జల వనరుల సాధనకు స్ఫూర్తి

| సంభాషణ

జల వనరుల సాధనకు స్ఫూర్తి

- బొజ్జ ద‌శ‌ర‌థ‌రామి రెడ్డి | 02.06.2019 10:51:58pm

రాయలసీమకు ప్రకృతి కల్పించిన నీటి వనరులను సాంకేతికంగా మరియు చట్టబద్దంగా వాడుకోవడానికున్న అనేక అవకాశాలను సమాజం ముందుంచడంలో శ్రీ సుబ్బారాయుడు గారు పడిన శ్రమ వెలకట్టలేనిది. రాయలసీమను సస్యస్యామలం చేయడానికున్న మార్గాలను అన్వేషించే కార్యక్రమాన్ని సుబ్బారాయుడు గారు ఉద్యోగ విరమనాంతరం కూడా నిరంతరం కొనసాగిస్తున్నారు. ఉద్యోగ విరమనానంతరం అంటే జీతం కోసం కాకుండా, వెనకబడిన రాయలసీమ కోసం నిబద్దతో పరిశోధన కొనసాగిస్తున్న నిత్య అన్వేషకుడు వారిలో కనిపిస్తారు.

రాయలసీమ సాగునీటి ప్రాజక్టులకై గతంలో అనేక ఉద్యమాలు జరిగాయి. రాజకీయ నాయకుల అండదండలతో జరిగిన ఉద్యమాల వలన పాక్షిక పలితాలు పొందిన, రాజకీయ కారణాలతో ఆ ఉద్యమాలు ఆశించిన లక్ష్యం వరుకు కొనసాగలేదు. ఈ నేపధ్యంలో నీటి వనురులు, రాయలసీమకున్న చట్టబద్ద నీటి హక్కులు, సక్రమంగా నీటి లభ్యత పొదేందుకు కావాల్సిన నిర్మాణాలపై రాయలసీమ ప్రజలకు అవగాహన కలగించి, పాలకులపై ఒత్తిడి పెంచే కార్యక్రమాల లక్ష్యంగా రాయలసీమ సాగునీటి సాధన సమితి 2011 ఏర్పడింది. మంచి లక్ష్యంతో పని ప్రారంభించిన రాయలసీమ సాగునీటి సమితికి తన కార్యక్రమాలను ముందుకు తీసికొని పోవడానికి తగిన సమాచారం కోసం అన్వేషించడంలో చాల ఇబ్బందులను ఎదుర్కొంది. అంధ్రప్రదేశ్ సాగునీటి సమస్యల పరిష్కార మార్గాలకై లభ్యమైన అత్యదిక సమాచారం అంత ( రామి రెడ్డి గారి ʹʹఎడారిలో వికసించిన పుష్పాలుʹʹ లాంటి కొద్దిపాటి సమాచారం మినహియిస్తే) మధ్య కోస్తా ఆంధ్ర కోణంలోనే వ్రాయబడి వుంది.

రాయలసీమ సాగునీటి సమితి సమాచార సంగ్రహన కోసం ఇబ్బందులు పడుతున్న నేపధ్యంలో సుబ్బారాయుడు గారు మాకు లభించడంతో, వారు అందించిన సమాచారంతోనే ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాలు ఊపందుకున్నాయి. బచావత్ కమీషన్ రాయలసీమకు కేటాయించిన నీటిని సక్రమంగా పొందడానికి సూచించిన మార్గదర్శకాలు, నీటి లభ్యత వివరాలు, కృష్ణ డెల్టా స్థిరీకరణ చేసే పులిచింతల మరియ పట్టిసీమ నిర్మాణాలు, 2009 లో తుంగభద్ర, కృష్ణ నదిలో వరదల వలన శ్రీశైలం రిజర్వాయర్ పరిరక్షణ పై నిపుణల నివేదికలు, తదితర సమకాలిన పరిస్థితులపై నివేదికల ఆధారంగా రాయలసీమ అభివ ద్దికి సమగ్ర సాంకేతిక వివరాలతో అనేక ప్రతిపాదనలు శ్రీ సుబ్బారాయుడు గారు చేసారు. ఈ ప్రతిపాదనలను వారు ప్రభుత్వానికి పంపడంతో పాటు అనేక ప్రజా సంఘాలకు ఈ విషయాలపై అవగాహన కలుగ చేసారు.

సుబ్బారాయుడు గారు సిద్దేశ్వరం అలుగు నిర్మాణం, గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం, ఆడిఎస్ కుడి కాలువతో అనుసందానంగా తుంగభద్ర వరద కాలువ నిర్మాణం, తుంగభద్ర ఎగువ సమాంతర కాలువ నిర్మాణం, వేదవతి ఎత్తిపోతల పథకం తదితర ప్రాజక్టుల నిర్మాణాలపై వున్న సానుకూల సాంకేతిక అంశాలు, నీటి లభ్యత, రాయలసీమ హక్కుల సమగ్ర సమాచారాన్ని ప్రజా సంఘాల ముందు ఉంచారు. ఈ అవగాహనే రాయసీమ చట్టబద్ధ నీటి హక్కులకై వేలాది మందితో సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపనకు అంకురమైంది. సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపనే రాయలసీమ నీటి హక్కుల సాధన దిశగా జరుగుతున్న ప్రజా ఉద్యమానికి స్పూర్తి నిచ్చ్చింది.

(ʹరాయ‌ల‌సీమ‌ను ఇలా స‌స్య‌శ్యామ‌లం చేద్దాం!ʹ పుస్త‌కం ముందుమాట‌)

No. of visitors : 220
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర

కార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ...

 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార డిసెంబర్ 2019
  సృజనాత్మక ధిక్కారం
  హింసలోనే పరిష్కారం వెతికిన రాజ్యం
  ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.
  హిందుత్వ శక్తులు చేస్తున్న బలవంతపు మత మార్పిడులకు బలైన ఒక ఆదివాసీ యువకుడి కథ
  వాళ్ళు
  ఇంగ్లీషు వద్దనడం లేదు, తెలుగు మాధ్యమం ఉంచండి
  గుండెను స్పృశిస్తూ జరిపిన ఒంటరి సంభాషణ "నా గదిలో ఓ పిచ్చుక"
  దేశంలో ప్రశాంతత నెలకొనివుంది-జైళ్ళూ నోళ్ళు తెరుచుకొనే వున్నాయి - తస్మాత్ జాగ్రత్త
  జై శ్రీరామ్!
  రమాకాంత్‌ వాళ్లమ్మ
  హిందూ రాజ్యం దిశగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •