ప్రయివేటు విద్యావ్యాపారుల ఒడిలో కాసులు పోయాడానికేనా ʹఅమ్మఒడిʹ?

| సంపాద‌కీయం

ప్రయివేటు విద్యావ్యాపారుల ఒడిలో కాసులు పోయాడానికేనా ʹఅమ్మఒడిʹ?

- పి.వరలక్ష్మి | 16.06.2019 09:11:04am

ప్రజాధనాన్ని అడ్డగోలుగా బలుస్తున్న ప్రయివేటు స్కూళ్లకు దోచిపెట్టే పథకంలానే కనిపిస్తోంది అమ్మ ఒడి. వాళ్లకు మేలు జరిగితే జరిగింది. కనీసం పేద పిల్లలకు మేలు జరుగుతుంది కదా అనుకోవచ్చా? ఆ కాసిన్ని డబ్బులు ఇస్తే జరిగే వ్యక్తిగత మేలు ఎంత? మొత్తంగా సమాజానికి జరిగే మేలు ఎంత? తద్వారా పిల్లల విద్యావికాసం, భవిష్యత్తు భరోసా ఎంత?

సమాధానం చెప్పుకునేకన్న ముందు ఇప్పుడు స్కూళ్ళ పరిస్థితి ఆలోచించాలి. కొన్ని దశాబ్దాలుగా ప్రయివేటు స్కూళ్ళు విద్యా ప్రమాణాల్ని దారుణంగా పడేసాయి. కానీ అదే నిజమైన విద్యగా ఎస్టాబ్లిష్ చేసి, పనిగట్టుకొని ప్రభుత్వ పాఠశాలలను నాశనం చేస్తున్నారు. సుమారుగా చేసేసారు కూడా. శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మక జ్ఞానం, సామాజిక బాధ్యత, మానవ విలువలు నేర్పించడం ద్వారా వ్యక్తి వికాసానికి తోడ్పడడం విద్యావ్యవస్థ బాధ్యత. ఈ క్రమంలో మంచి నైపుణ్యాలు నేర్చుకుని తమకిష్టమైన రంగంలో బతుకుతెరువును చూసుకుంటారు విద్యార్థులు. కానీ వ్యవస్థ దానికి తగిన మనుషులనే అది తయారు చేసుకుంటుంది. ఇప్పుడు కావాల్సింది కార్పొరేట్ కు సేవ చేసే వెన్నెముక లేని కూలీల తరాన్ని తయారుచేయడం కాబట్టి దానికి ఇతరేతర విలువలేవీ ఉండవు. అట్లా ఏ విలువల్లేని, డబ్బు సంపాదనే లక్ష్యంగా ఉండే వ్యాపారస్తుల చేతులకు విద్యను అప్పగించారు. వీళ్ళను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వ విద్యాసంస్థలకు నిధులివ్వకుండా, అక్కడ చదువులు చెప్తున్నారో లేదో పట్టించుకోకుండా, ఏ పర్యవేక్షణ చేయకుండా వాటిని నీరుగార్చారు. గవర్నమెంటు బడులలో చదువురాదు అని పేరు పడేలా చేసారు. ప్రైవేట్ దుకాణాలను తెరిపించారు. నారాయణ వంటి వ్యాపారులను కుట్రపూరితంగా కొన్ని దశాబ్దాలుగా ప్రోత్సహించారు. అటువంటి కార్పోరేట్ స్కూళ్ళలో విద్యను బోధించే పద్ధతే సుమారుగా అన్ని ప్రైవేట్ స్కూళ్ళూ, ఇటీవలి కాలంలో గవర్నమెంట్ స్కూళ్ళు కూడా ప్రమాణంగా తీసుకుంటున్నాయి.
ఫలితంగా నిజమైన జ్ఞానానికి విలువనివ్వక, సామాజిక బాధ్యతను తెలియజెప్పక, అనారోగ్య పోటీలను పెంచి, విద్యార్థులను ఒత్తిడికి గురిచేసి, శారీరకంగా, మానసికంగా వారిని చేవలేని చచ్చు శరీరాలుగా తయారుచేస్తున్న విద్యావిధానం అభివృద్ధి చెందింది. అన్నీ ప్రక్షాళన చేస్తానంటున్న ప్రభుత్వానికి ఈ స్థితిని మార్చే నిజాయితీ ఉందా? ఎల్లెడలా పాకిపోయిన అనైతిక, అవినీతి విద్యాసంస్థల గురించి ఒక్క మాటన్నా మాట్లాడే ధైర్యం ఉందా? యువతరాన్ని రోజూ ఆత్మహత్యల వైపు తోసేస్తున్న స్థితి పట్ల బాధ్యత ఉందా? ప్రభుత్వ పాఠశాలల సౌకర్యాల గురించి కూడా మాట్లాడుకుందాం కానీ కనీస ప్రమాణాలు పాటించే ప్రయివేటు స్కూళ్ళు రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి? టీచర్లకు సక్రమంగా జీతాలిచ్చేవి, పిల్లలకు లైబ్రరీ, ప్లే గ్రౌండ్, గాలీ వెలుతురూ సోకే తరగతి గదులు ఉన్నవి, విద్యార్థుల సంఖ్యకు సరిపడా టీచర్ల నిష్పత్తి ఉన్నవి ఎన్ని ఉన్నాయి? కోళ్ల ఫారాల వంటి స్కూళ్లను కళ్ళు తెరిచి ఏ విద్యాశాఖ అధికారి అయినా చూస్తున్నారా? ప్రభుత్వ స్కూళ్లకు నిధులివ్వరు. ప్రయివేట్ స్కూళ్లకు ఏమీ లేకున్నా అనుమతులిస్తారు. విద్యార్థులు చచ్చిపోతున్నా పట్టించుకోరు.

మార్కులే ప్రమాణంగా ఉండే విద్య నేడు మార్కెట్లో ఉంది. అది పిల్లల్లో సృజనాత్మకతను ఎదగనివ్వకుండా చేస్తోంది. కానీ ఉన్నత విద్య అవకాశాలు పొందాలంటే ఆ మార్కులే కావాలి. ఇదో విచిత్రమైన స్థితి. ఆ మార్కులు రావాలంటే కార్పెరేట్ స్కూళ్ళే గత్యంతరం అని ప్రభుత్వం కూడా పరోక్షంగా ప్రచారం చేస్తుంది. ʹకార్పొరేట్ʹ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని అప్పుడప్పుడూ విద్యాశాఖ అధికారులు మాట్లాడుతుంటారు. ఏమిటి ఆ స్థాయి? సేవా సంస్థ (ట్రస్ట్) పేరుతో రిజిస్టర్ చేయించుకొని వ్యాపారం చేస్తూ లక్షలు దండుకునే స్థాయి. వందల కోట్లకొద్దీ నల్లధనం దాచుకోగలిగే స్థాయి. అవసరమైతే ప్రశ్నాపత్రాలు లీక్ చేయించునే స్థాయి. అధికారులను కొనగలిగే స్థాయి. ఏటా వందల మంది పిల్లలను చచ్చేదాకా శిక్షణ ఇచ్చే స్థాయి. గత్యంతరంలేక ఈ రోగగ్రస్తమైన విద్యావ్యవస్థలోనే సర్దుకుపోతున్నారు గానీ దీనిపట్ల లాభాలు దండుకునే వ్యాపారులకు తప్ప పిల్లలకు, తల్లిదండ్రులకు ఏ మాత్రం సంతృప్తి లేదు.

అత్యంత లోపభూయిష్టాంగా, సంక్షుభితంగా విద్యావ్యవస్థ ఉంటే, దాన్నేక్కడా ముట్టుకోకుండా, మీ పిల్లలను ఎక్కడైనా చదివించుకోండి, మీకు డబ్బులిస్తాం అని ముఖ్యమంత్రి అంటున్నాడంటే ఏమని అర్థం? రోగికి శాస్త్ర చికిత్స చేయాలంటే పారాసెటమాల్ మందు ఇచ్చి ఏదో గొప్ప సేవ చేస్తున్నట్లు ప్రకటించుకోవడంలా ఉంది ఇది. రాజన్న రాజ్యం అన్నా సంక్షేమ రాజ్యం అన్నా ఇదే. ప్రజలకు హక్కుగా రావలసినవన్నీ రద్దు చేసి, ఆ ప్రజల వద్ద దండుకున్న డబ్బుల నుండే చిల్లర విదిల్చి వాళ్ళను బిక్షగాళ్ళను చేయడం.

ఫీజ్ రీఎంబర్స్ మెంట్ తో ప్రభుత్వ కాలేజీలను నాశనం చేశారు. విశాలమైన మైదానాలు, లైబ్రరీలు, ప్రయోగశాలలతో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి, ఎంతో మంది మేధావులను తయారుచేసిన ప్రభుత్వ కాలేజీలు మూతపడి, సరిపడా రూమ్స్ గానీ, ల్యాబ్స్ కానీ లేని ప్రయివేట్ కాలేజీలు రోడ్లమీద దుకాణాల్లా తెరుచుకుని డబ్బులు దండుకుంటున్నాయి. ఫీజ్ రీఎంబర్స్ మెంట్ కు పెట్టే ఖర్చు మరిన్ని ప్రభుత్వ కాలేజీలు స్థాపించడానికి, ఉన్నవాటిని మెరుగుపరచడానికి పెట్టి ఉంటే విద్యా ప్రమాణాలు ఉన్నతంగా ఉండేవి. ప్రభుత్వ కళాశాలలు అలా అంతరించిపోతుంటే, ఇప్పుడిక ప్రభుత్వ బడులు కూడా కనుమరుగు కావడానికి మరో పథకం వస్తోంది.

విద్యాప్రమాణాలు, విలువలతో కూడిన విద్య, ఒత్తిడి లేని విద్య ఎప్పటికైనా అందివ్వగలరా అనే సీరియస్ ప్రశ్న సామాజం నుండి చాలా ఏళ్లుగా వస్తున్నది. దానిని స్వీకరించే నిజాయితీ పాలకులకు ఉంటుందనుకోవడం దురాశే. అమ్మఒడి పథకాన్ని ప్రకటించిన వెంటనే ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు దీనిని ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే వర్తింపజేయమని, లేదంటే మిణుకుమిణుకు మంటున్న దీపంలా ఇవాలున్న ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా మూతపడుతాయని విజ్ఞప్తి చేస్తున్నారు. కనీసం దీనినైనా స్వీకరిస్తారా?

No. of visitors : 797
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోషలిజమే ప్ర‌త్యామ్నాయం, నక్స‌ల్బ‌రీయే భారత విప్లవ పంథా

పి.వరల‌క్ష్మి | 29.04.2016 11:02:35am

20, 21వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన భిన్న ధోరణుల‌న్నీ సారాంశంలో మార్క్సిస్టు వ్యతిరేకత ముఖ్యమైన ల‌క్షణంగా కలిగి ఉంటున్నాయి. కొన్నయితే మార్క్పిజం పేరుతోనే ప్రపంచ...
...ఇంకా చదవండి

పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలు

వ‌ర‌ల‌క్ష్మి | 12.03.2017 12:32:58am

సంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ - సోషలిజమే ప్రత్యామ్నాయం (విర‌సం సాహిత్య పాఠ‌శాల కీనోట్).....
...ఇంకా చదవండి

నేనెందుకు రాస్తున్నాను?

పి.వరలక్ష్మి | 05.10.2016 01:16:41am

బూర్జువా పార్టీలు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తాయి కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం రాస్తాను. ఉదాహరణకు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని దశాద్బాలుగా ఒక.......
...ఇంకా చదవండి

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం

| 28.07.2016 08:35:37pm

అసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, ఆమె సామాజిక జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ .......
...ఇంకా చదవండి

సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹ

పి.వరలక్ష్మి | 03.09.2016 01:40:55am

మన ఊర్లలో గూటి గువ్వలు, పాల పిట్టలు, ఎర్ర జొన్నలు, సజ్జ గింజెలు ఏమైపోయాయి? రాయలసీమ ప్రకృతి మరింతగా ఎందుకు నాశనమవుతోంది? పౌష్టిక ఆహారాన్నిచ్చే తిండి .......
...ఇంకా చదవండి

ఇది మనిషి మీద యుద్ధం

పి. వరలక్ష్మి | 19.04.2016 10:59:20am

సైనిక, రాజకీయార్థిక, ప్రచార రంగాల్లో సామ్రాజ్యవాదం ఎంత దాడి చేస్తున్నదో అర్థం చేసుకోవాలంటే వాటన్నిటినీ అనుసంధానించే మంద్రస్థాయి యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి...
...ఇంకా చదవండి

మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రం పై కీనోట్

పి. వ‌ర‌ల‌క్ష్మి | 03.06.2016 10:43:06pm

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రంపై రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి. వ‌ర‌ల‌క్ష్మి కీనోట్‌...
...ఇంకా చదవండి

ప్రొఫెస‌ర్‌ క‌ంచ‌ ఐల‌య్య‌కు సంఘీభావంగా భావప్రకటనా స్వేచ్ఛకై

వరలక్ష్మి | 01.06.2016 09:29:12am

ప్రభుత్వాలు భావాల పట్ల నియంత్రణలు అమలుచేయజూస్తూ, భిన్నాభిప్రాయాన్ని, నిరసనను క్రిమినలైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్య...
...ఇంకా చదవండి

ఉనా స్వాతంత్ర నినాదం

పి.వరలక్ష్మి | 15.08.2016 10:44:28pm

ఆగస్టు పదిహేను ద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకుʹ అని చెరబండరాజు అన్నట్లు బూటకపు స్వాతంత్రాన్ని ఎండగడుతూ నిజమైన స్వాతంత్రం కోసం ఉనా దళిత సమ్మేళనంతో... ...
...ఇంకా చదవండి

ఆపరేషన్ దేశభక్తి

వరలక్ష్మి | 04.10.2016 10:21:50pm

భారత ప్రభుత్వం కశ్మీర్ గాయాన్ని బుల్లెట్లతో, పెల్లెట్లతో కెలికి ఇప్పుడీ యుద్ధాన్ని దేశప్రజలపై రుద్దింది. కాశ్మీర్ లో జులై నుండి ఇప్పటి దాకా కనీసం 90మంది.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌
  భారత విప్లవోద్యమంలో చారుమజుందార్ శతజయంతి సదస్సు
  విరసం నాయకుడు జగన్‌పై అక్రమంగా పెట్టిన ఉపా కేసు ఎత్తివేయాలి
  అరుణతార అక్టోబర్ 2019
  మనమూ తేల్చుకోవాల్సిందే
  ఆత్మీయ కలయిక
  కరవాలం చెప్పిన రహస్యం
  కాశ్మీరు మనది!
  మంచి కథ ఎప్పుడూ పాఠకుల ఆలోచనలకు పదును పెడుతుంది
  అక్షర సాహసులకు చైతన్య స్ఫూర్తి విరసం
  విరసం తో నా అనుబంధం - అనుభవం
  కులం - విప్లవోద్యమ అవగాహన, ఆచరణ - 2

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •