిత్తుల్ని ఆరేసుకుంటున్నప్పుడు
వానయి కురిసే పైరగాలి పాటలే
నా అక్షరాలు....

మీరింక మోదుగు పూల వనంలో సాయుధులై వెన్నెల సెంట్రీగా పాలపిట్ట తోడుగా కదనరంగంలో కదలిరండి.

No. of visitors : 260
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఆకు క‌ద‌ల‌ని చోట వ‌ర్షించిన క‌విత్వం

కేక్యూబ్ వ‌ర్మ‌ | 20.10.2016 12:53:32am

ఒకమారుమూలపాఠశాలఉపాధ్యాయుడు ఈ నిశ్శబ్దాన్నిభరించలేక ఈ ఉక్కపోతనుధిక్కరిస్తూతనచుట్టూవున్నఆకుకదలనితనాన్నికవిత్వంగామనముందుఆవిష్కరించినదే ఈ సంకలనం.......
...ఇంకా చదవండి

ఆ పావురాలు!

కేక్యూబ్ వ‌ర్మ‌ | 02.01.2017 11:39:40pm

ఒలికిన నెత్తురు అద్దిన జెండానందుకుంటూ గుంపుగా ఆ పావురాలు! ...
...ఇంకా చదవండి

తెలవారని ఆకాశం!

కేక్యూబ్ వ‌ర్మ‌ | 07.12.2016 11:52:30am

కొన్ని మంచు బిందువులేవో రాతిరి కురిసిన వాన చివుళ్ళ నుండి రాలుతూ రెక్కల చాటున ముఖం దాచుకున్న పక్షి టపటప రెక్కలల్లారుస్తూ ఎగరబోతూ...
...ఇంకా చదవండి

నమస్కరిస్తూ..

కేక్యూబ్ వ‌ర్మ‌ | 04.09.2017 11:18:59am

కళ్ళకు గంతలు కట్టుకొన్నదని మీ న్యాయ దేవత ముందు నగ్నంగా నిలబడిన ఆ పదముగ్గురూ విడిచిన లజ్జను మీ మఖంపై నెత్తుటి ఉమ్ముగా ఊసి!...
...ఇంకా చదవండి

దక్షిణ యాత్ర

కెక్యూబ్ వర్మ | 04.06.2017 01:12:22pm

నీ ఒంటి రంగును హేళన చేసి నిన్ను బానిస చేసుకో చూస్తున్నాడు నీకంటూ మిగిలిన ఆఖరి అవకాశం నిన్ను నువ్వు జెండాగా ఎగురవేయడమే!!...
...ఇంకా చదవండి

జీవ‌సూత్రాన్ని చెప్పే చింతా అప్పలనాయుడు ʹదుక్కిʹ

కెక్యూబ్‌ వర్మ | 16.06.2018 09:22:29am

కవితలనిండా రైతు జీవన చిత్రమే. ఒక దు:ఖార్తితో కొనసాగుతుంది. కురవని వానలు కలసిరాని కార్తెలు అప్పుల ఊబిలు కాడెద్దులను దూరం చేసే యంత్రాల దాష్టీకం అక్కరకు రాని ప...
...ఇంకా చదవండి

గులాబీ!

కేక్యూబ్ వ‌ర్మ‌ | 17.04.2017 11:32:19am

వాడెంత విధ్వంసం చేసినా నీ పసివాడి చేతిలో గులాబీ విచ్చుకుంటూ వాడిని భయపెడుతూనే వుంది!!...
...ఇంకా చదవండి

మస్వాల్..

కెక్యూబ్ వ‌ర్మ‌ | 03.09.2016 12:37:26am

మరుగుతున్న మంచు తెరలుగా విడిపోతూ రాలిపోతున్న మస్వాల్ పూలెన్నో ఇప్పుడిక్కడ ఒకటే హృదయ ఘోష ఆజాదీ ఆజాదీ .......
...ఇంకా చదవండి

కుందాపన

కెక్యూబ్ వర్మ | 04.01.2018 01:31:58pm

ఈ కవిత్వం నిండా పరచుకున్న దాహం ఒంటరితనం.సమూహంలో తను నిలబడ్డ చోటు ఒంటరిగా ఒక దీపపు సమ్మెకింద నీడలా వెంటాడడాన్ని మనకనుభవంలోకి తెస్తుంది.కలసి నడవాల్సిన దారు......
...ఇంకా చదవండి

ఒంటరి వెన్నెల

కేక్యూబ్ వ‌ర్మ‌ | 07.05.2016 08:29:33am

ఈ ఇప్ప పూల వనం రాలిపోతూ నిబ్బరాన్ని వదిలి నివురు కప్పుకుంది తూరుపింకా తెలవారక నీ పేరు తలుస్తూ పొలమారుతొంది...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
  సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన
  జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA), జాతీయ పౌర జాబితా (NRC) ప్రక్రియను ఎందుకు వ్యతిరేకించాలి?
  నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు
  ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి
  ఢిల్లీ నుండి ప్రేమతో
  తెలంగాణలో ఏం జరుగుతోంది? సైలెంట్ ఎమర్జెన్సీ దేనికి సంకేతం?
  తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం
  మానవాచరణ నుంచే విప్లవ కవిత్వం
  కథావరణంలో 50 సంవత్సరాల విరసం.
  నూత‌న మాన‌వ ఆవిష్క‌ర‌ణే విప్ల‌వ క‌థ అంతిమ ల‌క్ష్యం
  జీవితం పరిమళించిన కథలు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •