మహాభారతం - చారిత్రక వాస్తవాలు

| సాహిత్యం | వ్యాసాలు

మహాభారతం - చారిత్రక వాస్తవాలు

- పిళ్లా విజయ్ | 04.06.2019 06:50:12pm

మహాభారతాన్ని ఇతిహాసమని పిలిచారు. ఇతి అనగా ఇది హాసమనగా చరిత్ర అని అర్థం.అంటే ఇది చరిత్ర అని అర్థం. మహాభారతం ఆధారంగా మన భారతదేశచరిత్రను వెలికి తీయవచ్చని భావించారు పరిశోధకులు. దీనికి కారణం గ్రీకు దేశంలో హోమర్ రాసిన ఇలియడ్ ఆధారంగా జరిపిన త్రవ్వకాలలో ఆ కాలం నాటి నగర శిధిలాలు బయట పడ్డాయి. అదే విధంగా మహాభారతంలో హస్తినాపురం ప్రధాన పట్టణం.భరతుని కంటే ముందు తరాల వాళ్ళు ఆ పరంపరలోకురువంశ రాజులు పరిపాలించారు. గ్రీసు దేశంలో మాదిరే మహాభారతంలో చెప్పిన హస్తినాపురంలో కూడా తవ్వకాలు చేపడితే కొన్ని ఆధారాలు దొరుకుతాయని భావించి త్రవ్వకాలు చేపట్టారు పురావస్తు శాస్త్రజ్ఞులు. కానీ అక్కడ కేవలం కొన్ని ఇనుప ఆయుధాలు మాత్రమే దొరికినాయి. వాటి కాలాన్ని కార్బన్ డేటింగ్ పద్ధతిలో కనుగొంటే అది క్రీ.పూ. 950 కి సంబంధించినవిగా తేలినాయి.

దానిని బట్టి మహాభారతం లో జరిగిన కురుక్షేత్ర యుద్ధం క్రీ.పూ. 950లో జరిగినట్లుగా చరిత్రకారులు నిర్థారించారు. అయితే ఈ సంగ్రామం ఆధారంగా వ్యాసుడు జయం పేరుతో ఒక కథను రాసినాడని ఆ తర్వాత వివిధ కాలాలలో క్రీ.పూ. 400నుండి క్రీ.శ. 400 వరకు జరిగిన సంఘటనలను జయం కథలోకి చేర్చి పెద్ద కథగా మహాభారతాన్ని మలిచారని ప్రముఖ చరిత్ర పరిశోధకులు సుక్తాకర్ హోష్కిన్స్ భావించాడు. ఇది ప్రారంభంలో 18,000 పద్యాలతో ఉన్న కథ కాలానుగుణంగా లక్ష పద్యాలకు చేరింది. గణసమాజంలో నుంచి రాచరిక వ్యవస్థలోకి మారుతున్నప్పుడు జరిగే మార్పులకు అనుగుణంగా మహాభారతం కథ సాగింది .

మహాభారత కథ అనేక ఉపకథలతో సాగింది .కథలో కథ ఉంటుంది .ఆ కథ శాఖోపశాఖల కథలుతో సాగుతుంది. ఆ కథల్లో సమాజంలోని ప్రజలు పాటించాల్సిన ధర్మాలను చెప్పించారు. బ్రాహ్మణుల గొప్పతనాన్ని పెంచే విధంగా తక్కిన కులాలవారు వారికి అణిగిమణిగి ఉండే విధంగా రాసినారు. చాలా గణాలను తమలో కలుపుకోవడానికి, వారి దేవుళ్ళను ఆర్యుల దేవుళ్ళ లోకి కలుపుకోవడానికి వీలుగా కథను నిర్మించి ప్రచారం చేసినారని డిడి కోశాంబి పేర్కొన్నారు.ఈ కథానిర్మాణం బుద్ధుని తర్వాత జరగడం వల్ల వర్ణ వ్యవస్థ పతనం కాకుండా ఉండడానికి , భారతం లోని కథలను వర్ణ వ్యవస్థ ప్రాధాన్యతను నొక్కి చెప్పే విధంగా రాశారు. బౌద్ధం చెప్పే విషయాలను బ్రహ్మచర్యాన్ని ఒక వైపు కీర్తిస్తూ ఒకవైపు ఖండిస్తూ పరస్పర విరుద్ధ అంశాలతో ఒక్కోసారి ఒక్కో రకంగా వివిధ పాత్రల ద్వారా చెప్పించారు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పే విషయాలలో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది.

మహాభారత కథను డి.డి.కోశాంబి మూడు సంప్రదాయాల కలయికగా విడగొట్టాడు .ఈ కథ మొత్తం ఢిల్లీ , మీరట్, మధుర ప్రాంతానికి పరిమితమైనదిగా గుర్తించాడు. భారతంలో 18 రోజుల పాటు సాగిన కురుక్షేత్ర యుద్ధంలో 50 లక్షల మంది చనిపోయారు. ఒక లక్షా 30 వేల రధాలు ఏనుగులను, గుర్రాలను ఉపయోగించారని రాసినారు. ఇలా జరగాలంటే ఆ నాటి దేశ జనాభా 20 కోట్లు ఉండాలని ఆయన అంచనా వేశారు .అయితే బ్రిటిష్ కాలం నాటికి దేశ జనాభా 20 కోట్లకు కూడా చేరుకోలేదని గుర్తు చేస్తాడు.ఈ కథకు కేంద్రం కురుక్షేత్ర యుద్ధం కాదు. నాగజాతి అంతం చేస్తానని జనమేజయుడు చేసిన యజ్ఞం అని కోశాంబి భావించాడు.

అయితే జనమేజయుడు తలపెట్టిన యజ్ఞం ఆస్తికుడు అనే బ్రాహ్మణుని చొరవ వలన ఆగిపోతుంది.ఆస్తికుని తల్లి నాగ స్త్రీ .తండ్రి బ్రాహ్మణుడు. జనమేజయుని పురోహితుడు సోమశ్రవుడు కూడా నాగ స్త్రీకి పుట్టినవాడే. యజ్ఞాన్ని ఆపినారంటే ఆటవికులకు వ్యవసాయ సమూహాలకు మధ్య సామరస్యం కుదరటం వల్లనే జరిగి ఉంటుంది .అటవికులు వ్యవసాయాన్ని వర్ణ వ్యవస్థను అంగీకరించారు. వారిలో కొంతమంది బ్రాహ్మణులుగా క్షత్రియులుగా మారిపోయారు. అత్యధికులు శూద్రులయ్యారు. మహాభారత కథలో శ్రావస్థి, కపిలవస్తు ,రాజగృహ అయోధ్య వారణాసి ,ఉజ్జయిని కౌసంబి ,హస్తినాపురం ,తక్షశిల మొదలైనవన్నీ నగరాలు గా వర్ణించారు . వాస్తవానికి ఇవి కొంత నాగరికత సాధించిన గణాలు సంచరించిన ప్రాంతాలుగా ప్రసిద్ధి చెంది ఉంటాయని కోశాంబి చెప్తాడు. అందుకే వాటిన కోసలలు ,మా గధులు అని పిలిచారు. కాంభోజ, గాంధార, కురు, పాంచాల, మత్స్య, శూరసేన ప్రాంతాలన్నీ జనపదాలు గా ప్రసిద్ధి చెందినవే. ఉత్తరాపథంలో మగధ, కోసల విదేహ, మల్ల, శక్య, లిచ్ఛావి కూడా జనపదాలే. గంగా యమున లోయల మధ్యలో కాశి, కుసినార, అవంతి, వత్స కూడా జనపదాలే. ఈ జనపదాలు అనేక పురాణాల కథల్లోనూ, బౌద్ధ కథల్లోనూ కనిపిస్తాయి.మహాభారతంలో బృహద్రతుడు మగధ రాజు గా ఉంటాడు. కాకపోతే భారతదేశంలోనే మొట్టమొదటి సర్వసత్తాక రాజ్యం మగధ. ఇది క్రీ.పూ. 530_470 మధ్య రూపొందింది .హర్యాంక వంశస్థుడైన బింబిసారుడు ఈ మగధను రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. చాలా గణాలు వర్ణ వ్యవస్థలోకి ఇమిడిపోయాయి. అనేక జనపదాలు మెల్లగా మారిపోయాయి. విదేహ జనపదం వైదేహికులుగా, వ్యాపారస్తులుగా మిగిలారు. మగధ గణానికి చెందిన వారు మాగధులుగా అంటే రాజులను పొగిడేవారుగా మిగిలిపోయారు.

No. of visitors : 622
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
  సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన
  జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA), జాతీయ పౌర జాబితా (NRC) ప్రక్రియను ఎందుకు వ్యతిరేకించాలి?
  నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు
  ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి
  ఢిల్లీ నుండి ప్రేమతో
  తెలంగాణలో ఏం జరుగుతోంది? సైలెంట్ ఎమర్జెన్సీ దేనికి సంకేతం?
  తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం
  మానవాచరణ నుంచే విప్లవ కవిత్వం
  కథావరణంలో 50 సంవత్సరాల విరసం.
  నూత‌న మాన‌వ ఆవిష్క‌ర‌ణే విప్ల‌వ క‌థ అంతిమ ల‌క్ష్యం
  జీవితం పరిమళించిన కథలు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •