ధిక్కార ప్రతీక గిరీష్‌ కర్నాడ్‌

| ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు

ధిక్కార ప్రతీక గిరీష్‌ కర్నాడ్‌

- పాణి | 11.06.2019 10:41:13am

సమకాలీన భారతీయ ప్రజా సాహిత్య సాంస్కృతిక రంగంలో గిరీష్‌కర్నాడ్‌ అద్భుతమైన కాంతిపుజం. రచయితగా, దర్శకుడిగా, నటుడిగా ఆయన నిరంతర ప్రజాపక్షపాతి. కన్నడ నాటకరంగాన్ని, సినిమాను ఆయన అపారంగా ప్రభావితం చేశారు. ఆయన రాసిన నాటకాలు భారతీయ నాటక రంగంలో సుప్రసిద్ధమైనవి. సమాజం సంక్షోభంలో ఉన్నప్పుడు, రాజ్యం ఫాసిస్టుగా మారినప్పుడు కళాకారులు ఎలా వ్యవహరించాలో తన జీవితాచరణ ద్వారా నిరూపించారు. ప్రజా దృక్పథం ఎంత కళాత్మకంగా ఉంటుందో, ధిక్కారశక్తిని ప్రదర్శిస్తుందో ఆయనలోని సృజనకారుడు, సామాజికుడు రుజువు చేశారు. సంఘ్‌పరివార్‌ ఆధిపత్య, విధ్వంస విధానాలకు వ్యతిరేకంగా నిరంతరం స్పందిస్తూ వచ్చారు. ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యంపట్ల దృఢంగా నిలబడ్డ మేధావి గిరీష్‌కర్నాడ్‌.

ఈ క్రమంలో ఆయన తీసుకునే వైఖరులు ప్రజాస్వామ్య శక్తులకు గొప్ప ఉత్తేజాన్ని ఇచ్చేవి. ఫాసిస్టు వ్యతిరేక ఉద్యమానికి దారి చూపేవి. రాజ్యానికి, సంఘ్‌పరివార్‌కు ఆయన వ్యాఖ్యలు, విశ్లేషణలు, వైఖరులు చిరాకుపుట్టి బెదిరింపులకు, దాడులకు, కుట్రలకు పాల్పడినా, కేసులు పెట్టినా గిరీష్‌ కర్నాడ్‌ తన అచంచలమైన విశ్వాసాల వెంట దృఢంగా సాగిపోయారు. వ్యవస్థపట్ల లోతైన విమర్శనాదృష్టి ఉంటేనే కళలు, సాహిత్యం ప్రభావశీలంగా ఉంటాయనడానికి ఆయన ఉదాహరణ. దేశాన్నంతా ఫాసిస్టు తుఫాను చుట్టుముట్టినప్పుడు గిరీష్‌కర్నాడ్‌ ధీరోదాత్తమైన తన అసమ్మతి ప్రకటనలు చేశారు. ఆవు మాంసం పేరుతో ముస్లింలు, దళితులపై దాడులు జరుగుతున్నప్పుడు గిరీష్‌ కర్నాడ్‌ ʹనాట్‌ ఇన్‌ మై నేమ్‌ʹ అని నిరసన వ్యక్తం చేశారు. కన్నడ సమాజంలో కల్బుర్గి, గౌరీలంకేశ్‌ల హత్యల సమయంలో ఆయన సంఘ్‌పరివార్‌కు ఎదురొడ్డి నిలబడి ప్రజాస్వామిక శక్తులకు ఆశ్వాసాన్నిచ్చారు. గౌరి హత్యను ఖండిస్తే ఆమెకు పట్టినగతే పడుతుందని సంఘ్‌ మూక బెదిరిస్తే కూడా ʹనేను గౌరిని..ʹ అనే ధిక్కారానికి ఆయన పతాకమయ్యాడు. టిప్పు సుల్తాన్‌ హిందువు అయి ఉంటే శివాజీకి వచ్చిన గుర్తింపు వచ్చేదని ఒక కీలకమైన చారిత్రక, సామాజిక వ్యాఖ్య చేసినప్పుడు సంఘ్‌పరివార్‌ కన్నెర్ర చేసింది. లౌకిక ప్రజాస్వామిక విలువల కోసం దృఢంగా నిలబడినందుకు ఈ దేశంలో చోటు లేదని సంఘ్‌ మూక పదే పదే హెచ్చరించింది. పాకిస్తాన్‌ వెళ్లిపోవాలని బెదిరించింది.

దేశంలోని సుప్రసిద్ధ మేధావులను, రచయితలను, కళాకారులను అర్బన్‌ మావోయిస్టులని అక్రమంగా అరెస్టు చేసినప్పుడు నేను కూడా అర్బన్‌ మావోయిస్టునే అని ఆయన ప్రకటించారు. మేధావి అంటే ఎలా ఉండాలో గిరీష్‌ కర్నాడ్‌ జీవితమంతా ఆచరించి చూపించారు. పాలకులకు, రాజ్య భావజాలానికి, సామాజిక ఆధిపత్యాలకు, వివక్షలకు వ్యతిరేకంగా తడబాటు లేకుండా నిలబడ్డారు. సంక్షోభ వర్తమానంలో ఆయన దేశ ప్రజలకు పెద్ద దిక్కుగా నిలిచారు. తన కళను, జ్ఞానాన్ని లౌకిక ప్రజాస్వామిక విలువల కోసం వెచ్చించారు. భారతీయ సృజనాత్మక, మేధో రంగాల్లో ధిక్కారానికి, క్రియాశీలతకు ఆయన చెరగని చిరునామా. ఆయన మరణం ప్రజా సాహిత్య సాంస్కృతిక రంగాలకు తీరని వెలితి. ఫాసిజాన్ని మట్టి కరిపించే పోరాటాల్లో మునుముందుకు సాగడమే ఆయనకు మనమిచ్చే నివాళి.

పాణి
విరసం కార్యదర్శి


No. of visitors : 447
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర

కార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ...

 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార డిసెంబర్ 2019
  సృజనాత్మక ధిక్కారం
  హింసలోనే పరిష్కారం వెతికిన రాజ్యం
  ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.
  హిందుత్వ శక్తులు చేస్తున్న బలవంతపు మత మార్పిడులకు బలైన ఒక ఆదివాసీ యువకుడి కథ
  వాళ్ళు
  ఇంగ్లీషు వద్దనడం లేదు, తెలుగు మాధ్యమం ఉంచండి
  గుండెను స్పృశిస్తూ జరిపిన ఒంటరి సంభాషణ "నా గదిలో ఓ పిచ్చుక"
  దేశంలో ప్రశాంతత నెలకొనివుంది-జైళ్ళూ నోళ్ళు తెరుచుకొనే వున్నాయి - తస్మాత్ జాగ్రత్త
  జై శ్రీరామ్!
  రమాకాంత్‌ వాళ్లమ్మ
  హిందూ రాజ్యం దిశగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •